Cancellation notes
-
చర్చ లేకుండానే ముగింపు
తుడిచిపెట్టుకుపోయిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ► నోట్ల రద్దుపై చివరి రోజు వరకూ అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ ► 21 రోజుల్లో 19గంటలు సాగిన లోక్‌సభ, 22గంటలు సాగిన రాజ్యసభ న్యూఢిల్లీ: తాము చెప్పినట్లు వినాలంటూ విపక్షాలు, తమకు నచ్చినట్లే జరగాలంటూ అధికార పక్షం పట్టుదలతో నెలరోజుల పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే తుడిచిపెట్టుకుపోయాయి. పెద్ద నోట్ల రద్దుపై తలెత్తిన ఇక్కట్లపై చర్చించాల్సిన అధికార, విపక్షాలు ఉభయసభల్లో తమ పంతం నెగ్గించుకునేందుకు సభా సమయాన్ని పణంగా పెట్టాయి. దీంతో చివరకు శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉభయసభల్ని నిరవధికంగా వాయిదావేశారు. నవంబర్ 16న సమావేశాలు మొదలుకాగా తొలి రోజు నుంచి సభల్లో వాయిదాలు కొనసాగాయి. నోట్ల రద్దుపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగాలంటూ లోక్‌సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, అధికార పక్షం అంగీకరించకపోవడంతో గందరగోళం కొనసాగింది. అంతరాయం వల్ల లోక్‌సభలో 92 గంటల సభా సమయం వృథా అయ్యింది. మొత్తం 21 రోజుల పాటు లోక్‌సభ సమావేశం కాగా... కేవలం 19 గంటలే నడిచింది. రాజ్యసభలో 86 గంటల సమయం వృథా కాగా., సభ 22 గంటలే పనిచేసింది. వాయిదాల వల్ల రాజ్యసభ జాబితాలోని 330 ప్రశ్నలకు గాను కేవలం రెండింటికి, లోక్‌సభలో మొత్తం 440 ప్రశ్నలకు గాను 50 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలిచ్చారు. లోక్‌సభలో నోట్ల రద్దుపై 193 నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చర్చను మొదలుపెట్టినా... విపక్షాల ఆందోళనలతో అది కొనసాగలేదు. సభా కార్యకలాపాలన్ని రద్దు చేసి నోట్ల రద్దుపై తామిచ్చిన వాయిదా తీర్మానాలు చేపట్టాలంటూ మొదటి రోజు నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్‌సభ స్పీకర్ వాయిదా తీర్మానాల్ని తిరస్కరించారు. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. రాజ్యసభలో సమావేశాల మొదటి రోజే నోట్ల రద్దుపై చర్చను ప్రారంభించారు. ప్రధాని సభలోనే ఉండాలన్న విపక్ష డిమాండ్‌తో సభ పదేపదే వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌సభ సమావేశం కాగానే గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం సమావేశం కాగానే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లేచి తాము నోట్ల రద్దు చర్చకు సిద్ధమని గురువారమే చెప్పామని, అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తమపై అనవసర ఆరోపణలు చేశారని చెప్పారు. దివ్యాంగుల హక్కుల బిల్లుకు ఆమోదం తాజా సమావేశాల్లో సభలు ఒక్క బిల్లునే ఆమోదించాయి. దివ్యాంగులపై వివక్షకు కఠిన శిక్షలకు ఉద్దేశించిన హక్కుల బిల్లును సభలు ఆమోదం తెలిపాయి. బుధవారం రాజ్యసభ ఆమోదించిన దీనికి లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆమోద సమయంలో ప్రధాని సభలో ఉన్నారు. ఖర్చు రూ.267 కోట్లు షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలు 21 రోజుల పాటు సమావేశం కావాలి. కానీ, ఇందులో లోక్‌సభలో కేవలం 19 గంటలపాటు, రాజ్యసభలో 22.25 గంటలే సభాకార్యక్రమాలు జరిగాయి. సాధారణంగా పార్లమెంటు నడిచేందుకు ఒక్కోసభలో నిమిషానికి రూ.2.5 లక్షలు ఖర్చవుతుంది (చాలాకాలంగా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు). ఈ లెక్కన ఉభయ సభలు తుడిచిపెట్టుకుపోవటంతో ఖజానాకు రూ. 267 కోట్లు నష్టం వాటిల్లింది. -
ఇది జాతీయ విపత్తు
నోట్ల రద్దుపై అసెంబ్లీలో జానారెడ్డి • ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు • తుపాను, సునామీల కంటే పెద్ద సమస్య • కూలీ దొరకని పరిస్థితి..వ్యాపారాలు దెబ్బతిన్నాయి • లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదం • క్యూలైన్లలో చనిపోయినవారికుటుంబాలకు పరిహారం ఇవ్వాలి సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రణాళిక రహితం, అనాలోచితం, బాధ్యతా రాహిత్యమని శాసనసభలో విపక్ష నేత జానారెడ్డి అభివర్ణించారు. ఇదొక జాతీయ విపత్తు లాంటిదేనని.. తుఫాను, సునామీల కంటే ఎక్కువగా దేశమంతటా ప్రజలు బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభలో ‘నోట్ల రద్దు’ అంశంపై జరిగిన చర్చలో జానారెడ్డి మాట్లాడారు. కేంద్రం క్షేత్రస్థాయిలో ఇబ్బందులను అంచనా వేయకుండా, ముందస్తు ప్రణాళిక లేకుండా నిర్ణయం తీసుకోవడంతో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. నల్లధనాన్ని వెలికితీసే లక్ష్యాన్ని తాము స్వాగతిస్తున్నామని... కానీ నోట్ల రద్దుతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. నోట్ల రద్దు మంచిది కాదని ఆర్థికవేత్తలు కూడా చెబుతున్నారన్నారు. ఇది ఆర్థిక మంద గమనానికి దారితీయడంతో పాటు లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదముందని... కూలీ దొరకని పరిస్థితి, వ్యాపారాలు దివాళా, పేదల ఇళ్లలో పెళ్లిళ్లు జరగని దుస్థితి వంటి సమస్యలు వచ్చాయని స్పష్టం చేశారు. కేంద్రాన్ని, బీజేపీని ఉద్దేశించి తాము ఈ వ్యాఖ్యలు చేయడం లేదని... కేవలం ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. కేసీఆర్ తీరు విడ్డూరం.. నగదు రహిత లావాదేవీలు పూర్తిగా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రే చెబుతుంటే... సీఎం కేసీఆర్ తెలంగాణను పూర్తిగా నగదు రహితం చేస్తామనడం విడ్డూరంగా ఉందని జానారెడ్డి ఎద్దేవా చేశారు. గ్రామాల్లో రైతులు ఎరువులు, విత్తనాలకు డబ్బు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వారిని ఆదుకోవాలని కోరారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిలబడి చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2013లోనే యూపీఏ ప్రభుత్వం నోట్ల రద్దు ప్రతిపాదన తెస్తే అప్పటి బీజేపీ అధికార ప్రతినిధి వ్యతిరేకించిన విషయాన్ని జానారెడ్డి గుర్తుచేశారు. అయితే దీనిపై జోక్యం చేసుకున్న కేసీఆర్.. మన పరిధిలో లేని అంశాలు ప్రస్తావించవద్దని సూచించారు. వెంటనే నగదు పంపిణీ చేయాలి: రాజయ్య నోట్ల రద్దుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని సీపీఎం నేత సున్నం రాజయ్య పేర్కొన్నారు. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద రోజుల తరబడి నిలబడుతున్నారని... ఆదివాసీలు, గిరిజన ప్రాంతాల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమని చెప్పారు. రోజు కూలీపై బతికే కుటుంబాలు నోట్ల కొరతతో ఉపాధి కోల్పోయాయని.. వెంటనే ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి సరిపడా నగదు పంపిణీ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పేదోడు నవ్వుతున్నాడు: కిషన్‌రెడ్డి నోట్ల రద్దు నిర్ణయం దేశ ప్రయోజనాల కోసం తీసుకు న్నదని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నది వాస్తవమేనని, 50 రోజులు ఈ సమస్య ఉంటుందని ప్రధాని మోదీ తొలిరోజే చెప్పారని గుర్తుచేశారు. నల్లధనాన్ని నియంత్రించేందుకు తీసుకున్న అసాధారణ నిర్ణయంపై ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోందన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో పేదవాడు తొలిసారి నవ్వుతున్నాడని, నల్ల కుబేరులు, స్మగర్లు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. మినీ బ్యాంకులుండాలి: రేవంత్ కేంద్రం నోట్లను రద్దు చేయలేదని, నోట్ల ఉప సంహ రణతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 96 శాతం నగదు లావాదేవీలే జరిగే దేశం కావడంతో.. ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోందన్నారు. ప్రతిగ్రామంలో మినీ బ్యాం కులను ఏర్పాటు చేయాలని.. వాటిని మహిళా పొదుపు సంఘాలకు అప్పగించాలన్నారు. చిరు వ్యాపారులు, కూరగాయలు, పాలు అమ్ముకునే రైతులకు ప్రభుత్వమే ఉచితంగా స్వైపింగ్ మిషన్లు సరఫరా చేయాలన్నారు. నీది లోపలి బాధ..నాది బయటి బాధ సీఎంను ఉద్దేశించి జానా చలోక్తులు సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో నవ్వులు విరిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, విపక్ష నేత జానారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పెద్దనోట్ల రద్దుతో తెలంగాణకు ఆదాయం తగ్గలేదని ముఖ్యమంత్రి చెబుతున్నారని జానారెడ్డి అన్నారు. అందుకు వెంటనే జోక్యం చేసుకున్న కేసీఆర్.. రాష్ట్రానికి ఆదాయం తగ్గలేదని తాను అనలేదని.. సభ్యులకిచ్చిన నోట్లోనూ ఆ విషయం లేదని చెప్పారు. దీనికి స్పందించిన జానారెడ్డి.. కేసీఆర్ అలా అనకపోయినా ఆయన మాటల సారాంశం అలాగే అర్థమైందన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై తాను బహిరంగంగా బాధ పడుతుంటే.. ముఖ్యమంత్రి అంతర్గతంగా బాధ పడుతున్నారని అనడంతో సభలో నవ్వులు విరిశాయి. నీదే కదా వ్యవహారం ‘ఈ నిర్ణయంతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను రెండుసార్లు బ్యాంకుకు వెళితే ఒకసారి రూ.6 వేలు, ఒకసారి రూ.24 వేలు ఇచ్చారు’ అని జానారెడ్డి చెప్పారు. పక్కనే ఉన్న బీజేపీ నేత కిషన్‌రెడ్డి.. ‘మీరే నయం. మాకు అవి కూడా ఇవ్వలేదు..’ అన్నారు. ‘డబ్బులతో నీకేం అవసరం.. నువ్వే కదా వ్యవహారం చేసేటోడివి..’ అని జానారెడ్డి మాటకు మాట అనడం అందరినీ నవ్వించింది. చెక్కు ఇచ్చి డబ్బులు తెప్పించుకున్నా.. ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తనకు తెలుసునని.. అందుకు తానేమీ అతీతుడని కాదని సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ఇటీవల ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన. పోయే ముందు తొవ్వ ఖర్చులకు డబ్బు కావాలని బ్యాంకోళ్లతో మాట్లాడిన. రూ.24 వేలకు చెక్కు రాసి పంపిస్తే ఇస్తాం సార్.. అన్నారు. తెప్పించుకున్నా. చెక్కులతో డబ్బులు తీసుకోవటం మనకు అలవాటు లేని పని. కానీ ఇప్పుడు తప్పడం లేదు.. మారాలి కదా’ అన్నారు. -
అప్పు తీసుకునే వారేరీ?
• నోట్ల రద్దుతో తగ్గిన గృహ రుణ మార్కెట్ • కొన్నిచోట్ల మంజూరైన రుణాలూ వాపసు • తీసుకోవాలనుకునే వారిదీ వేచి చూసే ధోరణే • రియల్టీ ధరలు తగ్గుతాయేమోనని ఆశలు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఢిల్లీ, ముంబై వంటి మెట్రోలు సహా పలు నగరాల్లో గృహ రుణ మార్కెట్ డీలా పడింది. బ్యాంకుల్లో జమ చేసిన నగదు పూర్తిగా వెనక్కి తీసుకునే అవకాశం లేక... కొనుగోళ్లు, వినియోగం తగ్గిపోయిన పరిస్థితుల్లో ఇంటి రుణాల కోసం బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వైపు తొంగిచూసే వారు కరువయ్యారు. ఈ పరిస్థితి అటు బ్యాంకులను, ఇటు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను కలవరపెడుతోంది. నోట్లకు కటకటతో... 90 శాతానికి పైగా నగదు లావాదేవీలపై ఆధారపడ్డ రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత వాతావరణంలో రిటైల్ గృహ రుణాలు కావాలంటూ వచ్చే వారి సంఖ్యగణనీయంగా తగ్గిపోయిందని ఈ రంగానికి చెందిన ఫైనాన్స్ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు, అసలు గృహ రుణం కావాలంటూ గత కొన్ని రోజుల్లో తమ కార్యాలయం తలుపు తట్టిన కస్టమర్ ఒక్కరూ లేరనిఆయన పేర్కొనడం పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఇక ఇప్పటికే రుణానికి ఒప్పందం చేసుకుని కొనుగోళ్ల కోసం టోకెన్ పేమెంట్ తీసుకున్న వారు సైతం... తదుపరి విడత నిధుల కోసం తిరిగి రావడం లేదని ఆ అధికారి పేర్కొన్నారు. మరికొందరైతే రుణం వద్దంటూ మంజూరైన వాటిని సైతం రద్దు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. చూద్దాంలే... ఇక ఇళ్లు కొనాలనే నిజమైన ఆసక్తితో ఉన్నవారు సైతం ‘చూద్దాం... రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతాయేమో’ అన్న ధోరణితో వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి ఒకరు తెలియజేశారు. ఉదాహరణకు... ముంబైలోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖకు డీమోనిటైజేషన్ ప్రకటన రావడానికి ముందు వరకు ప్రతి నెలా సగటున 15–20 వరకు ఇంటి రుణం కోసం ప్రతిపాదనలు వచ్చేవి. డీమోనిటైజేషన్ తర్వాతగత నెల రోజుల్లో వచ్చిన ప్రతిపాదనలు రెండు మాత్రమే. వాస్తవానికి డీమోనిటైజేషన్ తర్వాత కొనుగోళ్లు పెరుగుతాయని కొందరు అంచనా వేశారు. ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు మరింత మంది ముందుకొస్తారని,దాంతో మార్కెట్ మెరుగుపడుతుందనే ఆశాభావం వ్యక్తమైంది. బ్యాంకుల్లోకి భారీగా వచ్చి పడుతున్న నగదు జమలతో రుణాల రేట్లు తగ్గుముఖం పట్టడం కూడా ఈ రంగానికి కలసి వస్తుందన్న అంచనాలు వ్యక్తమయ్యా యి. కానీ, ఇప్పటి వరకు ఆ పరిస్థితులేవీ కనిపించడం లేదు. ఆరు నెలలు ఆగాల్సిందే... డీమోనిటైజేషన్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న ప్రకటించగా.. ఇప్పటికే ఓ నెల పూర్తయింది. అయినప్పటికీ గృహ రుణ మార్కెట్ పుంజుకోలేదని ఓ రియల్టీ సంస్థ ప్రతినిధి చెప్పారు. రుణాల కోసం కస్టమర్లుతిరిగి డిమాండ్ చేయడానికి, తాము కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి, మొత్తం మీద సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం ఆరు నెలలైనా పడుతుందన్నది ఆయన అభిప్రాయం. వ్యాపారంపై ప్రభావం.. ఒకవైపు కార్పొరేట్ రుణాల డిమాండ్ తగ్గడంతో బ్యాంకులు గత ఏడాదిగా తమ రుణ పోర్ట్‌ఫోలియోని పెంచుకునేందుకు గృహ రుణాలపై దృష్టి పెట్టాయి. ఇప్పుడు డీమోనిటైజేషన్ ఫలితంగా గృహ రుణ మార్కెట్పడిపోవడం వాటి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. గత మూడు, నాలుగేళ్లుగా గృహ రుణాల వృద్ధి 20 శాతం పెరుగుతూ వస్తోంది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లు కొనుగోలు దారులు తమ నిర్ణయాలనువాయిదా వేసుకోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికాల్లో గృహ రుణ మార్కెట్ వ్యాపారం ఏమంత ఉండకపోవచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. -
