badrachalam
-
Bhadrachalam: ఉగ్ర ‘గోదావరి’.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం 48 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతి నేపథ్యంలో ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇక, ఏజెన్సీలోని పలు గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. ఇప్పటికే చర్ల మండలంలోని మూడు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు.ఇక ధవళేశ్వేరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇక, వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఐదు ఎస్డీఆర్ఎఫ్, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విధుల్లో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.7 అడుగులకు చేరుకుంది. మరోవైపు, పోలవరం వద్ద గోదావరి నీటి ప్రవాహం 12.5 మీటర్లకు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. గోదావరి నుంచి ప్రస్తుతం 10 లక్షల 28 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల అవుతోంది. ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజలు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక, ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. -
అందంగా ముస్తాబైన భద్రాద్రి రామాలయం
-
పొంగులేటికి హ్యాండిస్తూ.. తిరిగి బీఆర్ఎస్లోకి తెల్లం
-
పొంగులేటికి భారీ ఝలక్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పెద్ద ఝలకే తగిలింది. గత నెలలో ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షంలో తనతో పాటే కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు మనసు మర్చాకున్నాడు. తిరిగి బీఆర్ఎస్లోకే వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చకపోవడం, అదే సమయంలో తనను నమ్ముకున్న కార్యకర్తల నమ్మకం వమ్ము చేయడం ఇష్టం లేకనే తిరిగి బీఆర్ఎస్ వెళ్తున్నట్లు ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారాయన. భద్రాచలం అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేపు(గురువారం) ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లం వెంకటరావు మొదటి నుంచి పొంగులేటికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ వచ్చారు. 2018లో టీ(బీ)ఆర్ఎస్ తరపున తెల్లం పోటీ చేసి ఓడిపోయారు(32 శాతం ఓటింగ్.. దాదాపు 36వేల ఓట్లు పోలయ్యాయి). అయితే రాబోయే ఎన్నికల్లో భద్రాచలం టికెట్ ఆశించి మరీ ఆయన పొంగులేటితో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇక్కడే ఆయనకు ఆటంకాలు ఎదురయ్యాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పొదెం వీరయ్యకే కేటాయించే అవకాశం ఉండడంతో.. వెంకటరావు నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో మరోపక్క నుంచి బీఆర్ఎస్ ముఖ్యనేతలు వెంకటరావుతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే టికెట్ హామీ ఇస్తేనే బీఆర్ఎస్లోకి వస్తానని ఆయన కరాకండిగా చెప్పినట్లు ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. చివరకు ఏమైందో తెలియదుగానీ.. ఆయన బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటన చేసేశారు. ఇదీ చదవండి: జెండా వందనంలో కొట్టుకున్న బీజేపీ నేతలు -
భద్రాచలంలో మళ్లీ పెరుగుతోన్న నీటిమట్టం..!
-
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
-
మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్’లో అమీర్‌ఖాన్‌లా రామిరెడ్డి!
U19 Women T20 World Cup- Gongadi Trisha- సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్పోర్ట్స్ నేపథ్యంలో వెండితెర మీద విజయఢంకా మోగించిన సినిమాలు ఎన్నో. అందులో ప్రథమ స్థానం రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన దంగల్‌కు దక్కుతుంది. జాతీయ స్థాయిలో ఆడలేకపోయిన మల్లయోధుడు మహవీర్ తన ఇద్దరు కూతళ్లను మల్లయోధులుగా తీర్చిదిద్ది దేశానికి అనేక పతకాలు సాధించేలా ఎంతో శ్రమించాడు. ఆ కష్టాన్ని అమీర్‌ఖాన్, ఫాతిమా సనా, మల్హోత్రాలు వెండితెర మీద కళ్లకు కట్టారు. అచ్చంగా అలాంటి స్ఫూర్తిదాయక జీవితాలు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తారసపడతాయి. గోదావరి తీరాన శ్రీరాముడి పాదల చెంతన త్రిష – రామిరెడ్డిలు మన దంగల్ కథకు ప్రతిరూపాలుగా నిలిచారు. 22 గజాల క్రికెట్ పిచ్‌లో రాణించేందుకు త్రిష సాగించిన, సాగిస్తోన్న గురించి ప్రయాణం ఆమె తండ్రి రామిరెడ్డి మాటల్లో.... నేను హాకీ ప్లేయర్‌ని స్వతహాగా నేను హాకీ ప్లేయర్‌ని. ఆటల్లో నా వారసులు నన్ను మించేలా ఎదగాలని కోరుకున్నాను. ఒక క్రీడాకారుడిగా నా జీవితంలో ఎదురైన అనుభవాల ఆధారంగా నా పిల్లలకు క్రీడల్లో ఎదురయ్యే ఆటంకాలు రాకుండా చూసుకోవాలని వాళ్లు పుట్టకముందే డిసైడ్ అయ్యాను. క్రికెటర్‌ను చేయాలని అప్పటి వరకు ఉన్న ఆటలను పరిశీలిస్తే షటిల్, టెన్నిస్ తదితర గేమ్స్ హైట్ అడ్వాంటేజ్ గేమ్స్. ప్లేయర్లో ఎంత ప్రతిభ ఉన్నా హైట్ సరిగా లేకపోతే ఈ ఆటల్లో రాణించడం కష్టం. అయితే ఎత్తుతో సంబంధం లేని గేమ్స్ ఏంటా అని పరిశీలిస్తే ఫుట్‌బాల్, క్రికెట్లు కనిపించాయి. భద్రాచలంలో ఫుట్‌బాల్ ఆడేందుకు, కోచింగ్ ఇచ్చేందుకు అనుకూలమైన పరిస్థితి లేదు. అదే క్రికెట్ అయితే గల్లీ క్రికెట్ మొదలు భద్రాద్రి కప్ వరకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు అనిపించింది. మిథాలీలా ఎదగాలని.. రెండేళ్ల వయసు నుంచే దీంతో నాకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా భవిష్యత్తులో క్రికెట్లో గొప్ప స్థాయికి వెళ్లేలా అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. సాధారణంగా పిల్లలకు ఏడేళ్ల నుంచి ఏదైనా ఆటలో ప్రొఫెషనల్ కోచింగ్ ఇప్పించడం మొదలవుతుంది. కానీ నేను త్రిషాకు నేరు రెండేళ్ల వయస్సు నుంచే ప్రారంభించాను, త్రిష పుట్టిన సమయానికి విమెన్ క్రికెట్లో మిథాలిరాజ్ డబుల్ సెంచరీలతో సంచలనాలు నమోదు చేస్తోంది. వరల్డ్‌కప్ ఆడుతుందని నమ్మాను లేడీ సచిన్‌గా పేరు తెచ్చుకుంటోంది. దీంతో మిథాలీ స్ఫూర్తితో కేవలం రెండేళ్ల వయస్సులో తనకు ఏమీ తెలియనప్పటి నుంచే క్రికెటింగ్ షాట్లు ఆడటం నేర్పిస్తూ వచ్చాను. తనకు