Constitutional
-
రాజ్యాంగాన్ని మోసగించడమే
న్యూఢిల్లీ: కేవలం రిజర్వేషన్ ఫలాలు దోచేయాలనే దుర్భుద్దితో మతం మారిన విషయాన్ని దాచిపెట్టిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని మోసగించడంతో సమానమని అభివర్ణించింది. క్రైస్తవమతంలోకి మారిన తర్వాత కూడా ఒక మహిళ షెడ్యూల్ కులం సర్టిఫికేట్ కోసం తాను ఇంకా హిందువునేనని వాదించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. హిందువు అయిన సి.సెల్వరాణి క్రైస్తవమతం పుచ్చుకుంది. అయితే రిజర్వేషన్ లబ్ది పొందేందుకు, ఉద్యోగి సంబంధిత ప్రయోజనాలు పొందేందుకు తాను ఇంకా హిందువునేనని నమ్మించే ప్రయత్నంచేశారు. అయితే ఆమె నిజంగా క్రైస్తవ మతంలోకి మారిందని, తరచూ చర్చికి వెళ్తూ, క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ, పూర్తి విశ్వాసంతో క్రైస్తవమతాన్ని ఆచరిస్తోందని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో రిజర్వేషన్ కోసం ఆ మహిళ తన మతాన్ని దాచిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘బాప్టిజం పూర్తయ్యాక ఇంకా తాను హిందువును అని మహిళ చెప్పుకోవడంలో అర్థంలేదు. మతం మారాక కూడా రిజర్వేషన్ ప్రయోజనాలే పరమావధిగా ఇలా వ్యవహరించడం రిజర్వేషన్ లక్ష్యాలకే విఘాతం. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న రిజర్వేషన్ల విధానం ఇలాంటి వారితో ప్రమాదంలో పడుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. సెల్వరాణి తండ్రి హిందువుకాగా తల్లి క్రైస్తవురాలు. అయితే సెల్వరాణి చిన్నతనంలోనే బాప్టిజం తర్వాత క్రైస్తవురాలిగా మారారు. అయితే 2015లో పుదుచ్చెరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం పొందేందుకు ఆమె ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించారు. సెల్వరాణి తండ్రి వల్లువాన్ కులానికి చెందిన వ్యక్తి. స్థానికంగా ఈ కులం వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ సెల్వరాణి తండ్రి సైతం దశాబ్దాలక్రితమే క్రైస్తవమతం స్వీకరించారు. దీంతో తల్లిదండ్రులు క్రైస్తవులుకాగా తాను మాత్రం హిందువును అని ఈమె చేసిన వాదనల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది. -
రాజ్యాంగ దినోత్సవం.. ఏపీలో మానవ హక్కుల హననంపై ఆగ్రహం
గుంటూరు, సాక్షి: రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించారు. రాజ్యాంగానికి విరుద్దంగా ఏపీలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక దాడులు, దౌర్జన్యాలపై గళమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి జరుగుతున్న రాజ్యాంగ హననంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో ఇవాళ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రాంతాల వారీగా ఆ వేడుకల్లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..విజయవాడరాజ్యాంగం ప్రతి పౌరుడు కి భద్రత, హక్కులు, స్వేచ్ఛ కల్పించిందికూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉందివైయస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధం చేస్తుందికూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతిలోకి తీసుకొని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుందిసోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవటం దారుణంనల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందుందిఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన జరుగుతుందిప్రజల యొక్క హక్కులు హరించబడుతున్నాయిపెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందివైయస్ జగన్మోహన్ రెడ్డి పై దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందిరాజ్యాంగం అమలు చేయడంలో కుటుంబ ప్రభుత్వం విఫలమైందివిజయవాడ నడిబొడ్డున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ఎందుకు నివాళులర్పించలేదు..?ప్రభుత్వం, అధికారులు వివక్షత చూపిస్తున్నారుసింగ్ నగర్‌లోని తన కార్యాలయంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డివిశాఖపట్నంరాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాలేదు.లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందిరాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు..విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని వైయస్ జగన్ ఏర్పాటు చేశారు..రైల్వే భవనాల నిర్మాణానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించింది.కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి..వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదానీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు.కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకితో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.ఆదానీ సంస్థతో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం.ప్రధాని మోడీ ప్రారంభిస్తారనే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జరిగింది.ప్లాంట్ కు సంబంధించిన భూ కేటాయింపులు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి:::మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తూర్పుగోదావరిరాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దోపిడీ, అక్రమ ఇసుక రవాణా,మద్యం అక్రమ అమ్మకాలు ఎక్కువయ్యాయి.త్వరలోనే తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుంది:::కొవ్వూరులో రాజ్యాంగం 75వ ఆమోద దినోత్సవ సందర్భంగా కొవ్వూరు బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన కొవ్వూరు వైఎస్సార్‌షీపీ కన్వీనర్ తలారి వెంకట్రావుకాకినాడరాష్ట్రంలో గత ఆరు నెలలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన జరుగుతోంది.ప్రత్యార్ధులను అణివేసే దోరణీ చాల నిరంకుశంగా జరుగుతోందితునిలో 17 మందిపై అక్రమ కేసులు పెట్టారుసోషల్ మీడియాలో పోస్ట్ ను లైక్ చేసిన వారిపై నాన్ బెయిల్ కేసులు పెట్టారు.పసుపు చొక్కాలేసుకుని ఉద్యోగాలు చెయ్యోద్దని పోలీసులను కోరుతున్నానుగత 10 ఏళ్ళ కాలంలో వైఎస్ఆర్ సిపి ఒక పర్సంటేజ్ పోస్టులు పెడితే..టిడిపి,జనసేన 99 % అసభ్య పదజాలాలతో పోస్టులు పెట్టారు.తునిలో మామ అల్లుళ్ళ పాలన సాగుతోంది.అల్లుడు గల్లా పెట్టె దగ్గర కూర్చుంటే..మాయ యనమల అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. తునిలో ఘనంగా భారత రాజ్యంగ ఆమోద దినోత్సవం వేడుకల్లో.. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.ఏలూరు75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జెట్టి గురునాథం, ఇతరులు.కృష్ణాపెడన మండలం బల్లిపర్రు అంబేద్కర్ సెంటర్లో 75 వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలుఏలూరు75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కొయ్యలగూడెం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు,పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు.కృష్ణాకానూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో 75వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తిని చక్రవర్తి.ఎన్టీఆర్తిరువూరు పట్టణంలోని బోసు బొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 75వ "భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు,కార్యకర్తలు.విజయనగరంభారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన రాజాం వైఎస్సార్సీపి ఇంచార్జ్ డాక్టర్ తలే రాజేష్.పార్వతీపురం మన్యం మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలువైఎస్సార్కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషగుంటూరుప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు..భారత రాజ్యాంగం రూపకల్పనకు కమిటీ చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యవహరించారు..ప్రపంచ దేశాలలోని అన్ని రాజ్యాంగంలో పరిశీలించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది..చిన్నచిన్న అమెండ్మెంట్స్ మినహా నేటికీ చెక్కుచెదరని విధంగా భారత రాజ్యాంగం ఉంది..న్యాయ వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా, మీడియా వ్యవస్థ అయినా భారత రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి..కాని ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులు తయారయ్యాయి..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక అరాచక, కక్ష సాధింపు పాలన సాగుతుంది..రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలకే పరిమితమైంది..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాలేదు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందిఈ ఐదు సంవత్సరాలు మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరిగే విధంగా ఉంది..మంత్రి నారా లోకేష్ ఎవరిని జైల్లో పెట్టమంటే వారిని పోలీసులు బలవంతంగా అక్రమ కేసులతో అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు..ఒక్కో వ్యక్తిమీద 10, 20, 30 కేసుల వరకు పెడుతున్నారు..బ్రిటిష్ పాలనలో స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారి మీద కూడా ఇన్ని కేసులు పెట్టి ఉండరు..రానున్న రోజుల్లో నారా లోకేష్ దోషిగా నిలబడాల్సి వస్తుంది:::ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం కర్నూలుభారతదేశం గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ఇవాళ కూటమి పాలనలో రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతుందిరాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదుచంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది.గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగింది.ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్య.. కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, మేయర్ బి వై రామయ్యప్రకాశంఈ రోజు సంక్షేమ పథకాలు లేవు, రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రబాబు పాలనఒంగోలు వైస్సార్సీపీ ఇంచార్జీ చుండూరి రవిబాబు, కార్యక్రమంలో పాల్గొన్న సిటీ పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, కుప్పం ప్రసాద్ మరియు కార్యకర్తలు నంద్యాలఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందిప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతోటే ఎన్నికలుజరుగుతున్నాయిమన దేశము మన రాష్ట్రం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్ళకూడదూ, అందరూ ఆలోచించాలిఆత్మకూరు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.సంబంధం లేని కేసులను రాజకీయ నాయకులు కంటగడుతూ పబ్బం గడుపుకుంటున్నారు.