ఉభయసభల్లో మారని తీరు
-
ఉభయసభల్లో మారని తీరు
నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమన్న ప్రతిపక్షం న్యూఢిల్లీ: మూడు వారాలు గడుస్తున్నా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏం మార్పూ లేదు. విపక్షాల ఆందోళన, ప్రభుత్వం ఎదురుదాడి మధ్య శుక్రవారమై ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదాపడ్డాయి. నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమంటూ లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రకటించినా 16 రోజులుగా సభను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలంటూ ప్రభుత్వం డిమాండ్ చేయడంతో గందరగోళం కొనసాగింది. రాజ్యసభలో నోట్ల రద్దు అంశంతో పాటు గోధుమలపై దిగుమతి సుంకం తగ్గించడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభను స్పీకర్ వాయిదా వేయగా, వాయిదాల అనంతరం సమావేశమైన రాజ్యసభలో కోరం లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్ తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఖర్గే మాట్లాడుతూ... నోట్ల రద్దు, దాని పరిణామాలపై చర్చించేందుకు ప్రతిపక్షం సిద్ధంగా ఉందన్నారు. ఇంతలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ జోక్యం చేసుకుంటూ.. విపక్షాలు 16 రోజులుగా సభను నడవనీయలేదని అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యురాలు మీనాక్షీ లేఖీ మాట్లాడుతూ... రాష్ట్రపతి సూచించినట్లు నిరసనలు, ధర్నాల కోసం జంతర్‌మంతర్ సరైన వేదికని పార్లమెంట్కాదన్నారు. ఉదయం సభ మొదలవగానే డిసెంబర్ 13, 2001న పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటనను గుర్తు చేసుకుంటూ... ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందికి నివాళులర్పించారు. కోరం లేక రాజ్యసభ వాయిదా.. గోధుమలపై దిగుమతి సుంకం ఎత్తివేయడంపై రాజ్యసభలో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, జేడీయూ, లెఫ్ట్ పార్టీలు నిరసన తెలిపాయి. ఈ నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోతారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గోధుమల కొరత లేదని, ఇటీవల ధరలు పెరగడంతో తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆహార మంత్రి పాశ్వాన్ చెప్పారు. ఇదే తుది నిర్ణయం కాదని, అవసరమనుకుంటే సమీక్షించవచ్చన్నారు. ఇంతలో కురియన్ జీరో అవర్ ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని సహించేది లేదంటూ నినాదాలు చేశారు. -
నోట్ల రద్దుతో నష్టమే ఎక్కువ..!
• ప్రయోజనం రూ.80 వేల కోట్లు.. ఖర్చు రూ. 2 లక్షల కోట్లు • పెద్ద నోట్ల రద్దుపై పరిశీలకుల అంచనా... • ప్రభుత్వం చెప్పే లెక్కలకు పొంతన లేదంటూ విశ్లేషణ డీమోనిటైజేషన్(పెద్ద నోట్ల రద్దు) వ్యవహారంతో ఒనగూరే ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉండబోతున్నాయంటూ హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. రద్దు చేసిన పెద్ద నోట్లన్నీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేయగలవంటూ ప్రభుత్వమే చెబుతుండటం దీనికి ఊతమిస్తోందని వారంటున్నారు. దీంతో మొత్తం డీమోనిటైజేషన్ ప్రక్రియ పరమార్ధమే దెబ్బతింటోందని చెబుతున్నారు. డీమోనిటైజేషన్ ప్రక్రియతో పెద్ద నోట్లు గణనీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాకుండా పోతాయని, రూ. 3 లక్షల కోట్లు- రూ. 5 లక్షల కోట్ల మేర నల్లధనం ధ్వంసమవుతుందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇలా పెద్ద ఎత్తున మిగిలిపోయే మొత్తాలను ప్రజోపయోగ పనులు, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన వాటికి వెచ్చిస్తామని, భవిష్యత్ రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోతాయని ఊదరగొట్టింది. కానీ, రద్దు చేసిన రూ. 500, రూ. 1,000 నోట్లు అన్నీ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేయగలవని భావిస్తున్నట్లు తాజాగా కేంద్ర రెవెన్యూ విభాగ కార్యదర్శి హస్ముఖ్ అధియా ప్రకటించడం ప్రభుత్వ హామీలపై సందేహాలు రేకెత్తిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం బుధవారం నాటికి దాదాపు రూ.12 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి చేరారుు. దీంతో ప్రభుత్వం ముందుగా చెప్పినట్లు ఖజానాకు భారీ నిధులేమీ వచ్చే అవకాశాలేమీ లేకుండా పోరుుందని పరిశీలకులు చెబుతున్నారు. డీమోనిటైజేషన్‌కి సంబంధించి ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండటం లేదని వారు విశ్లేషిస్తున్నారు. ఖర్చులు, ప్రయోజనాలను పోల్చి చూసుకుంటే ఈ ప్రక్రియ కారణంగా ప్రభుత్వం..అంతిమంగా దేశం నష్టపోనుందని అంటున్నారు. రూ. 4.5 లక్షల కోట్ల నల్లధనం లెక్కలు.. ప్రభుత్వ లెక్కలను బట్టి రద్దు చేసిన రూ. 15.4 లక్షల కోట్ల నగదులో దాదాపు 30 శాతం నల్లధనం ఉంటుందని అంచనా. అంటే సుమారు రూ. 4.5 లక్షల కోట్లు ఉండొచ్చు. అరుుతే, నవంబర్ 8 నాటి డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత నల్ల కుబేరులు ఏదో రకంగా కనీసం రూ. 1.5 లక్షల కోట్లకు చట్టబద్ధత తెచ్చేసుకుని ఉంటారని అంచనా. ఇందుకోసం వారు జన ధన ఖాతాలు, రూ. 2.5 లక్షల పరిమితులు మొదలైన మార్గాలు ఉపయోగించుకుని ఉంటారు. ఇక నవంబర్ 28న ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద దాదాపు రూ.1.3 లక్షల కోట్లు వెల్లడి కావొచ్చని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) అంచనా వేస్తోంది. కొందరు విశ్లేషకులు దీన్ని కాస్త ఉదారంగా రూ. 1.5 లక్షల కోట్లకు పెంచి రౌండు ఫిగర్ చేశారు. ఇక ముందుగా అనుకున్న రూ. 4.5 లక్షల కోట్ల నల్లధనంలో మిగిలింది రూ. 