రహస్య అణు నగరాన్ని నిర్మిస్తున్న భారత్: పాక్
ఇస్లామాబాద్: భారత్ రహస్య అణు నగరాన్ని నిర్మిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. భారీగా అణు ఆయుధ నిల్వలను పెంచుకొని ఈ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక సంతులనాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా వ్యాఖ్యానించారు. భారత్ ఖండాంతర క్షిపణి ప్రయోగాలు చేస్తోందన్నారు. ప్రాణాంతక ఆయుధాలను భారీగా తయారుచేస్తున్న భారత్‌పై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని కోరారు. పొరుగున ఉన్న దేశాలతో సఖ్యత, శాంతి కోసం పాకిస్తాన్ చేస్తున్న చర్యలకు భారత్ భంగం కలిగిస్తోందన్నారు.