Cops raid
-
పార్కులో కూర్చుంటే జరిమానా
సాక్షి, కృష్ణరాజపురం: మా సేవలు ఊరికే రావు. ప్రజలకు భద్రత కల్పించాలంటే.. చాలా ఖర్చవుతుంది అన్నట్టుగా ఉంది కొందరు ఖాకీల వ్యవహారశైలి. వారి వల్ల నిజాయతీగా పనిచేసేవారిని కూడా అనుమానంతో చూసే పరిస్థితి నెలకొంది. ఐటీ సిటీలో సంపిగెహళ్లి, ఆడుగోడి పోలీసులు ప్రజల నుంచి డబ్బు తీసుకోవడం రచ్చ కావడం మరిచిపోకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. ఉద్యానవనంలో కూర్చుని ఉన్న స్నేహితులను ఓ కానిస్టేబుల్ బెదిరించి వారి వద్ద నుంచి రూ. 1000 వసూలు చేశాడు. ఫొటోలు తీసి, డబ్బు ఇవ్వాలని.. వివరాలు.. జనవరి 29వ తేదీన నగరంలోని వైట్‌ఫీల్డ్ వద్ద కుందళహళ్లిలో ఉన్న ఉద్యానవనంలో ఆర్ష లతీఫ్ అనే యువతి, స్నేహితునితో కూర్చుని ఉంది. కులాసాగా మాట్లాడుకుంటూ ఉండగా ఒక కానిస్టేబుల్ వచ్చి వారిని తన మొబైల్‌తో ఫొటోలు తీయసాగాడు. ఇక్కడ పార్కులో ఏం చేస్తున్నారు?, ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు అని వారిని గదమాయించాడు. తాము ఏమీ చేయడం లేదని, ఊరికే కూర్చుని ఉన్నామని చెప్పారు. పార్క్‌లో కూర్చోడానికి కూడా పర్మిషన్ కావాలా? అని యువతీ యువకుడు అడిగారు. దాంతో కానిస్టేబుల్.. ఏమిటీ రూల్స్ మాట్లాడుతున్నారు? రండి స్టేషన్‌కు వెళదాము, అక్కడ అన్నీ బయటకి వస్తాయని బెదిరించారు. ఇక్కడే అయితే రూ. వెయ్యి జరిమానా కట్టి వెళ్లిపోండి. స్టేషన్‌కు వస్తే మీకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించి, వారి వద్ద నుంచి రూ . వెయ్యి ఫోన్ పే ద్వారా వేయించుకున్నాడు. తరువాత తమ బాధాకర అనుభవం ఇదీ యువతి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ బాగోతంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు పోలీస్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. (చదవండి: వధువు కావాలా.. నాయనా?) -
మహిళా శక్తి
సాక్షి, అమరావతిబ్యూరో: ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలు, మహిళలు గడప దాటాలంటేనే భయం.. యువతులు కాలేజీకి వెళితే ఈవ్‌టీజింగ్.. సినిమాకు వెళితే ఆకతాయిల వేధింపులు.. మహిళలు ఆఫీసుకు వెళితే బాసుల అసభ్య ప్రవర్తన.. ఇలా ఎటుచూసినా ఏదొక రూపంలో మహిళలు మగవారితో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి బెడద ఇకపై బెజవాడ మహిళలకు ఉండబోదు. పోలీసు శాఖ అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ‘శక్తి మొబైల్ కాప్స్’ పేరిట మహిళా పోలీసు బృందాలను రంగంలోకి దింపనుంది. వీరి రాకతో భవిష్యత్‌లో బెజవాడమహిళలు నిశ్చింతగా ఉండొచ్చని పోలీసులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే ఉద్దేశంలో భాగంగా డీజీపీ ఠాకూర్ ‘శక్తి మొబైల్ కాప్స్’కు రూపకల్పన చేశారు. అందులో భాగంగా తొలుత బెజవాడను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం ‘శక్తి మొబైల్ కాప్స్’ టీమ్‌లు రాజధాని రహదారులపైకి రానున్నాయి. పోలీసు శాఖ నేతృత్వంలో బెజవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో తొలిసారి పైలెట్ ప్రాజెక్టు కింద ఈ ‘శక్తి’ టీమ్‌లను నియమించనున్నారు. మహిళల రక్షణ బాధ్యతలు చూసే ఈ టీమ్ సభ్యులకు పోలీసు శాఖ ప్రత్యేక శిక్షణను ఇస్తోంది. శిక్షణ కార్యక్రమం పూర్తయిన వెంటనే వీరు రంగంలోకి దిగనున్నారు. ఐదు టీమ్‌ల