Baldness prevention
-
బట్టతలకు పరిష్కారం దొరికింది..
న్యూఢిల్లీ : సమకాలీన ప్రపంచంలో చాలా మందిని వేధిస్తున్న వాటిలో బట్టతల కూడా ఒకటి. పలురకాల సంస్థలు బట్టతల సమస్యను పూర్తిగా తగ్గిస్తామని పేర్కొంటున్నాయి. దీంతో చాలామంది పురుషులు వాటివైపు ఆకర్షితులు అవుతున్నారు. అయితే, తాజా అధ్యాయనంలో బట్టతలకు పరిష్కారం దొరికింది. ఎముకలు పెళుసుబారడాన్ని నివారించే మందుకు బట్టతలను కూడా నివారించే శక్తి ఉందని పరిశోధకుల అధ్యాయనాల్లో తేలింది. బట్టతల సమస్యతో బాధపడుతూ ఈ మందును వినియోగించిన పురుషులకు కేవలం ఆరు రోజుల్లో రెండు మిల్లీమీటర్ల పాటు జుట్టు పెరిగినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, దీనిపై పూర్తి స్థాయిలో అధ్యాయనం చేయాల్సివుందని చెప్పారు. డబ్ల్యూఏవై-316606 అనే మందును ఉపయోగించినప్పుడు ఈ ఫలితం వచ్చిందని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం బట్టతల నివారణకు రెండు రకాల డ్రగ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటి వల్ల దుష్ఫలితాలు కూడా ఉంటుండటంతో ఎక్కువ మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారు. -
బట్టతలకు కొత్త ఔషధాలు!
న్యూయార్క్: బట్టతల నివారణకు ఓ సరికొత్త ఔషధాలు సిద్ధమవుతున్నాయి. వెంట్రుకల పెరుగుదలను బాగా పెంచి బట్టతల రావడాన్ని నియంత్రించే ఈ ఔషధాలను అమెరికాకు చెందిన కొలంబియా వర్సిటీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్త ఏంజిలా క్రిస్టియానో నేతృత్వంలోని పరిశోధకులు రూపొందించారు. వెంట్రుకల పెరుగుదల నిలిచిపోయిన చోట చర్మంలో ఉండే వెంట్రుకల మూలాలలో ‘జానస్ కినాసే (జేఏకే)’ తరహాకు చెందిన ఎంజైమ్లు ఉంటాయని.. వీటిని నిరోధించినప్పుడు తిరిగి వెంట్రుకలు వేగంగా పెరుగుతున్నట్లుగా గుర్తించామని ఏంజిలా చెప్పారు. ఈ ఎంజైమ్లను నియంత్రించే ఔషధాలను అభివృద్ధి చేశామని.. వాటిని మనుషులపై ఇప్పటికే ప్రయోగించి చూడగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ ఔషధాలను నేరుగా చర్మంపై రాసుకుంటే సరిపోతుందన్నారు. పలు ఇతర వ్యాధుల బారిన పడినప్పుడు వెంట్రుకలు రాలిపోవడాన్ని ఈ మందులు నియంత్రిస్తాయన్నారు.