తెలియకుండానే అది మజిల్ మెమోరీలో ఇమిడి పోయింది. ఆ మజిల్ మెమొరీ తనకు ఎంతగానో ఉపయోగపడింది. తను ఎదుగుతున్న కొద్దీ ఆటలో ఆ తేడాను బయటి వాళ్లు కనిపెట్టలేకపోయినా నేను పసిపగడుతూ వచ్చాను. దీంతో తనకు ఏదో ఒక రోజు ఇండియా తరఫున విమెన్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాదు, కచ్చితంగా వరల్డ్ కప్ కూడా ఆగుతుందనే విశ్వాసం ఉండేది. ఏడేళ్ల వయస్సులో హైదరాబాద్‌కు అడ్వాన్స్, సైంటిఫిక్ కోచింగ్ కోసం త్రిషకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యాం. అక్కడ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీకి వచ్చాం. వాళ్లిద్దరి ప్రత్యేక శిక్షణలో ఇక్కడ, జాన్ మనోజ్ సార్ త్రిష వీడియోను పరిశీలించారు. అప్పుడే వారు తను ఏదో ఒకరోజు ఇండియాకు ఆడుతుందని చెప్పారు. ఆర్ శ్రీధర్, ఇక్బాల్‌లు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రోజకు ఎనిమిది గంటల పాటు సాధన చేసేది. వారి అంచనాలను నిజం చేస్తూ 16లో దేశానికి ఎంపికైంది. 12 ఇయర్స్‌కి ఛాలెంజర్స్ సిరీస్‌కు సెలక్ట్ అయ్యింది. దీంతో మా నమ్మకం వమ్ము కాదనే నమ్మకం కలిగింది. హ్యపీగా ఉంది నా అంచనాలకు మించి ఏకంగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో మెంబర్‌గా ఉండటమే కాదు ఫైనల్లో విలువైన పరుగులు చేసింది త్రిష. మా కుటుంబం, బంధువులు, కోచ్‌లు, భద్రాచలం పట్టణం అంతా సంతోషంగా ఉన్నాం. త్రిష విజయాన్ని భద్రాచలం పట్టణం అంతా కేక్‌లు కట్ చేసుకుని తమ ఇంటి పండగలా చేసుకోవడం చూస్తే పట్టరాని సంతోషం కలుగుతోంది. తదుపరి లక్ష్యం అదే ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో ఉన్న త్రిష ప్రస్తుతం భావనాస్ కాలేజీలో ఇంటర్మీడియ్ సెకండియర్ (సీఈసీ) చదువుతోంది. రాబోయే రోజుల్లో ఇండియన్ సీనియర్స్ జట్టుకు ఎంపిక కావాలనేది తదుపరి లక్ష్యం. అంతేకాదు విమెన్ వరల్డ్ కప్ జట్టులో తాను ఉండాలి, కప్ కొట్టాలనేది మా కుటుంబం లక్ష్యం. చదవండి: Ind Vs Aus: సెలక్షన్ కమిటీ డోర్లు బాదడం మాత్రమే కాదు.. ఏకంగా! అయినా పాపం IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టీమిండియాకు గ్రాండ్ వెలకమ్! వీడియో వైరల్ -
మరింత ముదురుతున్న భద్రాద్రి లడ్డూ వివాదం
-
భద్రాద్రి: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. భక్తుల కౌంటర్ నిరసన
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరోసారి బూజు పట్టిన లడ్డూల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసిన కొందరు భక్తులకు షాక్ తగిలింది. లడ్డూలు వాసన వస్తుండడంతో సిబ్బందిని నిలదీశారు భక్తులు. బూజు పట్టిన లడ్డూలు ఎలా విక్రయిస్తారని కౌంటర్ సిబ్బందిని నిలదీశారు భక్తులు.ఈ క్రమంలో.. ‘ఇచ్చట బూజు పట్టిన ప్రసాదం లడ్డూలు ఇస్తారు’’ అని పేపర్ మీద రాసి లడ్డూ కౌంటర్‌కి అతికించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో లడ్డూలు మాయం కావడంపై తీవ్ర దుమారం రేగి.. చర్చ నడిచి దర్యాప్తు దాకా వెళ్లింది. తాజా ఘటనతో.. లడ్డూల నాణ్యత వ్యవహారంపై చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై సిబ్బంది స్పందించాల్సి ఉంది. -
భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన.. 144 సెక్షన్ విధింపు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి జిల్లాలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(బుధవారం) ఆమె భద్రాచలం ఆలయానికి రానున్నారు. బుధవారం భద్రాచలం శ్రీసీతారాముడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. భద్రాచలంలో 144 సెక్షన్ విధించారు. ఉదయం ఏడు గంటల నుంచి 144 సెక్షన్ అమలులోకి రానుంది. రాకపోకల నిలిపివేత ఉంటుంది. సుమారు 2 వేల మంది పోలీసులతో, 350 అధికారులు రాష్ట్రపతి భద్రతను పర్యవేక్షించనున్నారు. అలాగే.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో సారపాక బీపీఎల్ స్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు అధికారులు. హెలిప్యాడ్ నుంచి ఆలయం చుట్టూ ప్రోటోకాల్ కాన్వాయ్ ట్రయల్ నిర్వహించారు. ఉదయం పది గంటల ప్రాంతంలో సీతారాములను దర్శించుకుంటారు. దేశ ప్రథమ పౌరురాలి రాక సందర్భంగా.. ఉదయం 8 గంటల నుంచి 11.30గం. దాకా అన్ని దర్శనాలు బంద్ కానున్నాయి. ఇక తెలంగాణలో మూడు రోజులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు. ఈ నెల 28న అంటే బుధవారం భద్రాచలం సీతారాములను దర్శించుకుంటారు. ఈ నెల 29న ముచ్చింతల్ సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ నెల 30న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. -
గోదావరిలో కొనసాగుతున్నవరద ఉద్ధృతి
సాక్షి, అమరావతి/చింతూరు/కూనవరం/పోలవరం రూరల్/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మరోపక్క కృష్ణానదిలో వరద తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి ఏడుగంటలకు ప్రకాశం బ్యారేజి నుంచి 3,17,250 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి, శబరి నదుల్లో వరద ఉద్ధృతి పెరగడంతో విలీన మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినా విలీన మండలాల్లోకి నీరు చేరుతోంది. బుధవారం ఉదయం భద్రాచలం వద్ద 54.6 అడుగులున్న గోదావరి నీటిమట్టం రాత్రి ఏడుగంటలకు 54.4 అడుగులకు తగ్గింది. ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో బుధవారం రాత్రి వరకు వరద పెరుగుతూనే ఉంది. ఎటపాక మండలంలో ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో భద్రాచలంతో పాటు ఇతర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలో కూనవరం, టేకులబోరు, శబరి కొత్తగూడెం, చినార్కూరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, ముల్లూరు, తాళ్లగూడెం గ్రామాల్లోకి నీరు చేరింది. వీఆర్‌పురం మండలంలో పలు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. గోదావరి ఎగపోటు కారణంగా శబరినది కూడా క్రమేపీ పెరుగుతోంది. చింతూరు వంతెన వద్ద శబరినది బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. దీంతో వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. చింతూరులోని శబరిఒడ్డు, సంతపాకలు, టోల్గేట్, లారీ ఆఫీస్, పంచాయతీ రహదారి, వీఆర్‌పురం రహదారి ప్రాంతాలతో పాటు ఏజీకొడేరులో ఇళ్లల్లోకి వరదనీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 34.200 మీటర్లకు చేరింది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 12,36,429 క్యూసెక్కుల వరద నీరు కిందికి వెళుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కాటన్ బ్యారేజి వద్ద బుధవారం రాత్రి ఏడుగంటలకు నీటిమట్టం 15.20 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల విడుదల కృష్ణానదిపై ఆల్మట్టి జలాశయంలోకి 2.15 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 1.