Adulteration oil
-
‘కల్తీ’ కథలు.. ఒకటేమిటీ అన్నీ అంతే.. తినేదెలా? బతికేదెలా?
కేసరి దాల్పైనే దాడులు పట్టణంలోని రాజీవ్నగర్కాలనీలోని ఓ ఇంట్లో దాచిన 112 బస్తాల నిషేధిత కేసరిదాల్ను 2017లో సీజ్‌చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ నుంచి సరుకు ఇక్కడికి అక్రమంగా వస్తున్నట్టు అప్పట్లో అధికారుల విచారణలో తేలింది. 2018లో సైతం పుడ్‌సేప్టీ అధికారులు పలమనేరు ప్రాంతంలోని పలు వారపుసంతల్లో కల్తీ సరుకులపై దాడులు చేపట్టి భారీగా జరిమానాలు విధించారు. ఎముకలతో నూనెలు పలమనేరు సమీపంలోని గడ్డూరు వద్ద ఓ ఇంట్లో టన్నులకొద్దీ దాచి ఉంచిన ఎముకలను అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులోని కబేళాలనుంచి వీటిని సేకరించి ఇక్కడ ఎండబెట్టి నూనెను తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో అప్పట్లో జిల్లా వ్యాప్తంగా వంటనూనెలపై తనిఖీలు చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు అధికారులు హడావుడి చేసి, ఆ తరువాత మళ్లీ పట్టించుకోవడంలేదు. దీంతో అక్రమార్కులు మళ్లీ కల్తీ సరుకును మార్కెట్లో్లకి తెచ్చి అమ్మకాలు మొదలెట్టారు. మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా కల్తీ వ్యాపారం సాగుతోంది. చౌక బేరమే ఈ కల్తీ వ్యాపారానికి ఆధారంగా మారింది. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండడం అక్రమార్కులకు కలసి వచ్చింది. తమిళనాడు నుంచి యథేచ్ఛగా కల్తీ సరుకు మార్కెట్లోకి దిగుతోంది. వారపు సంతల్లో అమ్ముడవుతోంది. మరోవైపు దుకాణాలు, హోటళ్లు, టీ స్టాళ్లు వంటి ఆహార పదార్థాలు విక్రయించే కేంద్రాలకు గుట్టు చప్పుడు కాకుండా చేరిపోతోంది. ఇలా కల్తీ సరుకు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలమనేరు (చిత్తూరు): జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ జోరందుకుంది. పప్పు దినుసులు, టీపొడి, నూనెలు తదితరాల్లో ఈ కల్తీలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతోపాటు కేసరి దాల్ అమ్మకాలు వారపు సంతల్లో భారీగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కల్తీ సరుకులు ఇక్కడికి గుట్టుగా రవాణా అవుతున్నాయి. ఇలాంటి కల్తీ పదార్థాలను తింటే అనారోగ్యం తప్పదని తెలిసినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కల్తీ ఇలా వంటనూనెలే అధికం దుకాణాలకు వస్తున్న సరుకుల్లో ఒకటో రకం, రెండో రకం అంటూ స్థానిక వ్యాపారులే ఏది అసలో, ఏది నకిలీనో కనుక్కోలేకపోతున్నారు. బియ్యం మొదలుకొని శెనగపప్పు, కందిపప్పు, చక్కెర, పెసరపప్పు, మైదాపిండి, గసాలు, రవ్వ, జీలకర్ర, మిరియాలు, ఆఖరుకు వంటనూనెలు కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీ వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. స్థానికంగా దుకాణాల్లో లభించే ప్రముఖ కంపెనీల నూనె ప్యాకెట్లు ఈ ప్రాంతంలోని వారపు సంతల్లో సైతం అదే కంపెనీల పేరుతో నకిలీ ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. ధరలో కూడా భారీ తేడా ఉండడంతో ప్రజలు ఎగబడి వీటినే కొనుగోలు చేస్తున్నారు. అదే అదనుగా లీటరు ప్యాకెట్లలో 900 మిల్లీలీటర్ల నూనె నింపి సులభంగా సొమ్ముచేసుకుంటున్నారు. చోద్యం చూస్తున్న ఫుడ్ సేఫ్టీ విభాగం ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు జిల్లా మొత్తానికి ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయితే వారు దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. సంబందిత