రాష్ట్రంలో అమలు అవుతున్న పోలీసులు కూడా రెండు బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారుప్రతి ఒక్క పేద కుటుంబానికి నిత్యవసరమైన సరుకులు కూరగాయలు , నూనె , కందిపప్పు ప్రతి ఒక్కటి రేట్లు విపరీతంగా పెంచేశారుమా ప్రభుత్వంలో నిత్యవసర సరుకులను రేట్లు పెంచామని అబద్ధపు పుకార్లు చేసుకుంటూ రోడ్లెక్కిన ఘనత టిడిపి నాయకులకు చెల్లుతుందిరైతులకు గిట్టుబాటు ధరలు లేకపోతే ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత మా పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది.మీడియా చేతిలో ఉంది కదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.మా పైన పెట్టిన పోస్టింగులు కూడా మేము పోలీసులకు అందజేస్తాం వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి.కేవలం తెలుగుదేశం పార్టీ వారు మా పైన పెట్టిన కేసులు మాత్రమే విచారిస్తారా మా వైఎస్సార్సీపీ నాయకులు పెట్టిన కేసులను విచారించరాకాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అధికారులు కూడా గమనించుకోవాలి మేం అందజేసిన ఫిర్యాదులపై నిజ నిజాలు విచారించి చర్యలు తీసుకోవాలి.పోలీసులు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన విధంగా ఉండకూడదు:::నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డినెల్లూరు జిల్లాగత ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పాటుపడిందని వెల్లడి..స్వరాజ్ మైదానంలో అప్పటి సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు..అంబేద్కర్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి జగన్.రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీలో పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్..కాకాణి నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపల్నాడునరసరావుపేటలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. -
Rahul Gandhi: ఏమీ ఉండదనే చదవలేదనుకుంటా
నందూర్బార్(మహారాష్ట్ర): తాను తరచూ ప్రదర్శించిన ఎరుపురంగు రాజ్యాంగప్రతి అంతా ఖాళీ అంటూ ప్రధాని మోదీసహా అధికార బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు లోక్‌సభలో విపక్ష నేత గట్టి సమాధానమిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నందూర్బాగ్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘‘ రాజ్యాంగ ప్రతి కవర్ ఎరుపు రంగులో ఉందా నీలం రంగులో ఉందా అనేది మనం ఎప్పుడూ చూడలేదు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధపడ్డాం. ఇంతటి ఘనత గల రాజ్యాంగంలో ఏమీ లేదని, ఏమీ ఉండదని ప్రధాని మోదీజీకి గట్టి నమ్మకం కల్గిందేమో. ఎందుకంటే జీవితంలో ఆయన ఎప్పుడూ ఈ రాజ్యాంగాన్ని చదివిఉండరు. ఏమీ ఉండదనే చదవలేదనుకుంటా. అందుకే నేను ర్యాలీల్లో చూపించే ఎరుపురంగు రాజ్యాంగప్రతి లోపల అన్నీ తెల్లపేజీలే అని చెబుతున్నారు. మోదీజీ ఇది ఖాళీ పుస్తకం కాదు. భారతీయ ఆత్మ, జ్ఞానానికి ఆలవాలం ఈ పుస్తకం. బిర్సా ముండా, బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా పూలే, మహాత్మాగాంధీల ఆత్మతో భారత రాజ్యాంగం నిండి ఉంది. అయినాసరే మీరు ఈ పుస్తకం ఖాళీ అని అంటున్నారంటే మీరు వీళ్లందరినీ అవమాని స్తున్నట్లే’’ అని రాహుల్ అన్నారు. ‘‘ ఆదివా సీలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు నిర్ణయాధికారం దక్కాలి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లు గిరిజనులను ఆదివాసీలు అని సంభోదించకుండా వనవాసులు అని పిలుస్తు న్నారు. నీరు, భూమి, అడవిపై తొలి హక్కు దారులు ఆదివాసీలే. ఎలాంటి హక్కులు కల్పించకుండా బీజేపీ ఆదివాసీలను అడవికి పరిమితం చేసింది. బిర్సా ముండా ఇవే హక్కుల కోసం పోరాడి వీరమరణం పొందారు’’ అని రాహుల్ అన్నారు. మేనిఫెస్టోను ప్రస్తావించిన రాహుల్‘‘మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంబీఏ) జనప్రయోజన వాగ్దానాలతో మేనిఫెస్టోను మీ ముందుకు తెచ్చింది. అధికారంలోకి వస్తే మా కూటమి సర్కార్ రైతులు, యువతకు నెలకు రూ.3,000 ఆర్థిక తోడ్పాటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.3,00,000 దాకా రుణమాఫీ, నిరుద్యోగయువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి అందించనుంది. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీల అసలైన జనసంఖ్య తెలిస్తే వారికి ఆ మేరకు వనరుల్లో న్యాయమైన వాట దక్కుతుంది. అందుకు జనగణన ఎంతగానో దోహదపడనుంది. ప్రస్తుతం 80 శాతం గిరిజనుల జనాభాలో నిర్ణాయాత్మక స్థాయి లో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఉన్నారు’’ అని అన్నారు. ఒక్కరే ఆదివాసీ ఆఫీసర్‘‘కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత ఉన్న తాధికారులు 90 మంది ఉంటే వారిలో ఆదివాసీ వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఉదాహరణకు ఈ 90 మంది అధికారులు రూ.100 విలువైన ప్రజాపనులపై నిర్ణయాలు తీసుకుంటే ఆదివాసీ అధికారి నిర్ణయంపై ఆధారపడే పనుల విలువ కేవలం 10 పైసలు. మొత్తంగా చూస్తే పనిచేసే ఆ కొద్ది మంది ఆదివాసీ అధికారులను కీలకమైన శాఖల్లో ఉండనివ్వ రు. అప్రాధాన్యమైన విభాగాల్లో, పోస్టుల్లో నియమిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. మనం ఈ పద్ధతిని మారుద్దాం’’ అని రాహుల్ అన్నారు. -
Supreme Court: రాజ్యాంగబద్ధతను తేలుస్తాం
న్యూఢిల్లీ: మారిటల్ రేప్ నుంచి భర్తలకు రక్షణ కల్పిస్తున్న ఐపీసీ, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని మినహాయింపు నిబంధనల రాజ్యాంగబద్ధతను తేలుస్తామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. భార్య సమ్మతి లేకుండా ఆమెతో భర్త బలవంతంగా సంభోగం జరపడాన్ని మారిటల్ రేప్‌గా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఇది క్రిమినల్ నేరం. భారత్‌లో చట్టాలు దీనికి మినయింపునిస్తున్నాయి. మారిటల్ రేప్ నేరం కాదని భర్తలకు రక్షణ కల్పిస్తున్నాయి. భార్య 18 ఏళ్ల లోపు మైనర్ కాకుంటే మారిటల్ రేప్ నేరం కాదని పేర్కొంటున్నాయి. దీన్ని పలువురు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌పై పిటిషనర్ల ప్రతిస్పందన కోరింది. మారిటల్ రేప్‌ను నేరంగా చేస్తే దాంపత్య బంధంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, వివాహ వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే విషయాన్ని తాజా అఫిడవిట్లో సుప్రీంకోర్టు ముందుంచింది. ‘ఇది రాజ్యాంగబద్ధతకు సంబంధించిన అంశం. ఈ అంశంలో రెండు గత తీర్పులున్నాయి. మినహాయింపును ఇస్తున్న నిబంధనల రాజ్యాంగబద్ధతను తేల్చడమే ముఖ్యం’ అని సీజేఐ చంద్రచూడ్ విచారణ సందర్భంగా అన్నారు. భార్య వయసు 18 ఏళ్ల లోపు కానంతవరకు భర్త ఆమెను బలవంతంగా అనుభవించినా అది నేరం కాదు.. అని బీఎన్ఎస్లో సెక్షన్ 63 (రేప్) మినహాయింపు–2 చెబుతోంది. రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిబంధనను కొట్టివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కరుణా నంది కోరారు. ‘మారిటల్ రేప్‌కు మినయింపు నిబంధన.. ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 19, ఆరి్టకల్ 21 (జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ)కు భంగకరమని మీరు అంటున్నారు. 18 ఏళ్లు పైబడిన భార్యతో భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డా అది రేప్ కాదని మినహాయింపును ఇచి్చనపుడు పార్లమెంటు భావించింది. భర్తలకు రక్షణ కల్పిస్తున్న మినహాయింపును కొట్టివేస్తే అప్పుడా లైంగిక చర్య రేప్ నిర్వచనం కిందకు వస్తుంది. అలాంటపుడు దీన్ని ప్రత్యేక నేరంగా చూడాలా? మినహాయింపు చట్టబద్ధతను తేల్చాలా? అనే సమస్య కోర్టులకు ఉత్పన్నమవుతుంది’అని ధర్మాసనం పేర్కొంది. ‘భర్త డిమాండ్ చేస్తాడు. భార్య నిరాకరిస్తుంది. ఈ సందర్భంలో భర్త ఆమెను నిర్భందిస్తే అది చట్టవిరుద్ధమవుతుంది. ఆమెను గాయపరిస్తే నేరపూరిత బెదిరింపు అవుతుంది. చివరికి భార్య లొంగిపోతే అప్పుడా సంభోగం నేరం కాదు. మిగతావన్నీ నేరాలైనపుడు చివరికి ఎందుకు కాదనేగా మీ ప్రశ్న’ అని జస్టిస్ పారి్థవాలా అన్నారు. ‘కాదంటే కాదనే అర్థం. ఒక మహిళ వద్దు అదంటే వద్దనే అర్థం. వైవాహిక బంధంలో బలవంతంగా సంభోగం జరిపినా అది రేప్ అవుతుంది. కేసు నమోదు చేయాల్సిందే’ అని పిటిషనర్ తరఫున వాదించిన కోలిన్ గొంజాల్వెజ్ అన్నారు. వాదనల తర్వాత కేసు ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది. -
వ్యక్తిగత స్వేచ్ఛే... సుప్రీమ్!
భారత సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పులు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని తేల్చి చెప్పాయి. పీఎమ్ఎల్ఏ, ఉపా వంటి చట్టాల అమలులో వ్యక్తమవుతున్న ఆందోళనల వెలుగులో ప్రాథమిక హక్కుల రక్షణ, సరైన చట్ట ప్రక్రియ ఆవశ్యకతను ఇవి నొక్కిచెప్పాయి. అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియపర్చడం కీలకమైన రాజ్యాంగ భద్రత అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘న్యూస్ క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టును రద్దు చేస్తూనే, విధానపరమైన న్యాయ ప్రాముఖ్యాన్నీ, ఉపా కింద అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియజేసే హక్కునూ ఎత్తిపట్టింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నప్పుడు రాజ్యాంగ హక్కులకు మినహాయింపు ఉండదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.భారత సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పులు... మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎమ్ఎల్ఏ), చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ– ఉపా) వంటి కఠినమైన చట్టాల అమలు సందర్భంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని గట్టిగా నొక్కి వక్కాణించాయి. ఆర్థిక నేరాలను, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి రూపొందించిన ఈ చట్టాలు ఎలా వ్యవహరిస్తున్నాయి అనే విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు గణనీయమైన మార్పు తీసుకొచ్చాయి. చట్టాన్ని అమలు చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య ప్రమాణాలను సమతుల్యం చేయడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను తెలియజేసేలా, మే నెలలో వారంలోపు వ్యవధిలో ఈ తీర్పులు వెలువడ్డాయి. న్యాయబద్ధత, నిర్బంధంలోకి తీసుకునే అధికారాలను ఉపయోగించడంపై వ్యక్తమవుతున్న తీవ్రమైన ఆందోళనల వెలుగులో ప్రాథమిక హక్కుల రక్షణ, సరైన చట్ట ప్రక్రియ ఆవశ్యకతను ఇవి నొక్కిచెప్పాయి.