హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భేష్
ముంబై: ప్రైవేటు రంగంలో 2వ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో(2014-15, అక్టోబర్-డిసెంబర్) మంచి ఫలితాలు సాధించింది. నికరలాభం 20% పెరిగింది. బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ పరేశ్ సుక్తాంకర్ శనివారం వెల్లడించిన అంశాల్లో కొన్ని...
నికర లాభం 20.2 శాతం పెరిగి రూ.2,794.5 కోట్లుగా నమోదయ్యింది. ప్రధానంగా వడ్డీ ఆదాయం పెరగడం దీనికి ప్రధాన కారణం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ పరిమాణం రూ.2,325.7 కోట్లు.
{పధానంగా వడ్డీల మీద వచ్చే ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.5,699 కోట్లుగా ఉంది. ఇతర ఆదాయం 18 % వృద్ధితో రూ.2,535 కోట్లకు చేరింది.
మనీ మార్కెట్ రేట్లు తగ్గడం వల్ల నిధుల సమీకరణ వ్యయ భారం తగ్గించుకుంది. వెరసి వార్షికంగా నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 0.2 శాతం పెరిగి 4.4 శాతానికి ఎగసింది. అయితే త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే ఈ రేటు 0.10 శాతం తగ్గింది. 4.1-4.5 శాతం మధ్య ఈ మార్జిన్ ఉండేందుకు బ్యాంక్ కసరత్తు.
మార్చి నాటికి బేస్ రేటును బ్యాంక్ పునఃసమీక్షిస్తోంది.
స్థూల మొండిబకాయిల రేటు 1.01 శాతం నుంచి 0.99 శాతానికి తగ్గింది.
మొండిబకాయిల కేటాయింపులకు సంబంధించిన