క్యాన్సర్ రోగికి క్రీడాలోకం చేయూత
కోల్‌కతా: కెప్టెన్ కూల్ ధోని క్యాన్సర్ వ్యాధిగ్రస్తునికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇటీవలే గొంతు క్యాన్సర్‌తో మరణించిన అలీప్ చక్రవర్తి, లివర్ క్యాన్సర్‌తో పోరాడుతోన్న బాపి మజ్హి కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తన గ్లోవ్స్, ప్యాడ్స్‌ను వేలానికి పెట్టనున్నాడు. ఇక్కడి సెంట్రల్ కోల్‌కతా హోటల్లో జూన్ 11న ఈ వేలం జరుగనుంది.
ధోనితో పాటు లియాండర్ పేస్, అజింక్య రహానే, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, మనీశ్ పాండే, బ్రాడ్‌హాగ్, షకీబుల్ హసన్, జులన్ గోస్వామి, ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రి, జేజీ తమ జెర్సీలు, బ్యాట్లు, గ్లోవ్స్ లను ఈ వేలంలో ఉంచనున్నారు.