పీఎమ్ఎల్ఏ కింద దాఖలు చేసిన చార్జిషీట్‌పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టిన తర్వాత మే 16న వెలువరించిన కీలకమైన తీర్పులో, వ్యక్తులను అరెస్టు చేసే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఉన్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం కుదించింది. న్యాయస్థానం విచారణ చేపట్టిన తర్వాత, ఫిర్యాదులో పేర్కొన్న నిందితులను ఈడీ అరెస్టు చేయలేదని న్యాయమూర్తులు ఏఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్ ప్రకటించారు. విచారణ సమయంలో అరెస్టు చేయని నిందితులకు వారెంటుకు బదులుగా ప్రత్యేక కోర్టులు సమన్లు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం ఏకపక్ష నిర్బంధాలను నిరోధిస్తుంది. కోర్టుకు హాజరయ్యే వారిని మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం కఠినమైన బెయిల్ ప్రక్రియలోకి నెట్టకుండా హామీనిస్తుంది. నిందితుడి బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అవకాశం ఇవ్వాలని సెక్షన్ 45 నిర్దేశిస్తుంది. అంతేకాకుండా, నిందితుడు నిర్దోషి అనీ, బెయిల్‌పై ఉన్నప్పుడు ఎలాంటి నేరం చేసే అవకాశం లేదనీ విశ్వసించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని ట్రయల్ కోర్టుకు నమ్మకం కలిగించడం అవసరం. ఈ పరిస్థితులు సాధారణంగా మనీ లాండరింగ్ కేసులో నిందితుడు బెయిల్ పొందడాన్ని సవాలుగా మారుస్తాయి. సమన్లు పంపిన తర్వాత హాజరయ్యే నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినట్లయితే, అది సంబంధిత ట్రయల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నేరాన్ని గుర్తించిన తర్వాత ఈడీ చేసే అరెస్ట్ అధికారాలను పరిమితం చేయడం ద్వారా, కోర్టు సమన్లను పాటించిన నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, అయోమయం కలిగించే, కఠినమైన పీఎంఎల్ఏ బెయిల్ ప్రక్రియలో జరిగే దుర్వినియోగాలను పరిష్కరించడం ఈ తీర్పు లక్ష్యం.అదేవిధంగా, ఈడీ అరెస్టులు చేసే ముందు నేరాలను అంచనా వేయవలసిన అవసరాన్ని మే 17న సుప్రీంకోర్టు చేసిన న్యాయపరమైన ఉత్తర్వు నొక్కి చెప్పింది. పీఎమ్ఎల్ఏ కింద నమోదయ్యే నేరాలు ‘పరాన్నజీవి‘ స్వభావంతో కూడి ఉన్నాయనీ, ముందస్తు నేరాల ఉనికి అవసరమనీ ఆ తీర్పు నొక్కి చెప్పింది. ముందస్తు నేరం లేకుండా, పీఎంఎల్ఏ ఆరోపణలు స్వతంత్రంగా నిలబడలేవని న్యాయమూర్తులు సూర్యకాంత్, కేవీ విశ్వనాథన్ నొక్కి చెప్పారు. ముందస్తు నేరంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నిందితుల పేర్లు లేకపోయినా, ఒక కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలను విచారించే ముందుగా ఈడీ ఆ కేసులో అంతర్లీనంగా ఉండే ముందస్తు నేరాలను క్షుణ్ణంగా నిర్ధారించాలని పేర్కొంది. ఆర్థిక నేర పరిశోధనల్లో బలమైన చట్టపరమైన ఆధారం అవసరమని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.ఈ దృక్పథం ఆర్థిక నేర పరిశోధనలలో బలమైన చట్టపరమైన పునాది అవసరాన్ని బలపరిచింది, పవన దిబ్బూర్ కేసులో సుప్రీంకోర్టు 2023 నవంబర్‌లో ఇచ్చిన తీర్పు హేతుబద్ధతను ఇది ముందుకు తీసుకువెళ్లింది. 2023లో కోర్టు నిర్ణయం ప్రకారం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బి కింద శిక్షార్హమైన నేరపూరిత కుట్ర, మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించినంత మాత్రమే అది నేరం కాకూడదు. ఆ కుట్ర పీఎమ్ఎల్ఏ కింద తప్పనిసరిగా షెడ్యూల్ చేసిన నేరంగా నమోదు చేసిన నేరానికి సంబంధించినదై ఉండాలి. మే 15న సుప్రీంకోర్టు తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ‘న్యూస్ క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టును రద్దు చేస్తూనే, విధానపరమైన న్యాయ ప్రాముఖ్యతను, ఉపా కింద అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియజేసే హక్కును ఎత్తిపట్టింది. ఢిల్లీ పోలీసుల విధానపరమైన లోపాలను న్యాయమూర్తులు బీఆర్ గవయీ, సందీప్ మెహతా విమర్శించారు. ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని చెబుతున్న రాజ్యాంగ ఆదేశాన్ని నొక్కిచెప్పారు.భారతదేశ స్థిరత్వం, సమగ్రతకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో చైనా సంస్థల ద్వారా విదేశీ నిధులను స్వీకరించిన ఆరోపణలపై 2023 అక్టోబర్‌లో పుర్కాయస్థను అరెస్టు చేసిన తరువాత ఉపా కింద పోలీసు కస్టడీకి పంపిన తీరుపై సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా విమర్శించింది. ఆయన అరెస్టు, రిమాండ్‌ను ‘రహస్యంగా‘ నిర్వహించారని కోర్టు పేర్కొంది. ‘ఇది చట్టబద్ధమైన ప్రక్రియను తప్పించుకునే కఠోరమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదు; నిందితుడిని అరెస్టు చేసిన కారణాలను తెలియజేయకుండా పోలీసు కస్టడీకి పరిమితం చేశారు. న్యాయవాదుల సేవలను పొందే అవకాశాన్ని నిందితుడికి హరించారు. బెయిల్ కోరడం అనేది నిందితుడి ఎంపిక’ అని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నప్పుడు రాజ్యాంగ హక్కులకు మినహాయింపు ఉండదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనీ లాండరింగ్ చట్టం, ఉపా చట్టం రెండింటిలోనూ అరెస్టుకు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా తెలియజేయాలని కోరడమైనదనీ, ఈ అవసరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1)లో వేళ్లూనుకుని ఉందనీ కోర్టు పేర్కొంది. ఇది తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే అంశంపై ప్రజల హక్కును పరిరక్షిస్తుంది. పంకజ్ బన్సాల్ కేసులో 2023 అక్టోబరు 3 నాటి తీర్పులో ఉపా కేసులకు వర్తించదంటూ ఢిల్లీ పోలీసుల వాదనకు ప్రతిస్పందనగా న్యాయస్థానం ఈవిధంగా ప్రకటించింది. దీని ప్రకారం నిందితులను అరెస్టు చేసేటప్పుడు ఈడీ పత్రబద్ధమైన ఆధారాలను అందించాలి. అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియపర్చడం అనేది కీలకమైన రాజ్యాంగ భద్రత అనీ, పారదర్శకతను, న్యాయాన్ని నిర్ధారించడానికి ఏకరీతిగా దీనిని వర్తింపజేయాలని న్యాయస్థానం నొక్కి చెప్పింది. చట్టాలను అమలు చేసే సంస్థలకు విస్తృతమైన అధికారాలను కల్పించే విధానాలలోని పారదర్శకత, న్యాయమైన ఆవశ్యకతను ఈ తీర్పు పునరుద్ఘాటించింది.వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడానికి, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు తగిన ప్రక్రియకు, న్యాయానికి కట్టుబడి ఉండేలా చేయడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను ఈ తీర్పులు సమష్టిగా సూచిస్తాయి. ఈ నిర్ణయాలు చట్ట నియమాన్ని పటిష్ఠం చేస్తాయి. ఈడీ వంటి ఏజెన్సీలు వ్యక్తిగత స్వేచ్ఛలను గౌరవిస్తూ చట్టపరమైన సరిహద్దుల్లో పని చేసేలా చూస్తాయి. ఈ విధానం ప్రజల హక్కులను పరిరక్షిస్తుంది. ఉగ్రవాదం, ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో కీలకమైన విధులను అందించే చట్టాల అమలు సంస్థల విశ్వసనీయతను, జవాబుదారీతనాన్ని ఏకకాలంలో ఇది పెంచుతుంది.ఉత్కర్ష్ ఆనంద్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
జమిలి ఎన్నికలపై కేంద్రం కసరత్తు.. రాజ్యాంగ సవాళ్లు ఇవే..
ఢిల్లీ:జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్రం కమిటీని నియమించింది. దానికితోడు ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఒకే దేశం- ఒకే ఎన్నికల బిల్లు చర్చకు రానుందని రాజకీయ వర్గాల సమాచారం. బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే జమిలి ఎన్నికలకు సిద్ధపడిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి సరిపడా పోలింగ్ సామాగ్రి మన వద్ద లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలు జరపడానికి రాజ్యాంగ పరంగా కూడా చిక్కులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సవరణలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ‘One Nation One Election’ possible, Constitutional amendment needed: say experts Read @ANI Story | https://t.co/QkRUL3m1Vf#OneNationOneElection #ParliamentSpecialSession pic.twitter.com/AwHG1QF3Gq — ANI Digital (@ani_digital) September 1, 2023 ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే చేయాల్సిన రాజ్యాంగ సవరణలు.. జమిలీ ఎన్నికలకు అనుగుణంగా ఈ ఆరు ఆర్టికల్లలో విధివిధానాలను సవరించాల్సి ఉంటుంది. ► ఆర్టికల్ 83(2): ఈ ఆర్టికల్ ప్రకారం లోక్‌సభ గడువు ఐదేళ్లు. ముందుగా కూడా రద్దు చేయవచ్చు. ► ఆర్టికల్ 85: లోక్‌సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. ప్రస్తుత సభ రద్దు అయిన వెంటనే సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త సభ ఆరంభం అవుతుంది. ► ఆర్టికల్ 172(1): రాష్ట్ర అసెంబ్లీ రద్దు కానంతరవరకు ఐదేళ్ల పాటు గడువు ఉంటుంది. ► ఆర్టికల్ 174(2): కేబినేట్ సూచన మేరకు అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. మెజారిటీ సందిగ్ధంలో ఉన్నప్పుడు గవర్నర్ తన విచక్షణను వినియోగిస్తారు. ► ఆర్టికల్ 356: ఈ ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. అవిశ్వాస తీర్మాణం విపక్షాలు నెగ్గినప్పుడు ప్రభుత్వం రద్దు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో జమిలి ఎన్నికలకు అనుగుణంగా సవరణ చేయాల్సి ఉంటుంది. ► ఈ ఆర్టికల్‌ల సవరణ ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో మూడొంతుల్లో రెండోంతుల సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తప్పనిసరి. పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత సగం రాష్ట్రాల అసెంబ్లీలు దానికి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. వనరుల కొరత.. లోక్‌సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చేలా రాజ్యాంగాన్ని సవరించినా.. ఎన్నికల నిర్వహణకు భారీ వనరులు అవసరమవుతాయి. 25 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVM)లు, 25 లక్షల VVPATలు (ఓటర్-వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) కావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం కేవలం 12 లక్షల ఈవీఎంలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో సిబ్బంది కూడా అవసరమవుతారు. మొదట్లో జమిలీ ఎన్నికలే.. 1967 వరకు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడిన తర్వాత ఈ పద్ధతి ఆగిపోయింది. లోక్‌సభ కూడా మొదటిసారిగా 1971లో షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడింది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. విదేశాల్లో ఇలా.. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీ దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపుతోంది. అక్కడ జాతీయ, స్థానిక స్థానాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. స్వీడన్లో కూడా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్ణీత తేదీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. నేషనల్ లెజిస్లేచర్ (రిక్స్‌డాగ్), ప్రావిన్షియల్ లెజిస్లేచర్ (ల్యాండ్‌స్టింగ్), స్థానిక సంస్థలు/మునిసిపల్ అసెంబ్లీలకు సెప్టెంబర్ రెండో ఆదివారం ఎన్నికలు జరుగుతాయి. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఆర్డినెన్స్
