రేపు ఉరవకొండకు హీరో రానా
ఉరవకొండ : ఉరవకొండలో మరోసారి షూటింగ్ సందండి ప్రారంభం కానుంది. బహుబలి ఫేం దగ్గుపాటి రానాతో పాటు ప్రముఖ నటీనటులంతా సందడి చేయనున్నారు. సురేష్ ప్రొడెక్షన్స్ పతాకం పై రానా హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఉరవకొండలో చిత్రీకరించనున్నారు. 3న ఉరవకొండ ఎస్కె ప్రభుత్వ క్రీడా మైదానంలో పతాక సన్నివేశాలు షూట్ చేస్తారు. ఆర్ట్ డైరెక్టర్ సుబ్బారాయుడు పర్యవేక్షణలో ఆదివారం సినిమాలో ఓ భారీ బహిరంగ సభకు సంభందించిన సెట్ ను సిద్ధం చేస్తున్నారు. గతంలో ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో నాని, మోహరూన్ హీరో హీరోయిన్లుగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రం దాదాపు 60 శాతానికి పైగా ఉరవకొండలోనే షూటింగ్ జరిగింది.