మున్సిపల్ కమిషనర్లకు తనిఖీలు చేసే అధికారం లేదు. ప్రభుత్వం ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌ను అమలు చేస్తున్నా ఇలాంటి అక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై ఆహార కల్తీ నిరోధక శాఖ విచారణాధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ అయినా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడునుంచి వచ్చిన కల్తీ టీపొడి టీపొడి భారీ వ్యాపారం కల్తీ టీ పొడి అక్రమార్కుల పంట పండిస్తోంది. సాధారణంగా మార్కెట్లో పావు కిలో బ్రాండెడ్ టీ పొడి కొనాలంటే రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు పెట్టాలి. అంటే కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉంది. అది కల్తీ టీ పొడి అయితే కిలో రూ.170కే దొరుకుతోంది. వినియోగించిన టీ పొడిలో చింతగింజల పొడి, రసాయనాలతో కూడిన చాక్లెట్ పొడి కలిపి చౌకగా దొరికే టీ పొడిని విక్రయిస్తున్నారు. ఈ చాక్లెట్ పొడిని కలపడం వల్ల ఎంత ఉడికించినా టీ రంగు మారదు. జిల్లాలోని పలు టీ దుకాణాల్లో ఈ కల్తీ టీపొడినే వాడుతున్నారు. దీని వల్ల వ్యాపారులకు ఆదాయం అధికంగా వస్తోంది. క్వింటాళ్ల కొద్దీ కల్తీ టీ పొడిని జిల్లాలోని మార్కెట్లో విక్రయించేస్తున్నారు. నిల్వ ఉంచిన కేసరిదాల్ను సీజ్ చేసిన అధికారి (ఫైల్) కేసరి దాల్‌పై 1961 నుంచే నిషేధం జిల్లాలో ప్రమాదకర కేసరి దాల్(లంకపప్పు) అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. వీటిని తింటే పలు రకాల ఆరోగ్య సమస్యలు ఖాయం. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, అశోం రాష్ట్రాల్లో విరివిగా పండే లతిరస్ సటివస్ అనే మొక్క గింజలను పప్పులుగా చేస్తారు. వాటికి రసాయన రంగులను కలిపి కేసరి దాల్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇందులో న్యూరో టాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. వీటిని తింటే నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అందుకే ప్రభుత్వం 1961 నుంచి ఈ పంటపై నిషేధం విధించింది. కానీ ఈ పప్పు ధర చౌకగా ఉండడంతో జనం దీన్ని కొనుగోలు చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. గతంలో పలమనేరు సమీపంలో అధికారులు సీజ్ చేసిన ఎముకల గోడోన్ కబేళాల నుంచి బోన్ ఆయిల్ జిల్లాలోని పలు పట్టణాల్లో తమిళనాడులోని కబేళాలతో లభ్యమయ్యే ఎముకలనుంచి తయారవుతున్న నూనెలను లూజు పామోలిన్, శెనిగనూనెలో కలిపి గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. ముఖ్యంగా చిత్తూరు, నగిరి, పుత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు తదితర ప్రాంతాల్లో చికెన్ కబాబ్ సెంటర్లు, కొన్ని హోటళ్లలో బిరియానీ, బోండా, బజ్జీలతో పాటు స్వీట్స్టాల్స్లో ఈ కల్తీ నూనెలు వినియోగిస్తున్నారు. తమిళనాడుకు చెందిన వ్యాపారులు ముఠాగా ఏర్పడి ఈ కల్తీ దందాను నడిపిస్తున్నారు. కారుచౌకగా ఈ నూనెను జిల్లాలో విక్రయిస్తున్నట్టు సమాచారం. పొట్టేలు మటన్‌లో లేగదూడల మాంసాన్ని సైతం కలిపి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. జీర్ణకోశ వ్యాధులు వస్తాయి వంటనూనెల కల్తీతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తొలుత గ్యాస్స్ట్రిక్తో ఈ సమస్య ప్రారంభమై ఆ తర్వాత తీవ్ర స్థాయికి వెళుతుంది. కల్తీ ఆహార పదార్థాలను తిన్న వెంటనే చర్మంపై దురదలు, అలర్జీ వచ్చిందంటే వెంటనే అక్కడ కల్తీ జరిగినట్లు భావించవచ్చు. కల్తీ అయిన నూనెలతో తయారు చేసే ఆహారపదార్థాలు, మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా ప్రమాదకరం. – డా.