పీవీపీలో మన్నర చోప్రా సందడి
విజయవాడ(లబ్బీపేట) :
ఇటీవల విడుదలైన జక్కన సినిమాలోని నటి మన్నర చోప్రా గురువారం నగరంలోని పీవీపీ మాల్లో సందడి చేసింది. అక్కడ అప్పో ఎఫ్ 1ఎస్ మొబైల్‌ను ఆవిష్కరించేందుకు వచ్చిన ఆమెను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. మన్నర చోప్రా అప్పో ఎఫ్ 1ఎస్ మొబైల్‌ను ఆవిష్కరించి, ఆ మొబైల్‌తో సెల్ఫీ తీసి సందడి చేసింది.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకూ తాను చూసిన మొబైల్స్‌లో అప్పో ఎఫ్ 1ఎస్ అద్భుతంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో సెల్ఫీలో చక్కటి ఆనందాన్ని ఈ ఫోన్ అందిస్తుందన్నారు. కెమెరా ఫోన్ టెక్నాలజీలో అప్పో అత్యుత్తమంగా ఉందన్నారు. కార్యక్రమంలో అప్పో జీఎం రే, హెడ్ కిమ్, డిస్ట్రిబ్యూటర్ భరత్‌కుమార్ పాల్గొన్నారు.