older adults
-
60 ఏళ్లు దాటిన వాళ్లు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం సహజం. కీళ్ల నొప్పులు, చర్మం సాగిపోవడం, సత్తువ లేకపోవడం, జీవక్రియ మందగించడం వంటి సమస్యలు ఎన్నో చుట్టుముడతాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటాక ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అందుకే వయసుకు తగ్గట్లు ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరు పదుల వయసు దాటిన వాళ్లు తమ డైట్ ప్లాన్‌లో ఎలాంటి ఆహారం చేర్చుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. సుమారు 60 ఏళ్లు పైబడిన వారికి విటమిన్స్ అత్యవసరం. వయసు పైబడుతున్న కొద్దీ చూపు మందగిస్తుంది. రుచి, వాసన, గ్రహణ శక్తి తగ్గిపోతుంది. జీర్ణక్రియలో మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకు తగ్గట్లుగా సరైన ఆహారం తీసుకోవాలి. మహిళల్లో 40 ఏళ్లు దాటితే కండరాలు బలహీనపడటం సహజం. 60 తర్వాత కండరాల క్షీణత మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి కండరాల శక్తిని మెరుగుపరుస్తాయి. వయసు పైబడిన వృద్ధులు ప్రతి కిలోగ్రాము బరువుకు 1 నుంచి 1.2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది. ఎముకలు గట్టిపడాలంటే వారు మరింత కాల్షియం ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ప్రోటీన్ ఉండే ఆహారాలు బాదం, చేపలు, పెరుగు, డార్క్ చాక్లెట్, సోయామిల్క్, లెంటిల్స్, చీజ్, చికెన్ గుమ్మడి విత్తనాలు, చిక్కుడు,ఆవు పాలు పీనట్ బటర్ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కుడు గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 50 ఏళ్లు దాటిన మహిళలు అందరూ రోజుకు 21 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఫైబర్ తినాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సిఫార్సు చేస్తోంది. అదే వయసు గల పురుషులు 30 లేదా అంతకంటే ఎక్కువ గ్రాములు తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, కూరగాయలు, పండ్లను క్రమం తప్పకుండా తమ డైట్లో చేర్చుకోవాలి. తగినంత ఫైబర్ డైట్లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు తెలిపారు. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు యాపిల్స్ బార్లీ బ్లాక్ బీన్స్ బ్లాక్ బెర్రీలు బ్రాన్ ఫ్లేక్స్ బ్రకోలి చియా సీడ్స్ రోజ్ బెర్రీస్ బఠాణీలు, పప్పులు -
ఇంటర్నెట్ వాడకం: వీరిలోనే ఒంటరితనం అధికం!
లండన్ : లాక్డౌన్ కాలంలో సాధారణ సమయంలో కంటే ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం విపరితంగా పెరిగిపోయింది. అయితే తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో సరికొత్త విషయం వెలుగు చూసింది. వృద్దుల్లో అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లోకి వెళుతున్న వారి కంటే రోజూ ఇంటర్నెట్ను వినియోగిస్తున్న వారు సామాజికంగా ఒంటరిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. రోజువారీ ఇంటర్నెట్ వాడకం సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చని జర్నల్ ఏజింగ్ అండ్ సొసైటీ ఇటీవల జరిపిన పరిశోధనలో రుజువైంది. ఇందుకు ఇంగ్లాండ్‌లోని సగటు వయస్సు 64 ఏళ్లు ఉన్న 4492 మంది నుంచి డేటాను సేకరించారు. వీరిలో 19 శాతం మందిలో ఒంటరితనం అధికంగా ఉన్నట్లు, 33 శాతం మంది సామాజికంగా ఒంటరిగా ఉంటున్నట్లు తేలింది. అంటే వీరు కుటుంబంతో సరిగానే ఉండవచ్చు కానీ వీరిలో సామాజిక సంబంధాలు తక్కువగా ఉంటాయి. (25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం) రోజూ ఇంటర్నెట్ వాడుతున్న వారి కంటే.. వారానికి, నెలకొకసారి ఇంటర్నెట్ను వినియోగించే వృద్ధులు సామాజికంగా ఒంటరిగా ఉండే అవకాశం తక్కువ ఉన్నట్లు యూకేలోని ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో తేలింది. సమాచారం శోధించడం, ఈమెయిల్ పంపడం, ఆన్లైన్ షాపింగ్.. ఈ మూడు ఆన్లైన్లో ఎక్కువగా చేసే పనులు. మూడింట రెండు వంతుల మంది(69 శాతం) ప్రతిరోజు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్లు తేలింది. దీనిపై పీహెచ్డీ స్టూడెంట్ స్టాక్‌వెల్ మాట్లాడుతూ.. రోజూ ఇంటర్నెట్ను వినియోగించే వారి సామాజిక ఒంటరితనం, అసలు ఇంటర్నెట్ ఉపయోగించని వారి స్థాయి ఇంచుమించు ఒకే విధంగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు. తరచుగా ఆన్‌లైన్‌లోకి వెళ్లడం వల్ల కొంతమంది వృద్ధులకు చుట్టూ ఉన్నవారితో భౌతిక దూరం పెరగడంతో ఎక్కువ సామాజిక ఒంటరితనం ఏర్పడుతుందన్నారు. (లాక్డౌన్ ఎత్తివేత; నా ఆనందం ఇలాగే ఉంటుంది) -
వృద్ధులకు అది బెస్ట్ ప్లేస్...
మనిషి జీవితంలో వృద్ధాప్యం అతి క్లిష్టమైన సమయం. ఈ సమయంలో వృద్ధుల సామాజిక, ఆర్థిక శ్రేయస్సు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి అందించాల్సిన సహాయంపై ప్రభుత్వాలు ఇప్పటికే పలు రకాల పథకాలు ప్రవేశ పెట్టాయి. అయినా ఇండియా వృద్ధుల శ్రేయస్సు విషయంలో వెనుకబడే ఉంది. వృద్ధుల సామాజిక, ఆర్థిక శ్రేయస్సుపై ఇటీవల మొత్తం 96 దేశాల్లో జరిపిన ఓ సర్వేలో అరవై ఏళ్ళ పైబడిన వృద్ధులు ప్రశాంతంగా నివసించేందుకు ప్రపంచంలోనే స్విట్జర్లాండ్ అత్యుత్తమ ప్రదేశంగా గుర్తింపు పొందినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. మొత్తం అరవై ఏళ్ళ పైబడిన వయస్కులు ప్రపంచం మొత్తంలో 11.66 కోట్లమంది ఉండగా వీరు ప్రశాంతంగా జీవించడానికి అనువుగా ఉన్న ప్రాంతాలను అంచనా వేస్తే భారత్ కేవలం 71వ స్థానంలో నిలిచింది. హెల్పేజ్ ఇంటర్నేషనల్, గ్లోబల్ ఏజ్ వాచ్ సంయుక్తంగా స్విర్జర్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఓ సర్వేలో అరవై ఏళ్ళకు పైబడిన వృద్ధులు నివసించేందుకు నార్వే, స్వీడన్ ల తర్వాత స్విజ్జర్లాండ్ ఉత్తమమైన ప్రాంతంగా గుర్తించారు. అలాగే జర్మనీ.. వృద్ధులు ప్రశాతంగా జీవితం గడపడానికి నాలుగో బెస్ట్ ప్లేస్ గానూ, నెదర్లాండ్, ఐస్ ల్యాండ్, జపాన్, యు.