bomb blastings
-
అఫ్గాన్లను చంపడం ఆపండి ప్లీజ్.. రషీద్ ఖాన్ ఉద్వేగం
కాబుల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి రక్తసిక్తమైంది. దేశాన్ని వదిలి వెళ్తున్న పాశ్చాత్యులు, అఫ్గాన్లు లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం సాయంత్రం ఆత్మాహుతి దాడులు జరిగాయి. రెండు బాంబుపేలుళ్లలో 72 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు ఇస్లామిక్ స్టేట్-ఖోరాసన్(ఐసిస్-కె) ఉగ్రమూక దుశ్చర్యగా భావిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయానికి ఉగ్రముప్పు పొంచివుందని, ఆ పరిసరాల్లో ఎవరూ ఉండవద్దని అమెరికా, బ్రిటన్ సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే బాంబుల మోతతో కాబూల్ దద్దరిల్లింది. Kabul is bleeding again 😢😢💔💔 STOP KILLING AFGHAN PLEASE 🙏🙏😢😢🇦🇫🇦🇫 — Rashid Khan (@rashidkhan_19) August 26, 2021 ఈ పేలుళ్లపై అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ట్విటర్ వేదికగా కాబుల్ మరోసారి రక్తసిక్తమైందని, తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్‌లో నరవధకు ఫుల్స్టాప్ పెట్టాలని ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నీళ్లు చిందిస్తున్న ఏమోజీలతో పాటు గుండె పగిలిన ఏమోజీలను ట్వీట్‌కు జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. క్రికెట్ అభిమానులు రషీద్‌ను తమ కామెంట్లతో ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాబూల్ ఎయిర్పోర్ట్ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాడులకు బాధ్యులను వెంటాడి వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఐసిస్ ఉగ్రమూకల కౌంట్‌డౌన్ మొదలైందంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. ఇదిలా ఉంటే, రషీద్ ఖాన్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఆడుతున్నాడు. స్వదేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ తన ఆటపై ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. తనలోకి కసినంతా ప్రత్యర్థి జట్టుపై చూపిస్తున్నాడు. ఇప్పటిదాకా బంతితోనే సత్తా చాటుతూ వచ్చిన అతను.. ఈ మధ్య బ్యాట్‌కు కూడా పనిచెబుతున్నాడు. లీగ్‌లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్.. యార్క్‌షైర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను కొట్టిన హెలికాప్టర్ సిక్స్ ఇన్నింగ్స్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. చదవండి: Chris Gayle: గేల్ సిక్స్ కొడితే మాములుగా ఉంటుందా.. -
అన్నవరంలో బాంబుల కలవరం
అన్నవరం: పంపానది ఒడ్డున గల కొండల్లో నిర్మిస్తున్న పుష్కరకాలువ కోసం బాంబులతో కొండలను బద్దలు కొడుతుండడంతో అటు అన్నవరంలో ఇటు దేవస్థానంలో భవనాలకు నష్టం వాటిల్లుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మోతాదులో పేలుడు పదార్థాలను ఉపయోగించి బ్లాస్టింగ్లు చేయడం వల్ల మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రదేశమంతా ఆ పేలుళ్లకు అదిరిపోతోంది. అన్నవరం దేవస్థానంలో అయితే బుధవారం ఈ పేలుడుధాటికి సత్రాలు భూకంపం వచ్చినట్టు అదిరిపోయాయి. సత్రాల్లో బస చేసిన భక్తులు బయటకు పరుగులుతీశారు. అన్నవరంలో అయితే స్వల్పభూకంపం వచ్చినట్టుగా భవనాలు ఊగిపోవడం, ఆ తరువాత దూరంగా పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. కలెక్టర్‌కు ఇన్చార్జ్ ఈఓ వినతి జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రాకు బుధవారం అన్నవరం దేవస్థానం ఇన్చార్జ్ ఈవో ఈరం కి జగన్నాథరావు ఈ బాంబుపేలుడు విషయమై వినతి పత్రం పంపించారు.ఈ పేలు ళ్లు కారణంగా సత్రాల్లో బస చేసే భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆలయ కట్టడాలు బీటలు వారే ప్రమాదం ఉందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవలసిందిగా ఆయన అభ్యర్థించారు. ఈ లేఖ కాపీలను మైన్స్ విభాగానికి, రెవెన్యూ, పోలీసు విభాగాలకు పంపినట్టు ఈవో తెలిపారు. -
ఆ రోజే బాంబు పేలుళ్లు ఎక్కువ
యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో కూడా జరగనన్ని బాంబు పేలుళ్లు 2016లో ఒక్క భారత్ లో సంభవించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం. నేషనల్ బాంబ్ డేటా సెంటర్(ఎన్ బీడీసీ) ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక్క 2016లో భారత్ లో 406 పేలుళ్లు జరిగాయి. యుద్ధవాతావరణంలో మగ్గుతున్న ఇరాక్ 221 బాంబు పేలుళ్లతో తర్వాతి స్ధానంలో నిలిచింది. మొత్తం 406 పేలుళ్లలో 337 ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)లను ఉపయోగించి జరిగినవేనని చెప్పింది. మిగిలిన 69 పేలుళ్లలో గ్రెనేడ్లు తదితర పేలుడు పదార్ధాలను వాడినట్లు తెలిపింది. భారత్‌లో బాంబు పేలుళ్ల తీరును విశ్లేషించిన ఎన్బీడీసీకి ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. వారంలోని ఒక రోజు(గురువారం) మాత్రమే అత్యధికంగా ఐఈడీ పేలుళ్లు జరిగినట్లు కనిపెట్టింది. 2016లో గురువారాల్లో మొత్తం 63 పేలుళ్లు సంభవించాయి. కాగా, మార్చి నెలలో అత్యధికంగా 42 పేలుళ్లు జరిగినట్లు ఎన్బీడీసీ చెప్పింది. జమ్మూకశ్మీర్ లో జులై తర్వాత బాంబు పేలుళ్లు 121 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2016లో పొరుగుదేశమైన పాకిస్తాన్లో 161 పేలుడు ఘటనలు సంభవించగా.. ఆప్ఘనిస్తాన్‌లో 132, టర్కీలో 92, థాయ్‌లాండ్‌లో 71, దక్షిణాఫ్రికాలో 63, సిరియాలో 56, ఈజిప్టులో 42, బంగ్లాదేశ్‌లో 29 పేలుళ్లు సంభవించాయి.