banda jyothi
-
గుండెపోటుతో సినీ నటి జ్యోతి మృతి
హైదరాబాద్: పలు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా నటించిన బండ జ్యోతి(55) శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. మణికొండ పంచాయతీ పరిధిలోని చిత్రపురి కాలనీలో తన తల్లితో పాటు ఉంటున్న ఆమె వారం రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆమె ఎలాంటి ఆహారం తీసుకోకపోవటంతో పల్స్ పడిపోయి శనివారం తెల్లవారు జామున గుండెపోటు రావటంతో మృతి చెందారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు. జ్యోతి మృతితో చిత్రపురి కాలనీలో విషాదం నెలకొంది. జ్యోతి మృతివార్త తెలుసుకున్న మూవీఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు కొమర వెంకటేశ్‌లు నివాళులర్పించారు. అనంతరం ఆమె అంత్యక్రియలను నగరంలో నిర్వహించేందుకు తరలించారు. -
హాస్యనటి బండ జ్యోతి కన్నుమూత
-
హాస్యనటి బండ జ్యోతి మృతి
తెలుగు సినిమా హాస్యాన్ని విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇటీవల కాలంలో కొందరు హాస్యనటులు శాశ్వతంగా దూరమైపోగా ఇప్పుడు మరో హాస్యనటి కూడా ఈ లోకాన్ని వీడింది. హాస్య నటి బండ జ్యోతి శనివారం మృతి చెందారు. చేసినవి చిన్న పాత్రలే అయినా, తనదైన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్న బండ జ్యోతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడేవారు. హైదరాబాద్ నానక్ రాం గూడ చిత్రపురికాలనీలో నివాసం ఉంటున్న ఆమె ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. విజయరామరాజు, కళ్యాణరాముడు, స్వయంవరం, అందగాడు, భద్రాచలం, గణేష్ వంటి పలు చిత్రాల్లో నటించిన బండ జ్యోతి స్వస్థలం విజయవాడ.