clearing house
-
క్లియరింగ్ సంస్థలకు క్లయింట్ల నిధులు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను పరిరక్షించే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజా మార్గదర్శకాలను తీసుకువచ్చింది. దీంతో అన్నిరకాల క్లయింట్ల నిధులను ఇకపై స్టాక్ బ్రోకర్లు క్లయరింగ్ కార్పొరేషన్ల(సీసీలు)కు బదిలీ చేయవలసి ఉంటుంది. రోజువారీ ప్రాతిపదికన క్లయింట్ల ఎలాంటి నిధులనూ కలిగి ఉండేందుకు వీలుండదు. వెరసి నగదు, ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు లేదా మ్యూచువల్ ఫండ్స్ ఓవర్‌నైట్ పథకాల యూనిట్ల తనఖా రూపేణా స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సభ్యులు క్లయింట్ల నిధులను సీసీలకు చేర్చవలసి ఉంటుంది. పైన ప్రస్తావించినవి కాకుండా ఇతరత్రా క్లయింట్ల నిధులుంటే కటాఫ్ సమయంలోగా సీసీకి బదిలీ చేయవలసి ఉంటుంది. తాజా మార్గదర్శకాలు 2023 జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఒక సర్క్యులర్ ద్వారా సెబీ తెలియజేసింది. కాగా.. సీసీ నిబంధనలు కలిగిన బ్యాంకుల ద్వారా మాత్రమే ఎఫ్డీఆర్లకు అనుమతి ఉంటుంది. ఇక క్లయింట్ల నిధులకు సంబంధించి ఎంఎఫ్ ఓవర్‌నైట్ పథకాల ద్వారా స్టాక్ బ్రోకర్లకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నట్లు సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. -
సెలవుల్లో కూడా పన్ను చెల్లించొచ్చు
ముంబై: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా పన్ను చెల్లింపుదారుల కోసం ఎంపికచేసిన శాఖలను ఈ నెలాఖరులో మూడురోజులూ తెరిచివుంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) బుధవారం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29 (శనివారం), 31(సోమవారం-ప్రభుత్వం ఉగాది సెలవు ప్రకటించని బ్యాంక్ బ్రాంచీల్లో) ఆయా శాఖల్ని రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంచాలని పేర్కొంది. ఈ నెల 30(ఆదివారం), 31 (సోమవారం) ప్రభుత్వ సెలవు ప్రకటించిన బ్రాంచీల్లో కూడా ఆ రోజుల్లో సాధారణ పని గంటల వరకూ బ్యాంకులను తెరచి ఉంచాలని ఆదేశించింది. భారత ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఆర్థిక సంవత్సరం ముగింపును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ వివరించింది. అంతే కాకుండా ఈ నెల 29, 30, 31 తేదీల్లో అన్ని క్లియరింగ్ హౌజుల్లో ప్రత్యేకమైన క్లియరింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించామని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ అకౌంట్ లావాదేవీల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.