ఇంటి పేరు కేసరి.. ఆటలో నేర్పరి..
క్రికెట్ ఈ మాట చెప్పగానే మనలో చాలా మందికి పూనకాలు వచ్చేస్తాయి.. చూసేవాళ్లకే ఆ రేంజ్లో పూనకాలొస్తే.. ఆడేవాళ్ల పరిస్థితి ఏంటి? ఆ మాట అన్నంత ఈజీకాదు ఆడటం.. పైగా గల్లీ టీమ్‌లో ఆడటం ఒకెత్తయితే.. అండర్ –19 జట్టులో ఆడటం మరో ఎత్తు.. అందునా ఓ మహిళ క్రికెట్ టీమ్‌కి సెలక్ట్ కావడం అంటే అదో గొప్ప సక్సెస్‌గానే చెప్పాలి.. అలా క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తితో, కఠోరమైన సాధనతో ఐసీసీ అండర్–19 ప్రపంచ మహిళా జట్టుకు ఎంపికైంది రామంతాపూర్‌కు చెందిన కేసరి ద్రితి.. ఈ నేపథ్యంలో ఆమె గురించిన మరికొన్ని విశేషాలు.. - రామంతాపూర్క్రీడల్లో పాల్గొనాలని ఆసక్తి, మక్కువ ఉంటే సరిపోదు.. ఆ క్రీడపై పట్టు సాధించడానికి నిత్యం సాధన చేస్తే ఎటువంటి లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చని నిరూపించింది క్రికెటర్ ద్రితి. తన 13వ ఏట నుంచే మాదాపూర్‌లోని రామానాయుడు క్రికెట్ అకాడమీలో ప్రముఖ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ పర్యవేక్షణలో కఠోర శిక్షణ తీసుకుంటూ పలు క్రికెట్ పోటీల్లో తన ప్రతిభను చూపుతోంది ద్రితి. రామంతాపూర్‌కు చెందిన 18 ఏళ్ల ద్రితి కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ తనలోని ప్రతిభను చాటుకుంటోంది. ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ద్రితి ప్రతి మ్యాచ్‌లో చిచ్చర పిడుగులా చెలరేగుతూ సునామీల పరుగులు తీస్తూ వికెట్లు తీస్తూ ప్రతిభ చూపుతోంది. తండ్రి శ్రీకాంత్ ప్రోత్సాహంతో.. హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారుడైన తన తండ్రి కేసరి శ్రీకాంత్ ఇచి్చన ప్రోత్సాహంతో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్లో ముందుకు కదిలింది. దీంతోపాటు తల్లి సహకారం ద్రితికి ఎంతో మేలు చేసింది. వృత్తిరీత్యా న్యూట్రిషనిస్ట్ అయిన తన తల్లి లావణ్య కేసరి ఆహార నియమాలు, సలహాలు ఫిట్‌గా ఉండటానికి దోహదపడ్డాయి. మాజీ క్రికెటర్ పరమేశ్వర్ భవనాక్ వ్యక్తిత్వ వికాస సూచనలు క్రికెట్లో ద్రితి సంచలనాలను సృష్టించేలా చేస్తోంది. ఇప్పటి వరకూ ద్రితి ఆడిన 115 లీగ్, జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో 695 పరుగులు, అదే విధంగా ఆప్ బ్రేక్ బౌలర్‌గా 155 వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో తన సత్తా చాటుతోంది ద్రితి. క్రికెట్ మ్యాచ్‌లు.. ద్రితి అండర్–19, అండర్–23 వంటి క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొంది. అండర్–19 ఛాలెంజర్ ట్రోఫి ట్రీ సిరీస్ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొంది. మలేíÙయాలో జరిగిన అండర్–19 ఆసియా కప్ పోటీల్లో భారత జట్టులో పాల్గొంది. ఈ పోటీలో భారత్ విజయం సాధించింది. అదే విధంగా జాతీయ క్రికెట్ అకాడమీ దేశంలోని 25 మంది అగ్రశ్రేణి క్రికెట్ క్రీడాకారులతో నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొని శిక్షణలో సీనియర్ల నుంచి క్రికెట్లోని మెళకువలు నేర్చుకుంది.అవార్డులు..పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ద్రితికి పలు మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది బౌలర్ అవార్డులు లభించాయి. – ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ మహిళా పోటీలకు కేసరి ద్రితి మలేషియా వేదికగా 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకూ నిర్వహించే అండర్–19 మహిళా టీ 20 ప్రపంచ కప్ పోటీలకు నగరం నుంచి కేసరి ద్రితిని బీసీసీఐ సెలక్ట్ కమిటీ ఎంపిక చేసింది. మలేషియా కౌలాలంపూర్‌లో బయు మస్ ఓవల్‌లో భారత జట్టు (డిపెండింగ్ ఛాంపియన్) అదిత్య మలేíÙయా, వెస్టిండీస్, శ్రీలంక జట్లు గ్రూప్ ఏలో ఉన్నాయి.సీనియర్ మహిళా టీమ్‌లో స్థానమే లక్ష్యంగా.. భారత సీనియర్ మహిళల క్రికెట్ టీమ్ స్థానం సంపాదించి దేశం తరపున పలు అంతర్జాతీయ క్రికెట్లో పాల్గొని అత్యుత్తమ ఆల్ రౌండర్ క్రీడాకారిణిగా నిలబడటమే నా లక్ష్యం. క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడటానికి కారణం ప్రముఖ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ పర్యవేక్షణలో క్రమశిక్షణతో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఆయన నాకు క్రికెట్లో మెళకువలతోపాటు క్రీడలో ఉన్నప్పుడు ఏ విధంగా మనో నిబ్బరంతో మసలుకోవాలనే ఆదేశాలు, సూచనలు నా ఉన్నత స్థానానికి కారణాలు. – కేసరి ద్రితి