హోండా బ్రియో, అమేజ్ కార్ల ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా... బ్రియో, అమేజ్ మోడళ్ల కార్ల ధరలను స్వల్పంగా పెంచింది. బడ్జెట్లో పన్నుల హేతుబద్ధీకరణ కారణంగా బ్రియో కార్ల ధరలను రూ.600 వరకూ, అమేజ్ కార్ల ధరలను రూ.800 వరకూ పెంచామని హోండా కార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పెరుగుదల ఈ నెల మొదటి వారం నుంచే వర్తిస్తుందని తెలిపింది. ధరలు పెంచిన తర్వాత బ్రియో ధరలు రూ. 4.21 లక్షల నుంచి రూ.6.79 లక్షలు, అమేజ్ కార్ల ధరలు రూ.5.18 లక్షల నుంచి రూ.8.21 లక్షల రేంజ్లో(అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇతర మోడళ్ల ధరలను పెంచలేదని తెలిపింది.