వృద్ధులకు అది బెస్ట్ ప్లేస్...
మనిషి జీవితంలో వృద్ధాప్యం అతి క్లిష్టమైన సమయం. ఈ సమయంలో వృద్ధుల సామాజిక, ఆర్థిక శ్రేయస్సు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి అందించాల్సిన సహాయంపై ప్రభుత్వాలు ఇప్పటికే పలు రకాల పథకాలు ప్రవేశ పెట్టాయి. అయినా ఇండియా వృద్ధుల శ్రేయస్సు విషయంలో వెనుకబడే ఉంది. వృద్ధుల సామాజిక, ఆర్థిక శ్రేయస్సుపై ఇటీవల మొత్తం 96 దేశాల్లో జరిపిన ఓ సర్వేలో అరవై ఏళ్ళ పైబడిన వృద్ధులు ప్రశాంతంగా నివసించేందుకు ప్రపంచంలోనే స్విట్జర్లాండ్ అత్యుత్తమ ప్రదేశంగా గుర్తింపు పొందినట్లు నివేదికలు స్పష్టం చేశాయి.
మొత్తం అరవై ఏళ్ళ పైబడిన వయస్కులు ప్రపంచం మొత్తంలో 11.66 కోట్లమంది ఉండగా వీరు ప్రశాంతంగా జీవించడానికి అనువుగా ఉన్న ప్రాంతాలను అంచనా వేస్తే భారత్ కేవలం 71వ స్థానంలో నిలిచింది. హెల్పేజ్ ఇంటర్నేషనల్, గ్లోబల్ ఏజ్ వాచ్ సంయుక్తంగా స్విర్జర్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఓ సర్వేలో అరవై ఏళ్ళకు పైబడిన వృద్ధులు నివసించేందుకు నార్వే, స్వీడన్ ల తర్వాత స్విజ్జర్లాండ్ ఉత్తమమైన ప్రాంతంగా గుర్తించారు. అలాగే జర్మనీ.. వృద్ధులు ప్రశాతంగా జీవితం గడపడానికి నాలుగో బెస్ట్ ప్లేస్ గానూ, నెదర్లాండ్, ఐస్ ల్యాండ్, జపాన్, యు.ఎస్. యు.కె., డెన్మార్క్ ల తర్వాత కెనడా ఐదోదిగానూ వృద్ధులు జీవనానికి అత్యుత్తమ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి.
ముఖ్యంగా స్విట్జర్లాండ్ లో సగటు మనిషి జీవిత కాలం అరవై ఏళ్ళుగా నమ్ముతారు. అంతకు మించి ఉన్నా... మంచి ఆరోగ్యంతో ఉండే కాలం తక్కువగానే ఉంటుంది. అయితే ఇండియాలో మరో పదిహేడు సంవత్సరాలు బతికే అవకాశం ఉన్నా.. ఆరోగ్యంగా జీవించే కాలం మాత్రం అరవై ఏళ్ళుగానే ఉంటోంది. ఈ నిష్పత్తిలో చూస్తూ సుమారుగా జీవిత కాలంలో మనిషి ఆరోగ్యంగా, హాయిగా జీవించగలిగేది సగటున 12.6 సంవత్సరాలుగా ఉంటోంది.
జపాన్ ప్రజల్లో మనిషి జీవిత కాలం అరవై ఏళ్ళుగా అనుకుంటే మరో 26 సంవత్సరాలు అదనంగా బతికే వారు ఉంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో అదనంగా 16 సంవత్సరాలు బతుకుతున్నారు. అయితే ఇండియాలో నివసిస్తున్న28 శాతం వృద్ధులు పెన్సన్లు పొందుతుండగా... 30 శాతం పురుషులు, 72 శాతం మహిళలు మాత్రం అరవై ఏళ్ళు, ఆ పైబడిన వారు పూర్తిగా ఇతరులపై ఆధారపడి బతుకుతున్నారు. గ్లోబల్ ఏజ్ వాచ్ లెక్కల ప్రకారం మొత్తం ప్రపంచ జనాభాలో 91 శాతం వృద్ధులు, అరవై, ఆపై బడ్డ వయసున్నవారు. వీరిలో ముఖ్యంగా నాలుగు ప్రదేశాల్లో అరవై ఏళ్ళ పై బడిన వారు ఆర్థిక, ఆరోగ్య, విద్య, ఉద్యోగంతో పాటు పర్యావరణ ఇబ్బందులతో బాధపడుతున్నారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం శ్రీ లంకతోపాటు మిగిలిన కొన్ని దేశాలు వృద్ధుల శ్రేయస్సు విషయంలో 46వ స్థానంలో ఉన్నాయి. చైనా 52, బంగ్లాదేశ్ 67, నేపాల్ 70, పాకిస్తాన్ 92, ఆఫ్గనిస్తాన్ చివరిస్థానంలోనూ ఉన్నాయి. ఇతర దేశాల్లో వృద్ధాప్యంలో పేదరికం లెక్కలు సామాంతరంగా మారుతుంటాయి. అయితే సౌతాఫ్రికాలో ఓల్డేజ్ పీపుల్ లో పేదరికం రేట్లు చూస్తే... సౌతాఫ్రికాలో 12.7 శాతం, మారిషస్ లో 6.4శాతం, భారత దేశంలో 51 శాతంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 55 నుంచి 64 సంవత్సరాల వయసులో మహిళల శాతం పురుషుల శాతంతో పోలిస్తే ఆర్థికంగా చురుకుగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నప్పటికీ... కొన్ని ప్రాంతాల్లో వృద్ధాప్యంలో కూడ లింగ వివక్ష, అసమానతలతో ఓల్డేజ్ మహిళలు ఇబ్బందులు పడుతున్న ప్రభావాలు కనిపిస్తున్నాయి.
ఇండియాలో పెద్ద వయసువారిలో ఉన్న మగవారిలో మూడింట రెండు వంతుల మంది, ఆడవారిలో 90 నుంచి 95 శాతం మంది నిరక్షరాస్యులు. వీరిలో ఎక్కువ శాతంమంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నవారే. ఇలా పెద్ద వయసులో ఆర్థికంగా ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడం మన దేశంలో చాలా ఎక్కువ. వీరిని పోషించే విషయంలో బాధ్యతల్ని విస్మరించే వారిపై సామాజిక ఒత్తిడి కూడ నిరంతరంగా కనిపిస్తుంది. అయితే వృద్ధాప్యంలో పెద్దవారిని మానవ వనరులుగా పరిగణించి వారి అనుభవాన్ని, సామర్థ్యాన్ని జాతీయ అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవడం అవసరం.