best place
-
కంప్లీట్ టూర్ : రిషికేశ్, రుద్రాక్షలు స్పెషల్
అక్టోబర్ వస్తోంది. దసరా సెలవులు వస్తాయి. కాలేజ్, ఉద్యోగం స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం ఎటైనా టూర్‌కెళ్తే బావుణ్ననిపిస్తుంది. ఈ సీజన్లో మనదేశంలో ఏ ప్లేస్ బెస్ట్ అంటే ముందు రిషికేశ్ని గుర్తు చేసుకోవాలి. రిషికేశ్ టూర్ అంటే అట్లా ఇట్లా ఉండదు. ఒక అడ్వెంచరస్ టూర్, ఒక తీర్థయాత్ర, ఒక హనీమూన్ వెకేషన్, ఓ తథాత్మ్యత... అన్నీ కలిపిన తీర్థం, క్షేత్రం ఇది. గంగోత్రి నుంచి గంగానది కొండ వాలుల మధ్య ప్రవహిస్తూ నేల మీదకు వచ్చే వరకు ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. గంగోత్రి నుంచి రిషికేశ్కు 250 కిమీల దూరం ఉంటుంది. రిషికేశ్ పట్టణం సముద్రమట్టానికి పదకొండు వందల నుంచి పదిహేడు వందల అడుగుల ఎత్తులో విస్తరించి ఉంది. రిషికేశ్ వరకు గంగానది ఎక్కువ వెడల్పు లేకుండాపాయలాగ వేగంగా ప్రవహిస్తూ ఆకాశం నుంచి దూకుతున్నట్లే ఉంటుంది. అక్కడి నుంచి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న హరిద్వార్ వరకు ప్రవాహం విశాలమవుతూ, పరుగు వేగం తగ్గుతుంటుంది. గంగానది కలుషితం కావడం హరిద్వార్ దగ్గర నుంచే మొదలవుతుంది. కాబట్టి అంతకంటే పైన రిషికేశ్ దగ్గర గంగాస్నానం చేయాలనుకుంటారు ఎక్కువ మంది. యువత అయితే గంగానదితోపాటు ఒక్క ఉదుటున భూమ్మీదకు దూకడం కోసం రిషికేశ్కు ఇరవై కిలోమీటర్ల పైకి వెళ్లి అక్కడి నుంచి రాఫ్టింగ్ మొదలు పెడతారు. రిషికేశ్‌లో రివర్‌రాఫ్టింగ్ నిర్వహించే సంస్థలు ప్రతి వీధిలోనూ కనిపిస్తాయి. బంగీ జంప్, ఫ్లయింగ్ పాక్స్ కూడా చేయవచ్చు. నగరం ఎంత ఇరుకుగా ఉంటుందో నది తీరాన గుడారాల్లో క్యాంపింగ్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కనిపిస్తాయి.లక్ష్మణ్ ఝాలాగంగానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి సస్పెన్షన్ బ్రిడ్జి ఉంది. దాని పేరు లక్ష్మణ్ ఝాలా. రామాయణ కాలంలో రాముడు, లక్ష్మణుడు, సీత కొంతకాలం ఇక్కడ నివసించారని చెబుతారు. సీత నది దాటడం కోసం లక్ష్మణుడు అడవి చెట్ల తీగలతో వంతెనను అల్లాడని, దాని పేరే లక్ష్మణ్ ఝాలా అని చెబుతారు. రిషికేశ్కు మరికొంత దూరంలో రామ్ ఝాలా ఉంది. అది రాముడు అల్లిన తీగల వంతెన. ఈ రెండు వంతెనలు నది దాటడానికి అనువుగా ఉండేవి. కాలక్రమంలో ఆ వంతెనల స్థానంలోనే ఇనుప వంతెనలు నిర్మాణం