ఎస్. యు.కె., డెన్మార్క్ ల తర్వాత కెనడా ఐదోదిగానూ వృద్ధులు జీవనానికి అత్యుత్తమ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా స్విట్జర్లాండ్ లో సగటు మనిషి జీవిత కాలం అరవై ఏళ్ళుగా నమ్ముతారు. అంతకు మించి ఉన్నా... మంచి ఆరోగ్యంతో ఉండే కాలం తక్కువగానే ఉంటుంది. అయితే ఇండియాలో మరో పదిహేడు సంవత్సరాలు బతికే అవకాశం ఉన్నా.. ఆరోగ్యంగా జీవించే కాలం మాత్రం అరవై ఏళ్ళుగానే ఉంటోంది. ఈ నిష్పత్తిలో చూస్తూ సుమారుగా జీవిత కాలంలో మనిషి ఆరోగ్యంగా, హాయిగా జీవించగలిగేది సగటున 12.6 సంవత్సరాలుగా ఉంటోంది. జపాన్ ప్రజల్లో మనిషి జీవిత కాలం అరవై ఏళ్ళుగా అనుకుంటే మరో 26 సంవత్సరాలు అదనంగా బతికే వారు ఉంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో అదనంగా 16 సంవత్సరాలు బతుకుతున్నారు. అయితే ఇండియాలో నివసిస్తున్న28 శాతం వృద్ధులు పెన్సన్లు పొందుతుండగా... 30 శాతం పురుషులు, 72 శాతం మహిళలు మాత్రం అరవై ఏళ్ళు, ఆ పైబడిన వారు పూర్తిగా ఇతరులపై ఆధారపడి బతుకుతున్నారు. గ్లోబల్ ఏజ్ వాచ్ లెక్కల ప్రకారం మొత్తం ప్రపంచ జనాభాలో 91 శాతం వృద్ధులు, అరవై, ఆపై బడ్డ వయసున్నవారు. వీరిలో ముఖ్యంగా నాలుగు ప్రదేశాల్లో అరవై ఏళ్ళ పై బడిన వారు ఆర్థిక, ఆరోగ్య, విద్య, ఉద్యోగంతో పాటు పర్యావరణ ఇబ్బందులతో బాధపడుతున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం శ్రీ లంకతోపాటు మిగిలిన కొన్ని దేశాలు వృద్ధుల శ్రేయస్సు విషయంలో 46వ స్థానంలో ఉన్నాయి. చైనా 52, బంగ్లాదేశ్ 67, నేపాల్ 70, పాకిస్తాన్ 92, ఆఫ్గనిస్తాన్ చివరిస్థానంలోనూ ఉన్నాయి. ఇతర దేశాల్లో వృద్ధాప్యంలో పేదరికం లెక్కలు సామాంతరంగా మారుతుంటాయి. అయితే సౌతాఫ్రికాలో ఓల్డేజ్ పీపుల్ లో పేదరికం రేట్లు చూస్తే... సౌతాఫ్రికాలో 12.7 శాతం, మారిషస్ లో 6.4శాతం, భారత దేశంలో 51 శాతంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 55 నుంచి 64 సంవత్సరాల వయసులో మహిళల శాతం పురుషుల శాతంతో పోలిస్తే ఆర్థికంగా చురుకుగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నప్పటికీ... కొన్ని ప్రాంతాల్లో వృద్ధాప్యంలో కూడ లింగ వివక్ష, అసమానతలతో ఓల్డేజ్ మహిళలు ఇబ్బందులు పడుతున్న ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో పెద్ద వయసువారిలో ఉన్న మగవారిలో మూడింట రెండు వంతుల మంది, ఆడవారిలో 90 నుంచి 95 శాతం మంది నిరక్షరాస్యులు. వీరిలో ఎక్కువ శాతంమంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నవారే. ఇలా పెద్ద వయసులో ఆర్థికంగా ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడం మన దేశంలో చాలా ఎక్కువ. వీరిని పోషించే విషయంలో బాధ్యతల్ని విస్మరించే వారిపై సామాజిక ఒత్తిడి కూడ నిరంతరంగా కనిపిస్తుంది. అయితే వృద్ధాప్యంలో పెద్దవారిని మానవ వనరులుగా పరిగణించి వారి అనుభవాన్ని, సామర్థ్యాన్ని జాతీయ అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవడం అవసరం.