ఏర్పాటు.. నగర కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ఐదు బృందాలను నియమించనున్నారు. ఒక్కో బృందంలో ఐదుగురు మహిళా పోలీసులు ఉంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి విధులు అప్పగిస్తారు. శిక్షణలో తైక్వాండో, స్విమ్మింగ్, డ్రైవింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో పనిచేసే ‘శక్తి మొబైల్ కాప్స్’ టీమ్ సభ్యులు నగరంలో నిరంతరం ఈ–బైస్కిళ్లపై గస్తీ నిర్వహిస్తూ ఆకతాయిలపై నిఘా పెడతారు. మహిళల భద్రతే లక్ష్యం.. మహిళల భద్రత, రక్షణే లక్ష్యంగా ఈ బృందాలు పనిచేస్తాయి. పోలీసు డ్రెస్‌లో ఉండే శక్తి టీమ్స్ సభ్యులు నగరంలో నిత్యం గస్తీ నిర్వహిస్తూ మహిళలకు రక్షణ కవచంలా ఉంటారు. మహిళలను ఎవరైనా వేధించినా.. వెకిలి చేష్టలకు పాల్పడినా తక్షణమే వారిని అదుపులోకి తీసుకుంటారు. ముఖ్యంగా విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేసి చట్ట ప్రకాశం శిక్షించడం వీరి విధి. ఈవ్టీజర్ల తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలి పించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేయడం ‘శక్తి కాప్స్’ ముఖ్య నిర్వహణ. -
ఛీర్ గాళ్స్ గదులపై పోలీసుల దాడులు
స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలేవీ వెలుగులోకి రాకుండా ఐపీఎల్-8 సజావుగా సాగుతోందనుకున్న తరుణంలో ఛీర్ గాళ్స్ గదులపై పోలీసుల దాడి సంచలనం రేకెత్తించింది. మంగళవారం రాత్రి రాయ్‌పూర్‌లో ఢిల్లీ- చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన కొద్ది గంటలకే నగరంలోని జీఈ రోడ్డు ప్రాంతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఛీర్ లీడర్స్ బస చేసిన హోటల్ పై పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. మూడు వాహనాల్లో హోటల్ కు చేరుకున్న పోలీసులు దాదాపు గంటపాటు ఛీర్ లీడర్స్ పై రకరకాల ప్రశ్నలు సంధించారు. హోటల్లోని ఇతర గదులకూ వెళ్లిన పోలీసులు.. సంబంధిత వ్యక్తుల వివరాలు సేకరించారు. కొందరు బుకీలు ఛీర్ లీడర్స్ ద్వారా ఆటగాళ్లకు ఎరవేసి ఫిక్సింగ్ కు పాల్పడిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఛీర్ లీడర్స్‌కు, ఆటగాళ్లకు ఐపీఎల్ నిర్వాహకులు వేర్వేరు హోటల్స్‌లో బస ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సూపర్ కింగ్స్ ఛీర్ లీడర్స్ గా పనిచేస్తోన్నవారిలో ఎక్కువ మంది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందినవారే. కాగా సోదాల పేరుతో పోలీసులు తమను వేధించారని చెన్నై జట్టు ఛీర్ లీడర్స్ బోరున విలపించారు. తమకు వర్క పర్కింట్ ఉందని, గతంలో బాలీవుడ్ సినిమాలకు కూడా పని చేశామని అయితే ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదని, అడ్డమైన ప్రశ్నలడిగి పోలీసులు తమను ఇబ్బందిపెట్టారని ఓ ఛీర్ గళ్ కన్నీటి పర్యంతమైంది. తమపై ఏవైనా ఫిర్యాదులు వస్తే నిర్వాహకులను సంప్రదించాలికానీ ఇలా హోటల్ గదుల్లోకి దూరి భీభత్సం చేయడమేంటని ఛీర్ గాళ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆరోపణలను కొట్టిపారేసిన పోలీసులు.. రొటీన్ చెకప్స్‌లో భాగంగానే ఛీర్ లీడర్స్ గదుల్ని తనిఖీ చేశామని, ఇందులో మరో ఉద్దేశానికి తావు లేదని, అసాంఘిక విషయాలేవీ తమ దృష్టికి రాలేదని రాయ్ పూర్ సిటీ ఎస్పీ అన్షుమన్ సింగ్ సిసోడియా వివరణ ఇచ్చారు.