boinapally
-
Hyderabad: మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం
రసూల్‌పురా: మద్యం సీసాల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పేలి బోల్తా పడిన ఘటన బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొంపల్లి ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి రూ.32 లక్షల విలువైన మద్యం కాటన్ బాక్సులతో డీసీఎం కంటైయినర్ బంజారాహిల్స్ వైపు వెళ్తోంది. బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్ వద్దకు చేరుకోగానే వెనక టైరు పేలి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కంటెయినర్లో నుంచి మద్యం సీసాల కాటన్ బాక్స్‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమీపంలో ఉన్న బస్తీవాసులు, రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు మద్యం సీసాలను తీసుకుని ఉడాయించారు. మద్యం సీసాలను తీసుకుని వెళ్తున్న కొందరిని డీసీఎం డ్రైవర్ బసవలింగప్ప, ఇద్దరు హెల్పర్లు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. డీసీఎం బోల్తా పడిన ఘటనతో జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. -
వ్యాయామం చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలిన యువ కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో విషాద ఘటన జరిగింది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ 24 ఏళ్ల యువ పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బోయిన్‌పల్లికి చెందిన ఈ కానిస్టేబుల్ పేరు విశాల్. 2020 బ్యాచ్. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. చదువు పూర్తయిన వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడిన ఈ యువకుడు 24 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడం కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. చదవండి: విషమంగానే ప్రీతి ఆరోగ్యం -
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు:అదుపులో ఏపీ మాజీ మంత్రి మేనల్లుడు!
కంటోన్మెంట్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో హైదరాబాద్‌లోని బోయిన్పల్లి పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితులైన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి, మరో 14 మంది నిందితులు షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. అయితే కేసులో మరో కీలక నిందితుడు గుంటూరు శ్రీను ఆచూకీ ఇప్పటివరకు పోలీసులకు దొరకలేదు. ఈ క్రమంలో గుంటూరు శ్రీను సమీప బంధువు చైతన్యను రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను, మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఇందులో ఒకరైన పునీత్ అనే వ్యక్తి ఏపీ మాజీ మంత్రికి సమీప బంధువు అని సమాచారం. చదవండి:అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం -
అఖిలప్రియను కస్టడీకి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అఖిలప్రియను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు శుక్రవారం సికింద్రాబాద్‌లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారంరోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాకి తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ అనుచరులు మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. బోయిన్పల్లి నుంచి కిడ్నాప్ చేసిన ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లో బంధించిన నిందితులు వారి నుంచి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి వివరించారు. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్టు చేసిన తర్వాతే కీలక ఘట్టమైన క్రైమ్ సీన్ రీ–కన్‌స్ట్రక్షన్‌ను చేపట్టాల్సి ఉందని పోలీసులు తమ పిటిషన్‌న్‌లో పేర్కొన్నారు. శనివారం నుంచి ఈ నెల 15 వరకు అఖిలప్రియను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదును బట్టే ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) జారీ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నాప్ కేసులో తొలుత అఖిలప్రియ ఏ–2గా ఉన్నారని, ప్రాథమిక విచారణలో లభించిన ఆధారాలను బట్టి ఆమే సూత్రధారిగా తేలిందని, అందుకే రిమాండ్ రిపోర్టులో అఖిలప్రియను ఏ–1గా చేర్చామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, కిడ్నాప్‌లో కీలకంగా వ్యవహరించిన వారి అనుచరుడు శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శీను లొంగుబాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. భార్గవ్‌రామ్ సికింద్రాబాద్ కోర్టులో లొంగిపోవడానికి వస్తున్నాడంటూ శుక్రవారం ఉదయం ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు పద్ద బందోబస్తు, నిఘా ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు ఓ దశలో కోర్టు తలుపులూ మూసివేశారు. ఈ పరిణామంతో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పొలిటికల్ గేమ్‌గా కనిపిస్తోంది: మౌనిక బంజారాహిల్స్(హైదరాబాద్): హఫీజ్‌పేటలోని భూ వివాదం తమ తండ్రి భూమా నాగిరెడ్డి బతికున్నప్పటి నుంచే ఉందని ఆయన కుమార్తె, అఖిలప్రియ సోదరి భూమా మౌనికరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పొలిటికల్ గేమ్‌గా కనిపిస్తోందని, అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై తమకు ఆందోళన ఉందని పేర్కొన్నారు. అరెస్టు చేసినప్పుడు టెర్రరిస్టులను కూడా బాగా చూస్తారని, అఖిలప్రియ అంతకంటే ఎక్కువా? అని ప్రశ్నించారు. కిడ్నాప్ చేసినప్పుడు నిందితులు ప్రవీణ్‌రావును కొట్టారు.. తిట్టారు.. అని అంటున్న పోలీసులు ఆ ఆధారాలను కోర్టుకు ఎందుకు అందించలేదని అన్నారు. ‘జైలు నుంచి మా అక్క బతికి వస్తుందా? ఈ పరిస్థితుల్లో భార్గవ్‌రామ్ బయటకు వస్తే రక్షణ ఉంటుందా?’అని ప్రశ్నించారు. -
అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు..