హరగోపాల్, వైద్యాధికారి, పలమనేరు ఏరియా ఆస్పత్రి ఆకస్మిక దాడులు చేస్తాం జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు, వంటనూనెలు, హోటళ్లలో మాంసాహార పదార్థాలు, పప్పులు, రెండోరకం వస్తువులు, వారపుసంతలో విడి విక్రయ సరుకులపై త్వరలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మన జిల్లాలో కల్తీ సరుకుల విక్రయానికి అవకాశం ఉంటుంది. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తక్కువ ధరతో లభిస్తోందని ఏ వస్తువులను కొనుగోలు చేయొద్దు. – సతీష్‌కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్, చిత్తూరు -
బంకుల్లోయథేచ్ఛగా ఆయిల్ కల్తీ
ఒక వైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వినియోగదారుడు అవస్థలకు గురవుతుంటే మరో వైపు బంక్ నిర్వాహకుల మోసాలకు బలై నష్టపోతున్నాడు. పెట్రోల్ కల్తీ చేయడం, రీడింగ్‌లో తక్కువ చూపడం వంటి మోసాలతో వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. నిఘా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా కల్తీ జరుగుతోంది. దీనివల్ల రూ.వేలు, లక్షలు పెట్టి కొనుగోలుచేసిన వాహనాలు పాడై మెకానిక్ షెడ్లకు చేరుతున్నాయి. కీలకమైన ఇంజిన్ మరమ్మతులకు గురైన వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. గడిచిన కొద్దిరోజులుగా వీటి సంఖ్య మరీ పెరిగింది. విశాఖపట్నం, చోడవరం: రూరల్‌జిల్లాలో పెట్రోల్,డీజిల్ బంకులు సుమారు 100కుపైగా ఉన్నాయి. ఒక్క చోడవరం పరిసరాల్లోనే 15 బంకులు ఉన్నాయి. వీటిలో ఆయిల్ కల్తీ ఎక్కువగా జరుగుతోంది. పెట్రోల్,డీజిల్‌లో ఇథనాయిల్, కిరోసిన్ కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. ఆయిల్ కల్తీతోపాటు కొన్ని బంకుల్లో భూమిలో ఉంచిన స్టోరేజ్ ఆయిల్ ట్యాంకర్లు నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల పెట్రోల్,డీజిల్ ట్యాంకుల్లో రకరకాల ఇతర ఆయిల్స్‌ను కల్తీచేసి ఆ కల్తీ ఆయిల్‌నే వాహనాలకు వేస్తున్నారు. ఇటీవల చోడవరం పరిసరాల్లో పెట్రోల్ బంకుల్లో ఈ తరహా కల్తీతో అనేక వాహనాలు మరమ్మతులతో మూలకు చేరాయి. చోడవరం, వెంకన్నపాలెం, వడ్డాది, రావికమతం, మాడుగుల, అనకాపల్లి, సబ్బవరం ప్రాంతాల్లో బంకుల్లో ఆయిల్ కల్తీ మరీ ఘోరంగా జరుగుతోంది. బంకులను ఎప్పటికప్పుడు పరిశీలించి, తనిఖీలు చేయాల్సిన విజిలెన్స్, జిల్లా రెవెన్యూ, కొలతలు,తూనికలు,పౌరసరఫరాల శాఖాధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలు లేకపోవడం వల్ల పెట్రోల్‌బంకుల యజమానులు ఇష్టారాజ్యంగా ఆయిల్ కల్తీలకు పాల్పడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాయిల్, కిరోసిన్‌తోపాటు పలు రకాల ఆయిల్స్‌ను పెట్రోల్,డీజిల్‌లో కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీ కారణంగా చోడవరం పరిసరాల్లో పలువాహనాలు ఇంజిన్ స్ట్రక్ అయిపోయి మెకానిక్ షెడ్లకు చేరుతున్నాయి. ప్రయాణం మధ్యలో వాహనాలు నిలిచిపోవడం వల్ల దూరప్రాంతాలకు, అత్యవసర పనులపై వెళ్లే వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో ఆయిల్ కల్తీపై అధికారులు చర్యలు తీసుకోవాలని, కల్తీని అరికట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి మా గ్రామం నుంచి చోడవరానికి పనిమీద వచ్చాను, ఇక్కడ బంకులో పెట్రోల్ కొట్టించాను. కొద్ది దూరం వెళ్లిన తరువాత మోటారుసైకిల్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించిన స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ షెడ్‌కు తెచ్చాను. ఆయిల్ కల్తీ వల్లే ఇంజిన్ పట్టేసిందని తెలిసింది. పెట్రోల్ బంకుల్లో కల్తీని నివారించాల్సిన ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడం వల్లే మా వాహనాలు పాడవుతున్నాయి. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. – అప్పారావు, గాంధీ గ్రామం కొత్త బైక్ పాడైంది నేను కుటుంబసభ్యులతో కలిసి విశాఖపట్నం బయలు దేరాను. నా బైక్‌కు చోడవరం పట్టణంలో ఓ బంకులో రెండు లీటర్లు పెట్రోల్ కొట్టించాను. కొద్దిదూరం వెళ్లిక ఆగిపోయింది. మండుటెండలో బండి ఆగిపోవడం వల్ల నేను, నా కుటుంబసభ్యులం చాలా ఇబ్బంది పడ్డాం. మెకానిక్ షెడ్‌కు తీసుకెళ్తే ఇంజిన్ పట్టేసింది,ఆయిలే కారణమని అన్నారు. బంకుల్లో ఆయిల్ కల్తీలు జరగడం వల్ల నా కొత్త బైక్ మరమ్మతులకు గురైంది. ఈ కల్తీని అరికట్టకపోతే చాలా ఇబ్బంది. – శ్రీను, చోడవరం -
‘కల్తీ’గాళ్లు
కల్తీ వ్యాపారాలకు కామారెడ్డి జిల్లా అడ్డాగా మారింది.. కొందరి అక్రమ సంపాదన యావ సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది!. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం మానేసిన ఫలితంగా కల్తీ మాఫియా జూలు విదుల్చుతోంది. కల్తీ కారణంగా ఆహార పదార్థాలన్నీ విషతుల్యంగా మారుతున్నాయి. నిత్యావసర వస్తువులు సహజత్వాన్ని కోల్పోయి ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నాయి. ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్ల యవ్వారం తాజాగా మరోమారు జిల్లాలో వెలుగు చూసింది. బాన్సువాడలో నకిలీ నెయ్యి తయారు చేసి, విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. కామారెడ్డి క్రైం: సరిగ్గా ఏడాది క్రితం.. వంటనూనె కొనేందుకు ఓ దినసరి కూలీ జిల్లా కేంద్రం లోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లి, వంటనూనె కావాలని అడిగితే సదరు వ్యాపారి కల్తీ నూనె అంటగట్టాడు. దాంతో వంట చేసుకుని భోజనం చేసిన ఆ కుటుంబం మొత్తం వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయింది. కల్తీ నూనె వ్యవ హారం బయటకు రావడంతో అధికారులు అప్ప ట్లో హడావుడి చేశారు. కల్తీ వంటనూనె విక్రయిం చిన దుకాణంతో పాటు మరికొన్ని దుకాణాల్లో తనిఖీలు చేసి, చేతులు దులుపుకున్నారు. అన్నీ తెలిసినా ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తేగానీ కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం అప్పట్లో దాడులు నిర్వహించి తామేదో మొత్తం కల్తీలను అరికట్టినట్లు ఫోజులిచ్చేసింది. ఇక ఆ వ్యవహారాన్ని అక్కడితో ముగించేసింది. అయితే, వాస్తవాల్లోకి వెళితే మార్కెట్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తినే తిండి, వస్తువులన్నీ కల్తీమయం గా మారాయి. కల్తీ ఆహార పదార్థాలు, వస్తువుల వినియోగంతో ప్రజల ఆరోగ్యాలు గాలిలో దీపం లా మారుతున్నాయి. పాలు, నూనె, నెయ్యి, పప్పు దినుసులు, పండ్లు ఇతర నిత్యావసరాలన్నీ కల్తీ అవుతున్నాయి. నియంత్రించే వారు లేకపోవడంతో కల్తీగాళ్ల వ్యాపారాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుంది. మామూళ్ల మత్తులో అధికారులు పట్టించుకోవడం మానేశారనే ఫిర్యా దులున్నాయి. తాజాగా బాన్సువాడలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడమే ఇందుకు నిదర్శనం. విషతుల్యంగా నిత్యావసరాలు.. బాన్సువాడ పట్టణంలో వెలుగుచూసిన నకిలీ నెయ్యి