జరిగింది. పర్యాటకులు లక్ష్మణ్ ఝాలా మీద నుంచి అవతలి తీరానికి చేరి అక్కడి నుంచి పడవలో విహరిస్తూ ఇవతలి ఒడ్డుకు రావచ్చు. పడవలో మెల్లగా సాగుతూ ఒక ఒడ్డున మనుషులను, మరో ఒడ్డునున్న ఎత్తైన కొండలను, కొండవాలులో, నది తీరాన ఉన్న నిర్మాణాలను చూస్తూ ఉంటే ఒక్కసారిగా తుళ్లింతలతో యువకులు రివర్ రాఫ్టింగ్ చేస్తూ దూసుకొస్తారు. నదిలో బోట్ షికార్ టికెట్ల మీద ప్రభుత్వ నిఘా పెద్దగా ఉండదు. ప్రైవేట్ బోట్ల వాళ్లు ఒక్క ట్రిప్‌కి వేలల్లో అడుగుతారు. పెద్ద బోట్లలో వెళ్లడమే శ్రేయస్కరం. గంగ పరవళ్లు తొక్కుతుంటుంది. చిన్న పిల్లలతో వెళ్లిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.యోగా క్యాపిటల్రిషికేశ్, హరిద్వార్ రెండూ నేషనల్ హెరిటేజ్ సిటీలు. కేరళలో ఉన్నట్లే ఆయుర్వేద వైద్యం, పంచకర్మ చికిత్స కేంద్రాలుంటాయి. హిమాలయాల నుంచి సేకరించిన ఔషధ మొక్కలతో వైద్యం చేస్తారు. రిషికేశ్‌లో ఏటా యోగా, మెడిటేషన్ సెషన్లు జరుగుతాయి. భారత ప్రధాని కూడా రిషికేశ్ పర్యటన సందర్భంగా పట్టణంలోని ఒక గుహలో ధ్యానం చేశారు. భవబంధాలను వదిలి మోక్షసాధన కోసం జీవితంలో అంత్యకాలాన్ని ఇక్కడ గడపడానికి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. రోజూ సాయంత్రం గంగాహారతి కనువిందు చేస్తుంది. నది మధ్యలో ధ్యానముద్రలో ఉన్న ఈశ్వరుని విగ్రహాన్ని చూడడానికి దగ్గరకు వెళ్లడం కంటే ఒడ్డున ఘాట్ నుంచి చూస్తేనే శిల్పసౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతాం. ఉత్తరాఖండ్ వర్షాకాలం వరదల బారిన పడుతుంటుంది. కానీ ఆ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజమే. కాబట్టి సీజన్ వచ్చే సరికి టూరిస్టుల కోసం సిద్ధమైపోతుంది. అన్నట్లు ఈ టూర్ గుర్తుగా రుద్రాక్ష తెచ్చుకోవడం మర్చిపోవద్దు. మన దగ్గర జామచెట్లు ఉన్నట్లు ఎక్కడ చూసినా రుద్రాక్ష చెట్లే. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎండలు బాబోయ్.. ఇక్కడికి చెక్కేద్దామా!
-
US: అమెరికాలో తప్పక చూడాల్సిన ఐదు ప్రదేశాలివే!