‘ఢిల్లీ ఆర్డినెన్స్’ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ (సవరణ) చట్టం, 2023, ఢిల్లీలో పరిపాలనా రూపాన్ని మారుస్తుంది. ఈ ఆర్డినెన్స్, స్పష్టమైన కారణం లేకుండా, ‘సేవలకు’ సంబంధించి అధికారాలను వినియోగించుకునే వీలును ఢిల్లీ ప్రభుత్వానికి లేకుండా చేస్తోంది. దీనికి బదులుగా, ఇది భారత ప్రభుత్వానికి అపరిమిత అధికారాన్ని ఇచ్చింది. పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిని, మంత్రులను రబ్బర్ స్టాంప్ కంటే తక్కువ స్థాయికి కుదించింది. దీంతో ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం చుక్కాని లేనిదిగా మిగిలిపోయింది. పైగా, ప్రజల అభీష్టం అనేది ఏ మాత్రం విలువ లేనిదిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ పాలన ఎలా ఉంటుందనేది ఆశ్చర్యంగానే ఉంది. అంబేడ్కర్, సుప్రీంకోర్టు అభిప్రాయాలను కలిపి చదివినట్లయితే, దురదృష్టవశాత్తు ఆర్డినెన్స్ రాజ్యాంగ నైతికతను విస్మరించిందని స్పష్టమవుతోంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ 1948 నవంబర్ 4న రాజ్యాంగ సభలో రాజ్యాంగ నైతికత గురించి ప్రసంగించారు. ఆయన ఇలా అన్నారు: ‘‘ప్రజాస్వామ్య రాజ్యాంగం శాంతియుతంగా పనిచేయడానికి రాజ్యాంగ నైతికత వ్యాప్తి ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించినప్పటికీ, దానితో పరస్పరం అనుసంధానితమైన రెండు అంశాలను దురదృష్టవశాత్తు సాధారణంగా గుర్తించలేదు. ఒకటి, పరిపాలనా రూపానికి రాజ్యాంగ రూపంతో దగ్గరి సంబంధం ఉంది. రెండోది, దాని రూపాన్ని మార్చకుండా కేవలం పరిపాలనా రూపాన్ని మార్చడం ద్వారా రాజ్యాంగాన్ని వక్రీకరించగలగడం. ఇలా చేయడం ద్వారా రాజ్యాంగాన్ని అస్థిరపర్చి, రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకించడం కచ్చితంగా సాధ్యమవుతుంది.’’ ఇంత తొందరేల? జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ (సవరణ) చట్టం, 2023, ఢిల్లీలో పరిపాలనా రూపాన్ని మారుస్తుంది. అలాగే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదు. ఆర్డినెన్స్ రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్ట్ నిర్ణయిస్తుంది. పైగా దాని ప్రస్తుత రూపాన్ని సవాలు చేసినప్పుడు, 1991లో జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి కనీసం ఢిల్లీలో అమలులో ఉన్న పరిపాలనా రూపాన్ని అది అధిగమిస్తుందనడంలో సందేహం లేదు. ఒక మార్పు తీసుకురావడంలో ఇంత తొందరపాటు అవస రమా? రాజ్యాంగం ఇచ్చిన అసాధారణ అధికారాన్ని వినియోగించు కోవాల్సిన తక్షణ అవసరం ఉందా? ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అధికారుల నియామకం, నియంత్రణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వా నికీ, భారత ప్రభుత్వానికీ మధ్య ఉన్న వివాదాన్ని, ఆర్డినెన్స్ ప్రకటించడానికి కేవలం ఒక వారం ముందు సుప్రీంకోర్టు పరిష్కరించింది. రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతకుముందు, రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన వివాదంలో, సుప్రీంకోర్టు (2018) రాజ్యాంగ నైతికతను ఈ పదాలలో ప్రస్తావించింది. ‘‘రాజ్యాంగ నైతికత అనేది ఉన్నత స్థాయి సిబ్బందిపై, పౌరు లపై ఒక ముఖ్యమైన తనిఖీ వ్యవస్థగా పనిచేస్తుంది. అపరిమితమైన శక్తిని కలిగివుండి, ఎటువంటి తనిఖీలు, నియంత్రణలు లేకపోతే ప్రజాస్వామ్య ఆలోచనకు విరుద్ధమైన నిరంకుశ పరిస్థితి ఏర్పడుతుంది. అదే మొత్తం ప్రజాస్వామ్య భావనకే విరుద్ధమైనది.’’ కాలు చేతులు లేకుండా... ఈ ఆర్డినెన్స్, స్పష్టమైన కారణం లేకుండా, ‘సేవలకు’ సంబంధించి అధికారాలను వినియోగించుకునే వీలును ఢిల్లీ ప్రభుత్వానికి లేకుండా చేస్తోంది. దీనికి బదులుగా, ఇది భారత ప్రభుత్వానికి అపరి మిత అధికారాన్ని ఇచ్చింది. పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిని, మంత్రులను రబ్బర్ స్టాంప్ కంటే తక్కువ స్థాయికి కుదించింది. అంబేడ్కర్, సుప్రీంకోర్టు అభిప్రాయాలను కలిపి చదివినట్ల యితే, దురదృష్టవశాత్తు ఆర్డినెన్స్ రాజ్యాంగ నైతికతను విస్మరించిందని స్పష్టమవుతుంది. ఇతర నిబంధనలను చూస్తే, ఆర్డినెన్స్ ఢిల్లీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక అథారిటీని ఏర్పాటు చేసే వీలు కల్పిస్తుంది. దీనిని నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అని పిలుస్తారు. ఈ అథారిటీకి పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్, అంటే భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లోని జాబితా పరిధిలోకి వచ్చే ఎంట్రీలు కాకుండా, ఢిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో పనిచేస్తున్న గ్రూప్–ఏ అధికారులకు సంబంధించి హాస్యాస్పదమైన సిఫార్సులు చేసే అధికా రాలు మాత్రమే ఉన్నాయి. అథారిటీకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించినప్పటికీ, సీనియర్ బ్యూరోక్రాట్లుగా ఉన్న మరో ఇద్దరు అధికార సభ్యులు ముఖ్యమంత్రిని తోసిరాజనవచ్చు. అందువల్ల, ముఖ్యమంత్రి పేరుకు నామమాత్రపు అధిపతి. పైగా ఆయన ఢిల్లీ ప్రజల ఎన్నికైన ప్రతినిధి అయినప్పటికీ, ఆయన కేవలం సున్నాకు తగ్గించబడ్డారు. అంతే కాకుండా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుకి అథారిటీ సిఫార్సును ఆమోదించాల్సిన అవసరం లేదు. ప్రజాభీష్టం మాటేమిటి? మరొక క్రూరమైన కోత ఏమిటంటే, సాక్షాత్తూ మంత్రుల మండలి అభిప్రాయాలను ఒక కార్యదర్శి నిరోధించగలగడం. అప్ప టికి అమలులో ఉన్న చట్టానికి అనుగుణంగా మంత్రుల మండలి అభిప్రాయం లేకపోతే గనక, తానుగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోగలిగే అధికారం ఈయనకు దఖలు పడింది. పైగా ఆ అభిప్రాయాన్ని ఆయన తప్పనిసరిగా లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తెచ్చి, దానిమీద ఆయన నిర్ణయాన్ని తీసుకునే వీలు కల్పిస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల చట్టబద్ధతను పరీక్షించే ఇన్విజిలేటర్ లేదా ఎగ్జామినర్ పాత్రను కార్యదర్శి స్వీకరిస్తాడు. కాబట్టి ముఖ్యమంత్రి పాత్ర శూన్యంగా మారిపోవడమే కాకుండా, మంత్రి మండలి కూడా ఆ స్థాయికి దిగజారిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ పాలన ఎలా ఉంటుందనేది ఆశ్చర్యంగానే ఉంది. ఆర్డినెన్స్ ద్వారా న్యాయం ప్రభావితం అవుతుందా? అవును, ఆర్డినెన్స్‌లోని సెక్షన్ 45 డి ప్రకారం, ఏదైనా కమిషన్, చట్టబద్ధమైన అధికార వ్యవస్థ, బోర్డు, కార్పొరేషన్ లో ఎవరైనా ఛైర్పర్సన్, సభ్యుడు లేదా ఆఫీస్ బేరర్‌ను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అంటే తద్వారా భారత ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటుంది. పర్యవసానంగా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ఢిల్లీ మహిళా కమి షన్, ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మొదలైన వాటితో సహా పాక్షిక–న్యాయ అధికారాలను అమలు చేసే చట్టబద్ధమైన సంస్థల నియామకాన్ని భారత ప్రభుత్వమే చేపడుతుంది. ఇది బాలల హక్కులు, స్త్రీల హక్కులు, రవాణా, నీరు, విద్యుత్ మొదలైన రంగాలకు విస్తరించింది. ప్రభావ వంతంగా, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం చుక్కానిలేనిదిగా మిగిలి పోయింది. పైగా, ప్రజల అభీష్టం అనేది ఏమాత్రం విలువ లేనిదిగా మారిపోయింది. ఆర్డినెన్స్ ఆమోదం పొందిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన ఏకగ్రీవ తీర్పును రద్దు చేయడమే ఆర్డినెన్స్ ఉద్దేశ్యం, లక్ష్యం అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలపై, దాని ఎన్నికైన ప్రజాప్రతినిధులపై, రాజ్యాంగంపై కూడా రాజ్యాంగ వంచన రూపంలో వచ్చింది. ఈ మొత్తం కసరత్తు బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడం, ‘‘ప్రజాస్వామ్య రాజ్యాంగం శాంతి యుతంగా పనిచేయడానికి రాజ్యాంగ నైతికత విస్తరణ ఆవశ్యకతను’’ అంగీకరించడంలో పొరబడ్డారా అనే ఆశ్చర్యానికి దారి తీస్తుంది. జస్టిస్ మదన్ బి లోకూర్ వ్యాసకర్త సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి -
రాజదండం – రాజ్యాంగ దండం
నిప్పు కాలుతుంది, అయినా నిప్పు లేనిదే రోజు గడవదు. కాలకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే నిప్పును వాడుకోవాలి. అధికారం కూడా అంతే; అధికారం చెడగొడుతుందనీ, సంపూర్ణ అధికారం సంపూర్ణంగా చెడగొడుతుందనీ ఒక ఆంగ్ల మేధావి సెలవిచ్చాడు. లోకవ్యవహారం సజావుగా సాగాలంటే అందుకు అవసరమైన అధికారాన్ని ఒక వ్యక్తి చేతిలోనో, వ్యవస్థ చేతిలోనో పెట్టక తప్పదు. మళ్ళీ అది చెడుదారి పట్టకుండా అవసరమైనప్పుడు కళ్లేలు బిగించకా తప్పదు. ఒక తెగకు లేదా ఒక ప్రాంతానికి చెందిన జనం సమష్టి ప్రయోజనాల కోసం ఎప్పుడైతే గుంపు కట్టారో అప్పుడే అధికార– నియంత్రణల రెండింటి అవసరాన్నీ గుర్తించారు. ఆ క్రమంలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక కోణంలో చూస్తే మానవచరిత్ర అంతా అధికారమూ, దాని నియంత్రణల మధ్య ఎడతెగని పెనుగులాటే! ఈ పెనుగులాట రూపురేఖలు మన పురాణ ఇతిహాసాలలోనూ కనిపిస్తాయి. దశరథుడు అవడానికి రాజే కానీ పెద్దకొడుకైన రాముడికి పట్టాభిషేకం చేసే స్వతంత్రాధికారం మాత్రం ఆయనకు లేదు. పౌరజానపద పరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. ఆ పౌర జానపదులలో తరుజనులు, గిరిజనులూ కూడా ఉన్నారని రామాయణం చెబుతోంది. దశరథుడికి పౌరజానపదుల ఆమోదం సునాయాసంగా లభించింది కానీ; మహాభారత ప్రసిద్ధుడైన యయాతికి మాత్రం అంత సులువుగా లభించలేదు. తన చిన్న కొడుకైన పూరునికి రాజ్యం అప్పగించాలన్న తన ప్రతిపాదనను అతడు పౌరజానపదుల ముందు ఉంచినప్పుడు, పెద్దకొడుకైన యదువు ఉండగా చిన్నకొడుకును ఎలా రాజును చేస్తావని వారు ప్రశ్నించారు. యయాతి వారిని ఎలాగో ఒప్పించి తన నిర్ణయాన్ని అమలు చేశాడు. ప్రజామోదంతో రాజైన వ్యక్తి ఆ తర్వాత సర్వస్వతంత్రుడై విర్రవీగినప్పుడు అతణ్ణి తొలగించిన ఉదాహరణలూ ఉన్నాయి. మహాభారతంలోని పురూరవుడు, నహుషుడు ఆ కోవలోకి వస్తారు. రాజు ధర్మతత్పరతను ఉగ్గడించే కథలు; ధర్మం తప్పిన రాజూ, అతని రాజ్యమూ కూడా భస్మీపటలమైన కథలూ చరిత్రకాలంలోనూ కనిపిస్తాయి. బెజవాడ రాజధానిగా ఏలిన విష్ణుకుండిన రాజు మాధవవర్మ, తన కొడుకు ప్రయాణించే రథం కింద పడి ఒక పౌరుడు మరణించినప్పుడు కొడుకని చూడకుండా మరణశిక్ష అమలు చేస్తాడు. ‘శిలప్పదికారం’ అనే ప్రసిద్ధ తమిళ కావ్యంలో నాయిక కణ్ణగి తన భర్త కోవలన్ కు పాండ్యరాజు ఒకడు అన్యాయంగా మరణశిక్ష అమలు చేసినప్పుడు ఆగ్రహించి అతని రాజ్యాన్ని బూడిదకుప్ప కమ్మని శపిస్తుంది. శిక్షించే అధికారంతో పాటు తప్పొప్పులను నిర్ణయించే అధికారాన్ని కూడా రాజు గుప్పిట పెట్టుకున్న దశను ఈ కథ సూచిస్తుంది. రాజూ, రాజ్యాధికారమూ, ధర్మబద్ధత, దండనీతి గురించిన భావనలు ఏ ఒక్క దేశానికో పరిమితమైనవి కావు; సార్వత్రికమైనవీ, అత్యంత ప్రాచీనమైనవీ కూడా! ఆధునిక భాషాశాస్త్ర నిర్ధారణలనే ప్రామాణికంగా తీసుకుంటే, ప్రోటో–ఇండో–యూరోపియన్ మూలరూపమైన ‘రెగ్’ అనే మాటే సంస్కృతంలో రాజశబ్దంగానూ, ఇతర ఇండో–యూరోపియన్ భాషల్లో దానికి దగ్గరగా ధ్వనించే ‘రెక్స్’ (లాటిన్) వంటి శబ్దాలుగానూ మారింది. ‘సరళరేఖలా తిన్నగా నడిచేది, నడిపించే’ దనే అర్థం కలిగిన ‘రెగ్’ అనే మాట నుంచే నేటి రెగ్యులేషన్, రెగ్యులర్, రైట్, రీజన్, రెజీమ్ మొదలైన మాటలు వచ్చాయని భాషావేత్తలు అంటారు. రాజశబ్దం ఎంత ప్రాచీనమో, కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న