best marks
-
ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
ఎండవేడిమితో విద్యార్థుల ఇబ్బందులు నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో పదోతరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా మొదలయ్యాయి. జిల్లా వ్యాపితంగా 172 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. తాము ఉత్తమ మార్కులు సాధించాలని కోరుకుంటూ విద్యార్ధులు పలు దేవాలయాల్లో పూజలు చేసి పరీక్షలకు రాయడానికి బయలు దేరారు. తెలుగు, సంస్కృతానికి సంబంధించి మొదటిరోజు 33,814 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 223 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ రామలింగం జిల్లాలో 8 కేంద్రాలను తనిఖీ చేశారు. నెల్లూరులోని ఎస్ఆర్కే పాఠశాలలో తనిఖీలు చేసిన డీఈఓ ఇన్విజిలేటర్లకు తగు సూచనలిచ్చారు. పరిశీలకులు మరో 8 , స్క్వాడ్ బృందాలు 89 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఎండ తీవ్రత (40 డి గ్రీల సెల్సియస్) ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు, వారికి సహాయకులుగా వచ్చిన త ల్లిదండ్రులు ఇబ్బందిపడ్డారు. పలువురు తల్లిదండ్రులు చెట్లకింద, గోడల మాటున నిలబడి పిల్లలు పరీక్షలు రాసి వచ్చేంతవరకు ఎదురు చూశారు. విద్యార్థులు పరీక్షలు రాసి కేంద్రాల నుంచి వెలుపలికి రాగానే పలువురు తల్లిదండ్రులు వారికి తాగునీరు, జ్యూస్‌ను అందించారు. అప్పుడే మొదలైన ప్రైవేటు ప్రచారం ఒక వైపు పదోతరగతి పరీక్షలు రాసి బయటకు వస్తున్న విద్యార్థులకు కేంద్రాల వాకిట వద్ద నిలబడి పలువురు ప్రైవేటు కళశాలల వారు తమ పాఠశాలలో చేరాలంటూ కరపత్రాలు పంచారు. -
పోలీసు కుటుంబాలకు పరిహారం పంపిణీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు రూరల్ ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ శనివారం తన కార్యాలయంలో పరిహారం పంపిణీ చేశారు. చీడికాడ పోలీస్ స్టేషన్లో పనిచేసి మృతి చెందిన హెచ్‌సీ కె.అప్పన్న భార్య కోడా వెంకటలక్ష్మికి, హుకుంపేట పీఎస్ ఏఎస్ఐ ఎన్.సోమయ్య భార్య విజయకుమారికి, మంప పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ సోబా రాంబాబు భార్య సర్వలక్ష్మిలకు తలో రూ.50 వేలు పంపిణి చేశారు. అదే విధంగా 2011-12,2012-14 విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన సిబ్బంది పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. అనంతరం కంట్రోల్ రూం ఎస్ఐ సిహెచ్.రాంబాబు, అనకాపల్లి సీసీఎస్ ఎల్.తాతబ్బాయి, అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన చోటా సాహెబ్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డి.ఎన్.కిశోర్, నర్సీపట్నం ఏఆర్ డీఎస్పీ దామోదర్, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ సిహెచ్.వివేకానంద, జిల్లా అధ్యక్షుడు జె.వి.ఆర్.సుబ్బరాజు, సిబ్బంది పాల్గొన్నారు.