కూల్ కుచ్చులు...
కొత్త డిజైన్‌లో ఏదొచ్చినా ‘అబ్బో ఎంత కూల్‌గా ఉంది’... అంటారు. ఇప్పుడు సింగిల్పీస్కుచ్చుల కుర్తాలు మార్కెట్లో కూల్ హల్చల్ చేస్తున్నాయి. డిజైన్ చాలా సింపుల్. మీకు మీరే డిజైనర్ అయిపోవచ్చు. వేడుకలో కూల్ అండ్ కలర్ఫుల్గా వెలిగిపోవచ్చు.
పటియాలా, ధోతీ స్టైల్ బాటమ్స్ని ఇప్పటి వరకు చూశాం. ఇప్పుడవే కుచ్చులను కుర్తీలకు పెట్టేస్తున్నారు. ఇలా అందంగా, ప్రెజెంట్ డేస్నికలర్ఫుల్గా మార్చేస్తున్నారు డిజైనర్లు. షల్వార్, కమీజ్‌లు కంఫర్ట్ నుంచి కంటికి ఇంపుగా మార్చే దిశగా డిజైనర్లు ఎన్నో కసరత్తులు చేస్తూనే ఉన్నారు. దీంట్లో భాగంగా డ్రేప్ కుర్తీలు రెడ్ కార్పెట్‌పై తెగ హడావిడి చేస్తున్నాయి. చూపరుల మది దోచేస్తున్నాయి.
కుచ్చుల కుర్తీ...
పైన లాంగ్ జాకెట్ పూర్తి ఎంబ్రాయిడరీతో ఉండగా దానికి అటాచ్ చేసిన ప్లెయిన్ జార్టెట్ క్లాత్ నడుము భాగాన ఫిట్‌గా ఉండి, కింది భాగంలో కుచ్చులు కుచ్చులుగా వదులుగా ఉంటుంది. సాధారణ కుర్తాలతో బోరెత్తిపోయినవారికి ఇప్పుడీ కుర్తీలు తెగ ఆకర్షిస్తున్నాయి.
టాప్ టు బాటమ్...
జాకెట్, బాటమ్ రెండూ ఒకే రంగుతోనూ, పూర్తి కాంట్రాస్ట్ కలర్స్‌తోనూ డిజైన్ చేసుకోవచ్చు. షిఫాన్, జార్టెట్ క్లాత్‌లు కుచ్చులు ఉన్న భాగాన్ని, జాకెట్ భాగానికి వెల్వెట్, బెనారస్, రా సిల్క్... వంటి మంచి ఫాల్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. ఇలా డిజైన్ చేసుకున్న కుర్తాకి బాటమ్‌గా అదే రంగు లేదా పూర్తి కాంట్రాస్ట్ లెగ్గింగ్ ధరిస్తే డ్రేప్డ్ కుర్తా సెట్ అయిపోతుంది.