1.5 లక్షల కోట్లు. వీటికి సంబంధించి మాత్రమే వివరాల కోసం, చర్యల కోసం ఆదాయ పన్ను విభాగం.. డిపాజిట్‌దారుల వెంటపడాల్సి ఉండొచ్చు. అరుుతే, ఇందుకు కనీసం రెండు మూడేళ్లరుునా పట్టేస్తుంది. కాబట్టి ప్రస్తుతం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (కొత్త ఐడీఎస్కి ప్రభుత్వం పెట్టిన పేరు) కింద వెల్లడైన సంపదపై 50% మేర పన్ను విధిస్తే ప్రభుత్వ ఖజానాకు తక్షణం దక్కేది రూ. 75,000 కోట్లు. ఐడీఎస్ కింద డిపాజిట్ చేసే పాతిక శాతం మీద తొలి ఏడాది వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ విధంగా రూ. 2,500 కోట్లు మిగులుతుంది. మొత్తం మీద రౌండ్ ఫిగర్ చేస్తే ఒక రూ. 80,000దాకా తేలుతుంది. లక్షల కోట్ల ఖర్చు.. ఇక ప్రభుత్వానికి వచ్చేది కాస్సేపు పక్కన పెట్టి ఈ మొత్తం ప్రక్రియకు అవుతున్న వ్యయాలు ఓసారి చూస్తే.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ)అంచనాల ప్రకారం డీమోనిటైజేషన్ కారణంగా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 మధ్య కాలంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై రూ. 1.28 లక్షల కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. ప్రస్తుత త్రైమాసికం ప్రభావాలు వచ్చే త్రైమాసికంలోను, ఆపైనా కూడా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సీఎంఐఈ కాస్త ఉదారంగా వేసిన లెక్కల ప్రకారమే ఇంత భారీ స్థారుులో నష్టం వాటిల్లనుంది. స్థూలంగా జీడీపీకి దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల మేర నష్టం జరగొచ్చని సీఎంఐఈ చెబుతోంది. డీమోనిటైజేషన్ వాస్తవ ఖర్చులు (కొత్త నోట్లు ముద్రించడం, రవాణా చేయడం మొదలైనవి) దాదాపు రూ. 20,000 కోట్లు ఉంటారుు. బ్యాంకుల్లోకి కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్న నగదుకు తగ్గట్లుగా రూ. 6 లక్షల కోట్ల మేర మార్కెట్ స్థిరీకరణ (ఎంఎస్ఎస్) బాండ్లను జారీ చేసేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటి మీద కనీసం 6-6.5% మేర వార్షిక వడ్డీ రేటు నిర్ణరుుంచినా.. 9 నెలల కాలానికి (ఈ వ్యవధిలో అంతా సద్దుమణుగుతుందని అంచనా) ఆర్బీఐ కనీసం రూ.30,000 కోట్లు-35,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా కలిపినప్పుడు.. డీమోనిటైజేషన్‌కి సంబంధించి ఖర్చులు మొత్తం రూ. 2 లక్షల కోట్లుగా లెక్క తేలుతోంది. తీరా చూస్తే వచ్చే లబ్ధి మాత్రం రూ. 80,000 కోట్లే. -
గ్రామీణుల కష్టాల సంగతేంటి?
• సహకార సంఘాల్లో నగదు కొరతపై ఏం చర్యలు తీసుకున్నారు? • ‘నోట్ల రద్దు’పై కేంద్రానికి సుప్రీం సూటిప్రశ్న • కావాలనే సహకార సంఘాల్ని నగదు మార్పిడి నుంచి తప్పించాం: కేంద్రం న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అసౌకర్యాల్ని పరిష్కరించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే సామాన్యులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు పరిష్కరించేందుకు తీసుకున్న చర్యల్ని పేర్కొంటూ అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుందా? లేదా?, నగదు దొరక్క ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం శుక్రవారం వాదనలు ఆలకించింది. నోట్ల రద్దు అనంతరం వేర్వేరు అంశాలపై వివిధ హైకోర్టుల్లో అనేక కేసులు దాఖలయ్యాయని, కేరళ, కోల్‌కతా, జైపూర్, ముంబై... ఇలా వివిధ హైకోర్టుల్లో దాఖలైన కేసులు డీల్ చేయడం తమకు సాధ్యం కాదని, అన్నీ కలిపి ఏదోఒక హైకోర్టుకు బదిలీ చేయడమో లేదా... సుప్రీంకోర్టులో విచారించడమో చేయాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. నోట్ల రద్దు అనంతరం దాఖలైన అన్ని పిటిషన్లను సంబంధిత పార్టీలన్నీ కలిసి కూర్చుని పరిశీలించి... ఏ కేసులు హైకోర్టులకు బదిలీ చేయవచ్చో, ఏవి సుప్రీంకోర్టులో విచారించవచ్చో పేర్కొంటూ జాబితా సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ... పిటిషనర్లు అందరూ కలిసి కూర్చుని జాబితా రూపొందించి సోమవారం కోర్టుకు సమర్పిస్తారని చెప్పారు. సహకార సంఘాల్లో నకిలీలను గుర్తించే సౌకర్యం లేదు: కేంద్రం సహకార సంఘాలపై గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆధారపడ్డారని, నోట్ల రద్దు అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ అటార్నీ జనరల్‌ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. రోహత్గీ సమాధానమిస్తూ... మిగతా బ్యాంకులతో పోలిస్తే సహకార బ్యాంకుల్లో సరైన మౌలిక వసతులు, యంత్రాంగం లేదన్న విషయం ప్రభుత్వానికి తెలుసన్నారు. కేంద్రం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో సహకార బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాల్నే పేర్కొన్నామని చెప్పారు. ప్రభుత్వం కావాలనే నగదు మార్పిడి, సరఫరా నుంచి సహకార సంఘాల్ని దూరం పెట్టిందని, నకిలీ కరెన్సీని గుర్తించే నిపుణత సహకార బ్యాంకుల వద్ద లేదని రోహత్గీ వాదించారు. సహకార సంఘాల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పి.చిదంబరం వాదిస్తూ... సహకార సంఘాల్ని నగదు మార్పిడి పక్రియలో చేర్చకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. అనంతరం కోర్టు వాదనలను డిసెంబర్ 5కు వారుుదా వేసింది. -
27 మంది బ్యాంకు అధికారుల సస్పెన్షన్
నోట్ల రద్దు అనంతరం పలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తింపు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన అవకతవకలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 27 మంది సీనియర్ అధికారుల్ని కేంద్రం సస్పెండ్ చేసి, ఆరుగుర్ని బదిలీ చేసింది. వీరంతా పలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో వీరి అక్రమాలు వెలుగు చూశారుు. బెంగళూరులో ఇద్దరు వ్యాపార వేత్తల నుంచి కొత్త నోట్ల రూపంలో గురువారం రూ. 5.7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని అక్రమాల్లో అధికారుల పాత్ర ఉందని తేలిందని, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వారు పనిచేసినట్లు గుర్తించామని ఆర్థిక శాఖ వెల్లడించింది. అక్రమాల్ని సహించేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ హెచ్చరించింది. మనీల్యాండరింగ్‌కు పాల్పడుతున్న వారిని, అక్రమ సంపాదనను సక్రమంగా మార్చుకుంటోన్న నల్ల కుబేరుల్ని వదిలిపెట్టేది లేదని, సంబంధిత విభాగాలు వారి కోసం వేటాడుతున్నాయని కేంద్రం ఆర్థిక శాఖ కూడా శుక్రవారం స్పష్టం చేసింది. ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పారు. -
నోట్ల రద్దుతో ప్రజల్లో మార్పు రాదు..