సాక్షి, హైదరాబాద్: కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కస్టడీ కోసం బోయిన్పల్లి పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఖిలప్రియను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. రేపటి నుంచి ఈనెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని, అఖిలప్రియ భర్త సహా మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేశాక కిడ్నాప్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందన్నారు. (చదవండి: కిడ్నాప్ ప్లానంతా అతని కనుసన్నల్లోనే..) ఇది ఇలా ఉండగా, అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. అఖిలప్రియకు బెయిల్ వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, ఆమెపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం మాకు లేదని పోలీసులు తెలిపారు. ‘‘సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాలి. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చు. అఖిలప్రియ చర్యల వల్ల స్థానికుల్లో అభద్రతాభావం నెలకొంది. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉంది. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే కేసు విచారణ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. అఖిలప్రియ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. (చదవండి: అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!) -
చిన్నారి వైద్యానికి సోనూసూద్ భరోసా
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి) : సినీనటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4 నెలల పసిబిడ్డ వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భరిస్తానని ట్విట్టర్ ద్వారా భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల కుమారుడు అద్విత్ శౌర్య (4నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. బాబు సిరిసిల్లలో ఓ కొరియర్ సంస్థలో బాయ్‌గా పనిచేస్తున్నాడు. బాబు తన కుమారుడిని ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. శౌర్యను పరీక్షించిన వైద్యులు.. చికిత్స కోసం రూ.7 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీనస్థితిలో ఉన్న బాబు తన కుమారుడి వైద్యానికి సాయం అందించాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అతడి స్నేహి తులు ట్విట్టర్లో ఆ సమాచారాన్ని పోస్టు చేశారు. దీనిపై సోనూసూద్ స్పందించి అద్విత్ శౌర్య ఆపరేషన్‌కు అవసరమయ్యే డబ్బులో వీలైనంత మొత్తం భరించేందకు సిద్ధంగా ఉన్నట్లు ట్టిట్టర్ ద్వారా భరోసా ఇచ్చారని బాలుడి తండ్రి తెలిపాడు. ఇన్నోవా ఆస్పత్రిలో చిన్నారికి వైద్యచికిత్స చేయించాలని పేర్కొన్నట్లు తెలిపాడు. ఆపరేషన్‌ను డాక్టర్ కోన సాంబమూర్తి చేస్తారని సోనూసూద్ తెలిపినట్టు బాబు చెప్పారు. రూ.లక్షన్నర కోసం తిప్పలు చిన్నారి అద్విత్ చికిత్సకు అవసరమయ్యే రూ.7 లక్షల్లో అధికభాగం సోనూసూద్ ఇవ్వనుండగా ఇంకా రూ.1.5 లక్షలు కావాలని, అంత డబ్బు తమ వద్ద లేదని.. దాతలు ఆదుకుని తన కుమారునికి ప్రాణం పోయాలని బాబు వేడుకుంటున్నాడు. దాతలు 80964 24621 మొబైల్ నంబరును సంప్రదించాలని ఆయన కోరాడు. -
స్లీపింగ్ పిల్స్‌తో భర్తను పడుకోబెట్టి..
సాక్షి, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో గత ఏడాది నవంబర్‌లో జరిగిన బాబా ఖాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్య జహీదాతో పాటూ అమెకు సహకరించిన మరో నలుగురిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. భర్త బాబాఖాన్‌కు జహీదా నిద్రమాత్రలు అలవాటు చేసి, భర్త నిద్రమత్తులో ఉండగా పక్క రూములో ప్రియుడు ఫయాజ్‌తో కలిసి ఉండేది. అయితే ఈ విషయం బాబాఖాన్ దృష్టికి రావడంతో శాశ్వతంగా భర్తను వదిలించుకోవాలనుకుంది. ఫయాజ్‌తో పాటూ అతని స్నేహితుల సహకారంతో బాబాఖాన్‌ను జహేదా గొంతునులిమి హత్య చేసింది. అనంతరం గుండెపోటుతో బాబా ఖాన్ చనిపోయినట్లుగా అందరిని నమ్మించింది. చివరకుబంధువుల్లో ఒకరికి అనుమానం రావడంతో, పోలీసులు శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేశారు. దీంతో భర్త హత్య ఉదంతం వెలుగు చూసింది. -
బోయినపల్లి టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం
-
కంటోన్మెంట్లో పారిశుధ్య కార్మికుల ధర్నా
హైదరాబాద్ : పారిశుధ్య కార్మికునిపై ఓ వ్యక్తి దాడి చేయడాన్ని నిరసిస్తూ... కంటోన్మెంట్‌లోని కార్మికులు శుక్రవారం ధర్నాకు దిగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గురువారం రోడ్డుపై చెత్తవేస్తున్న వ్యక్తిని పారిశుధ్య కార్మికుడు రమేష్ అడ్డుకున్నాడు. దాంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో రమేష్‌పై సదరు వ్యక్తి దాడి చేశాడు. దాంతో కలత చెందిన పారిశుధ్య కార్మికుడు ఈ విషయాన్ని తోటి కార్మికులతో చెప్పాడు. దాంతో వారు శుక్రవారం ధర్నాకు దిగారు. బోయినపల్లి పరిథిలోని ఐదు సర్కిళ్లకు చెందిన మొత్తం 750 మంది కార్మికులు విధులను బహిష్కరించి సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. -
‘సుభోజనం’.. సంతోషదాయకం
బోయిన్‌పల్లిలో ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు సాక్షి,హైదరాబాద్: నగర ప్రజలకు ‘అన్నం’ పెడుతున్న అన్నదాతలకే భోజనం పెట్టడం తమకు సంతోషంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బోయిన్‌పల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.5కే భోజనాన్ని అందించే ‘సుభోజన’ పథకాన్ని మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావులతో కలసి ఆయన గురువారం ప్రారంభించారు. రైతు విశ్రాంతి భవనంలో సదుపాయాల కల్పన, హమాలీల విశ్రాంతి భవనానికి శంకుస్థాపనతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ మార్కెటింగ్ పనులకు వచ్చే రైతులకు తక్కువ ధరకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. హమాలీలకు అనువైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మాట్లాడిన ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు అన్నారు. ఆటోలకు, ట్రాలీలకు చలానాలు విధించే సమయంలో కాస్త సంయమనం పాటించాలని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఈ సందర్భంగా సూచించారు. రైతులకు భోజనం.. దేశంలోనే తొలిసారి రైతులకు భోజనం పెట్టే పథకం దేశంలోనే తొలిసారని పథనిర్వాహకుడు, హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు సత్యగౌరీ చందన్ అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో 23 ప్రాంతీయ కేంద్రాల ద్వారా పదివేల పాఠశాలల్లో సుమారు 23 లక్షల మంది విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మార్కెటింగ్ శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.