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 1.28 లక్షల క్యూసెక్కులు, జూరాలకు 2.47 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 2.46 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,96,431 క్యూసెక్కుల వరద వస్తోంది. రిజర్వాయర్ 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగులు ఎత్తి నీరు విడుదల చేస్తున్న అధికారులు గేట్లను బుధవారం ఉదయం ఆరుగంటలకు 12 అడుగులకు, మధ్యాహ్నం 12 గంటలకు 10 అడుగులకు దించారు. జలాశయం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల అవుతోంది. రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన చేస్తూ 62,570 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 209.5948 టీఎంసీల నీరు ఉంది. నీటిమట్టం 883.90 అడుగులకు చేరుకుంది. తుంగభద్రకు 51 వేల కూస్కెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. మొత్తం సాగర్ జలాశయానికి 3,39,214 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సాగర్ ఆరుగేట్లను ఐదడుగులు, 18 గేట్లను పదడుగులు ఎత్తి 2,98,596 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనతో 32,927 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ నీటిమట్టం 585.30 అడుగులు ఉంది. జలాశయంలో 298.3005 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 3.56 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి బుధవారం రాత్రి ఏడుగంటలకు 3,32,636 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. కృష్ణాడెల్టా కాలువలకు 15,386 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజి 30 గేట్లను ఎనిమిదడుగులు, 40 గేట్లను ఏడడుగులు ఎత్తి 3,17,250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద నీటిలో మునిగి రైతు మృతి కూనవరం మండలం కరకగూడెంలో కరక జోగయ్య(48) ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి మృతిచెందాడు. తన దుక్కిటెద్దులు కనిపించకపోవడంతో వెదుక్కుంటూ వెళ్లిన ఆయన తిరిగివచ్చే సమయంలో కొండాయిగూడెం–కరకాయిగూడెం మధ్యలో కాజ్‌వేపైన గోదావరి వరద నీటిని దాటుతూ మునిగిపోయాడు. ఇదీ చదవండి: పొంగుతున్న గోదావరి, శబరి నదులు -
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి
-
ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి
ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రాలోని ఎటపాక మండలం పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు ఆంధ్రాలోనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానాలు చేసినట్టు వస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. పురుషోత్తపట్నంలో శుక్రవారం కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. ఎంపీటీసీ సభ్యులు వర్సా బాలకృష్ణ, గొంగడి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ బుద్దా ఆదినారాయణ, పార్టీ నేతలు మంత్రిప్రగడ నర్సింహరావులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికీ అందుతున్నాయని తెలిపారు. జిల్లాల పునర్విభజన సమయంలో పాడేరు దూరాభారం దృష్ట్యా విలీన మండలాలకు పాలన సౌలభ్యం కోరుతూ ఆ సమయంలో కొందరు తీర్మానాలు చేశారని, అయితే ఆ నాటి తీర్మానాల్లో కొందరి సంతకాలు ఫోర్జరీ చేసి ఇప్పుడు వాటిని వక్రీకరించి చూపిస్తూ తెలంగాణ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. భద్రాచలంలోని కొందరు వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలనే వాదనను తెరపైకి తెస్తున్నారని చెప్పారు. భద్రాచలాన్ని తిరిగి ఆంధ్రాలో కలపాలని డిమాండ్ చేశారు. (క్లిక్: పవన్ కళ్యాణ్ తీరుపై మత్స్యకారుల మండిపాటు) -
దూరదృష్టితో గట్టెక్కించారు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పది రోజులపాటు మహోగ్రంగా పోటెత్తిన గోదావరి లంక గ్రామాలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ఎగువన భద్రాచలం వద్ద 71 అడుగులు, దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 21 అడుగులతో క్షణక్షణం వణికించింది. మూడు రోజుల పాటు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికతో ప్రమాద ఘంటికలు మోగించింది. అయితే ఈ స్థాయిలో వరద వచ్చినా గోదావరి తీరాన ఉన్న నాలుగు జిల్లాల్లో ఎక్కడా గండ్లు పడ్డ దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపే దీనికి కారణమని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో దూరదృష్టితో రూ.600 కోట్లతో 535 కిలోమీటర్లు మేర గోదావరి గట్లను ఆధునికీకరించడం, ఎత్తు పెంచడం వల్లే వరద ఉగ్రరూపం దాల్చినా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగినట్లు పేర్కొంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు... వైఎస్సార్ సీఎంగా ఉండగా 2006 ఆగస్టు 7న గోదావరికి వరదలు వచ్చాయి. నాడు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 22.80 అడుగుల నీటిమట్టంతో 28,50,664 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. నాటి వరదల ఉధృతికి వశిష్ట ఎడమ గట్టుకు పి.గన్నవరం మండలం మొండెపులంక, గౌతమి కుడిగట్టుకు అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద భారీగా గండ్లు పడ్డాయి. ఏటిగట్లకు పడ్డ గండ్లతో పలు మండలాల్లో పంటలు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చలించిపోయిన వైఎస్సార్ యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. నాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఒక బృందాన్ని గోదావరి జిల్లాలకు పంపి వాస్తవ పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయించారు. ఎటు చూసినా 8 మీటర్ల ఎత్తుతో.