ఇండియా నుండి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెళ్లే వాళ్ళను విమానాశ్రయాల్లో గమనిస్తే మూడుకాళ్ళ ముసలివాళ్ళు ఎక్కువగా కనబడుతుంటారు. ఇలాంటి వారికి వేలాది మైళ్ళ ప్రయాణం చేయగలిగే శక్తి ఉత్సాహలనిచ్చే అసలు అదృశ్యశక్తి దూర దేశాల్లోకి అంతర్జాలమే వాహనంగా దూరిపోయిన మన ఎన్ఆర్ఐ పిల్లలదేనన్నది నిస్సందేహం. హార్డ్‌వేర్ బతుకుల్లో సాఫ్ట్వేర్ పిల్లలు పండు ముదుసళ్లకు తప్పని ఫారిన్ ట్రిప్పులు ! ఎందుకు నాయనా ఈ వయసులో మాకు శ్రమ! అని ఆమ్మో నాన్నో తప్పించుకోజూస్తే.. ‘అలాకాదు మా చదువుల కోసం మీరు చేసిన అప్పులకు, పగలనకా రాత్రనకా కష్టపడి పనిచేసి మేము కూడబెట్టిన ఆస్తులకు, త్వరలోనే వారసులు రాబోతున్నారు కాబట్టి తప్పక రండి, మీరూ వాళ్ళ సేవ చేసుకొని తరించవచ్చు’ అంటారు. అలాంటిదే ఒక సేవా సందర్భం 2013లో నాకూ వచ్చింది. అప్పటి వరకు మాతో హైదరాబాద్ లోనున్న మూడేళ్ల మా మనవడిని అప్పుడు లాస్ ఎంజీల్స్లోనున్న మా అబ్బాయి దగ్గర దింపిరావడానికి ఆగష్టు 17న నేను అమెరికా బయలుదేరి వెళ్ళాను. గమ్యం చేరేవరకు ప్రతి ఎయిర్‌పోర్టులో అధికారులతో నేను పదే పదే ఎదుర్కున్న ప్రశ్న.. మా మనవడి గురించి.! మీ దగ్గర ‘పేరెంట్స్ పర్మిషన్, వాలిడ్ డాకుమెంట్స్ ఉన్నాయా లేవా ? ’ అని. మా జర్నీలో ఫ్లయిట్ మారినప్పుడల్లా కనబడ్డ ప్రతి టాయ్ కావాలని చేస్తున్న మా మనవడి డిమాండ్స్ అయిష్టంగానైనా ఒకటీ అరా తీరుస్తూ ఎలాగైతేనేం ఎట్టకేలకు లాస్ ఎంజీల్స్ చేరి అప్పగింతలు పూర్తిచేశా. నాలాంటి వాడిని అమెరికా వెళ్లి ఏం చేశారని ఎవ్వరూ అడగరు, ఏం చూశారన్నదే ముఖ్యమైన ప్రశ్న. నా లెక్కకు అందరూ అడిగే ఈ ఐదు చూసేస్తే అమెరికా యాత్ర పూర్తయినట్లే. 1 ) ఆ దేశ స్వాతంత్య్రానికి ప్రతీకయైన న్యూయార్క్‌లోని స్టాచ్యు అఫ్ లిబర్టీ 2 ) వాషింగ్టన్ డి సి లోని అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేతసౌధం అదే వైట్ హౌస్ 3 ) కాలిఫోర్నియాలోని హాలీవుడ్ సినీ ప్రపంచం 4 ) పిల్లల ప్రపంచం డిస్నిల్యాండ్ 5) నిద్రపోని నగరం క్యాసినోల ప్రపంచం లాస్ వేగాస్ను మరిచిపోయానంటారేమో, నా లాంటివాడు అటు వెళ్తే ఉన్న ఆరోగ్యమే కాదు పొదుపు చేసి పెట్టుకున్న పెన్షన్ డబ్బులు కూడా పోతాయేమోనని భయం. లాస్ ఏంజెల్స్ ఒకప్పుడు మెక్సికోలో భాగం, దీన్ని ఓ ఒప్పందం పేరిట 1848లో అమెరికా తీసేసుకున్నదట. లాస్ ఎంజీల్స్లో ఉన్నాను కాబట్టి అక్కడి హాలీవుడ్ సినీ ప్రపంచాన్ని చుట్టేసాను, యూనివర్సల్ స్టూడియోలో ఒక రోజంతా గడిపాను. అటునుండే వెళ్లి పిల్లలతో డిస్నీల్యాండ్ లో ఆడుకొని వచ్చాను. నేను అక్కడ ఉన్నప్పుడే అప్పటివరకు స్కెచర్స్ లో పనిచేస్తున్న మా అబ్బాయికి ఒరాకిల్ పోర్టులాండ్‌లో అవకాశం రావడంతో ముల్లెమూటా సర్దుకొని అక్కడి నుండి మారాల్సి వచ్చింది. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ నుండి పోర్టులాండ్ ( ఒరెగాన్ ) దూరం దాదాపు 900 మైళ్లు. అందరమూ కారులో వెళదామన్నాడు మా అబ్బాయి. నేషనల్ హైవె మీద దాదాపు 350 మైళ్లు, 7 గంటల డ్రైవ్ తర్వాత మేము శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుని అక్కడే నైట్ హాల్ట్ చేసాము. ఇదే విమానంలో వచ్చుంటే ఫ్లయిట్ జర్నీ గంటకు మించదు. 1906లో వచ్చిన తీవ్రమైన భూకంపంలో శాన్ ఫ్రాన్సిస్కో దాదాపు మూడు వంతులు దెబ్బతిందట. మళ్ళీ పునర్ నిర్మించుకున్న ఈ నగరం ఒకప్పుడు హిప్పీ సంస్కృతికి తర్వాతి కాలంలో స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్యమానికి పేరు గాంచింది. ఇంకా దాదాపు 550 మైళ్లు వెళితే గానీ మేము గమ్యం చేరలేము. పిల్లలు అప్పటికే అలసిపోయి ఉండడం వల్ల, వాళ్ళను మరునాడు ఫ్లయిట్ ఎక్కించి మా అబ్బాయి నేను మాత్రం ఇక్కడి ప్రసిద్ధ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూస్తూ పోర్ట్ ల్యాండ్ బాట పట్టాము. ఈ నేషనల్ హైవే 101 అంతా ఘాట్ రోడ్డు, ప్రయాణంలో ఎన్నో పదనిసలు. కుటుంబం నుంచి జాతీయ అంతర్జాతీయ రాజకీయాల వరకు అన్నీ మాట్లాడుతూ, ప్రతి 50-60 మైళ్లకు ఒకచోట హైవేల పక్కనున్న రెస్ట్ ఏరియాల్లో కాస్సేపు విశ్రమిస్తూ చేసిన దాదాపు పది గంటల ప్రయాణం తర్వాత మేము పోర్ట్ ల్యాండ్ చేరుకున్నాము. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు బాగా నచ్చినవి ప్రయాణికులు సేద దీరడానికి రెస్ట్ రూంలు. వీటిలో రెస్టారెంట్ల నుంచి ప్లే ఏరియా వరకు అన్ని సౌకర్యాలున్న ‘ రెస్ట్ ఏరియాలు ’ అవే విశ్రాంత ప్రాంతాలు ఎలాంటి బడలికనైనా అట్టే మాయం చేస్తాయి. అందుకే వేల కిలోమీటర్ల (మైళ్ల) దూరాన్ని సునాయసంగా లాగించేస్తుంటారు అమెరికన్లు. హోటళ్ల తరహాలోనే అన్ని సౌకర్యాలుంటాయి, పైగా ఇవి మోటారిస్టుల కోసం కాబట్టి వీటిని మోటళ్లు అంటారు. తక్కువ ఖర్చులో అవసరమైనవన్నీ ఇక్కడ లభిస్తాయి. అందుకే సగటు అమెరికన్లు ఏడాదిలో కనీసం 30 రోజులు ప్రయాణాల్లో ఉంటారట.! --వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికాలో తప్పకుండా చూడాల్సిన అయిదు ఏంటంటే?) -
వెకేషన్ కోసం బెస్ట్ ప్లేసులు ఇవే..
-
దుబాయ్‌లోని టాప్ 10 అందమైన ప్రదేశాలు
-
పనిచేయడానికి ఇదే బెస్ట్ కంపెనీ..
