మహిళతో అసభ్యకరంగా మాట్లాడినందుకు..
అనంతపురం(సోమన్దేవ్పల్లి): సోమన్దేవ్పల్లి మండల కేంద్రంలోని మెయిన్ బజార్లో మిరపకాయ బజ్జీలు అమ్ముకునే మహిళ ఓ తాగుబోతుకు చెప్పుతో బుద్ధిచెప్పింది. మద్యం తాగి ఉన్న వ్యక్తి సదరు మహిళతో అసభ్యకరంగా మాట్లాడటంతో ఆమెకు కోపం వచ్చి చెప్పుతో ఎడాపెడా వాయించింది.
స్థానికులు తాగుబోతును అక్కడి నుంచి పంపించివేయడంతో గొడవ సద్దుమణిగింది. సందట్లో సడేమియాగా కొందరు యువకులు ఈ గొడవను తమ సెల్ఫోన్లలో వీడియో తీసి స్నేహితులకు పంపించి ఆనందిస్తున్నారు. కాసేపు అయిన తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.