చైనా ఆర్మీలో 3 లక్షల మంది కుదింపు
బీజింగ్: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా గురువారం తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి చాటింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులతో బీజింగ్‌లోని తియానాన్మెన్ స్క్వేర్‌లో పరేడ్ నిర్వహించింది.
ఇదే సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన సైన్యం నుంచి 3 లక్షల మంది సైనికులను తగ్గించనున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వెల్లడించారు.