పోలవరం నిర్వాసితులకూ ‘రాజధాని ప్యాకేజీ’
సీఎంను కోరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పూర్తిగా నష్టపోతున్న 7 మండలాల ప్రజలకు కూడా రాజధాని ప్రాంతాల్లో భూములిచ్చే వారికి అమలు చేసే ప్యాకేజీని వర్తింపచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ తదితరులతో కలసి గురువారం ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.
అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ, కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించే పోలవరం ప్రాజెక్టుకు ఎక్కువగా నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరామన్నారు. పోలవరం నిర్వాసితులను తక్షణం ఆదుకోవాలని కోరామన్నారు.