కేరళతో హైదరాబాద్ తొలి పోరు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 12 వరకు జరిగే ఈ టోర్నీని నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల ఫార్మాట్ (90, ప్లస్ 40 ఓవర్లు)లో మ్యాచ్‌లు జరుగుతాయి. హెచ్‌సీఏ తరఫున రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. హెచ్‌సీఏ ఎలెవన్‌కు అక్షత్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌కు డీబీ రవితేజ నాయకత్వం వహిస్తాడు.
ఉప్పల్ స్టేడియంలో నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ ఎలెవన్ జట్టు కేరళతో తలపడుతుంది. ఉప్పల్, ఏఓసీ సెంటర్, ఎన్ఎఫ్సీ, ఈసీఐఎల్ మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. గోల్డ్ కప్ టోర్నీకి ఈసారి కూడా కోరమాండల్ కింగ్ సంస్థ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. విజేతకు రూ. లక్ష, రన్నరప్‌కు రూ. 50 వేల నగదు బహుమతి లభిస్తుంది. టోర్నీ డ్రాను హెచ్‌సీఏ ఆదివారం విడుదల చేసింది.
టోర్నీ షెడ్యూల్
సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు
హెచ్‌సీఏ ఎలెవన్ x కేరళ (ఉప్పల్ స్టేడియం)
గోవా xఢిల్లీ (ఎన్ఎఫ్సీ)
హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్x కర్ణాటక (ఈసీఐఎల్)
సర్వీసెస్ x తమిళనాడు (ఏఓసీ సెంటర్)
సెప్టెంబర్ 6-8 (సెమీ ఫైనల్స్)
సెప్టెంబర్ 10-12 (ఫైనల్స్)