తరహాలోనే జిల్లా కేంద్రంలోనూ కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలు ఉన్నట్లుగా సమాచారం. కొత్త బస్టాండ్ ప్రాంతంలోని ఓ కిరాణ దుకాణం, గంజ్ ప్రాంతంలోని పలు కిరాణ దుకాణాల నుంచి నిత్యం పెద్ద మొత్తంలో వనస్ప తి (డాల్డా) ప్యాకెట్లు వెళ్తుంటాయి. వాటిని నకిలీ నెయ్యి తయారీకే ఉపయోగిస్తారనే విషయం బహిరంగ రహస్యం. జిల్లా కేంద్రంలో గల్లీ గల్లీలోనూ పాల విక్రయ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో పాలు చిక్కగా, ఆకర్షణీయంగా ఉండేందుకు పలు రకాల రసాయనాలు, పౌడర్లు కలుపుతున్నారనే ఫిర్యాదులు ఎప్పటి నుంచో ఉన్నా యి. కారంపొడి, పసుసులను కల్తీ చేయడానికి తక్కువ ధరలో వచ్చే పిండి పదార్థాలు, రంగు కోసం పౌడర్లు, చెక్క పొడి వాడుతున్నారు. కంది పప్పులో సోయా పప్పు, మిరియాలలో బొప్పా యి విత్తులు కలిపేస్తారు. ఇక, కామారెడ్డి కల్తీ నూనెల తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ 3–4 వంట నూనెల తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటి నుంచి ఐదారు జిల్లాలకు వివిధ రకాల కంపెనీల పేర్లతో మంచి నూనె ప్యాకెట్లు సరఫరా అవుతున్నాయి. నాసిరకం నూనె పదార్థాలను కలుపుతూ అనుమానం రాకుండా ఉండేందుకు రసాయనాల ను వినియోగిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఇవే కాకుండా కిరాణ దుకాణాల్లో చిన్న పిల్లలు కొనుక్కునే తినుబండారాలు తయారు చేసే కేంద్రాలు కామారెడ్డిలో రెండు,మూడు చోట్ల ఉన్నాయి. వా టిపై అధికారుల కనీస పర్యవేక్షణ లేదు. అపరిశుభ్ర వాతావరణంలో తినుబండరాలు తయారు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మామూళ్ల మత్తులో అధికారులు! కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి లాంటి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోనూ నిత్యం పెద్ద మొత్తంలో వ్యాపారాలు సాగుతుంటాయి. ప్రతి రోజు రూ.కోట్లల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రధాన పట్టణాల్లో, ముఖ్యంగా కామారెడ్డిలో జీరో దందా ఎక్కువగా నడుస్తోంది. అధికారుల కనుసన్నల్లోనే నకిలీ వ్యాపారాలు నడుస్తున్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు మిగతా సమయాల్లో నకిలీ ఆహార పదార్థాలు, వస్తువులపై కనీస పర్యవేక్షణ చేపట్టడం లేదు. మాముళ్లే అందుకు కారణమనేది బహిరంగ సత్యం. ఈ వ్యవహారంపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి నాగరాజు వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. అన్నింటా కల్తీయే..! జిల్లా వ్యాప్తంగా ఆహార పదార్థాల కల్తీ వ్యాపారాలు జోరుగా నడుస్తున్నాయి. తాగే పాలను, తినే తిండిని సైతం వదలడం లేదు. ఉప్పులు, పప్పులు, పసుపు, కారంపొడి, చక్కెర, పాలు, పెరుగు, నెయ్యి, టీపొడి, నూనెలు.. ఇలా అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు. గతంలో వంటకు ఉపయోగించే ఆహార పదార్థాలకు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న ఆహార పదార్థాలకు వ్యత్యాసం ఎంతగానో ఉంది. ఎంత ప్రయత్నించినా వంటలు రుచిగా కావడం లేదు అని మాత్రమే వినియోగదారులు ఆలోచిస్తున్నారు. దానికి కారణం ఆహార పదార్థాల్లో కల్తీలేనని గుర్తించినా ఏమీ చేయలేని పరిస్థితి వారిది. రుచి మాట పక్కన పెడితే విలువైన ఆరోగ్యానికి హాని జరుగుతుందనేది వాస్తవం. ధనార్జనే లక్ష్యంగా నడుస్తున్న నకిలీ వ్యాపారాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. -
డబ్బాశతో ఇంజినీరింగ్ విద్యార్థి...