రాజదండం కూడా అంతే ప్రాచీనమూ, సార్వత్రికమూ కూడా! మన పురాణ, ఇతిహాసాలలో రాచరికానికీ, రాజుల నియామకానికీ ఇంద్రుడు బాధ్యుడిగా కనిపిస్తాడు. చేది దేశాన్ని పాలించే వసురాజు విరక్తుడై అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఇంద్రుడు అతణ్ణి తిరిగి రాజ్యపాలనకు ప్రోత్సహించి ఇతర రాజోచిత పురస్కారాలతోపాటు, ఒక రాజదండాన్నీ చేతికిచ్చాడని మహాభారతం చెబుతోంది. ఇలాగే ఇంద్రుడు రాజ్యపాలనకు ప్రోత్సహించిన మరో రాజు – మాంధాత. ధర్మరక్షణను రాజుకు నిత్యం గుర్తు చేస్తూ ఉంటుంది కనుక రాజదండాన్ని ధర్మదండంగా కూడా అన్వయించారు. పట్టాభిషేక సమయంలో రాజుకీ, గురువుకీ మధ్య నడిచే ఒక సంభాషణ ప్రకారం, ‘నన్ను ఎవరూ శిక్షించలే’రని రాజు అంటాడు; అప్పుడు, ‘ధర్మం నిన్ను శిక్షిస్తుంది’ అంటూ గురువు మూడుసార్లు ధర్మదండంతో అతని శిరసు మీద కొడతాడు. ఈ రాజదండం ఆనవాయితీ రోమన్లకూ సంక్రమించింది. వారిలో మొదట్లో వ్యక్తికేంద్రిత పాలన కాక, పౌరకేంద్రిత పాలన– అంటే గణతంత్ర వ్యవస్థ ఉండేది. రాచరికాన్నీ, రాజు అనే మాటనూ కూడా వారు ఏవగించుకునేవారు. ఒక దశలో రోమ్ సైనిక నియంతగా ఉన్న జూలియస్ సీజర్ ఈజిప్టు రాణి క్లియోపాత్రా ప్రేమలో పడిన తర్వాత, అక్కడున్న వ్యవస్థ ప్రభావంతో సింహాసనాన్నీ, రాజదండాన్నీ స్వీకరించాడు. అదే చివరికి అతని హత్యకు దారితీసింది. అధికారమంతా రాజు దగ్గరే పోగుబడే ప్రమాదం తలెత్తినప్పుడు అతణ్ణి అదుపు చేసే సంకేత పాత్రను రాజదండం నిర్వహించి ఉండవచ్చు. ఆధునిక ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ ద్వారా ఆ ప్రమాదాన్ని అరికట్టేందుకు ఆయా వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఏ వ్యవస్థ ఏ హద్దుల్లో ఉండాలో చెప్పే రాజ్యాంగమూ వచ్చింది. అదే నేటి అసలు సిసలు రాజదండం! -
Same Sex Marriage: రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిటిషన్లపై తుది వాదనలను వినేందుకు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది సుప్రీం కోర్టు. ఏప్రిల్ 18వ తేదీన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సమాజంపై భారీ ప్రభావం చూపుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు రాజ్యాంగ హక్కులు, ప్రత్యేక వివాహ చట్టం, ప్రత్యేక శాసన చట్టాలతో ముడిపడి ఉందని తెలిపింది. ఈ కేసుకి సంబంధించిన వాదనలు సుప్రీం కోర్టు వెబ్సైట్లో లేదా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని ధర్మాసనం తెలిపింది. ఇది సమాజంపై ప్రభావం చూపే కీలక అంశం కాబట్టి దీన్ని పరిగణలోని తీసుకోని సరైన తీర్పు ఇవ్వాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. రాజ్యంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం.. ఐగుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ సమస్యను పరిష్కరించడమే సముచితమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇటీవల నలుగురు స్వలింగ సంపర్కులు తమ వివాహాలను గుర్తించడమే గాక తమకు నచ్చి వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కును కల్పించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఐతే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మేరకు ప్రభత్వం తరుఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్వలింగ సంపర్కుల వివాహలను గుర్తిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని అన్నారు. పైగా ఇద్దరు స్త్రీలు లేదా పురుషుల మధ్య జరిగిన వివాహానికి వ్యక్తిగత చట్టాలు లేదంటే రాజ్యంగబద్ధమైన చట్టాల కింద చట్టబద్ధత కల్పించడం గుర్తించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. (చదవండి: పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు.. అదే తేదీన కవిత విచారణ) -
Constitution: పౌరులకు పట్టం కట్టిన పత్రం
నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ... సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మక బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. అందుకే తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోదనీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది. వలస పాలనలో దాదాపు 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మగ్గిన తర్వాత భారత దేశం 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రదేశంగా మారింది. జాతి ఎంతో కష్టపడి సాధించిన ఈ స్వాతంత్య్రం, దీర్ఘకాలం కొనసాగిన పోరాట ఫలితమే. తమ ప్రాణాలను అర్పించిన లేదా తీవ్రమైన నిర్బంధాన్ని చవిచూసిన వేలాదిమంది మన దేశవాసులతో పాటు ఈ పురాతనమైన, ఘనమైన గడ్డమీది సాధారణ పౌరులు కూడా కన్న కలల ఫలితమే ఈ స్వాతంత్య్రం. వలస పాలనకు పూర్వ సహస్రాబ్దంలో అంతర్జాతీయ ఆర్థిక, సాంస్కృతిక శక్తి కేంద్రంగా భారతదేశం గుర్తింపు పొందుతూ వచ్చింది. కానీ, స్వాతంత్య్రం పొందిన నాటికి దారిద్య్ర భారతాన్ని వారసత్వంగా పొందాము. దీంతో భారత నవయువ రిపబ్లిక్‌తో దీర్ఘకాల ప్రయోగంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకించి నిరక్షరాస్యత అలుముకున్న, దారిద్య్రం పేరుకున్న, ఆధునిక ప్రజాతంత్ర వ్యవస్థలు, సంస్థలు లేని మన జాతికి సార్వత్రిక వయోజన హక్కును కల్పించే విషయంలో, ప్రజాస్వామిక ఆదర్శ పాలనను చేపట్టడానికి సంబంధించిన ఆకాంక్షను వ్యక్తపరిచే విషయంలో పలు సందేహాలు అలుముకున్నాయి. అయితే రెండు వేల సంవత్సరాల క్రమంలో ఏర్పడుతూ వచ్చిన మన ప్రజాస్వామిక విలువలను లోతుగా అర్థం చేసుకున్న రాజ్యాంగ నిర్మాతలు... విధ్వంసం తప్పదని జోస్యం చెబుతున్న సంశయ వాదులను చూసి భయపడకుండా గట్టిగా నిలబడ్డారు. రాజ్యాంగ సభ సభ్యులు, మన గ్రామ గణతంత్రాలలో రూపు దిద్దుకుని ఉన్న సాంప్రదాయిక భాగస్వామ్య పాలనా రూపాలను లోతుగా అర్థం చేసుకున్నారు. అయితే అన్నిటికంటే మించి మన రాజ్యాంగ రూపకర్తలకు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమైన విషయాన్ని చెప్పుకొని తీరాలి. సగటు భారతీయ పౌరుల ప్రజాస్వామిక సున్నితత్వంపై వారు సంపూర్ణ విశ్వాసం ఉంచారు. ఇది లేకుంటే భారత్ తనను తాను ఒక ప్రజాస్వామ్య మాతగా న్యాయబద్ధంగానే ప్రకటించుకోలేకపోయేది. ఆధునిక చరిత్రలో ‘అమృత్ కాల్’లోకి జాతి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసేలా మన మార్గాన్ని ప్రకాశవంతం చేసేందుకు మన రాజ్యాంగ పునాదిని రూపొందించిన ఆదర్శాలు, మూల సూత్రాలు నేటికీ బలంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ సభ, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చేసిన నిర్విరామ ప్రయత్నాల వల్లే భారత రాజ్యాంగం మనకు వరప్రసాదమైంది. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. ప్రత్యేకించి రాజ్యాంగాల జీవితకాలం తరచుగా తక్కువగా ఉంటున్న, కొత్తగా విముక్తి పొంది అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో భారత రాజ్యాంగం సాధించిన విజయం సామాన్యమైంది కాదు. భారత రాజ్యాంగం మనసా వాచా ఎల్లప్పుడూ పౌరులందరి ఆత్మగౌరవం, సంక్షేమం కోసం నిలబడింది. దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో ప్రభుత్వ అంగా లన్నీ దశాబ్దాలుగా దోహదం చేస్తూ వచ్చాయి. దీని కారణంగానే మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, దారిద్య్రం, వెనుకబాటుతనం వంటి వాటిని నిర్మూలించి, సమగ్ర అభివృద్ధి, జవాబుదారీతనం, పారదర్శ కత వైపు అలుపు లేని ప్రయాణం సాగించడానికి వీలుపడింది. ఈ క్రమంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, రాజకీయ సుస్థిరతను దేశం సాధించగలుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వావలంబనను, సమానతను, దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని కల్పించే కృషిని ప్రోత్సహిస్తున్న ఆధునిక సంక్షేమ రాజ్యంగా మారడానికి మన ప్రయాణాన్ని భారత రాజ్యాంగం సులభతరం చేసింది. రాజ్యాంగం అంటే ప్రకరణాలు, నిబంధనల సమాహారం మాత్రమే కాదు. భారత రాజ్యాంగపు అత్యంత ప్రధాన అంశం ఏమిటంటే, అది శిలాజం కాదు, ఒక సజీవ పత్రం. దీంట్లో మన జాతి ప్రాథమిక విలువలకు, నాగరికతకు ఆశ్రయమిచ్చే అనుల్లంఘనీయ మైన కేంద్రకం ఉంటుంది. అదే సమయంలో వేగంగా మారిపోతున్న ప్రపంచంలో ప్రజా ప్రయోజనాల డిమాండ్లకు ప్రతిస్పందించేలా ఎప్పటికప్పుడు మార్చుకోగల సరళమైన నిర్మాణాన్ని కూడా ఇది బల పరుస్తుంది. ఈ సరళత వల్లే పార్లమెంటు ఎప్పటికప్పుడు ప్రజా కేంద్ర కమైన రాజ్యాంగ సవరణలను చేయగలుగుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకున్న మనం ఒక జాతిగా ఇంత వరకు సాగించిన ప్రయాణం పట్ల, విభిన్న రంగాల్లో మనం సాధించిన విజయాల పట్ల గర్వపడవచ్చు. ‘అమృత్ కాల్’లోకి మనం ప్రవేశిస్తూ, స్వావలంబనతో కూడిన, బలమైన ఐక్యమైన మహా జాతిగా వచ్చే 25 సంవత్సరాల్లో మారాలనే మన స్వప్న సాకారం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నాము కాబట్టి మన ప్రజల్లో, మన రాజ్యాం గంలో మన విశ్వాసాన్ని మరోసారి ప్రకటించుకునే తరుణం ఇదే. ‘అమృత్ కాల్’లో భాగమైన ‘పంచ ప్రాణ్’ అంటే అర్థం, వచ్చే పాతికేళ్లలో అభివృద్ధి చెందిన భారత్ గురించి మనం చేసుకున్న తీర్మానం మాత్రమే. వలసవాద ఆలోచనా తీరునుంచి బయట పడటం, మన వారసత్పం పట్ల గర్వపడటం, ఐక్యతను, సంఘీ భావాన్ని బలోపేతం చేసుకోవడం, పౌరుల్లో కర్తవ్య పరాయణత్వాన్ని పోషించడం వంటి లక్ష్యాలు... 1949 నవంబర్ 26న మనం చట్ట రూపంలోకి మార్చుకుని ఆమోదించిన రాజ్యాంగ ఆదర్శాలను గుర్తిం చడంలో నిస్సందేహంగా తోడ్పడతాయి. 1931లోనే మహాత్మా గాంధీ రాశారు: ‘‘నైతిక బానిసత్వం నుంచి, ఆధారపడటం నుంచి భారత్‌ను విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను పరితపిస్తాను. అత్యంత నిరు పేదలు సైతం ఇది నా దేశం అని భావించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అగ్రకులం, తక్కువ కులం అనే తేడా లేని భారత్ కోసం నేను శ్రమిస్తాను. అన్ని సామాజిక బృందాలు సామరస్యంతో కలిసి జీవించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అలాంటి భారతదేశంలో అంటరాని తనం అనే శాపానికి తావు ఉండకూడదు. దోపిడీకి గురికావడం కానీ, దోపిడీ చేయడం కానీ లేని ప్రపంచంలో శాంతియుతంగా ఉండగలం. ఇదే నా స్వప్నాల్లో ఉంటున్న భారతదేశం.’’ సామాన్యుడిని కేంద్రస్థానంలో ఉంచగల రాజకీయ సౌర్వభౌమా ధికారం కలిగిన రాజ్యాంగం కోసం స్వాతంత్య్ర సమరం కాలంలోని రాజకీయ నేతలు ప్రయత్నించారు. సామాన్యుడి సంక్షేమం, ఆత్మ గౌరవానికి రాజ్యాంగంలో కీలక స్థానం ఉంటోంది. ‘పంచ ప్రాణ్’ను తీసుకుని, దాని సాకారం కోసం మనస్ఫూర్తిగా పనిచేయగలగాలి. అప్పుడే మన ప్రజాస్వామిక నైతిక విలువలు సంపూర్ణ వికసనాన్ని చూస్తాయి. అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధుల స్వప్నాలను, త్యాగాలను గుర్తిస్తాయి. అప్పుడు మాత్రమే రెండు సహస్రాబ్దాలుగా మనం న్యాయబద్ధంగానే సాధించుకుని ఉన్న అగ్రగామి ప్రపంచ దేశంగా భారతదేశాన్ని తిరిగి నెలకొల్పగలుగుతాము. రాజ్యాంగం ప్రజలకు అధికారం కట్టబెడుతున్నట్లే, ప్రజలు కూడా రాజ్యాంగానికి అధికారం కట్టబెడతారు. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ, సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మకంగా బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. రాజ్యాంగ సభలోని ఒక గొప్ప వ్యక్తి ముందుచూపు, మేధాతత్వం, చాతుర్యం అనేవి రాజ్యాంగానికి రూపురేఖలు దిద్ద డంలో తోడ్పడ్డాయి. తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోద నీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది. గత ఏడు దశాబ్దాల మన ప్రయాణంలోని ప్రతి సంక్లిష్టమైన మలుపులోనూ సామాన్య పౌరులే రాజ్యాంగ ఉన్నతాదర్శాల పట్ల తమ విశ్వాసాన్ని, నిబద్ధతను పునరుద్ధరించుకుంటా వస్తున్నారు. ఓం బిర్లా, వ్యాసకర్త, లోక్‌సభ స్పీకర్ (నేడు భారత రాజ్యాంగ దినోత్సవం) -
నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధమేనా? మళ్లీ తెరపైకి
న్యూఢిల్లీ: దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో తీసుకున్న సంచలన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నల్లధనం, నకిలీ నోట్ల చలామణికి చెక్ పెట్టేందుకంటూ రాత్రికి రాత్రే ప్రకటించిన ఈ నిషేధం పెను దుమారాన్ని సృష్టించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ వివాదాస్పద అంశం వార్తల్లో నిలిచింది. నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రేపు (బుధవారం) సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. దీనికి ఏకంగా నాలుగు రాజ్యాంగ ధర్మాసనాలు అధ్యక్షత వహించనున్నాయి. వివరణాత్మక విచారణ తేదీని బెంచ్ నిర్ణయించే అవకాశం ఉంది. డిసెంబరు 16, 2016న ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించినప్పటికీ ఇంకా బెంచ్‌ను ఏర్పాటు చేయలేదు. కాగా నవంబర్ 8, 2016న ఆకస్మికంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ అనూహ్యంగాఅదే రోజు అర్ధరాత్రినుండి, అప్పటికి చెలామణిలోఉన్న 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని తీసుకున్న బాధ్యతా రాహిత్యమైన ఈ చర్య దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేసిందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. అంతేకాదు ఉన్న నోట్లను మార్చకునేందుకు క్యూలైన్లలో సామాన్య ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నగదు కొరత కారణంగా బ్యాంకుల వద్ద పొడవైన లైన్లు వేచి ఉండలేక కొంతమంది క్యూ లైన్లలోనే ప్రాణాలు కోల్పోయారు. -
Maharashtra political crisis: రాజ్యాంగపరమైన ప్రశ్నలెన్నో!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన, రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లు పార్టీల్లో చీలిక, విలీనం, ఫిరాయింపులు, అనర్హత తదితరాలకు సంబంధించి పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వీటన్నింటినీ విస్తృత ధర్మాసనం లోతుగా మదింపు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలేందుకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి ఉద్ధవ్, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై జస్టిస్ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వాదనలు సాగాయి. సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ ఉద్ధవ్ వర్గం తరఫున, హరీశ్ సాల్వే తదితరులు షిండే వర్గం తరఫున వాదనలు వినిపించారు. ప్రజా తీర్పుకు విలువేముంది: సిబల్ మహారాష్ట్రలో జరిగినట్టు అధికార పార్టీని ఇష్టానుసారం చీలుస్తూ పోతే ప్రజా తీర్పుకు విలువేముందని సిబల్ ప్రశ్నించారు. ‘‘ఫిరాయింపులను నిరోధించే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌కు కూడా విలువ లేకుండా పోతుంది. వేరే పార్టీలో విలీనానికే తప్ప ఇలాంటి చీలికలకు ఫిరాయింపుల నుంచి రక్షణ వర్తించబోదు. అలా కాదని మెజారిటీ సూత్రాన్నే అంగీకరించాల్సి వస్తే దేశంలో ఎన్నికైన ప్రతి ప్రభుత్వాన్నీ సులువుగా కూలదోయవచ్చు. పార్టీల్లో చీలికలను నిషేధిస్తున్న రాజ్యాంగ రక్షణకు అర్థమే ఉండదు. ఇదో ప్రమాదకరమైన పోకడకు దారితీస్తుంది’’ అన్నారు. బీజేపీ నిలబెట్టిన స్పీకర్ అభ్యర్థికి ఓటేసినందుకు షిండే వర్గానికి చెందిన 40 మంది సేన ఎమ్మెల్యేలపై పదో షెడ్యూల్లోని రెండో పేరా ప్రకారం అనర్హత వేటు పడ్డట్టేనని వాదించారు. అంతేగాక వివాదం సుప్రీంకోర్టులో ఉండగా గవర్నర్ కొత్త ప్రభుత్వంతో ప్రమాణస్వీకారం చేయించడమూ సరికాదన్నారు. సీఎంను మారిస్తే కొంపలేమీ మునగవు: సాల్వే సిబల్ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన కొంపలు మునగవన్నారు. నాయకున్ని మార్చాలని పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటే అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఒక్కటై ప్రధానిని కూడా వద్దు పొమ్మని చెప్పవచ్చు. కాబట్టి మహారాష్ట్ర ఉదంతానికి సంబంధించినంత వరకు ప్రజాస్వామ్య సంక్షోభం తదితరాల్లోకి పోకుండా స్పీకర్ ఎన్నిక చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్నదానికే వాదనలు పరిమితం కావాలి’’ అని సూచించారు. ఈ దశలో సీజేఐ జస్టిస్ రమణ స్పందిస్తూ మహారాష్ట్ర ఉదంతం పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తిందన్నారు. ‘‘10వ షెడ్యూల్లో మూడో పేరా తొలగింపు తర్వాత పార్టీలో చీలికకు గుర్తింపు లేకుండా పోయింది. దీని తాలూకు పరిణామాలెలా ఉంటాయో ఆలోచించాల్సి ఉంది. పార్టీ చీలికను గుర్తించే విధానం లేకపోవడం, పార్టీలో మైనారిటీలో పడ్డ నాయకునికి చట్టసభల్లోని తమ పార్టీ నేతను తొలగించే అధికారముందా వంటివన్నీ లోతుగా చర్చించాల్సన అంశాలు. ఇరుపక్షాల వాదనలూ విన్నాక, వీటిలో పలు అంశాలను అవసరమైతే విస్తృత ధర్మాసనానికి నివేదిస్తాం. అందుకే ఏయే అంశాలపై విచారణ జరపాలో ఇరు వర్గాలూ ఆలోచించుకుని జూలై 27కల్లా మా ముందుంచాలి’’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. బలపరీక్ష, స్పీకర్ ఎన్నిక సందర్భంగా పార్టీ విప్‌ను ఉల్లంఘించినందుకు ఉద్ధవ్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న షిండే వర్గం విజ్ఞప్తిపై అప్పటిదాకా ఏ చర్యలూ చేపట్టొద్దని స్పీకర్‌ను ఆదేశించారు. -
రాజ్యాంగ పీఠిక.. వాద వివాదాలు
రాజ్యాంగం తొలి ప్రతిని 1948 నవంబర్ 4వ తేదీన రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికైన సభ్యుడు నజీరుద్దీన్ అహ్మద్ మొదటినుంచీ రాజ్యాంగం చిత్తుప్రతిలో లోపాలను ఎత్తిచూపుతూ ఉండేవారు. ఆయన మాత్రమే కాదు, కె. సంతానం (మద్రాస్), ఆర్ ఆర్ దివాకర్ (బాంబే), మౌలానా హస్రత్ మోహానీ (యునైటెడ్ ప్రావిన్సెస్) కూడా రాజ్యాంగ రచనను పదే పదే విమర్శించేవారు. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ... చట్ట వ్యతిరేకంగా తనను తాను రాజ్యాంగ సంఘం (కానిస్టి ట్యూషన్ కమిటీ)గా మార్చుకున్నదని వ్యాఖ్యానించారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాజ్యాంగ సభ నిర్ణయాలను రచనలో పొందుపర్చడమే కాకుండా... ఆ నిర్ణయాలను సమీక్షించారనీ, కొన్ని చోట్ల వాటికి కొత్తరూపం ఇచ్చారనీ దివాకర్ విమర్శిం చారు. తర్వాతి రోజుల్లో రాజ్యంగ ‘పీఠిక’గా మారిన ‘రాజ్యాంగ లక్ష్య తీర్మానం’ (ఆబ్జెక్టివ్ రిజల్యూషన్) పైనా మోహానీ విమర్శలు కురిపించారు. ఇదంతా ఎందుకంటే ఈ పీఠిక (ప్రియాంబుల్) రాసిం దెవరు అనే ప్రశ్న కోసం. నిజంగా వెంటనే సమాధానం ఇవ్వడానికి వీలుకాని ప్రశ్న ఇది. రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, మార్పులు, చేర్పులు, ప్రసంగాల వివరాలు ఉన్నాయి కానీ... రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుల మధ్య జరిగిన చర్చలు, సవరణ ప్రతిపాదనలు; చేసిన మార్పులు, చేర్పులు; తుది రూపం ఇచ్చేముందు జరిపిన సంప్రదింపులకు సంబం ధించిన సమాచారం లేదు. ఆ వివరాలు ఎక్కడా రాసిలేవు. రాజ్యాంగ సభలో ఈ పీఠికకు తుది రూపంపై చర్చకు ముందు జరిగిన వివరాలూ లేవు. యూపీఎస్సీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేవారంతా పీఠిక ఎవరు రాశారు అనగానే జవ హర్లాల్ నెహ్రూ అని జవాబు ఇస్తారు. దానికి కారణ మేమంటే.... నెహ్రూ ప్రతిపాదించిన ‘లక్ష్య తీర్మాన’మే భావి భారత రాజ్యాంగానికి లక్ష్య, ఉద్దేశ్య ప్రకటనగా రూపొందింది. రాజ్యాంగ రచనాసభలో చర్చించిన వివరాలు లేకపోవడం మోహానీ వంటివారు కొందరు విమర్శించడానికి కారణమైంది. ఇక్కడే అసలు రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతి సేకరించి, అన్ని నియమాలు ఒకచోట గుమిగూర్చి, చర్చకు ప్రాతిపదికగా రూపొందించిన ఘనత రాజ్యాంగ సభ సలహాదారుడైన బిఎన్ రావ్‌కు దక్కుతుందనేవారు ఉన్నారు. తొలి చిత్తు ప్రతి రూప కల్పనలో రావ్ పాత్ర నిర్వివాదాంశం. అయితే పీఠిక కూడా ఆయనే రాశారనడానికి వీలు లేదు. ప్రతి సభ్యుడి ప్రతిస్పంద నను ఆధారంగా చేసుకుని, చాలా జాగ్రత్తగా రాజ్యాంగ వాక్యా లను రచనా సంఘం... ముఖ్యంగా అంబేడ్కర్ నిర్మించారనేది నిర్వివాదాంశం. అయినా వివాదం చేయదలచుకున్న వారికి వివాదం కావచ్చు కూడా! రాజ్యాంగ రచన ఉపసంఘం సమావేశాల కాలంలో చాలా సందర్భాలలో అందరు సభ్యులూ హాజరు కాలేదు. పీఠికా నిర్మాణ సమయంలో రాజ్యాంగ రచనా ఉపసంఘానికి చెందిన నలుగురు మాత్రమే తొలి సమావేశాల్లో పాల్గొన్నారు. ఏ రోజూ వదలకుండా మొత్తం రచనా ఉపసంఘం సమావేశా లన్నింటికీ వచ్చిన ఏకైక వ్యక్తి అంబేడ్కర్ మాత్రమే. కనుక రాజ్యాంగం నిర్మించిన రచనా ఉపసంఘం అధ్యక్షుడు అంబే డ్కర్కే పీఠిక నిర్మాణం ఘనత కూడా చెందుతుంది. అయితే రాజ్యాంగ రచన, పీఠిక రచన రెంటికీ మధ్య సారూప్యత ఉన్నా.. కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ‘ముఖ్య నిర్మాత’ అన్నంత మాత్రాన అన్ని భాగాల రచయిత వారే అవుతారని అనడానికి వీలుండదు. అంబేడ్కర్ రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత చేసిన ప్రసంగం, నెహ్రూ లోక్‌సభలో 6 డిసెంబర్, 1956 (అంబేడ్కర్ నిర్యాణ దినం) నాడు ఇచ్చిన ఉపన్యాసం... రాజ్యాంగ ముఖ్య నిర్మాత అంబేడ్కర్ అనే విషయాన్ని ధృవీ కరిస్తాయి. ‘‘సాధారణంగా రాజ్యాంగ నిర్మాతలలో అంబేడ్కర్ ఒకరు అంటారు. కానీ రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ కన్న ఎక్కువ శ్రద్ధచూపిన వారుగానీ, కష్టపడ్డవారు గానీ మరొకరు లేరు’’ అని నెహ్రూ చాలా స్పష్టంగా ప్రకటించారు. అయితే అంబేడ్కర్ తన చివరి ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాణ ఘనత తనకొక్కడికే ఇవ్వడం సరికాదని ప్రకటించారు. డ్రాఫ్టింగ్ కమిటీలో, రాజ్యాంగ సభలో కూడా అనేక మంది రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారని ఆయన వివ రంగా చెప్పారు. ఈ రకరకాల చర్చల మధ్య రాజ్యాంగ పీఠికకు కర్త ఎవరు అనే విషయం మరుగున పడిపోయింది. ఆకాశ్ సింగ్ రాథోర్ మాత్రం తన పుస్తకానికి ‘‘అంబేడ్కర్స్ ప్రియాం బుల్’’ అని పేరు పెట్టారు. ‘రాజ్యాంగ రహస్య చరిత్ర’ అని కూడా ఉపశీర్షిక తగిలించారు. -మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా వర్సిటీ -
ప్రత్యేక కోర్టులకు రాజ్యాంగబద్ధత ఉందా?
