గిరిజనులపై టీడీపీ మాయూజాలం
శ్రీకాళహస్తి రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ టీడీపీ నాయుకులు ఓ వివాదాస్పద కార్యక్రవూనికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో గెలిచి పదవిలో ఉన్న ఐదేళ్లు పలకరించని నాయుకులు ఇంటి స్థలాలకు సంబంధించి వుంజూరు పట్టాలను చేతికందించడం తో అవాక్కవడం గిరిజనుల వంతైంది. శ్రీకాళహస్తి వుండలం అక్కుర్తి ఎస్టీకాలనీకి చెందిన 30 వుంది గిరిజన కుటుంబాలకు తహశీల్దార్ వుుద్రతో కూడిన ఇంటి నివేశనస్థలాలకు సంబంధించిన పట్టాలను సోవువారం రాత్రి స్థానిక టీడీపీ నాయుకులు పంపిణీ చేశారు. ఎస్టీ కాలనీలో 60కుటుంబాలు ఉంటున్నారుు.
అరుుతే వీరిలో చాలావుందికి ఇంటిపట్టాలు లేవు. స్థలాలు లేకపోవడంతో చాలా అవస్థలను ఎదుర్కొంటున్నారు. అరుుతే వారి అవసరాలను గుర్తించిన టీడీపీ నాయుకులు ఓట్లకోసం సరికొత్త జిమ్మిక్కు రాజకీయూలకు నాంది పలికారు. 30వుందికి ఇంటిపట్టాలు వుంజూరయ్యూయుంటూ స్థానికనాయుకులతో వారికి పంపిణీ చేశారు. అరుుతే ఆ పట్టాల్లో ఇంటిస్థలం ఎక్కడ ఇస్తున్నారో... సర్వేనెంబరు, పట్టానెంబరు, తేదీ వంటి వివరాలేమీ నమోదు చేయుకుండా బాధితుల ఫొటోలతో మాత్రమే అందించారు. ఈ పట్టాలపై తహశీల్దార్ సంతకాలు రెండురకాలుగా కనిపిస్తున్నారుు. ఈ సంతకాలను బట్టిచూస్తే బోగస్‌పట్టాలని తేటతెల్లవువుతోంది. అరుుతే తహశీల్దార్ వుుద్ర పట్టాలపై ఉండడాన్ని బట్టిచూస్తే రెవెన్యూ కార్యాలయు అధికారుల ప్రమేయుంతోనే బోగస్‌పట్టాలు రూపుదిద్దుకున్నాయున్న అనువూనాలు వ్యక్తవువుతున్నారుు. ఈ వ్యవహారం బయుటకు పొక్కడంతో గ్రావూనికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు తవు అధినాయుకత్వం దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధవువుతున్నారు.