నోబెల్ గ్రహీత పాల్ క్రుగ్మన్ అభిప్రాయం న్యూఢిల్లీ: నోట్ల రద్దు భారీ స్థారుులో నష్టం కలిగించే చర్య అని నోబెల్ పురస్కార గ్రహీత, అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు పాల్ క్రుగ్మన్ అన్నారు. ఇది ప్రజల ఆలోచనను మార్చలేదన్నారు. మనీ లాండరింగ్ విషయంలో మరింత జాగ్రత్త పడతారని, పక్కదారులు వెతుకుతారని, మరోసారి ఇలానే చేస్తే తమను తాము రక్షించుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని తాను అర్థం చేసుకోగలనని, కానీ ఆచరిస్తున్న విధానం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగించేదిగా పేర్కొన్నారు. క్రుగ్మన్ అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన హెచ్‌టీ నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. డీమోనిటైజేషన్ను అసాధారణ చర్యగా పేర్కొన్నారు. రూ.2,000 నోటు విడుదల సరైంది కాదన్న ఆయన... నల్లధనాన్ని ఏరిపారేయడానికి ఇదొక ప్రయత్నమని చెప్పారు. -
హర్తాళ్‌కు పోలీసు సంకెళ్లు
► నిరసనకారుల్ని ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు ►సామాన్యుల కష్టాలకు ప్రభుత్వాలు ► సమాధానం చెప్పాలన్న అఖిలపక్ష నాయకులు చిత్తూరు(కార్పొరేషన్): పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల పడుతున్న అవస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నోట్ల ఇబ్బందులను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ.. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో హర్తాళ్ నిర్వహించారు. అయితే ముందస్తుగా పోలీసులు నాయకులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకొని సాయంత్రం స్టేషన్ నుంచి బయటకు పంపా రు. అయితే విద్యాసంస్థలు ముందస్తుగా సెలవు ప్రకటిం చడం, వ్యాపారులు కూడా పలుచోట్ల దుకాణాలు మూసివేయడంలో ప్రజలు రోడ్లపై పెద్దగా కనిపించలేదు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నుంచే.. ఉదయం ఆరు గంటల నుంచే ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు పహారా కాశారు. అదేవిధంగా రద్దీకూడళ్లలోనూ భారీగా బలగాలను మోహరించారు. దీంతో అక్కడి వచ్చిన నాయకులను అప్పటికప్పుడే అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లెశ్రీనివాసులు పిలుపు మేరకు నగరయూత్ అధ్యక్షుడు నారాయణ, నాయకులు టి.వి.శ్రీనివాసులు, పూంగొడి ఆధ్వర్యంలో గాంధీవిగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అలాగే స్థానిక శేషాపిరాన్‌వీధి నుంచి సీపీఐ, సీపీఎం నాయకులు నాగరాజన్, సురేంద్ర రమాదేవి, జమిలాభి, రాజేంద్ర, విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో వామపక్ష నాయకులు ర్యాలీ తీశారు. అరుుతే వీరు గాంధీవిగ్రహం వద్దకు వెళ్తుండగా పోలీసులు వారిని మార్కెట్‌వద్ద అదుపులోకి తీసుకోవడానికి యత్నించారు. కుదరకపోవడంతో చర్చివీధిలో అదుపులో తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవారి అరెస్టుల పర్వం సాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాలసుబ్రమణ్యం, మనోహర్, ఢిల్లీప్, హరి, శరవణ, సేతు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలంలో.. చిత్తూరు(రూరల్): పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావని, అరుునా కేంద్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం అనంతాపురం రోడ్డులో నరసన చేపట్టారు. ఉదయం 6 గంటలకే బంద్ పాటించి ధర్నాకు దిగారు. దీంతో వాహనాలు రోడ్డుపై కిలో మీటరు మేర నిలిచిపోయారుు. ఇంతలో స్థానిక బీఎన్‌ఆర్‌పేట పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భం గా పలువురు నాయకులు మాట్లాడుతూ నోట్ల రద్దుతో రోజురోజుకూ చిల్లర కష్టాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. రోజు కూలీలు, రైతు కుంటుంబాల జీవనం కష్టతరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సామన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఆ పార్టీ నాయకులు రాజా, త్యాగరాజులు, దిలీప్, రంజన్, ప్రభాకర్, రాబర్ట్, గంగ, కుమార్, శేఖర్, కన్నన్, గోవిందస్వామి, రజనీ, కళిల్, గంగాధరం, పార్లిన్, షణ్ముగం, భాస్కర్, భూప, చల్లా, వినాయకం, తులసీరాం, గోపీ, దేవదాసు, ముత్తు తదితరులు పాల్గొన్నారు. -
ఏమీ సేతుర లింగా ఏమీ సేతూ..
• బ్యాంకుల మూతతో బేజారు • రెండు రోజుల సెలవులతో సతమతం బ్యాంకుల గేట్లకు తాళాలు, ఏటీఎంలపై నో క్యాష్ బోర్డుల తోరణాలతో బిక్కచచ్చిపోరుున ప్రజలు ‘ఏమీ సేతుర లింగా ఏమీ సేతూ’ అంటూ పాడుకుంటున్నారు. బ్యాంకులకు శని, ఆదివారాల సెలవుతో ఖాతాదారులు సతమతమైపోతున్నారు. ఆశగా ఏటీఎంల వైపు వెళితే డబ్బులు లేని ఆ డబ్బాతో నిరాశే మిగులుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: పెద్ద నోట్ల రద్దు పేద, మధ్యతరగతి ప్రజలనే ఎక్కువగా బాధిస్తున్నదని గట్టిగా చెప్పవచ్చు. నగదు కోసం 16 రోజులుగా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. పాత నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్త నోట్లతో ఆదుకోవడంలో విఫలమైంది. రూ.2వేల నోట్లను మాత్రమే ముందుగా విడుదల చేసి చిన్ననోట్లపై చిన్నచూపు చూసింది. రూ.24వేల వరకు డ్రా చేసుకోవచ్చని కేంద్రం చెబుతున్నా కరెన్సీ లేని కారణంగా కొంత మొత్తాన్ని మాత్రమే కొసరి కొసరి సర్దుతున్నారు. రూ.100, రూ.500 కరెన్సీ చిల్లర నోట్లు కావాలంటూ ప్రజలు చిటపటలాడుతున్నారు. ఈ దశలో శుక్రవారం చెన్నైకి చేరుకున్న 14 టన్నుల రూ.500 నోట్లు ఎంత వరకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయోననే అనుమానాలు నెలకొన్నారుు. 