ముంబై: దేశంలో పనిచేయడానికి అత్యుత్తమ కంపెనీగా టీసీఎస్ గుర్తింపు పొందింది. పనిచేయడానికే కాకుండా, కెరీర్లో పురోగతికీ టీసీఎస్ మెరుగైన కంపెనీగా లింక్డ్ఇన్ 2023 నివేదిక తెలిపింది. టీసీఎస్ తర్వాత అమెజాన్, మోర్గాన్ స్టాన్లీ లింక్డ్ఇన్ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది లింక్డ్ఇన్ జాబితాలో టెక్ కంపెనీల ఆధిపత్యం ఎక్కువగా ఉండగా, ఈ ఏడాది జాబితాలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఆర్థిక సేవల కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రొఫెషనల్ సేవలు, తయారీ, గేమింగ్ కంపెనీలకూ చోటు దక్కింది. 25 కంపెనీల్లో 10 ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫిన్‌టెక్ నుంచే ఉన్నాయి. మాక్వేర్ గ్రూప్ 5వ స్థానంలో ఉంటే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 11, మాస్టర్‌కార్డ్ 12, యుబి 14వ స్థానంలో నిలిచాయి. 20వ స్థానంలో డ్రీమ్11, 24వ స్థానంలో గేమ్స్ 24/7 ఉన్నాయి. ఈ జాబితాలో గేమింగ్ కంపెనీలకు చోటు లభించడం మొదటిసారి. ఈ రంగానికి పెరుగుతున్న ప్రజాదరణను ఇది తెలియజేస్తోంది. ఇన్స్టంట్ గ్రోసరీ డెలివరీ సంస్థ జెప్టో 16వ స్థానం దక్కించుకుంది. ఈ తరహా నైపుణ్యాలకు డిమాండ్.. లింక్డ్ఇన్ జాబితాలో చోటు సంపాదించుకున్న టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం చూస్తున్నాయి. ఫైనాన్షియల్ రంగానికి చెందిన కంపెనీలు కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్రోత్ స్ట్రాటజీస్ తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇండస్ట్రియల్ డిజైన్, గేమ్ డెవలప్మెంట్ నిపుణులకూ డిమాండ్ నెలకొంది. ఇంజనీరింగ్, కన్సల్టింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, విక్రయాలు, డిజైన్, ఫైనాన్స్, ఆపరేషన్స్‌పై ఎక్కువగా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేసే కంపెనీలు, ఆ తర్వాత ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, పుణెకు చెందినవి నిపుణులను నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. -
అత్యధిక ‘ఆతిథ్య’ బుకింగ్స్ జాబితాలో హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పర్యాటకుల ఆసక్తిని దక్కించుకున్న అగ్రగామి ఆతిథ్య నగరాల్లో హైదరాబాద్ టాప్ 5గా నిలిచింది. ఈ విషయాన్ని పర్యాటకులకు హోమ్‌స్టేస్ అందించే ఆన్లైన్ వేదిక ఎయిర్ బిఎన్బి అధ్యయనం వెల్లడించింది. పర్యాటకాభిరుచుల గురించి గత ఏడాదికి సంబంధించి ఈ సంస్థ అధ్యయనం వెల్లడించిన పలు ఆసక్తికరమైన విశేషాల్లో... సోలో టూర్... సో బెటరూ... ఒంటరిగా ప్రయాణించడాన్ని అత్య«ధిక శాతం మంది ఇష్టపడుతున్నారని స్టడీ తేల్చింది. పర్యాటకశైలి ఆసక్తుల్లో సోలో ట్రావెల్ అత్యంత ప్రజాదరణ పొందిన అంతర్జాతీయ ప్రయాణ శైలిగా నిలవగా, తర్వాత స్థానాల్లో జంటగా చేసే కపుల్ ట్రావెల్, ఆ తర్వాత కుటుంబతో కలిసి చేసే ఫ్యామిలీ ట్రావెల్ లు ఉన్నాయి. మాదాపూర్ కు...ఆఫ్ బీట్ జర్నీ... అంతగా ప్రాచుర్యంలో లేని ప్రాంతాలను (ఆఫ్–ది–బీటెన్–పాత్ ) పర్యాటకులు అన్వేషించడం పెరిగింది. దేశీయంగా తమిళనాడు, మహారాష్ట్ర, మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆఫ్–బీట్ గమ్యస్థానాలను టూరిస్ట్‌లు అన్వేషిస్తున్నారు అలా ప్రచారంలో లేని పర్యాటకస్థలాలకు వీరు ప్రయాణించడం ఆయా ప్రాంతాలకు ప్రయోజనంతో పాటు పర్యాటకరంగ పురోభవృద్ధికి దోహదం చేస్తోంది. దేశంలోనే టాప్ 5 ఆఫ్–ది–బీట్–పాత్ ట్రెండింగ్ గమ్యస్థానాలుగా నగరంలోని మాదాపూర్ తొలి స్థానంలో నిలవడం విశేషం ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడులోని రామేశ్వరం, వెల్లూరు, మేఘాలయలోని చిరపుంజి, మహారాష్ట్ర చించ్వాడ్లోని ఫింప్రిలు ఉన్నాయి. టాప్ సిటీస్‌కూ...సై అంతర్జాతీయ ప్రయాణం గత ఏడాది వేగవంతమైన పునరుద్ధరణను సాధించింది, ఈ పెరుగుదల ట్రెండ్ 2023లో కూడా కొనసాగనుంది భారతీయ పర్యాటకులు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నగరాల కోసం అన్వేషిస్తున్నారు. భారతీయ అతిథులు అత్యధికంగా శోధించిన అంతర్జాతీయ గమ్యస్థానాలలో వరుసగా దుబాయ్. లండన్. పారిస్. టొరంటో, న్యూయార్క్ లు ఉన్నాయి. ఆతిథ్యంలో ఢిల్లీ టాప్... చక్కని ఆతిథ్యం విషయానికి వస్తే అత్యధిక 5–స్టార్ రేటింగ్స్‌తో ఢిల్లీ, గోవా, కేరళ, మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అతిథులు నగర జీవితాన్ని ఆస్వాదించడానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై కోల్‌కతాలను ఎక్కువగా ఎంచుకున్నారని అధ్యయనం వెల్లడించింది. అలాగే తాము బస చేసే చోట ఈత కొలను పక్కన ఆసీనులవడం లేదా ఇసుక బీచ్‌లో కిరణాలతో స్నానించడం వంటి ఆసక్తులు ఎక్కువగా ప్రదర్శించారు. బుకింగ్స్‌లో హైదరాబాద్‌కు 5వ స్థానం.. గత ఏడాది అత్యధిక బుకింగ్‌లతో భారతదేశంలోని టాప్ 5 ఆతిధ్య నగరాలుగా ముంబై (మహారాష్ట్ర), న్యూఢిల్లీ (ఢిల్లీ), గౌహతి (అస్సాం), గోవా (హైదరాబాద్) నిలిచాయి. ఒకే ఏడాది అత్యధికంగా ప్రయాణించిన భారతీయ అతిథిగా 115 కంటే ఎక్కువ బుకింగ్‌లు చేసిన ఓ పర్యాటకుడు నిలిచాడు. -
అత్యంత ఆసక్తిదాయక స్థలమిదే
న్యూయార్క్: అంతర్జాల ప్రపంచంలో అత్యంత ఆసక్తిదాయకమైన వేదిక అంటూ ఏదైనా ఉందంటే అది ట్విట్టర్ మాత్రమేనని ఆ సంస్థ నూతన అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ ఖాతా అధీకృతమైనదని తేల్చి చెప్పే ‘బ్లూ’ టిక్ గుర్తు సదుపాయంతో కొనసాగే ప్రీమియం ఖాతాదారుల నుంచి నెలకు ఎనిమిది డాలర్ల రుసుము అమలుచేయాలన్న ఆలోచనల నడుమ తన ట్విట్టర్ సంస్థ ప్రాధాన్యతను మస్క్ గుర్తుచేశారు. ‘ ట్విట్టర్ అనేది ఇంటర్నెట్లో అత్యంత ఇంట్రెస్టింట్ ప్లేస్. అందుకే నేను చేసిన ఈ ట్వీట్‌ను వెంటనే ఇప్పటికిప్పుడే చదివేస్తున్నారు’అని అన్నారు. ‘బ్లూ టిక్కు చార్జ్ చేస్తే అత్యంత క్రియాశీలకమైన వ్యక్తులు ఇకపై ట్విట్టర్‌ను వదిలేస్తారు. డబ్బులు రాబట్టేందుకు మీడియా, వ్యాపార సంస్థలే ఖాతాలు కొనసాగిస్తాయి. చివరకు ట్విట్టర్ ఒక బిల్బోర్డ్లాగా తయారవుతుంది’ అని బ్లూ టిక్ యూజర్ కస్తూరి శంకర్ ట్వీట్ చేశారు. ‘ తాము ఏ(సెలబ్రిటీ) ఖాతాను ఫాలో అవుతున్నామో సాధారణ యూజర్లకు తెలుసు. ప్రత్యేకంగా బ్లూ టిక్ అక్కర్లేదు’ అని మరొకరు ఎద్దేవాచేశారు. -
టూరిజానికి పారిస్ కన్నా అది మిన్న!
