Boora Narsayya Goud
-
ప్రతీకారం తీర్చుకున్న ‘బ్రదర్స్’
సాక్షి, హైదరాబాద్ : భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయంతో కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్లీ సత్తా చాటారు. గత ఎన్నికల్లో తన తమ్ముడిని ఓడించిన టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను ఈసారి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బూర నర్సయ్యగౌడ్ 30,494 ఓట్లతో ఓడించారు. రాజగోపాల్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి నుంచి వెంకట్‌రెడ్డిని పోటీలో నిలిపింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో వెంకట్‌రెడ్డికి 5,31,014 ఓట్లు రాగా, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు 5,26,751 ఓట్లు వచ్చాయి. 4,263 ఓట్ల ఆధిక్యతతో వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఎమ్మెల్యే, ఎంపీలుగా ... కోమటిరెడ్డి బ్రదర్స్ మరో రికార్డు సృష్టించారు. ఇద్దరికీ దేశ, రాష్ట్ర స్థాయిల్లో పనిచేసే అరుదైన అవకాశం లభించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999 నుంచి వరుసగా 2014 వరకు 4 సార్లు నల్లగొండ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలుకాగా, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అసెంబ్లీ నుంచి విజయం సాధిం చారు. 2009 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందగా, ఇప్పుడు అదే స్థానం నుంచి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. -
టీఆర్ఎస్ గెలుపుతో కేంద్రాన్ని శాసిద్దాం
సాక్షి, గుండాల : టీఆర్ఎస్ గెలుపుతో కేంద్రాన్ని శాసిద్దామని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దపడిశాల, గుండాల, సుద్దాల గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించాలని కోరారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో బీబీ నగర్లో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపిస్తే మరింత అభివృద్ధికి దోహద పడతారన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యర్థిగా గుర్తించి తనను పార్లమెంట్‌కు పంపిస్తే మరిన్ని సేవలు అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సంగి వేణుగోపాల్ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బండ రమేష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి దశరథ, పశు గణనాభివృద్ధి జిల్లా చైర్మన్, మోతె పిచ్చిరెడ్డి, నాయకులు ఎం.ఎ.రహీం, పాండరి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి ఈత, తాటి పరిశోధన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఈత, తాటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కొండపల్లిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఇది గీత కార్మికులకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలిం చిందని చెప్పారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, హరితహారంలో భాగంగా 5 కోట్ల ఈత చెట్లను నాటాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మలక్‌పూర్ వద్ద అండర్ పాస్ నిర్మించండి.. మలక్‌పూర్ ఎక్స్ రోడ్డు వద్ద వెహికల్ అండర్ పాస్ నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని టీఆర్ఎస్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్ కోరారు. అండర్‌పాస్ లేకపోవడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, దాని నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. బీడీ కార్మికులకోసం ఈఎస్ఐలు.. తెలంగాణలో అధిక సంఖ్యలో బీడీ కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈఎస్ఐ ఆస్పత్రులు నెలకొల్పాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను ఎంపీ నంది ఎల్లయ్య కోరారు. -
బీసీలపై కాంగ్రెస్ మొసలి కన్నీరు: ఎంపీ బూర
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నపు డు బీసీల సంక్షేమం గురించి పట్టించుకోని కాంగ్రెస్, ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. బీసీ–ఈ కోటా కింద ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామంటే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాల యంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించకుండా మతపర రిజర్వేషన్లు అని, బీసీలకు అన్యాయం జరుగుతుందని అపో హలు సృష్టించడం శోచనీయమన్నారు. రిజర్వేషన్లను తప్పుబడుతున్న పార్టీలు.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పొందుపరిచినప్పుడు ఎందుకు మాట్లాడ లేదన్నారు. ముస్లింలలో వెనకబాటుత నం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉందని సచార్, రంగనాథ్ మిశ్రా కమిటీలు నివేది కలు ఇచ్చాయని గుర్తు చేశారు. -
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు
కాంగ్రెస్ నేతలపై పాతూరి సుధాకర్‌రెడ్డి సాక్షి , హైదరాబాద్: అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు కాంగ్రెస్ పార్టీ నేతలని శాసన మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయ వంటి పథకంపై కూడా వారు విషం కక్కుతున్నారన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలసి శనివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం లో మాట్లాడారు. మిషన్ కాకతీయతో తాము ప్రజలకు దగ్గరవుతు న్నామనే, కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో ఎన్ని టీఎంసీల నీళ్లు చేరాయో కూడా వారికి కనీస పరిజ్ఞానం లేదన్నారు. ప్రజల అవసరాలను గమనించి ఎప్పటికపుడు తగిన నిర్ణయాలు తీసుకుంటున్న హరీశ్‌రావు వంటి సమర్థ మంత్రిపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. తప్పుడు ప్రచారం మానుకోండి: కాంగ్రెస్ నాయకులు మిషన్ కాకతీయ పథకం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఈ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించిన విషయాన్ని కూడా గుర్తించరా అని నిలదీశారు. మిషన్ కాకతీయ ఫలితాలను ఈ ఖరీఫ్ లో ఇప్పటికే తెలంగాణ ప్రజలు చూశారన్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు విషయం కొందరికి ముందే లీక్ అరుుందనే ఆరోపణలు చాలా తీవ్రంగా పరిగణించాల్సినవని, దీనిపై కేంద్రం విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని ఎంపీ బూర కోరారు. -
రాజకీయ అవినీతికి మారుపేరు కాంగ్రెస్: బూర
సాక్షి, హైదరాబాద్: అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుని, దాచుకునే సంస్కృతి కాంగ్రెస్ నరనరాల్లో జీర్ణించుకుపోయిందని, రాజకీయ అవినీతికి ఆ పార్టీ మారుపేరని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. పచ్చ కామెర్ల రోగుల్లా మారిన కాంగ్రెస్ నేతలు తమ హయాంలో జరిగినట్లే ఇప్పుడు కూడా అవినీతి జరుగుతోందని భ్రమపడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కేవలం రెండేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా, మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రజారంజక పాలనతో బెంబేలెత్తుతున్న కాంగ్రెస్ నాయకులు ఏమీ పాలుపోక ప్రభుత్వంపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంశానికి రాజకీయ రంగు పులిమిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ జిల్లా కమిటీల నియామకంలో మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్న వారికి సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.