న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం పరిపాటి. అయితే, ఇలాంటి కోర్టులకు రాజ్యాంగబద్ధత ఉందా? అని మద్రాస్ హైకోర్టుకు చెందిన త్రిసభ్య క్రిమినల్ రూల్స్ కమిటీ ప్రశ్నించింది. ప్రత్యేక కోర్టులు నేరస్తుడి కేంద్రంగా కాకుండా నేరం కేంద్రంగా(అఫెన్స్ సెంట్రిక్) ఉండాలని తేల్చిచెప్పింది. వీటిని చట్టసభల్లో శాసనం ద్వారా ఏర్పాటు చేయడం లేదని తప్పుపట్టింది. న్యాయ, కార్యనిర్వాహక విభాగం నిర్ణయాలతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం ఏమిటని వ్యాఖ్యానించింది.త్రిసభ్య కమిటీ తన 80 పేజీల నివేదికను సీనియర్ అడ్వొకేట్ విజయ్ హన్సారియాకు సమర్పించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రత్యేక కోర్టుల అంశంలో సుప్రీంకోర్టు ఆయనను అమికస్ క్యూరీ(విచారణ సందర్భంగా కోర్టుకు సహాయపడే నిష్పక్షపాత సలహాదారు)గా గతంలో నియమించింది. ఈ నివేదికను విజయ్ హన్సారియా సోమవారం సుప్రీంకోర్టుకు అందజేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. రాజ్యాంగబద్ధత లేని ప్రత్యేక కోర్టులతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని త్రిసభ్య కమిటీ తేల్చిచెప్పింది. -
రాజ్యాంగ రాణులు
అది 1946 సంవత్సరం, డిసెంబర్ 9వ తేదీ. న్యూఢిల్లీలోని రఫీమార్గ్‌లో రాజ్యాంగ హాలులో దేశవ్యాప్తంగా మేథోవర్గానికి చెందిన వారు, రాజకీయ నేతలు హాజరయ్యారు. రాజ్యాంగ సభ తాత్కాలిక చైర్మన్ సచ్చిదానంద సిన్హా ఆధ్వర్యంలోని ఈ తొలి సమావేశానికి 192 మంది పురుషులు, 15 మంది మహిళలు హాజరయ్యారు. గత 70 ఏళ్లుగా మన ప్రజాస్వామ్య వ్యవస్థకే దిక్సూచిగా మారిన రాజ్యాంగ రచనకు పునాదులు పడిన సమయంలో 15 మంది మహిళలు కీలక భూమిక పోషించారు. రాజ్యాంగ సభ ఏర్పాటులో దేశంలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యమివ్వాలని భావించారు కానీ మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. రాజ్యాంగ సభలోని మహిళలంతా అగ్రకులాలు, సంపన్నవర్గాలు, అధిక విద్యావంతులే ఉన్నారు. ఒక ముస్లిం, ఒక దళిత మహిళకు మాత్రమే రాజ్యాంగ సభలో చోటు లభించింది. సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్, సుచేతా కృపలాని, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ వంటి ప్రముఖులతో పాటు హంస మెహతా, రేణుక రే, నీరజ గోపాల్ వంటి వారూ ఉన్నారు. రాజ్యాంగ ముసాయిదాలో మహిళా హక్కులు, భద్రత ప్రముఖంగా ఉండాలని వీరంతా పోరాటం చేశారు. వీరిలో దాక్షాయణి అనే దళిత మహిళ అందరి కంటే వయసులో చిన్న. ఆమె వయసు అప్పటికి 34 ఏళ్లు. కేరళలో అణచివేతకు గురైన పులయా కులానికి చెందిన దాక్షాయణి.. భారత్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి దళిత మహిళగా రికార్డు సృష్టించారు. మహిళల రక్షణ కోసం తీసుకునే చర్యల కోసం దాక్షాయణి రాజ్యాంగ సభలో పెద్ద పోరాటమే చేశారని ఆమె కుమార్తె మీరా చెబుతుంటారు. రాజ్యాంగానికి మెరుగులు దిద్దే క్రమంలో దాక్షాయణి రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగాలే 1948 నవంబర్‌లో అంటరానితనాన్ని నిషేధించాయి. మరో ముస్లిం మహిళ రసూల్..ముస్లిం లీగ్‌ను వీడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లోకి వచ్చారు. మైనారిటీ హక్కులపై పోరాటం చేశారు. ముస్లింలకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్లు వచ్చాయి. కానీ వాటిని వదులుకోవడానికి కృషి చేశారు. చివరికి వెనుకబడిన కులాలకే రిజర్వేషన్లు కల్పించడానికి సభ అంగీకరించింది. -
పుతిన్: గతమా? శాశ్వతమా?
రష్యా అధ్యక్షుడిగా పుతిన్ సుదీర్ఘకాలం కొనసాగాలనుకుంటున్నారా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా తెరమీదకు తెచ్చి న రాజ్యాంగ సంస్కరణలు అదే విషయాన్ని ఖరారు చేస్తున్నాయంటున్నాయి రష్యాలోని ప్రతిపక్షాలు. చట్టసభలనుద్దేశించి పుతిన్ చేసిన వార్షిక ప్రసంగం సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. నిజానికి పుతిన్ పదవీకాలం 2024 వరకు కొనసాగనుంది. తాజాగా పార్లమెం టు సాక్షిగా పుతిన్ తన ప్రసంగంలో తన ఆలోచనలను ప్రజల్లోకితీ సుకెళుతున్నట్టు ప్రకటించారు. నేషనల్ ఓటింగ్ ద్వారా తన ప్రతిపాదనలను ప్రజామోదానికి ఉంచనున్నట్టు కూడా తేల్చి చెప్పారు. దీనికి ప్రజామోదం లభిస్తే శాశ్వతంగా పుతిన్ అధ్యక్ష పదవిలో కొనసాగే వీ లుంటుంది. పుతిన్ ఆలోచనల కొనసాగింపుగానే ద్విమిత్రి మెద్వదేవ్ తన ప్రభుత్వమంతా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రష్యా ప్రధానిగా ఉన్న ద్విమిత్రి మెద్వదేవ్ పుతిన్‌కి కావాల్సిన వ్యక్తి కావడం, గతంలో రష్యా అధ్యక్షుడిగా ద్విమిత్రి పనిచేసినప్పుడు ఆయ న్ను వెనుకుండి నడిపించింది కూడా పుతిన్ కావడం గమనార్హం. కాగా, రష్యాలో జీవితకాలం ఏకఛత్రాధిపత్యం కొనసాగించేందుకే పుతిన్ ఈ సంస్కరణలను తెరపైకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పుతిన్ ప్రతిపాదించిన రాజ్యాంగ సంస్కరణలివే.. 1. రెండుసార్లకు మించి ఎవరూ అధ్యక్షుడిగా ఉండకూడదు. 2. అధ్యక్ష పదవిలో ఉండేవారికి కఠిన నిబంధనలు అమలు చేయడం.. ఉదాహరణకు ద్వంద్వ పౌరసత్వం ఉండేవారిని దీనికి అనర్హులుగా చేయడం, 25 ఏళ్లపాటు రష్యాలో నివసించినవారై ఉండడం. ఇతర దేశాల్లో శాశ్వత నివాసమేర్పర్చుకున్న వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించడం. 3. అంతర్జాతీయ చట్టాల ప్రభావాన్ని తగ్గిస్తూ రష్యా రాజ్యాంగానికే ప్రాధాన్యతనివ్వడం. 4. 2000 సంవత్సరంలో పుతిన్ తొలిసారి ఎన్నికైనప్పుడు అతను స్థాపించిన సలహా సంస్థ అధికారిక పాలకమండలిని బలోపేతం చేయడం. సలహామండలిగా వ్యవహరించే స్టేట్ కౌన్సిల్ (ప్రస్తుతం పుతిన్ దీనికి సారథ్యం వహిస్తున్నారు) పాత్రను, పరిధిని పెంచడం. 5. చట్టసభల సభ్యులు, క్యాబినెట్ మినిస్టర్స్, న్యాయమూర్తులు, ఇతర అధికారులు ద్వితీయ పౌరసత్వం కలిగి ఉండకూడదు. వీరికి విదేశాల్లో శాశ్వత నివాసం ఉండరాదు. 6. రష్యా దిగువ సభ ‘స్టేట్ డ్యూమా’కు ప్రధానిని, మంత్రివర్గాన్ని నియమించే ప్రత్యేక కీలక బాధ్యతలు అప్పగించడం. 7. అన్ని భద్రతా సంస్థల అధిపతులను నియమించడంలో అధ్యక్షుడి సలహాల మేరకు నిర్ణయం తీసుకునే అధికారాన్ని సెనేటర్స్కి అప్పగించడం. 8. అగౌరవప్రదమైన న్యాయమూర్తులను అధ్యక్షుడి సలహా మేరకు తొలగించే అధికారాన్ని సెనేటర్లకు ఇవ్వడం. 9. ముసాయిదా చట్టాలను ఆమోదించేముందు అధ్యక్షుడి కోరిక మేరకు వాటిని సమీక్షించే అధికారాన్ని న్యాయమూర్తులకు ఇవ్వడం. 10. రష్యాలోని కనీస వేతనాలను దారిద్య్రరేఖకన్నా అధికంగా ఉంచడం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా పెన్షన్లను సర్దుబాటు చేయడం. -
దేశం కష్ట కాలంలో ఉంది
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగబద్ధమైందేనని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దేశం ప్రస్తుతం కష్ట సమయంలో ఉందనీ, హింసాయుత పరిస్థితులకు బదులుగా శాంతిని నెలకొల్పేందుకు కృషి జరగాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. సీఏఏ రాజ్యాంగబద్ధమైందేనంటూ ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ బాబ్డే, జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ విచారించింది. సీఏఏ విషయంలో జోక్యం చేసుకుని, ఈ చట్టం రాజ్యాంగ బద్ధమయిందేనని ప్రకటించాలని, దీనిని అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించాలంటూ పిటిషనర్ తరపు లాయర్ వినీత్ ధండా కోరారు. రాజకీయ నేతల కారణంగా చట్టంపై ప్రజల్లో ఏర్పడిన సందిగ్ధాన్ని తొలగించేందుకు కోర్టు సాయపడాలన్నారు. స్పందించిన ధర్మాసనం.. సీఏఏకు అనుకూలంగా వచ్చిన ఈ పిటిషన్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం హింసాయుత ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ముందుగా శాంతియుత వాతావరణం ఏర్పడాలి. ఒక చట్టం చట్టబద్ధతను కోర్టులు నిర్ణయించగలవే తప్ప, అవి రాజ్యాంగబద్ధమని ప్రకటించజాలవు. కానీ, సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ముందుగా విచారణ చేపడతాం’అని పేర్కొంది. సీఏఏ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను 22వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. -
రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు
బంకురా/పురూలియా/అజాంగఢ్/అలహాబాద్: ప్రధానిగా తనను అంగీకరించబోనని చెప్పడం ద్వారా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రధానిగా గుర్తించని మమత.. ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ ప్రధానిగా గుర్తించడాన్ని గౌరవంగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే మమత భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని స్పష్టం చేశారు. బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ, మమతా బెనర్జీతో పాటు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మీ చెంపదెబ్బలే నాకు దీవెనలు.. మమతా బెనర్జీ వాడుతున్న భాషను చూస్తేనే ఆమె ఎంత ఆందోళనలో ఉన్నారో అర్థమవుతుందని మోదీ తెలిపారు. ‘మమతా దీదీ నన్ను చెంపదెబ్బ కొట్టాలని అనుకుంటున్నట్లు విన్నాను. నేను మిమ్మల్ని(మమత) అమితంగా గౌరవిస్తున్నా. దీదీ(అక్కా) అని పిలుస్తున్నా. కాబట్టి మీరు కొట్టే చెంపదెబ్బలు నాకు దీవెనల వంటివి. మమతా బెనర్జీకి నిజంగా ధైర్యముంటే ముందుగా బెంగాల్లో చిట్‌ఫంట్ నిర్వాహకులు, ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడే వారి చెంపలు వాయించాలి. అప్పుడే టీఎంసీ అంటే తృణమూల్ దోపిడీదారుల(టోలాబాజ్) పన్ను అనే అపప్రద తొలగిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మమతా బెనర్జీ చెంపదెబ్బలతో పాటు తనను రాళ్లతో కొట్టడం గురించి మాట్లాడుతున్నారని మోదీ విమర్శించారు. ప్రతిపక్షాల దూషణలు తనకు అలవాటు అయిపోయాయనీ, ప్రపంచంలోని డిక్షనరీలన్నింటిలో ఉన్న తిట్లను కూడా అరిగించుకునే శక్తి వచ్చిందని చెప్పారు. ‘ఉపాధి’ కూలీలనూ వదిలిపెట్టలేదు.. పశ్చిమబెంగాల్లో పేరుకే టీఎంసీ ప్రభుత్వం నడుస్తోందనీ, అసలు వ్యవహారాలన్నింటిని తెరవెనుక సిండికేట్ నడిపిస్తోందని మోదీ ఆరోపించారు. ‘ఈ దోపిడీదారుల కారణంగా రాష్ట్రంలోని టీచర్ల నుంచి మేధావుల వరకూ, వ్యాపారుల నుంచి నిరుపేదల వరకూ అందరూ వేధింపులు ఎదుర్కొంటున్నారు. వీరు చివరికి జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ) కూలీలను కూడా వదిలిపెట్టడం లేదు. ఈ కార్మికుల జాబ్‌కార్డులను కూడా లాక్కుంటున్నారు. పేద ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసరాలు అందించేందుకు కేంద్రం భారీగా నిధులను అందజేస్తుంటే వాటిని కూడా ఈ దోపిడీదారులు లూటీ చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత తన అధికార దాహంతో పశ్చిమబెంగాల్‌ను సర్వనాశనం చేశారనీ, ఇప్పుడు అధికారాన్ని కోల్పోతానన్న భయంతో మరింత నష్టం చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు. కిచిడీ కూటమికి ఓటేస్తే అంతే.. విపక్షాలు ఏర్పాటుచేసిన మహాకూటమికి ఓటేస్తే దేశభద్రత ప్రమాదంలో పడుతుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ కిచిడీ కూటమికి ఓటేస్తే దేశంలో అరాచకత్వం, అస్థిరత నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బీజేపీ అధికారంలోని రాకముందు ఉగ్రదాడులు అనగానే అజాంగఢ్(యూపీ) పేరు వినిపించేది. ఎందుకంటే ఉగ్రమూకలకు సాయంచేసే వ్యక్తులకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నేతల ఆశీస్సులు ఉండేవి. వీరు అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి కులం, మతం, జాతి వంటి అంశాలను పరిశీలించేవారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉగ్రవాదాన్ని జమ్మూకశ్మీర్, సరిహద్దులోని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగాం. ఈ సరికొత్త భారతం ఉగ్రవాదులను వారి ఇళ్లలో దూరి హతమారుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. కాళీమాతకు భయపడండి టీఎంసీ నేతల అకృత్యాలపై తాను మాట్లాడితే మమతా బెనర్జీకి కోపం వస్తోందని మోదీ అన్నారు. కానీ తాను ఈ కోపానికి భయపడబోననీ, ఎందుకంటే 130 కోట్ల మంది భారతీయుల ప్రేమ తనతో ఉందని వ్యాఖ్యానించారు. ‘పశ్చిమబెంగాల్లో చిట్‌ఫండ్ మోసాల కారణంగా సర్వస్వం కోల్పోయిన పేదలు, నిరుద్యోగ యువకులు ఆగ్రహించడంపై మమత భయపడాలి. దుర్గామాత భక్తులు పూజ చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. దీనివల్ల కాళీమాత ఆగ్రహిస్తుందని మమత భయపడాలి. టీఎంసీ నేతలు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ద్వారా యథేచ్ఛగా సంపాదిస్తున్నారు. కానీ కార్మికులకు మాత్రం కనీస వేతనం చెల్లించడం లేదు’ అని ప్రధాని విమర్శించారు. ఓవైపు మమత తన మేనల్లుడి రాజకీయ భవిష్యత్‌ను తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉంటే, మరోవైపు మంత్రులు, టీఎంసీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారనీ, ఆ పార్టీ కార్యకర్తలు బలవంతపు వసూళ్లకు దిగుతున్నారన్నారు. ఫొని తుపాను సందర్భంగా తాను ఫోన్‌చేసినప్పటికీ మమత స్పందించలేదన్నారు. మే 23తో బెంగాల్లో మమత పాలన ముగుస్తుందని జోస్యం చెప్పారు. -
చంద్రబాబు తూట్లు పొడిచారు
ప్రొద్దుటూరు : చంద్రబాబు నాయుడు రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం మైదుకూరు రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ భారత జాతి యావత్తుకు ఈ రోజు నిజమైన పండుగ అని అన్నారు. అంబేడ్కర్ చూపిన మార్గంలోనే మనమందరం నడుస్తున్నామని, ఈ జాతికి దిశ, దశ నిర్మించింది ఆయనేనన్నారు. చక్కటి ప్రజాస్వామ్యాన్ని రూపకల్పన చేసిన ఘనత ఆ మహానుభావుడిదేనని తెలిపారు. మంచి ఆశయాలతో రూపకల్పన చేసిన రాజ్యాంగం నేడు కొన్ని ప్రభుత్వాలు, కొందరి నేతల వల్ల పలుమార్లు మరణిస్తోందన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో జరిగిన రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు అంబేడ్కర్ ఆత్మ ఎన్నో మార్లు ఘోషించి ఉంటుందన్నారు. స్వయంగా చంద్రబాబే ఎస్సీ, ఎస్టీ కులంలో జన్మించాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నారంటే అది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మంత్రి ఆది దళితులు అపరిశుభ్రమైన మనుషులని, వారు మారరని మాట్లాడి దళిత జాతిని అవహేళన చేశారన్నారు.ఈ నాయకులకు దళిత ఓట్లు మాత్రం కావాల్సిందేనన్నారు. సింహాసనం ఎక్కడానికి, ఊగడానికి వారి అవసరం మాత్రం ఉంటుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు దళితులు సమాజంలో అభివృద్ధి చెందలేదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి జీవితాలు పూర్తిగా మారకపోవడం పట్ల విచారం, బాధను వ్యక్తం చేస్తున్నానన్నారు. నేటికీ దళితులు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీ«ధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఆయిల్‌మిల్ ఖాజా, దాదాపీర్, జాఫర్, రఫి, సోములవారిపల్లె శేఖర్, ఎంపీటీసీ సభ్యుడు ఓబుళరెడ్డి, వెల్లాల భాస్కర్, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మల్లికార్జున ప్రసాద్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, జింకా విజయలక్ష్మి, రాచంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, కౌన్సిలర్ శివకుమార్ యాదవ్ పాల్గొన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తూ పరాయి పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను డబ్బు పెట్టి కొనుగోలు చేయడంతోపాటు వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి నాయకులకు అంబేడ్కర్ లాంటి గొప్ప నేతల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా అర్హులకు దక్కాల్సి ఉందన్నారు. ఇది రాజ్యాంగ హక్కు అని తెలిపారు. అయితే చంద్రబాబు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి అర్హులను పక్కనపెట్టి అనర్హులకు లబ్ధి చేకూర్చుతున్నారని విమర్శించారు. దీనికి ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం రూ.కోట్లు ఖర్చు చేసి ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో వరుసగా అనేక చోట్ల దళితులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని జానకి పేట గ్రామంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలిచారని టీడీపీ నేతలు దళితులను చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు. తాజాగా కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెలో పారిశుద్ధ్య పనులు చేయలేదని గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఇంతటి నీచమైన చర్యలకు పాల్పడినా ప్రభుత్వం మాత్రం కేసులు నమోదు చేయలేదన్నారు. -
రోజా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం
-
'అది తప్పేం కాదు.. వారు చేసిందే మేం చేస్తాం'
న్యూఢిల్లీ: ఢిల్లీకి పూర్తి స్ధాయిలో రాష్ట్ర హోదా కల్పించే అంశంపై ప్రజాభిప్రేయ సేకరణ జరపడం(రిఫరెండం) రాజ్యాంగ విరుద్ధమేమికాదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత దిలీప్ పాండే అన్నారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ డిమాండ్‌ను తెరమీదకు తెచ్చాయని తెలిపారు. అదే విషయాన్ని తాము డిమాండ్ చేస్తున్నామని ఇందులో ఏమాత్రం తప్పులేదని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1993 తొలిరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ, భారతీయ ఈ డిమాండ్ తీసుకొచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఈ అంశంపై మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ అంటున్న ఢిల్లీ పూర్తి రాష్ట్ర హోదా ప్రజాభిప్రాయ సేకరణ అంశం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దీనివల్ల చాలా అనర్ధాలు జరుగుతాయని, అపాయం అని అన్నారు. దీంతో ఆప్ నేత వివరణ ఇచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో నిరంతర విభేదాలు పలు అధికారాలు స్వతంత్రంగా చెలాయించలేకపోయిన నేపథ్యంలో దానికి ఏకైక పరిష్కారం ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా అని ఆలోచించి ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత కేబినెట్ సమావేశంలో నొక్కి చెప్పారు. -
'ఆపార్టీ నేతలే వ్యతిరేకించటం హాస్యాస్పదం'
పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనకు ముందే ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. 1956కు ముందు ముంపు మండలాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన తెలంగాణ నేతలకు హితవు పలికారు. పోలవరం ఆర్డినెన్స్ వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. గత కాంగ్రెస్ హయాంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అలాంటిది ఆ పార్టీ నేతలే వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సంగతి ఈ సందర్బంగా వెంకయ్య గుర్తు చేశారు. పోలవరం ఆర్డినెన్స్ ఆమోదంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని ఆయన స్సష్టం చేశారు. పోలవరం బిల్లుపై మరింత లోతైన చర్చ జరిగితే బాగుండేదని వెంకయ్య అభిప్రాయపడ్డారు.