సాక్షి, హైదరాబాద్: యూరియాతో పాలు.. ఇనుప రజను పౌడర్‌తో టీ పొడి.. ఇటుక పొడితో కారం... బట్టల సోడాతో చక్కెర.. పసుపు పచ్చ మోటానిల్‌తో పసుపు పౌడర్... జంతువుల కొవ్వుతో వంట నూనె.. నగరంలో ఇలా ప్రతి వస్తువూ కల్తీమయంగా మారింది. ఏ వస్తువు తింటే ఏ రోగమొస్తుందోనని జనం అల్లాడే పరిస్థితి దాపురించింది. నగర శివారు ప్రాంతాలు అడ్డాగా కోట్ల రూపాయల కల్తీ సరుకు తయారు చేసి నగర మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో హాని కల్గిస్తుందన్న విషయం తెలిసినా కూడా కేవలం ధనార్జనే ధ్యేయంగా కల్తీ దందా జోరుగా కొనసాగుతోంది. భారీ స్థాయిలో ఎతైన గోడలతో గోదాములు నిర్మించి, సెక్యూరిటీ గార్డులను నియమించి లోపలికి ఎవరికీ ప్రవేశం లేకుండా నగర శివారు ప్రాంతాల్లో కల్తీ కర్మాగారాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఉదయం లేవగానే తాగే కాఫీ లేదా చాయ్ పౌడర్‌లో చెక్కపొట్టు.. లేదంటే ఇనుప రజను ఉండి ఉంటుందంటే మీకు ఆశ్చర్యంగా కలగవచ్చు! చాయ్ లేదా కాఫీ తయారుచేయడానికి మీరు వాడే పాలలో పంటపొలాలకు వేసే యూరియా ఆనవాళ్లు ఉంటాయంటే మీరు భయకలగ వచ్చు...ఇడ్లీ లేదా దోశ లేదా ఉప్మా లేదా.. చపాతీలు వేసుకునే గోధుమపిండిలో మీరు తినకూడని, మీ కడుపులోకి ప్రవేశించకూడని పదార్థాలు యథేచ్ఛగా కలసిపోతున్నాయన్న వాస్తవం మీరు జీర్ణించుకోలేక పోవచ్చు. కానీ ఇవన్నీ వాస్తవాలు. జీర్ణించుకోలేని సత్యాలు! బ్రాండ్ ఎదో...లోకల్ మేడ్ ఎదో...ఏది స్వచ్ఛమో.. ఏది నకిలీయో..అంతా మాయాబజార్. ఆహార పదార్థాలే ఎక్కువ చిన్న పిల్లలకు తాగించే పాల నుంచి మొదలుకొని బియ్యం, నునె, కారం, ఉప్పు, పప్పు, నెయ్యి, మసాలాలతో సహా ప్రతి వస్తువు కల్తీ చేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువులు సైతం కల్తీకి గురవుతున్నాయి. అసలుకు ఏ మాత్రం తేడా లేకుండా నకలీ వస్తువుల్ని తయారు చేస్తున్నారు. నగర శివారు నుంచే.. గతంలో నిత్యావసర వస్తువులన్నీ గ్రామాల నుంచి నగరానికి ఎగుమతి అయ్యేవి. కల్తీగాళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి వస్తువు పట్టణాల్లోనే తయారు చేసి గ్రామాలకు చేరుస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్, ప్రాంతాల్లోని శివారు ప్రాంతాలను కల్తీగాళ్లు తమ అడ్డాలుగా మార్చుకున్నారు. రాచకొండ పరిధిలోని పహాడీషరీఫ్, జల్పల్లి, షాహీన్‌నగర్, బాలాపూర్ శివారు, శ్రీరాంనగర్ కాలనీ, మీర్పేట్, నాదర్గుల్, బడంగ్పేట్, కందుకూరు, మామిడిపల్లి, హయాత్ నగర్, పెద్ద అంబర్పేట్, అదిభట్ల, ఘట్కేసర్, కీసర, మేడిపల్లి మేడ్చల్ తదితర ప్రాంతాలతో పాటు సైబరాబాద్ పరిధిలోని బాలానగర్, శంషాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, పటాన్ చెరు తదితర ప్రాంతాలను కల్తీగాళ్లు అడ్డాగా మార్చుకున్నారు. రూ.50కి అమ్మే పదార్థం పది రూపాయలకే తయారవుతుంది. ఏకంగా రూ.40 లాభం పొందుతున్నారు. ఇంకాస్త లాభం ఎక్కువ రావాలంటే ప్యాకింగ్ మార్చేసి..బ్రాండ్ అలంకారం చేసి లారీల్లో గ్రామాలకు, బస్తీలు, కాలనీల్లోని చిన్నాచితక కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు వ్యాపారులు కల్తీ మాఫియాతో సంబంధాలు ఏర్పరుచుకొని వినియోగదారులకు బ్రాండెడ్ వస్తువుల స్థానంలో నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. ఈ కల్తీ వస్తువులు మార్కెట్లో తక్కువ ధరకు లభించడంతో వాటిని కొనుగోలు చేసిన ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అయినా సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువే. కల్తీకి గురవుతున్న కొన్ని వస్తువులు ఇలా.... కారం ఇలా కల్తీ ఫ్రీజర్ గోదాముల నుంచి బూజు పట్టిన మిరపకాయలు కోనుగోలు