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 535 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్ల పటిష్టం కోసం వైఎస్సార్ రూ.548 కోట్లు మంజూరు చేశారు. పనులు పూర్తయ్యేసరికి అంచనాలు రూ.600 కోట్లు దాటిపోయాయి. 1986 నాటి వరదల సమయంలో ఏటిగట్లు ఆరు మీటర్ల ఎత్తు ఉండగా మరో రెండు అడుగులు పెంచి ఆధునీకరించారు. గోదావరి బండ్ ఎత్తు ఎక్కడ చూసినా ఎనిమిది మీటర్లు ఉండేలా పెంచారు. నాలుగు మీటర్లు వెడల్పున్న ఏటిగట్లను ఆరున్నర మీటర్లకు పెంచి విస్తరించారు. ఏటిగట్లు కోతకు గురికాకుండా మరో రూ.112 కోట్లతో నదీ పరీవాహకం వెంట గ్రోయిన్స్ కూడా నిర్మించారు. పటిష్టమైన చర్యల ద్వారా 1986 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించారు. తద్వారా గోదావరి జిల్లాల ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికుడిగా నిలిచారు. ముందుచూపు ఫలితమే.. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 20.10 అడుగులతో రికార్డు స్థాయిలో 35,06,380 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అత్యధికంగా నమోదైన 1986 వరదలనే ప్రామాణికంగా తీసుకుని ఏటిగట్లు పటిష్టం చేయాలని వైఎస్సార్ నిర్ణయించారు. దూరదృష్టితో ఎత్తు పెంపు, వెడల్పు, పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవడంతో తాజా వరదల్లో ఏటిగట్లకు ఎక్కడా చిన్న గండి కూడా పడలేదు. ఆనాడు ముందుచూపుతో ఆయన తీసుకున్న నిర్ణయాలే గోదావరి ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలిచాయి. గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు వైఎస్సార్ హయాంలో చేపట్టిన రక్షణ చర్యల్లో కొన్ని ప్యాకేజీలను ఆయన హఠాన్మరణం తరువాత చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది. వశిష్ట కుడి గట్టు నరసాపురం, వశిష్ట ఎడమగట్టు పరిధిలో 48వ కిలోమీటరు నుంచి 90వ కిలోమీటరు వరకు మూడు ప్యాకేజీలు నిలిచిపోయాయి. అప్పట్లో పనులు నిలిచిపోయిన ప్రాంతాల్లోనే తాజాగా అధికార యంత్రాంగం, స్థానికులు నిద్రాహారాలు మాని గట్లకు కాపలా కాయాల్సి వచ్చింది. రాజోలు పరిధిలోని తాటిపాక మఠం నుంచి అంతర్వేది, రాజోలు నుంచి అంతర్వేది వరకు మానేపల్లి వద్ద గోదావరి వరద ఉధృతి భయపెట్టింది. సఖినేటిపల్లి లంక, టేకిశెట్టిపాలెం, దిండి, రామరాజులంక, ఎల్ గన్నవరం, మానేపల్లి ప్రాంతాల్లో వరద భీతిగొల్పింది. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ఈ పనులను తరువాత ప్రభుత్వాలు పూర్తి చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు. ఆ నిర్ణయమే కాపాడింది.. ఈరోజు గోదావరి జిల్లాలు సురక్షితంగా బయటపడ్డాయంటే ఆ రోజు వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ఆయన దూరదృష్టితో కరకట్ట పటిష్టం చేయకుంటే ఈ వరదలకు ఏం జరిగేదో ఊహించలేం. ఎప్పుడూ లేనిది జూలైలో ఇంత ఉధృతంగా రావడం ప్రమాదకరమే. 2006లో వైఎస్సార్ సీఎంగా ఉండగా ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఈఈగా ఏటిగట్ల అంచనాలు రూపొందించే ప్రక్రియలో భాగస్వామి కావడం నాకెంతో సంతృప్తినిచ్చింది. – విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఎస్ఈ, జలవనరులశాఖ, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి -
TS: భద్రాచలం వద్ద తగ్గిన నీటిమట్టం.. మిగతా చోట్ల వరద ఉధృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఎగువ నుంచి గోదావరిలోకి వస్తున్న 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పుడిప్పుడే ముంపునకు గురైన కాలనీలలో సాధారణ పరిస్థితిలు కనిపిస్తున్నాయి. దీంతో శానిటేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వరదలతో సర్వం కోల్పోయిన భద్రాచలం స్థానికులు.. భరించలేని దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఒక పక్క సిబ్బంది.. మరోవైపు ప్రజలూ మాస్కులు ధరించి రంగంలోకి దిగారు. ఇంకోపక్క గోదావరి వరద లతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లోని ఏడు మండలాల్లో 630కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. వారం రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయింది పర్ణశాల సబ్‌స్టేషన్. సమారు 16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. అలాగే 143 గ్రామాల్లో 5,620 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. సహాయక చర్యలు.. భద్రాచలం వరదలు తగ్గుముఖం పట్టాక వేగంగా వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇతర జిల్లాలో నుంచి వచ్చి విధుల్లో చేరిన 4,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేస్తున్నారు. శిల్పినగర్, విస్తా కాంప్లెక్స్‌తోపాటు ఆలయ ఉత్తర ద్వారం వైపునకు వస్తున్న భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్ల ద్వారా నీరు లీకవుతోంది. దీంతో.. ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఐదు మోటార్లకు అదనంగా మరో 15 మోటర్లు తెప్పించించింది సింగరేణి. మొత్తం 20 మోటార్ల ద్వారా వరదనీటిని తోడి తిరిగి గోదావరిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నడుస్తోంది. ఉన్నతాధికారిపై వేటు భద్రాచలం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డా. కె. రాజ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. గోదావరి వరదల సమయంలో హెడ్ క్వార్టర్లో లేకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోవడం సర్కార్ దృష్టికి వెళ్లింది. దీంతో రాజ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరదనీరు పొటెత్తింది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 402.40 అడుగులు చేరింది. ఇన్ ఫ్లో 4వేల క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 59 వేల క్యూసెక్కులుగా ఉంది. పద్దెనిమిది గేట్లెత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మొత్తం 90 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 77 టీఎంసీలు.. 