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యుత్తమ టూరిజం స్పాట్ ఏదన్న అంశంపై యూఎస్ ట్రావెల్ సైట్ నిర్వహించిన సర్వేలో ఆస్ట్రేలియాలోని క్విన్స్‌లాండ్ తీరంలో ఉన్న గ్రేట్ బారియర్ రీఫ్ ప్రధమ స్థానంలో నిలిచింది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్స్ 2016-17 సంవత్సరానికి గాను వెల్లడించిన ఈ ఫలితాల్లో పారిస్, బోర బొరాలను వెనక్కినెట్టి మరీ గ్రేట్ బారియర్ రీఫ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. వరల్డ్ టూరిస్ట్‌లు ఒక్కసారైన చూడాల్సిన ప్రదేశం ఈ కొరల్ రీఫ్స్ అని న్యూస్ కార్ప్ మీడియా సంస్థ వెల్లడించింది. దీనిపై క్వీన్స్లాండ్ టూరిజం అండ్ ఈవెంట్స్ చీఫ్ లియానె మాట్లాడుతూ.. గ్రేట్ బారియర్ రీఫ్‌కు ఫస్ట్ ప్లేస్ దక్కడం ప్రపంచ టూరిజంలో దాని ప్రాముఖ్యతను సూచిస్తుందన్నారు. క్వీన్స్లాండ్ పర్యాటకులకు గ్రేట్ బారియర్ రీఫ్ ఒక 'లివింగ్ ట్రెజర్' అని ఆమె తెలిపారు. ఆస్ట్రేలియన్ ఎకానమీకి ఈ రీఫ్ ద్వారా ఏటా 5.2 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆమె తెలిపారు. ప్రతీఏటా దీనిని 1.9 మిలియన్ల పర్యాటకులు సందర్శిస్తున్నారని లియానె వెల్లడించారు. -
వృద్ధులకు అది బెస్ట్ ప్లేస్...
మనిషి జీవితంలో వృద్ధాప్యం అతి క్లిష్టమైన సమయం. ఈ సమయంలో వృద్ధుల సామాజిక, ఆర్థిక శ్రేయస్సు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి అందించాల్సిన సహాయంపై ప్రభుత్వాలు ఇప్పటికే పలు రకాల పథకాలు ప్రవేశ పెట్టాయి. అయినా ఇండియా వృద్ధుల శ్రేయస్సు విషయంలో వెనుకబడే ఉంది. వృద్ధుల సామాజిక, ఆర్థిక శ్రేయస్సుపై ఇటీవల మొత్తం 96 దేశాల్లో జరిపిన ఓ సర్వేలో అరవై ఏళ్ళ పైబడిన వృద్ధులు ప్రశాంతంగా నివసించేందుకు ప్రపంచంలోనే స్విట్జర్లాండ్ అత్యుత్తమ ప్రదేశంగా గుర్తింపు పొందినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. మొత్తం అరవై ఏళ్ళ పైబడిన వయస్కులు ప్రపంచం మొత్తంలో 11.66 కోట్లమంది ఉండగా వీరు ప్రశాంతంగా జీవించడానికి అనువుగా ఉన్న ప్రాంతాలను అంచనా వేస్తే భారత్ కేవలం 71వ స్థానంలో నిలిచింది. హెల్పేజ్ ఇంటర్నేషనల్, గ్లోబల్ ఏజ్ వాచ్ సంయుక్తంగా స్విర్జర్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఓ సర్వేలో అరవై ఏళ్ళకు పైబడిన వృద్ధులు నివసించేందుకు నార్వే, స్వీడన్ ల తర్వాత స్విజ్జర్లాండ్ ఉత్తమమైన ప్రాంతంగా గుర్తించారు. అలాగే జర్మనీ.. వృద్ధులు ప్రశాతంగా జీవితం గడపడానికి నాలుగో బెస్ట్ ప్లేస్ గానూ, నెదర్లాండ్, ఐస్ ల్యాండ్, జపాన్, యు.ఎస్. యు.