వ్యవస్థను మార్చలేకపోతే అధికారం ఎందుకు
స్పీకర్ కాగోడు తిమ్మప్ప
సాక్షి, బెంగళూరు: కుళ్లిపోయిన పరిస్థితుల్లో ఉన్న వ్యవస్థను మార్చలేకపోతే అధికారంలోకి రావాల్సిన అవసరమేముందని ప్రభుత్వాన్ని స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రశ్నించారు. బెంగళూరులోని కుమారకృపా రోడ్డులో ఆదివారం ఏర్పా టు చేసిన చిత్రసంతె ప్రదర్శనను ఆయన సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైద్యుల కొరతను నివారించడం, ప్రజలకు సరైన వైద్య సదుపాయాలను చేరువ చేయలేకపోతే అధికారంలో ఉండికూడా ఫలితం లేదని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి యు.టి.ఖాదర్‌పై విమర్శలు గుప్పించారు.
ఇక అట వీశాఖ కూడా తానో సార్వభౌమత్వ శాఖగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రా ష్ట్ర ప్రభుత్వంలో ఒక శాఖగా తాము పని చేస్తున్నామన్న స్పృహతో పాటు, అసెంబీ ్లలో రూపొందించే చట్టాలపై కూడా ఆ శాఖలోని వ్యక్తులకు అవగాహన లేకుం డా పోతోందని విమర్శించారు.
మఠాలపై నియంత్రణ కోసం రూపొందించిన బిల్లుపై ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో దానిని వెనక్కు తీసుకోవచ్చని, ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన విషయమని అన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశారు. విధానసౌధలో నవీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.