ashok vardhan
-
నవ్వులే నవ్వులు
చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్ధన్ , యాదమ్మ రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్లాంట్ మ్యాన్’. కె.సంతోష్ బాబు దర్శకత్వం వహించారు. డీఎం యూనివర్సల్ స్టూడియోస్‌పై పన్నా రాయల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పన్నా రాయల్ మాట్లాడుతూ–‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ‘ప్లాంట్ మ్యాన్’. ప్రారంభం నుంచి చక్కని వినోదం ఉంటుంది. ఒక కొత్త అంశం కూడా ఉంది.. అందుకే ఈ సినిమాకి ‘ప్లాంట్ మ్యాన్ ’ అనే టైటిల్ నిర్ణయించాం. ఈ చిత్రం తర్వాత కూడా మా బేనర్లో కొత్తవారిని పరిచయం చేస్తూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీఎస్. మణికర్ణన్ , నేపథ్య సంగీతం: వినోద్ యాజమాన్య, సంగీతం: ఆనంద బాలాజీ, నిర్మాత–దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్. -
గల్ఫ్‌లో బాధలకు ‘జో ఈజీ’ యాప్ చెక్
పంజగుట్ట: గల్ఫ్ దేశాల్లో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాల అవకాశాలను కల్పించేందుకు ఐడియాన్ వెంచర్ క్యాపిటల్ ఫామ్ సౌజన్యంతో దుబాయికి చెందిన సంస్థ ఓ యాప్ ప్రారంభించింది. సౌదీలో ఉద్యోగాలకోసం వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో ఉంచుకుని ‘‘జో ఈజీ’’ అనే యాప్‌ను రూపొందించినట్లు యాప్ సృష్టికర్త స్పందన తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐడియాన్ సంస్థ వైస్ ప్రసిడెంట్ అశోక్ వర్ధన్‌తో కలిసి మాట్లాడుతూ ... స్కిల్డ్, అన్‌స్కిల్డ్, ఇంట్లో పనిమనుషులు, డ్రైవర్లు లాంటి ఉద్యోగాల కోసం ఎంతో మంది ఎజెంట్లను ద్వారా దుబాయి లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతమన్నారు. ఇకపై ఎవ్వరూ అలా మోస పోకూడదనే ఈ యాప్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. యజమాని వివరాలు, ఉద్యోగుల వివరాలు ముందస్తుగానే ఇందులో పూర్తిగా పొందుపర్చి ఉంచుతామని తద్వారా ఏ ఎజమానికి ఎలాంటి ఉద్యోగి అవసరమౌతారో ఎంచుకోవచ్చునని వెల్లడించారు.