కె., డెన్మార్క్ ల తర్వాత కెనడా ఐదోదిగానూ వృద్ధులు జీవనానికి అత్యుత్తమ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా స్విట్జర్లాండ్ లో సగటు మనిషి జీవిత కాలం అరవై ఏళ్ళుగా నమ్ముతారు. అంతకు మించి ఉన్నా... మంచి ఆరోగ్యంతో ఉండే కాలం తక్కువగానే ఉంటుంది. అయితే ఇండియాలో మరో పదిహేడు సంవత్సరాలు బతికే అవకాశం ఉన్నా.. ఆరోగ్యంగా జీవించే కాలం మాత్రం అరవై ఏళ్ళుగానే ఉంటోంది. ఈ నిష్పత్తిలో చూస్తూ సుమారుగా జీవిత కాలంలో మనిషి ఆరోగ్యంగా, హాయిగా జీవించగలిగేది సగటున 12.6 సంవత్సరాలుగా ఉంటోంది. జపాన్ ప్రజల్లో మనిషి జీవిత కాలం అరవై ఏళ్ళుగా అనుకుంటే మరో 26 సంవత్సరాలు అదనంగా బతికే వారు ఉంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో అదనంగా 16 సంవత్సరాలు బతుకుతున్నారు. అయితే ఇండియాలో నివసిస్తున్న28 శాతం వృద్ధులు పెన్సన్లు పొందుతుండగా... 30 శాతం పురుషులు, 72 శాతం మహిళలు మాత్రం అరవై ఏళ్ళు, ఆ పైబడిన వారు పూర్తిగా ఇతరులపై ఆధారపడి బతుకుతున్నారు. గ్లోబల్ ఏజ్ వాచ్ లెక్కల ప్రకారం మొత్తం ప్రపంచ జనాభాలో 91 శాతం వృద్ధులు, అరవై, ఆపై బడ్డ వయసున్నవారు. వీరిలో ముఖ్యంగా నాలుగు ప్రదేశాల్లో అరవై ఏళ్ళ పై బడిన వారు ఆర్థిక, ఆరోగ్య, విద్య, ఉద్యోగంతో పాటు పర్యావరణ ఇబ్బందులతో బాధపడుతున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం శ్రీ లంకతోపాటు మిగిలిన కొన్ని దేశాలు వృద్ధుల శ్రేయస్సు విషయంలో 46వ స్థానంలో ఉన్నాయి. చైనా 52, బంగ్లాదేశ్ 67, నేపాల్ 70, పాకిస్తాన్ 92, ఆఫ్గనిస్తాన్ చివరిస్థానంలోనూ ఉన్నాయి. ఇతర దేశాల్లో వృద్ధాప్యంలో పేదరికం లెక్కలు సామాంతరంగా మారుతుంటాయి. అయితే సౌతాఫ్రికాలో ఓల్డేజ్ పీపుల్ లో పేదరికం రేట్లు చూస్తే... సౌతాఫ్రికాలో 12.7 శాతం, మారిషస్ లో 6.4శాతం, భారత దేశంలో 51 శాతంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 55 నుంచి 64 సంవత్సరాల వయసులో మహిళల శాతం పురుషుల శాతంతో పోలిస్తే ఆర్థికంగా చురుకుగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నప్పటికీ... కొన్ని ప్రాంతాల్లో వృద్ధాప్యంలో కూడ లింగ వివక్ష, అసమానతలతో ఓల్డేజ్ మహిళలు ఇబ్బందులు పడుతున్న ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో పెద్ద వయసువారిలో ఉన్న మగవారిలో మూడింట రెండు వంతుల మంది, ఆడవారిలో 90 నుంచి 95 శాతం మంది నిరక్షరాస్యులు. వీరిలో ఎక్కువ శాతంమంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నవారే. ఇలా పెద్ద వయసులో ఆర్థికంగా ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడం మన దేశంలో చాలా ఎక్కువ. వీరిని పోషించే విషయంలో బాధ్యతల్ని విస్మరించే వారిపై సామాజిక ఒత్తిడి కూడ నిరంతరంగా కనిపిస్తుంది. అయితే వృద్ధాప్యంలో పెద్దవారిని మానవ వనరులుగా పరిగణించి వారి అనుభవాన్ని, సామర్థ్యాన్ని జాతీయ అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవడం అవసరం. -
పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ బెస్ట్