1091 అడుగులకుగాను.. నీటిమట్టం 1088 అడుగులుగా ఉంది. భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం వద్ద 12.600 మీటర్ల ఎత్తులో క్రమంగా పెరుగుతూ ప్రవహిస్తోంది గోదావరి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 10,71,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 10,71,720 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు. అన్నారం సరస్వతీ బ్యారేజ్ సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 1,46,,353 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 1,46,353 క్యూసెక్కులు గా ఉంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు.. ప్రస్తుత నీటి సామర్ధ్యం 0.33 టిఎంసిలుగా ఉంది. నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 29,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 4,138 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టిఎంసీ లు, ప్రస్తుత నీటి నిలువ: 173.6640 టిఎంసి లు. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం: 532.80 అడుగులు, -
అనుమతుల ప్రకారమే పోలవరం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల ప్రకారమే జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొత్తగా ఎత్తు పెంపు అంశం ఎక్కడిదని ప్రశ్నించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ‘అసలు పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏదీ జరగదు కదా? విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ప్రకారమే పోలవరం పనులు చేస్తున్నాం. భద్రాచలం ముంపు అనేది ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే చాలాకాలం తర్వాత భారీ వరదలు వచ్చాయి. సాంకేతికంగా ఇబ్బందులొస్తే దానిని ఎలా అధిగమించాలి.. ఏ రకంగా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలి. అక్కడా.. ఇక్కడా ఉన్నది ప్రజలే. సమస్య ఎక్కడైనా ఒక్కటే. దాని పరిష్కారానికి మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా నడుచుకోవాలి. ముంపు వచ్చింది.. ఇవే కారణాలంటే ఎలా కుదురుతుంది? సమస్యపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు’ అని పువ్వాడ అజయ్‌కు హితవు పలికారు. హైదరాబాద్‌ను కలిపేస్తారా? విలీన గ్రామాలను తిరిగి కలిపేస్తామంటున్న తెలంగాణ నాయకులు ఏపీలో హైదరాబాద్‌ను కూడా కలిపేస్తామంటే ఒప్పుకుంటారా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ‘రాష్ట్ర విభజన వల్ల ఏపీకి హైదరాబాద్ ద్వారా రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపేసి ఉమ్మడిగా ఉంచాలని అడిగితే బాగుంటుందా? అలా అయితే చేసేయమనండి తప్పు లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఒకటిగా ఉంచమనండి. అభ్యంతరం లేదు’ అని బొత్స వ్యాఖ్యానించారు. ఏపీలో విలీనమైన మండలాలు, అందులోని ప్రజలు తమ ప్రభుత్వ కుటుంబసభ్యులేనన్నారు. వారి పూర్తి బాధ్యత తమదేనని చెప్పారు. పువ్వాడ పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం తగదన్నారు. బాధ్యత గల ప్రభుత్వంగా.. వరదలను సమర్థంగా ఎదుర్కొన్నామని.. బాధితులకు అండగా నిలిచామన్నారు. పార్లమెంట్లో విలీన మండలాల అంశాన్ని తెలంగాణ తీసుకొస్తే.. తాము కూడా తెలుగు రాష్ట్రాలను కలిపేయాలని డిమాండ్ చేస్తామంటూ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బొత్స బదులిచ్చారు. అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యం విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మునిసిపల్ హైస్కూల్లో నిర్మించిన తరగతి గదులను మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.33.49 కోట్ల నిధులతో 28 ప్రభుత్వ పాఠశాలల్లో 168 అదనపు తరగతి గదుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తున్నామన్నారు. అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపునకు సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం ముంపునకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి నదికి భారీగా వచ్చిన వరదల వల్లనే తెలంగాణ, ఆంధ్రలోని నదీ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలోనూ గోదావరికి వచ్చిన వరదల వల్ల తెలంగాణ, ఆంధ్రల్లోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, 1986లో గోదావరి వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురయిందని అంబటి గుర్తు చేశారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని ప్రాంతాలు మునిగి పోతున్నాయని, భద్రాచలం మునగడానికి కూడా ఇదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. పూర్తిగా నిండినా నష్టం ఉండదన్న సీడబ్ల్యూపీఆర్ఎస్ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతు లు ఇచ్చిందని అంబటి గుర్తు చేశారు. ఈ ఎత్తులో రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండినా (ఎఫ్ఆర్ఎల్) నష్టం ఉండదని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) పరిశోధించి తేల్చిందని చెప్పారు. అందుకే పోలవరం నిర్మాణం వల్ల ముం పునకు గురయ్యే ఏడు మండలాలను విభజన సమ యంలో ఏపీకి కేటాయించారన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం వల్ల ముంపునకు గురయ్యే ఏడు మండలాల వారికి పునరావాసం కల్పించే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కొత్త వివాదాలు సృష్టించవద్దు ‘రెండు రాష్ట్రాల్లో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్లం. వివాదాలన్నీ సెటిల్ అయ్యాయి. ఇప్పుడు మనకేం వివాదాలు లేవు. కొత్త వివాదాలను సృష్టించుకోవద్దు’అని అంబటి సూచించారు. జల వివాదాలకు సంబంధించి సెంట్ర ల్ వాటర్ కమిటీ , కృష్ణా, గోదావరి రివర్ బోర్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. విడిపోయి కలిసుందాం అన్న మాటలకు కట్టుబడి రెండు రాష్ట్రాల ప్రతినిధులు సోదరభావంతో ఉండాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు దశలవారీగా పూర్తవుతుందని,. వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామన్నారు. భద్రాచలం ఇవ్వమంటే ఇచ్చేస్తారా? భద్రాచలం సమీపంలో ఉన్న ఏపీ పరిధిలోని ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయాలంటూ మంత్రి పువ్వాడ అడిగిన విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘ఇచ్చేయమనగానే ఇస్తారా? అలా అంటే భద్రాచలం మాదే కదా.. ఏపీకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా?’