చేస్తారు. వాటిని మర పట్టించి చెక్కపొడి, నూనె, కొన్ని రకాల రసాయానాలు కలిపి కారాన్ని తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఏ బ్రాండెడ్ కారం పొడికి డిమాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ కవర్లు తయారు చేయించి అందులో ఆ కారం వేసి ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు దాన్ని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. యూరియాతో పాలు... యూరియా, నూనె, క్రిమిసంహారక మందులతో పాటు క్యాస్టిక్ సోడా, అమ్మోనియం వంటి రసాయనాలతో కల్తీ పాలను తయారు చేస్తున్నారు. శివారు ప్రాంతాలలోని పలు ఇళ్లలో కల్తీ పాలు తయారు చేసే యూనిట్లపై ఇటీవల ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. రేషన్ బియ్యానికి పాలిష్... రేషన్ బియ్యాన్ని మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి మిల్లుల్లో పాలిషింగ్ చేయించి సన్నబియ్యంగా మారుస్తున్నారు. ప్రజలకు సన్న బియ్యం అని ఎక్కువ ధరకు అంటగడుతున్నారు. నూనె..నెయ్యి కల్తీ ఇలా... జంతు కళేబరాలతో, వ్యర్థాలను ఉపయోగించి నూనె తయారు చేస్తున్నారు. కళేబరాలను, జంతువుల వ్యర్థాలను మరిగించి వాటి ద్వారా వచ్చే కొవ్వులతో పలు రకాల రసాయనాలు కలిపి నూనె, నెయ్యిని తయారు చేస్తున్నట్లు ఇటీవల పోలీసులు నిర్వహించిన దాడుల్లో తేలింది. ఏది అసలు..ఏది నకిలీ? కల్తీ దందా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జోరుగా సాగుతున్నది. అక్రమార్కులు ఏదో ఒక ఫుడ్స్ పేరుతో ఒక చోట కంపెనీ నెలకొల్పడం.. కుటీర పరిశ్రమ కింద రిజిస్టర్ చేయించుకోవడం.. ఇకపై దందా షురూ! ఓ భారీ షెడ్.. లోపల జరిగే బాగోతం బయటకు కనిపించకుండా చుట్టూ కోటను తలపించే ఎత్తయిన గోడలు.. ఎవరైనా తనిఖీ కోసం వస్తే వారిని మేనేజ్ చేసుకోవడం...ఇలా కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది.. పోలీసు నిఘా పెరిగినా.. కల్తీని నిర్మూలించడానికి వాస్తవంగా ఫుడ్స్, పీసీబీ, జీహెచ్ఎంసీ, పరిశ్రమల శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పనిని ప్రస్తుతం ఒక్క పోలీసులే చేస్తున్నట్లు అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా కల్తీ అడ్డాలపై పోలీసులు ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు. పోలీసులు దాడులు పెరుగడంతో కొందరు కల్తీదారులు పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. పోలీసులు సోదాలు చేసి.. కల్తీల బండారం బయటపెడుతున్నప్పటికీ.. ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయన్నది మాత్రం సందేహమే. రాచకొండ పరిధిలోనే ఎక్కువ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే కల్తీ కార్ఖానాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, కుర్కురే నుంచి మొదలుకొని నిత్యం వాడే వస్తువులు..నూనె, మసాలాలు, అల్లం వెల్లుల్లి, టీ పొడి, పాల పౌడర్ వరకు అన్ని కల్తీల కార్ఖానాలు ఇక్కడే ఉన్నాయి. రాచకొండ ఎస్వోటీ అధికారులు గత కొన్ని నెలల్లో 100 కార్ఖానాలపై దాడులు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. రోగాల దాడి ఇది నగరంలో ఒక యువతి వ్యథ. తీవ్ర జ్వరం.. ముఖంపై ఎర్రని మచ్చలు. ఇంట్లో ఏదో అలర్జీ అనుకున్నారు. వేడివల్ల వచ్చాయేమోనని సీరియస్‌గా తీసుకోలేదు. నెల గడిచినా తగ్గలేదు. ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళితే. అక్కడ రక్త పరీక్షలు చేస్తే అసలు సంగతి తేలింది. కల్తీ ఆహారం తినడంవల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధికి గురైనట్టు అక్కడ డాక్టర్లు నిర్థారించారు. నగరంలో ఇలాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. రసాయనాలు, విష పదార్థాలతో కల్తీ అవుతున్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లే జనం ఇలాంటి వ్యాధుల బారినపడుతున్నారు. కాగా కల్తీ నేరానికి ప్రస్తుతం వెయ్యి రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ కొత్తగా కల్తీ నేరానికి 10 లక్షల జరిమానా, యావజ్జీవ జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించింది. డబ్బాశతో ఇంజినీరింగ్ విద్యార్థి.... ఇంజినీరింగ్ చదివిన ఓ యువకుడు నగర శివారు ప్రాంతమైన బడంగ్పేట్లో తన తేలితెటలతో కల్తీ నూనె, నెయ్యి తయారు చేసి జోరుగా విక్రయాలు చేశాడు. కల్తీ కోసం ప్రత్యేకంగా ఓ షెడ్‌తో పాటు మిషనరీ ఏర్పాటు చేసి ప్లాంట్ నెలకొల్పాడు. తయారు చేసిన కల్తీ నూనె, నెయ్యిని బ్రాండెడ్ స్టికర్లతో ప్యాకింగ్ చేసి నగరంతో పాటు శివారు జిల్లాలకు సరఫరా చేశాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి 250 కిలోల కల్తీ నెయ్యి , 50 కిలోల డాల్డా, 2 వేల లీటర్ల నకలీ పామాయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
వంటనూనె ప్యాకెట్లో మాంస వ్యర్థాలు!
గాదేపూడి (గుడ్లవల్లేరు) : ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే జంతువులు, పక్షుల కళేబరాల వ్యర్థాలతో తయారు చేస్తున్న నకిలీ వంటనూనె, నెయ్యి ముఠాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీ పేరిట మార్కెట్లోకి విడుదలైన పొద్దుతిరుగుడు నూనె ప్యాకెట్లో పేగులు, కొవ్వు వ్యర్థాలు వచ్చిన సంఘటన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం గాదేపూడి గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన అప్పినీడి భాస్కరరావు చెబుతున్న మేరకు ఆయన కొనుగోలు చేసిన కిలో వంట నూనె ప్యాకెట్లో ఈ వ్యర్థాలు వచ్చాయి. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపారు. వడ్లమన్నాడులో ఓ దుకాణంలో కొని తెచ్చానన్నారు. ఇంటికొచ్చి కత్తిరించగా ఆయిల్ బాగా దుర్వాసన వచ్చిందని, దానిలో నుంచి పేగులు, కొవ్వు ముక్కలు పడ్డాయని తెలిపారు. నూనె రక్తం రంగులో ఎర్రగా ఉందన్నారు. ఆ వంటనూనెను వాడలేక పక్కన పెట్టేశామన్నారు. ఒక ప్రముఖ కంపెనీ పేరిట ముద్రించిన ఆయిల్ కవర్లను కల్తీ ముఠాలు ఉపయోగించుకున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రముఖ కంపెనీ అయితే వినియోగదారులకు అనుమానం లేకుండా నమ్మకంతో కొనుగోలు చేస్తారని ఇలా అక్రమార్కులు తెగబడ్డారని చెబుతున్నారు. ఇంకా ఎన్ని బ్రాండెడ్ కంపెనీల పేర్లతో నకిలీ సంస్థలు ఇలాంటి ఘరానా మోసాలకు పాల్పడుతున్నాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ కంట్రోల్, విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసే కల్తీరాయుళ్ల గుట్టు బయటపడుతుందని కోరుతున్నారు. -
కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడులు
హయత్‌నగర్: నగరంలోని హయత్‌నగర్ ప్రాంతంలోని కేడియా ఇండస్ట్రీస్ పేరుతో నడుస్తున్న ఓ కల్తీ నూనె తయారీ కేంద్రంలో ఎస్వోటీ పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. హెయిర్ ఆయిల్, పామాయిల్, డాల్డాలను కల్తీ చేసి డబ్బాల్లో ప్యాక్ చేసి విక్రయిస్తున్న వ్యవహారం ఈ సందర్భంగా వెలుగు చూసింది. యజమాని పరారయ్యాడు. పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కల్తీనూనె.. ముఠా గుట్టు రట్టు
విజయవాడ: విజయవాడలో కల్తీ నూనె తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టైంది. వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రముఖ కంపెనీ బ్రాండ్ల లేబుళ్లతో వీటిని సరఫరా చేస్తున్నట్లు కనుగొన్నారు. తిరుమలకు ఇదే నూనె సరఫరా చేస్తున్నట్ల సమాచారం.