28వ తేదీకి అన్ని ఏటీఎంల నుంచి రూ.500 నోట్లను పొందవచ్చని బ్యాంకు అధికారుల చెబుతున్నారు. ఈ 14వేల టన్నుల్లో ఏ బ్యాంకు ఎంత వాటా దక్కుతుందోననే అనుమానాలు నెలకొని ఉన్నారుు. చెన్నైలోని రిజర్వు బ్యాంకు ఆధీనంలోని ఈ సొమ్ము పంపిణీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కే సింహభాగం దక్కే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్లుగా రాష్ట్రంలోని ఏటీఎంలలో రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తాయని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇటీవల కోవైలో ప్రకటించడం గమనార్హం. ఏటీఎంల రంగ ప్రవేశం వల్ల నగదు డ్రా కోసం బ్యాంకులపై ఆధారపడే రోజులు ఏనాడో పోయారుు. పెద్ద నోట్ల రద్దుతో మళ్లీ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదు. శని, ఆదివారాలను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల నిండా సొమ్ము పెట్టి ఉంటారని అందరూ ఆశించగా అది నిరాశే అని తేలేందుకు పెద్దగా సమయం పట్టలేదు. నగదున్న ఏటీఎం కోసం వేటాడి వెంటాడిన ఖాతాదారులు వాటి ముందే కూలపడిపోవడం చూపరుల గుండెను ద్రవింపజేసింది. అతికొద్ది ఏటీఎంలలో మాత్రమే నగదు ఉండడంతో చాంతాడంత క్యూ తయారైంది. గంటల తరబడి క్యూలో నిల్చుని ఏటీఎం వద్దకు వచ్చి కార్డు పెట్టగానే డబ్బులేదనే సమాచారం దర్శనమిస్తోంది. కొన్ని బ్యాంకులు ముందుగానే నో క్యాష్ బోర్డు పెట్టేశారుు. ఏటీఎంలలో డబ్బు లేనపుడు నింపాలిగానీ బోర్డు పెట్టడం ఏమిటని విమర్శిస్తున్నారు. పాత నోట్ల ద్వారా పన్నులు చెల్లించవచ్చని చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. 28న సామూహిక ఆందోళనలు : కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ఈనెల 28వ తేదీన సామూహిక ఆందోళనలు సాగనున్నారుు. నిరసన ప్రదర్శనలు చేస్తున్నట్లు డీఎంకే, వామపక్షాలు వేర్వేరుగా గతంలో ప్రకటించి ఉన్నారుు. డీఎంకే ఆందోళనలో తాము పాల్గొంటున్నట్లు తమిళ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య సంఘాలు సైతం నిరసన తెలుపబోతున్నట్లు శనివారం ప్రకటించారుు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల దుకాణాలను మూసివేయనున్నారు. -
నాలుగు నెలల ముందే లక్ష్యసాధన: పేటీఎం
న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు వాలెట్ సంస్థలకు బాగా అనుకూలించింది. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రోజుకు 70 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని పేటీఎం పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని తెలిపింది. దీంతో తాము 5 బిలియన్ డాలర్ల విలువైన జీఎంవీ అమ్మకాల లక్ష్యాన్ని నాలుగు నెలల ముందే సాధించామని పేర్కొంది. ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన వస్తువుల విక్రయానికి సంబంధించిన మొత్తం విలువనే జీఎంవీగా పరిగణలోకి తీసుకుంటాం. పేటీఎం జీఎంవీ గతేడాది 3 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా పేటీఎం.. మొబైల్ పేమెంట్ సర్వీసులతోపాటు ఈ-కామర్స్ సేవలను కూడా అందిస్తోంది. దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీల కన్నా తమ ప్లాట్‌ఫామ్ ఆధారంగా జరిగే ట్రాన్సాక్షన్లే ఎక్కువగా ఉన్నాయని పేటీఎం పేర్కొంది. -
పౌల్ట్రీకి రోజుకు 100 కోట్ల నష్టం..
• పెద్ద నోట్ల రద్దుతోనే సమస్య • 10 లక్షల మందికి జీతాలే లేవు • మీడియాతో పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు • నేటి నుంచే హైటెక్స్‌లో పౌల్ట్రీ సదస్సు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాలుగేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటున్న పౌల్ట్రీ రంగానికి 2016 కూడా కలిసి రాలేదు. ఈ ఏడాదైనా నష్టాల నుంచి గట్టెక్కుదామనుకున్న పరిశ్రమకు పెద్ద నోట్ల రద్దు రూపంలో అవాంతరం వచ్చి పడిందని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.రంజిత్ రెడ్డి చెప్పారు. చిల్లర సమస్యతో కొనుగోలుదార్లు లేక గుడ్లు, చికెన్ అమ్మకాలు ప్రస్తుతం 50-60 శాతానికే పరిమితమయ్యాయని సోమవారమిక్కడ మీడియాకు తెలియజేశారు. ‘‘నోట్ల రద్దు తర్వాత మొదటి రెండు రోజులు అమ్మకాలు 30 శాతమే నమోదయ్యారుు. పౌల్ట్రీకి అత్యంత కీలకమైన నవంబరు-డిసెంబరులో అమ్మకాలు పడిపోవడం కోలుకోలేని దెబ్బ’’ అని చెప్పారాయన. ప్రస్తుతం రోజుకు దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల నష్టం వాటిల్లుతోందని చక్ర గ్రూప్ ఎండీ పి.చక్రధర్‌రావు వెల్లడించారు. తెలంగాణలో ఈ నష్టం రోజుకు రూ.20 కోట్లపైనే ఉందన్నారు. దేశంలో రోజుకు 21 కోట్ల గుడ్లు, 2 కోట్ల కిలోల చికెన్ ఉత్పత్తి అవుతోంది. పరిశ్రమలో ఏటా రూ.1 లక్ష కోట్ల వ్యాపారం జరుగుతోంది. జీతాలు చెల్లించలేం..: దేశవ్యాప్తంగా పౌల్ట్రీ విపణిలో లక్ష మంది రైతులున్నారు. 10 లక్షల మంది ప్రత్యక్షంగా ఆధారపడ్డారు. ఒక్క తెలంగాణలోనే 25 వేల మంది రైతులున్నారు. పౌల్ట్రీ ఉత్పాదనలో అగ్రగామిగా ఉన్న ఈ రాష్ట్రంలో రోజూ 4 కోట్ల గుడ్లు, 15 లక్షల కిలోల చికెన్ ఉత్పత్తి అవుతున్నారుు. ఏటా రూ.10,000 కోట్ల వ్యాపారం నమోదవుతోంది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు, చిల్లర దొరక్కపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నట్లు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు చెప్పారు. కోళ్లకు దాణా పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. పౌల్ట్రీ రైతులు, ఈ రంగంలోని కంపెనీల రుణాలను ఏడాది పాటు రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ పౌల్ట్రీ సదస్సు.. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మంగళవారం నుంచి శుక్రవారం వరకూ (22-25) పౌల్ట్రీ సదస్సు జరుగనుంది. 200 భారతీయ, 50 విదేశీ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారుు. 20 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా. అంతర్జాతీయ స్థారుులో దీనిని నిర్వహిస్తున్నామని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీష్ గర్వారే తెలిపారు. పౌల్ట్రీ రంగంలో వచ్చిన అధునాతన టెక్నాలజీని తెలుసుకునేందుకు ప్రదర్శన ఉపకరిస్తుందని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ సభ్యులు కె.మోహన్ రెడ్డి చెప్పారు. భారత్‌తో పాటు దక్షిణాసియాకు చెందిన 800 మంది నిపుణులు నేడు (మంగళవారం) జరిగే నాలెజ్డ్ డేలో పాల్గొంటున్నారు. -
