పంజగుట్ట: గల్ఫ్ దేశాల్లో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాల అవకాశాలను కల్పించేందుకు ఐడియాన్ వెంచర్ క్యాపిటల్ ఫామ్ సౌజన్యంతో దుబాయికి చెందిన సంస్థ ఓ యాప్ ప్రారంభించింది. సౌదీలో ఉద్యోగాలకోసం వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో ఉంచుకుని ‘‘జో ఈజీ’’ అనే యాప్‌ను రూపొందించినట్లు యాప్ సృష్టికర్త స్పందన తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐడియాన్ సంస్థ వైస్ ప్రసిడెంట్ అశోక్ వర్ధన్‌తో కలిసి మాట్లాడుతూ ...
స్కిల్డ్, అన్‌స్కిల్డ్, ఇంట్లో పనిమనుషులు, డ్రైవర్లు లాంటి ఉద్యోగాల కోసం ఎంతో మంది ఎజెంట్లను ద్వారా దుబాయి లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతమన్నారు. ఇకపై ఎవ్వరూ అలా మోస పోకూడదనే ఈ యాప్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. యజమాని వివరాలు, ఉద్యోగుల వివరాలు ముందస్తుగానే ఇందులో పూర్తిగా పొందుపర్చి ఉంచుతామని తద్వారా ఏ ఎజమానికి ఎలాంటి ఉద్యోగి అవసరమౌతారో ఎంచుకోవచ్చునని వెల్లడించారు.