అని అంబటి ప్రశ్నించారు. వరదలపై ఈనాడు వక్రబుద్ధి గోదావరి వరదల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలోను ఈనాడు తన కుటిలబుద్ధిని వద లడం లేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అనూహ్యంగా జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదలను ఆరు జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు సమర్థంగా ఎదుర్కొని సహాయ కార్య క్రమాలు చేపడితే.. ఈనాడు పత్రిక.. ‘పిల్లలకు పా లు లేవు.. పెద్దలకు తిండిలేదు..’ అని దుర్మార్గంగా తప్పుడు వార్త రాసిందని చెప్పారు. దీనిపై తాను మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించింద న్నారు. అనూహ్యంగా జూలై నెలలో ఈ వరదలు వచ్చాయని చెబితే.. ప్రకృతి వైపరీత్యాలు– మన మేం చేయలేం అని వారి తప్పుడు వార్తను తాను ఒప్పుకొన్నట్లు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావుకు వయసొచ్చిందిగానీ బుద్ధి రాలేద న్నారు. చంద్రబాబును అర్జెంటుగా సీఎంను చేయాలని, భుజాన పెట్టుకుని వెళ్లాలనుకుంటున్న రామోజీరావు తన వక్రమార్గాన్ని వీడాలని హితవు పలికారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతిలో ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేయమని అధికారులను ఆదేశించాడు. తిత్లీ తుపాన్‌ను అధికారులు కంట్రోల్ చేస్తున్నారని చెప్పాడు. అలాంటి మాటలను రాయని రామోజీరావు నేను అనని మాటలను అన్నట్లు రాస్తున్నాడు..’ అని అన్నారు. -
భద్రాచలంలో వరద నష్టం.. బాధితుల కష్టం (ఫొటోలు)
-
భద్రాద్రిలో వైభవంగా ధ్వజారోహణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ధ్వజారోహణం కనుల పండువగా జరిగిం ది. నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్టాపన చేయ డమే కాక ఇతర పూజలు నిర్వహించారు. తొ లుత ప్రధానాలయం నుంచి వేద పండితు లు సమస్త లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్స వమూర్తులైన శ్రీ సీతారామలక్ష్మణ స్వామి వారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చే స్తూ ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చా రు. అనంతరం గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ జరిపి.. బ్రహ్మోత్సవ ర క్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆ హ్వానిం చి ఆరాధన చేశారు. అనంతరం శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రు డైన గరుత్మం తుడి పటాన్ని మంగళ వాయిద్య ఘోష మధ్య ధ్వజస్తంభంపై ఎగుర వేశారు. ఆ తర్వాత సంతానం లేనివారికి గరుడ ముద్దలను అం దజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సం తానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. -
శ్రీరామ నీ నామమెంతో రుచిరా..
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం భక్త రామదాసు 389వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం, చక్ర సిమెంట్స్, నేండ్రగంటి అలివేలు మంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో వివిధ నగరాల నుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు రామయ్యతో పాటు భక్తరామదాసుకు నవరత్న ఘోష్టితో ‘స్వరార్చన’ జరిపారు. తొలుత రామదాసు ప్రతిమతో భద్రగిరి ప్రదక్షిణ, నగర సంకీర్తన, రామదాసుకు అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే రామదాసు జయంతి ఉత్సవాలను కరోనా ఆంక్షల నేపథ్యాన ఈసారి ఒకేరోజుకు పరిమితం చేశారు. -
ఊహించని అద్భుతం: తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామనుకున్నారు..
కూనవరం (తూర్పుగోదావరి): తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామంటూ ముందుకు వచ్చిన వైద్య బృందానికి ఊహించని అద్భుతం తారసపడంతో వారి ఆనందానికి అవధులు లేవు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం జరిగిన అరుదైన ఈ ఘటన ఆస్పత్రి చరిత్రలోనే లిఖించదగినదిగా పలువురు ప్రసంశిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన జోడె నాగమణి నిండు గర్భిణి. వచ్చే నెల 4వ తేదీన ఆమెకు కాన్పు కావలసి ఉంది. ప్రస్తుతం బీపీకి మందులు వాడుతోంది. దానికితోడు ఆయాసం ఎక్కువైంది. నొప్పులు రావడంతో కూనవరం మండలం కోతులగుట్ట సీహెచ్‌సీకి వెళ్లింది. చదవండి: (అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి) అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని గ్రహించి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేస్తూ ఆ విషయాన్ని కోతులగుట్ట సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డికి సమాచారం ఇచ్చారు. డాక్టర్ కోటిరెడ్డి ఈ విషయాన్ని చింతూరు ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణకు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్యకు చేరవేశారు. అప్పటికే నాగమణి కోమాలోకి వెళ్లింది. భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెలో చలనం కనిపించలేదు. మృత్యువు ఒడిలోకి జారుకున్న ఆ మహిళను చూసి మదనపడుతున్న వైద్యుల వద్దకు డాక్టర్ కోటిరెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్య వెళ్లి కనీసం కడుపులో ఉన్న బిడ్డనైనా సేవ్ చేయాలని భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరిం టెండెంట్ రామకృష్ణను కోరారు. చదవండి: (ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం) గర్భిణి సోదరుడు జోడె నాగేశ్వరరావు, భర్త సత్యనారాయణకు పరిస్థితి వివరించి అంగీకరింపజేశారు. డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్ట్ నరసయ్య, ఎనస్తీషియన్ కిషన్, ఐసీయూ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది బృందంగా ఏర్పడి ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. అనంతరం కొద్దిసేపటికి తల్లిలో కూడా కదలికలు గమనించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ అద్భుతం చూసిన వైద్యులు ఆమెకు వెంటనే వైద్య సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమం. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోనే ఇది అరుదైన సంఘటన అని అక్కడి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ అన్నారు. వైద్యబృందం కృషిని ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణ మెచ్చుకున్నారు. -
నిరాడంబరంగా తెప్పోత్సవం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించే తెప్పోత్సవాన్ని బుధవారం నిరాడంబరంగా ఆంతరంగికంగానే జరిపించారు. స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా హంసవాహనంతో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి వారిని వేంచేపు చేశారు. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర తీర్థంతో సంప్రోక్షణ చేసిన తర్వాత ప్రత్యేక పూజలు, ఆరాధన, ఏకాంత తిరుమంజనం, నివేదన, దర్బారు సేవలను జరిపించారు. ఇక గురువారం తెల్లవారుజామున నిర్వహించే ఉత్తర ద్వార దర్శనాన్ని సైతం నిరాడంబరంగానే జరపనున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విద్యుత్ లైట్ల అలంకరణలో భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం -
సీఎం గారూ.. రామయ్య పెళ్లికి రండి
భద్రాచలం: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 21న జరిగే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ ఈవో బి.శివాజీ, వేదపండితులు కలిసి ఆహ్వాన పత్రిక, జ్ఞాపిక, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, మాలోత్ కవిత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కూడా ఆహ్వాన పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు స్థలశాయి, ఏఈవో శ్రవణ్‌కుమార్, సీసీ అనిల్, అర్చకులు పాల్గొన్నారు. చదవండి: ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు -
అమ్మో పులి.. జంకుతున్న జనం
తెల్లవారకముందే నిద్ర లేచే పల్లె.. ఇప్పుడు సూరీడు నడినెత్తికొచ్చినా గడప దాటట్లేదు. పొద్దుగూకే వరకు పంట చేలల్లోనే గడిపే శ్రమజీవులు.. ఇప్పుడు పెందళాడే ఇంటికి చేరుకుంటున్నారు. పులి భయం పల్లెల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇద్దరిని పొట్టన పెట్టుకుని.. రోజుకోచోట బయటపడుతున్న పులి జాడ అలజడి రేపుతోంది. ఏ క్షణంలో ఏ మూల నుంచి పంజా విసురుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. రైతులు, రైతుకూలీలు బయటకు అడుగుపెట్టలేని పరిస్థితుల్లో చేతికందిన పత్తి పంట ఇంటికి చేరనంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని అటవీ సమీప గ్రామాల్లో పులిదెబ్బకు ప్రజలదినచర్య, రోజువారీ కార్యకలాపాలు మారిపోయాయి. గుంపులుగా వెళ్లడం, పొలంలో పనిచేసే చోట డప్పు చప్పుళ్లు చేయడం, పులి బారిన పడకుండా ‘ముఖం మాస్కు’లు ధరించడం.. ఇంకా మరెన్నో జాగ్రత్తలతో బయట అడుగుపెడుతున్నారు. ఈ పరిస్థితులపై‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్’.. చేలల్లో పత్తి విచ్చుకున్నవేళ.. రైతుల్లో ఆనందం అలముకోవాలి. కానీ, వారిలో భయాందోళన నెలకొంది.. చేతికొచ్చిన పంట ఇంటికి చేరాలి. కానీ, చేలల్లోనే రైతుల కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. అడవిలో సంచరించాల్సిన పులి చేనుచెలకల్లో తిరుగుతోంది. కనబడినవారినల్లా పొట్టనపెట్టుకుంటోంది. కూలీలు వేకువజామునే బయలుదేరి ఉదయం ఆరుగంటలకల్లా పొద్దుతో పోటీపడి పత్తి చేలల్లో కనిపించేవారు. కానీ, పులి సంచారానికి భయపడి ఉదయం 10 గంటల తర్వాతే ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. చీకటి పడిందంటే.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని అటవీ సమీప ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పులి సంచరించిన ప్రాంతాల్లో ‘సాక్షి’ పర్యటించింది. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు స్థానికులతో మాట్లాడింది. సమయం ఉదయం పది గంటలు.. ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామంలో దిగాం. ఇక్కడే నవంబర్ 11న పులి దాడి చేసి సిడాం విగ్నేష్(21)ను పొట్టనబెట్టుకుంది. గ్రామ శివారులో కూలీలు గుంపులు, గుంపులుగా దారిలో మాకు ఎదురొస్తూ కనిపించారు. ఇంకొందరి చేతుల్లో ఉన్న డప్పులు అదేపనిగా మోగుతున్నాయి. మరికొందరు ప్లాస్టిక్ డబ్బాలతో చప్పుళ్లు చేస్తున్నారు. అసలు విషయమేమిటో కనుక్కుందామని.. అక్కడే ఉన్న కనక సాంబయ్య అనే కూలీని పలకరించగా... ‘పత్తి ఏరడానికి చేన్లకు పోతున్నాం. కా>నీ, పులి ఏడ నుంచి వచ్చి మీదపడ్తదో తెల్వక హడలిపోతున్నాం. సిడాం విగ్నేష్‌ని పొట్టనబెట్టుకుంది. అందుకే పులిని బెదరగొట్టడానికి డప్పుచప్పుళ్లు చేసుకుంటూ పొలాలకు పోతున్నం. మామూలుగానైతే వేకువజామున పత్తిచేలకు పోతం ’అని భయాందోళనతో చెప్పాడు. అక్కడ వారితో కొద్దిసేపు ముచ్చటించి మరో ఊరికి వెళ్లగా ఒక వ్యక్తి ఓ కుక్కను వెంటబెట్టుకొని వెళ్తూ కనిపించాడు. మరిచోట కొందరు యువకులు చేను చుట్టూ కాపాలా కాస్తుండగా కూలీలు పత్తి తీస్తున్న దృశ్యాన్ని ‘సాక్షి’గమనించింది. మాస్క్‌తో మస్కా.. మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నెత్తిమీదికొచ్చా డు. ఎండ చురుక్కుమంటోంది. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లికి ‘సాక్షి’ చేరుకుంది. నవంబర్ 29న ఈ ఊరుకు చెందిన పసుల నిర్మల పత్తి చేనులో ఉండగా పులి దాడి చేసి చంపేసింది. గ్రామానికి దూరంగా ఉన్న పత్తి చేనులో ఓ చోట గుమిగూడి పత్తి తీస్తున్న కూలీలు కనిపించా రు. కొందరి తలలకు వెనుకభాగంలో మాస్కులు కనిపించాయి. ఎందుకలా అని అడిగితే, ‘రెండుకాళ్ల జీవాల మీద పులి సాధారణంగా దాడి చేయదు. నాలుగు కాళ్ల జంతువుల మీదే ఎక్కువగా పంజా విసురుతుంది. అయితే, మేం చేలల్లో వంగి పనిచేస్తున్నప్పుడు నాలుగు కాళ్ల జంతువని భ్రమించి దాడిచేసే ప్రమాదం ఉంది. తలలకు వెనుక వైపు మాస్కు ధరించి కనిపిస్తే.. అక్కడున్నది మనిషి అనుకొని దాడి చేయదు’ అని ఓ కూలీ చెప్పాడు. పులి.. కెమెరా ‘కంట’బడేనా? మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కళ్లంపల్లిలో పత్తి చేనులో ప్లాస్టిక్ డబ్బాతో శబ్దం చేస్తూ ఓ యువకుడు కనిపించాడు. పులి జాడలను కనిపెట్టేందుకు కాటేపల్లి, ముక్కిడిగూడెం, బుడుగుఒర్రె, సుంపుటం, పాసినీళ్ల రోడ్ల వెంట ఏర్పాటు చేసిన కెమెరాలు కనిపించాయి. తాంసి(కె) శివా రు ప్రాంతాల్లో ఐదుచోట్ల అమర్చిన కెమెరాలను కనిపించాయి. ఈ పల్లె పెన్‌గంగా నదికి ఆనుకు ని ఉంటుంది. నదికి అవ తలి వైపు మహారాష్ట్ర భూ భాగం. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం(టైగర్ జోన్) నుంచి తరచూ ఇటువైపు పులులు వస్తున్నాయని గ్రామస్తులు భయంభయంగా చెప్పారు. నెలకు ఒకటి రెండుసార్లు పులి కన్పిస్తోందని చెప్పారు. మంచె మీద మొనగాడు మామూలుగానైతే కూలీలు కాలినడకన పొలం పనులకు వెళ్తుంటారు. కానీ, కొత్తగూడం జిల్లా గుండాల మండలం జగ్గయ్యగూడెంలో మాత్రం అందరూ కట్టకట్టుకుని ఒకే ట్రాక్టర్లో పొలం పనులకు వెళ్తుండటాన్ని ’సాక్షి‘గమనించింది. పాల్వంచ మండలం పాండురంగాపురంలో రైతులు ఊరేగింపు తీస్తున్నట్టుగా వెళ్తున్నారు. అందరి చేతుల్లోనూ కర్రలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్లగా దారిలో పెంపుడు కుక్కను వెంటపెట్టుకుని పొలం వద్దకు వెళ్తున్న ఓ రైతు కనిపించాడు. మరోచోట చేనులో మంచె మీద ఒక యువకుడు చురుకుగా అటు, ఇటు చూస్తున్నాడు. పులి రాకను గమనించి కూలీలను అప్రమత్తం చేయడానికి ఇలా మంచె మీద ఉన్నట్టు ఆ యువకుడు ‘సాక్షి’కి వివరించాడు. గుండెలో దడను కళ్లల్లో కనిపించకుండా ఎంతో దైర్యంగా ఉన్నాడతడు. అదిగో పులి.. పోదాం ఇంటికి సాయంత్రం నాలుగు గంటల వేళ.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి(కె) శివారులో కొందరు కూలీలు పత్తి చేలను వీడి అరుపులు, కేకలు వేస్తూ ఇళ్లకు వెళ్తుండటం ‘సాక్షి’కి గమనించింది. ప్రజ్వల్ అనే యుకుడిని పలకరించగా.. ‘ఒకసారి మా పశువుల మందపై పులిదాడి చేసి ఆవును చంపేసింది. అప్పటి నుంచి మందను అటవీలోకి తీసుకువెళ్లడం లేదు. పంట చేల సమీపంలోకే పశువులను మేత కోసం తీసుకెళ్తున్నాం’అని చెప్పాడు. చెబుతున్నప్పుడు అతడి కళ్లల్లో భయం స్పష్టంగా కనిపించింది. సీతాయిగూడెంలో తాజాగా.. చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతాయిగూడెం సమీపంలో గురువారం మిషన్ భగీ రథ వాటర్ ట్యాంక్ వద్ద పులి పాదముద్రలు కనిపించాయి. పులి అన్నపురెడ్డిపల్లి వెళ్లే రోడ్డు వరకు వచ్చి, తిరిగి అటవీ ప్రాంతం లోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. పులుల సంఖ్య అధికం కావడం వల్లే... ఒక్కసారిగా పులుల సంచారంతో కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం అభయారణ్యాన్ని టైగర్ రిజర్వ్‌గా చేస్తారంటూ ఆయా జిల్లాల్లో చర్చలు జరుగుతున్నాయి. సహజంగా పులి దట్టమైన అడవి దాటి బయటకు రాదు. పులుల సంఖ్య పెరగడంతోనే అవి తమకు అనువైన ప్రాంతా న్ని వెతుక్కునేందుకు కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి, మహారాష్ట్రలో ని చంద్రపూర్, తాడోబా, ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌ల నుంచి మం చిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల మీదుగా ఈ పులులు కిన్నెరసాని అభయారణ్యానికి వచ్చినట్లు తెలుస్తోంది. భయం గుప్పిట ఉన్న ప్రాంతాలివే ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి(కె), గొల్లఘాట్, పిప్పల్‌కోఠి గ్రామాలు ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ, లోహా, కర్జి, రాంపూర్ పరిసర ప్రాంతాలు.. పెంచికల్పేట్ మండలం కొండపల్లి, గుండెపల్లి, అగర్‌గూడ, మెరెగూడ, లోడుపల్లి, కొండపల్లి, దరోగపల్లి, బొంబాయిగూడ పరిసర ప్రాంతాలు.. బెజ్జూర్ మండలం చిన్నసిద్దాపూర్, పెద్దసిద్దాపూర్, పాపన్నపేట, ఏటిగూడ, గబ్బాయి గ్రామాలు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముక్కిడిగూడెం, కల్లెంపల్లి, సుంపుటం, రాజారాం, నాగారం, కాటేపల్లి, నీల్వాయి సమీప అటవీ ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో అటవీ ప్రాంతాలకు ఆనుకుని వందల గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కిన్నెరసాని అభయారణ్యంలో ప్రవేశించాక మొదట గుండాల, ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, మణుగూరు, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి మండలాల్లో పులి సంచారం అధికంగా ఉంది. రోజుకో చోట పులి సంచారం వెలుగుచూస్తోంది. -
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో భట్టి పర్యటన
సాక్షి, భద్రాచలం: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బాధితులకు వైద్య సేవలు అందించే విషయంలో సీఎం కేసీఆర్ చేతులెత్తేశారని అన్నారు. సీఎల్పీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన కార్యక్రమాన్ని బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్లు ధరించి, కరోనా నిబంధనలు పాటిస్తూ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డును పరిశీలించి, అందిస్తున్న వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ చావా యుగంధర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన వారు ఉంటే ఉంటారు.. పోతే పోతారు అన్న చందంగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో తాము పలు సూచనలు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వైద్య పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మూడు రాష్ట్రాలకు తలమానికంగా ఉన్న భద్రాద్రి ఏరియా ఆస్పత్రిలో కనీసం 1/3 వంతు మంది సిబ్బంది కూడా లేరని అన్నారు. ఇక్కడ మొత్తం 205 మంది పని చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 61 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇదే ఆస్పత్రిలో పనిచేసే డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, అలాంటి వారికే దిక్కు లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఈ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత గురించి గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, అయినా సర్కారు పెడచెవిన పెట్టిందని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.