వారం రోజులైనా తప్పని నోట్ల అగచాట్లు
-
నోట్లు అగచాట్లు
వారం రోజులైనా అదే పరిస్థితి.. బ్యాంకుల ముందు బారులు తీరిన జనం • రెండు మూడు గంటల్లోనే నగదు నిల్వలు ఖాళీ • ఏటీఎంలను నింపలేక చేతులెత్తేస్తున్న బ్యాంకులు • లావాదేవీల పరిమితి పెంపుతో మరింత ఒత్తిడి • చిన్న బ్యాంకుల పరిస్థితి మరింత దారుణం • అందుబాటులోకి రాని కొత్త రూ. 500 నోట్లు • రూ. 2,000 నోటుకు చిల్లర దొరకని వైనం • చిరు వ్యాపారులకు కోలుకోలేని ‘పెద్ద’ దెబ్బ • రోజంతా పడిగాపులు కాసినా కూలి డబ్బులూ దక్కని దుస్థితి • వంద నోట్లు, చిల్లర ఇచ్చే నాథుడు లేడు • రాష్ట్రంలో వేలాది చిరు వ్యాపారుల కుటుంబాల ఇక్కట్లు సాక్షి, అమరావతి పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సామాన్యప్రజలు ఎదుర్కొంటున్న తిప్పలు రోజురోజుకూ పెరుగుతున్నాయేగానీ తగ్గడం లేదు. వారంరోజులైనా పరిస్థితి ఏ మాత్రం చక్కబడటంలేదు. అన్ని ప్రాంతాల్లో కరెన్సీ అత్యవసర స్థితి ఏర్పడింది. ప్రజలకు రోజులకొద్దీ సమయం బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్దే గడిచిపోతోంది. చిన్నా, పెద్దా, మహిళలు, వృద్ధులు తేడా లేకుండా అందరూ క్యూలైన్లలోనే తమ ఓపికను, చెమటను ధారబోస్తున్నారు. గంటలపాటు క్యూల్లో నిల్చున్నా చివరికి అక్కడ తగినంత నగదు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనక్కివెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నారుు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఇంతవరకూ ఒక కొత్త రూ. 500 నోటు కూడా రాలేదు. బ్యాంకుల్లో చాలావరకు రూ. 2వేల నోట్లు ఇస్తుండడంతో రోజువారీ అవసరాలకు వాటిని మార్చడం అసాధ్యంగా మారింది. కొన్నిచోట్ల రూ. 100 నోట్లు ఇస్తున్నా ఉన్న డిమాండ్‌తో పోల్చుకుంటే అది చాలా స్వల్పం. నగదు కొరతతో అన్ని వర్గాల ప్రజలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడున్న డిమాండ్‌కే నగదు సరఫరా చేయలేక బ్యాంకులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు లావాదేవీలపై పరిమితులను పెంచడంతో బ్యాంకుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇప్పుడు బ్యాంకు నుంచి వారంలో రూ. 24,000 వరకు తీసుకోవచ్చనడం పెద్ద ఇబ్బందిగా మారిందని బ్యాంకు అధికారి వాపోయారు. అలాగే ఏటీఎంల నుంచి విత్‌డ్రాయల్ పరిమితిని రూ. 2,500కు పెంచినా చాలా చోట్ల అమలు కాలేదని ఫిర్యాదులు వచ్చారుు. ఒకసారి బ్యాంకు నుంచి వెళ్లిన 100 నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు రావడం లేదని, దీంతో నగదు సరఫరా చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. చిన్న బ్యాంకులపై ఆర్బీఐ వివక్ష నగదు సరఫరాలో ఆర్బీఐ వివక్ష చూపిస్తోందని చిన్న బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారులు వాపోతున్నారు. ఉన్న నగదులో అత్యధిక భాగం ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ వంటి పెద్ద బ్యాంకులకు కేటారుుంచి, ఆంధ్రాబ్యాంక్, సహకార బ్యాంకులకు చిల్లర విదిలిస్తుండటంతో ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడం కష్టంగా ఉందని పేరు రాయడానికి ఇష్టపడని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాష్ట్రాల్లో ఉన్న సహకార బ్యాంకు ఖాతాదారుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఎవరి దగ్గరో నల్లధనం ఉందని మాలాంటి సామాన్యులను ఇబ్బందికి గురి చేయడం ఎంతవరకు సమంజసమని వీరు ప్రశ్నిస్తున్నారు. కొత్త రూ. 500 నోట్ల కోసం ఎదురుచూపులే..! సోమవారం నుంచి బ్యాంకుల ద్వారా కొత్త రూ. 500 నోట్లు చెలామణిలోకి వస్తాయనే వార్తలతో అందరూ వాటి కోసం ఎదురు చూశారు. కానీ ఇంతవరకూ ఆర్బీఐ వాటిని రెండు రాష్ట్రాలకు పంపలేదు. తమకు ఎప్పుడు ఈ నోట్లు పంపుతారని అధికారులు ఆర్బీఐని సంప్రదించగా సరైన సమాధానం రాలేదు. ఇక్కడి ఆర్బీఐ రీజనల్ అధికారులకు సైతం దీనిపై స్పష్టత లేదు. మరో రెండుమూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రూ. 500 నోట్లు వస్తే కొంతవరకూ ప్రజల ఇబ్బందులు తీరే అవకాశం ఉంటుంది. నోట్ల రద్దు నేపథ్యంలో ఏపీకి రూ. 6,500 కోట్లను ఆర్బీఐ పంపింది. అందులో రూ. 4,500 కోట్లకుపైగా సొమ్ములో రెండు వేల నోట్లే ఉండడం గమనార్హం. మరోవైపు కొత్త రూ. 500 నోట్లరుునా ఏటీఎంలతో సరిపోతాయో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. సైజులు తేడా కారణంగా ఇప్పటికే రెండు వేల నోట్లు ఏటీఎంలలో అమరని విషయం తెలిసిందే. చిరువ్యాపారాలు చిందరవందర పెద్ద నోట్ల రద్దుతో చిరు వ్యాపారాలు చిందర వందర అయ్యారుు. పూలు, పండ్లు, కూరగాయల కొనుగోలు మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. రాజధాని అమరావతి ప్రాంతంలోనే దాదాపు 11,500 పైగా చిరు వ్యాపారాలు, తోపుడు బళ్లు(స్ట్రీట్ వెండర్స్) వారంగా అమ్మకాలు లేక దయనీయ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తోపుడు బండ్లు, రైతు బజార్లు, పాల కేంద్రాలు, కిళ్లీ బడ్డీలు తదితర చిరు వ్యాపారాలకు ఇప్పుడు అమ్మకాలు పడిపోరుు వెలవెలబోతున్నారుు. రోజంతా రోడ్డు పక్కన బళ్లు పెట్టి, దుకాణాలు తీసి పడిగాపులు పడినా ఇప్పుడు వారికి కూలి డబ్బులు కూడా గిట్టక చిరువ్యాపారుల కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తోంది. రద్దు చేసిన పాత నోట్లు చిరు వ్యాపారులు తీసుకోలేరు. అలా అని రూ.2 వేల కొత్త నోటుకు చిల్లర ఇవ్వలేక బేరాలు వదులుకుంటున్నారు. మార్కెట్లో వంద నోట్ల తీవ్ర కొరత చిరు వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీస్తోందని వాపోతున్నారు. మళ్లీ ’కాల్’నాగుల కోరల్లో పడాల్సిందేనా? రాష్ట్రంలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో తోపుడు బళ్ల వ్యాపారులు చాలా వరకు రోజువారీ వడ్డీలకు తెచ్చుకుని బతుకు బండిని నడుపుతుంటారు. రోజువారీ వడ్డీ వ్యాపారి ఉదయం రూ. 850, రూ. 800 ఇచ్చి రాత్రి అమ్మకాలు అయ్యాక వచ్చి రూ. 