సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నపు డు బీసీల సంక్షేమం గురించి పట్టించుకోని కాంగ్రెస్, ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. బీసీ–ఈ కోటా కింద ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామంటే రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాల యంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించకుండా మతపర రిజర్వేషన్లు అని, బీసీలకు అన్యాయం జరుగుతుందని అపో హలు సృష్టించడం శోచనీయమన్నారు. రిజర్వేషన్లను తప్పుబడుతున్న పార్టీలు.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ పొందుపరిచినప్పుడు ఎందుకు మాట్లాడ లేదన్నారు. ముస్లింలలో వెనకబాటుత నం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉందని సచార్, రంగనాథ్ మిశ్రా కమిటీలు నివేది కలు ఇచ్చాయని గుర్తు చేశారు.