1,000 వసూలు చేసుకుని వెళ్తాడు. ఇచ్చిన మొత్తం వడ్డీతో సహా చెల్లించకుంటే ఉపాధి చూపే తోపుడు బండి, ఇతర విలువైన వస్తువులను నిర్దయగా పట్టుకుని పోరుు బెదిరిస్తాడు. ఇటీవల ఈ తరహా కాల్ నాగుల బారిన పడుతున్న చిరు వ్యాపారులు గత్యంతరం లేక మూగ వేదన భరిస్తూనే బతుకు బండిని నెట్టుకొచ్చేందుకు రోజువారీ వడ్డీలు చెల్లిస్తున్నారు. నోట్లు రద్దు కారణంగా ఇప్పుడు పెట్టుబడిగా తీసుకున్న మొత్తాలు చెల్లించలేకపోతున్న చిరు వ్యాపారులు కుటుంబ పోషణ కోసం కూడా మళ్లీ కాల్‌నాగుల కోరల్లో చిక్కుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. నిర్మాణ కూలీలకు పెద్దనోట్లే.. పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడం కోసం కాంట్రాక్టర్లు పలు చోట్ల కూలీలపై ఒత్తిడి తెచ్చి.. కూలీ సొమ్ముగా పాత పెద్ద నోట్లు ఇస్తున్నారు. ఇలా ఒక రోజు కూలీ చేసి పెద్ద నోట్లు తీసుకుంటే వాటిని మార్చుకోవడానికి మరో రోజంతా బ్యాంకు దగ్గర పడిగాపులు పడాల్సివస్తోందని కూలీలు ఆవేదన చెందుతున్నారు. దాంతో పనులకు వెళ్లడమే మానుకుంటున్నారు. ఇంతకంటే ఆధారంలేదు.. ఈ వయస్సులో ఇంతకంటే పనిచేయలేను. ఏదో చిరు వ్యాపారం పెట్టుకుని రోజంతా అమ్మితే ఇంట్లో గడుస్తుందనే ఆశ. కానీ చిల్లర ఇబ్బందులు వల్ల అమ్మకాలు లేవు. మాలాంటి వారి పరిస్థితిని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. -నారాయణమ్మ, కూరగాయల వ్యాపారి రూ. 500 నోటు తెస్తున్నారు.. చాలా మంది వినియోగదారులు తమకు కావాల్సిన పండ్లు కొనుక్కుని చేతిలో రూ. 500 నోటు పెడుతున్నారు. ఇవి మారవు కదా అంటే డిసెంబర్ 30 వరకు మార్చుకోవచ్చని అంటున్నారు. వాటిని తీసుకుని మార్చుకునే పరిస్థితి మాకు లేక వ్యాపారం నష్టపోవాల్సి వస్తోంది. - వెంకటేశ్వరరావు, వ్యాపారి రోజంతా అమ్మినా కూలి గిట్టలేదు.. కూలి పనికి వెళితే ఎంతో కొంత డబ్బులు చేతిలో పడతాయనే నమ్మకం ఉంది. కానీ పెద్ద నోట్ల రద్దుతో మా వ్యాపారం తారుమారు అరుు్యంది. రోజంతా అమ్మినా కూలి డబ్బులకు సంపాదించడమే కష్టమవుతోంది. -శాంతి, పండ్ల వ్యాపారి వ్యాపారం లేదు.. అప్పు పుట్టదు.. గతంలో రోజుకు రూ. 1,500 వస్తువులు అమ్మేవాడిని. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో రూ.100 కూడా అమ్మడం లేదు. తోపుడు బండితో రోజంతా కాళ్లరిగేలా తిరిగినా కుటుంబాన్ని పోషించుకునేలా ఆదాయం పొందలేకపోతున్నా. -కృష్ణమూర్తి, తోపుడు బండిపై వ్యాపారం చిల్లరతో ‘పెద్ద’వ్యాపారం కేంద్రం ప్రకటించిన మేరకు ఈ నెల 24వ తేదీ వరకూ పెట్రోల్ బంకుల్లో పాత పెద్ద నోట్లు చెల్లుబాటు అవుతారుు. కానీ పెట్రోల్ బంకుల సిబ్బంది వినియోగదారులకు దారుణమైన టోపీ పెడుతున్నారు. పాత రూ.500, రూ.1,000 నోట్లు తీసుకోవడం లేదు, తీసుకున్నా తగిన చిల్లర ఇవ్వడం లేదు. రూ.500 నోటు ఇచ్చి 100 రూపాయల పెట్రోల్ పోరుుంచుకుంటే మిగతా రూ.400 ఇవ్వకుండా... యాభై, వందా కమీషన్ తీసుకుని రూ.300, రూ.350 ఇస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లోనూ.. కొన్ని చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు, దుకాణాలతోపాటు కొందరు వ్యాపారులు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. -
సీవోడీ లావాదేవీలు తగ్గాయ్: స్నాప్‌డీల్
కోల్‌కతా: కరెన్సీ నోట్ల రద్దు వల్ల క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) పేమెంట్స్‌పై ప్రతికూల ప్రభావం పడిందని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ సహవ్యవస్థాపకుడు కూనల్ భల్ తెలిపారు. ఈ-కామర్స్ సంస్థల మొత్తం లావాదేవీల్లో సీవోడీ వాటా 70% వరకు ఉంటుందని, ప్రస్తుతం దీనిలో కొంత క్షీణత నమోదరుు్యందన్నారు. ఈ తగ్గుదల పాక్షికమని, మళ్లీ సీవోడీ బిజినెస్ యథాస్థితికి చేరుతుందని తెలిపారు. నోట్ల రద్ద వల్ల ప్రజలు క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకు తొలి ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని, తద్వారా దీర్ఘకాలంలో ఈ-కామర్స్ పరిశ్రమ కార్యకలాపాలు సులభతరం అవుతాయని భల్ తెలిపారు. -
నోట్ల రద్దు... ప్రకంపనలు క్యాష్తో ముందే వేతనాలివ్వాలి!
• ప్రభుత్వానికి పారిశ్రామిక, వాణిజ్య సంఘాల సూచనలు • నోట్ల రద్దుతో నష్టం జరగకుండా చూడాలని వినతి న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో తక్షణం పడే ప్రభావంపై ఆందోళనతో ఉన్న వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారుు. కొత్త కరెన్సీ నోట్ల రూపంలో ముందస్తుగా వేతనాలు చెల్లించాలని, నగదు కొరతను నివారించేందుకు పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగుల సేవలను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారుు. ఈ మేరకు పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఓ వినతిపత్రం సమర్పించారుు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు పాక్షికంగా లేదా పూర్తిగా వేతనాలను మందుగానే రూ.500 నోట్ల రూపంలో చెల్లించాలని కోరారుు. దీనివల్ల బ్యాంకుల వద్ద క్యూలు తగ్గుతాయని, నగదు మార్చుకునే క్రమంలో ఉద్యోగుల గైర్హాజరు కారణంగా ఉత్పాదకత తగ్గకుండా చూడవచ్చని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. మరోవైపు అసోచామ్ సైతం ఈ విషయంలో ప్రధాని మోదీకి నేరుగా ఓ సూచన చేసింది. వేగంగా నగదు మార్పిడి, నగదు ఉపసంహరణ సాఫీగా జరిగేలా చూసేందుకు బ్యాంకులు రిటైర్డ్ ఉద్యోగులను భారీగా నియమించుకోవాలని అసోచామ్ సూచించింది. సాధారణ ఎన్నికల విధుల కోసం వివిధ శాఖల ఉద్యోగులను నియమించినట్టే ఇప్పుడు బ్యాంకుల్లోనూ వివిధ రకాల ఉద్యోగులను నియమించాలని కోరింది. 25 శాతం పడిపోరుున వ్యాపారం నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపారం 25 శాతం మేర తగ్గినట్టు ట్రేడర్ల సంఘం సీఏఐటీ పేర్కొంది. ఒకవైపు నగదు సరఫరా సాఫీగా కొనసాగేలా చూడడంతోపాటు ఎలక్ట్రానిక్ చెల్లింపులను పెంచే చర్యలను వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరింది.