crops dry
-
విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు
ఉరవకొండ : వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన టీడీపీ ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా సరఫరా చేయకపోవడంతో మండలవ్యాప్తంగా బోరుబావుల కింద సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయి. మండలంలోని ఇంద్రావతి, మోపిడి, రాకెట్ల, ఆమిద్యాల తదితర గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో అరటి, మామిడి, వేరుశనగ పంటలు ఎండుముఖం పట్టాయి. బోరుబావుల కింద వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలను కాపాడుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు పరిస్థితిని ఎన్నోమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఐదు గంటలైనా విద్యుత్ సరఫరా అయితే తప్ప తమ పంటలు చేతికందే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు. -
తడారి.. చేలు ఎడారి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కాలువలు తడారుతున్నాయి. చేలు ఎడారులను తలపిస్తున్నాయి. రబీలో సాగునీటి ఎద్దడి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వంతులవారీ విధానం సక్రమంగా అమలు కాకపోవడంతో శివారు ప్రాంతాల్లోని చేలు నీరందక బీటలు వారుతున్నాయి. అయితే, చేపల చెరువులకు మాత్రం మోటార్ల సా యంతో యథేచ్ఛగా నీటిని తోడేసుకుంటున్నారు. దీంతో వరి పండిం చే డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా.. 80 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని స్పష్టం చేసింది. సాధారణం గా రబీకి చివరి రోజుల్లో సీలేరు నుంచి అదనపు జలాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది తొలి దశలోనే సాగునీటి ఎద్దడి తలెత్తిం ది. నాట్లు పూర్తికాకుండానే జనవరి 22 నుంచి వంతులవారీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీనివల్ల శివారు ప్రాంతాల్లోని 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సక్రమంగా నీరు అందటం లేదు. చాలాచోట్ల ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీరు తోడుకోవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల పం ట కాలువలు, బోదెలు నీరులేక తడారిపోవడంతో పొలాలు ఎండిపోయి బీటలు వారుతున్నాయి. ఇదిలావుంటే.. వంతులవారీ విధా నం అమలయ్యే ప్రాంతాల్లో చేపల చెరువులకు కాలువ నీటిని తోడేస్తున్నారు. ఉంగుటూరు, తణుకు, ఉండి నియోజకవర్గాలో కొన్నిచోట్ల వరి పొలాలు బీటలు వారుతున్నా యి. నీటికోసం రైతుల మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి దుబ్బు కట్టే దశలో ఉంది. పొట్ట దశ, ఈనిక దశలో నీరు ఎక్కువ అవసరం అవుతుంది. ఆ సమయంలో తగినంత నీరు అందకపోతే ఎలుకలు చేరి పంటను నాశనం చేస్తాయి. ఇప్పటికే తెగుళ్లు ఆశించి పురుగు మం దుల కోసం ఎక్కువ పెట్టుబడి పె ట్టాల్సి వస్తోంది. ప్రస్తుత అవసరాలకు 6 వేల క్యూసెక్కులు విడుదల చేస్తే తప్ప శివారు ప్రాంతాలకు నీరందే పరిస్థితి లేదు. అయితే, 4 వేల క్యూసెక్కులకు మించి నీరివ్వడం లేదు. మరోవైపు పంట కాలువల్లో గుర్రపుడెక్క, తూడు, కర్రనాచు పెరిగిపోయింది. వీటిని తొలగించే చర్యలు చేపట్టలేదు. పంట బోదెలు ఆక్రమణలకు గురికావడంతో కుచించుకుపోయా యి. డెల్టా ఆధునికరణ పనులు సక్రమంగా జరగకపోవడం వల్లే శివారు ప్రాంతాలకు నీరందని ప రిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి ఆ ధునికీకరణ పనులు కొనసాగుతూ నే ఉన్నాయి. రైతులు ఇప్పటికే ఎకరాకు రైతులు రూ.15 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. నీటిసమస్య వల్ల దిగుబడి తగ్గితే నష్టపోవాల్సి వస్తుంది. చాలాచోట్ల లస్కర్ల కొరత వల్ల వంతులవారీ విధానం కూడా సక్రమంగా అమలు కా వడం లేదు. గత ఏడాది శివారు ప్రాంతాలకు అయిల్ ఇంజిన్లు పెట్టుకుంటే ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా చాలాచోట్ల అమలు కాలేదు. ఈ రబీలో ఆ భరోసా కూడా రైతులకు లేకుండా పోయింది. -
నిర్లక్ష్యం తెగులు
కొవ్వూరు : వరి పంటకు నీటి తడులు అందక ఎక్కడికక్కడ ఎండిపోతోంది. పట్టించుకోని సర్కారు తీరుపై రైతన్న కడుపు మండుతోంది. నాట్లు వేసే దారిలేక గోదావరి, కృష్ణా డెల్టాల ఆయకట్టు పరిధిలో సుమారు 40 వేల ఎకరాలు బీడు వారాయి. గోదావరిలో వరద పరవళ్లు తొక్కుతున్నా నాట్లు వేసిన చేలకు నీళ్లు అందటం లేదు. పచ్చని పశ్చిమ గోదావరిలో రైతుల దుస్థితి ఇది. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నా.. పంపిణీ కాలువలు, పంట బోదెల్లోకి వెళ్లడం లేదు. ఈ కారణంగానే కనీవినీ ఎరుగని రీతిలో డెల్టా రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని నీటిపారుదల శాఖ విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.38 లక్షల హెక్టార్లలో (సుమారు 6 లక్షల ఎకరాలు) వరినాట్లు వేయాల్సి ఉండగా 2.23 లక్షల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. ఆగస్టు ¯ð ల ముగుస్తున్నా ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. కారణాలివీ అధికారుల నిర్లక్ష్యం, లస్కర్లు లేకపోవడం, జిల్లా స్థాయి అధికారుల అవగాహనా లోపం వల్లే రైతులకు సార్వాలోనూ సాగునీటి కష్టాలు వచ్చి పడ్డాయని నీటి పారుదల నిపుణులు స్పష్తం చేస్తున్నారు. వారేమంటున్నారంటే...l ప్రధాన కాలువల కంటే పంపిణీ కాలువలు, పంట బోదెలు మెరకగా ఉండటంతో వాటి సామర్థ్యం మేరకు నీరు వెళ్లడం లేదు. l ప్రధానంగా పర్యవేక్షణ లోపం వల్ల నీటి ఎద్దడి అధికమైంది. ఏ పంపిణీ కాలువకు ఎంత నీరు ఇవ్వాలి, ఎంత ఇస్తున్నారు, నిర్దేశించిన ప్రాంతం వరకు సాగునీరు వెళుతోందా లేదా అనే దానిపై క్షేత్రస్థాయిలో సాగునీటి సంఘాలు, అధికారుల పర్యవేక్షణ ఉండటం లేదు. l ఎగువ ప్రాంత రైతులు నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా నీటిని వాడుకోవడం, తడులు అధికంగా పెట్టడంతో శివారు ప్రాంతాలకు నీరు పారడం లేదు. l గోదావరిలో ఎర్ర నీటిని కాలువలకు విడిచిపెట్టినప్పుడు ప్రవాహ వేగం తక్కువగా ఉంటుంది. రబీ సీజన్లో నీరు స్వచ్ఛంగా ఉండటం వల్ల ప్రవాహ వేగం అధికమవుతుంది. l అధికారులు, నీటిసంఘాల ప్రతినిధులు తమ పరిధిలోని కాలువకు కేటాయించిన నీరు సరఫరా అయ్యేంత వరకు పర్యవేక్షణ చేస్తేనే శివారు ప్రాంతాల వరకు నీరు చేరుతుంది. l మురుగు కాలువల్లో పూడికలు తీయకపోవడం, తూడు పేరుకుపోవడం కూడా శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడికి కారణమవుతున్నాయి. మొహం చాటేసిన వర్షాలు మొదట్లో మురిపించిన వర్షాలు మొహం చాటేయడం కూడా రైతుల్ని దెబ్బతీస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 551.5 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 442 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అదికూడా కొద్దిరోజులే ఉంది. సాధారణ వర్షపాతం కంటే 19.9 శాతం తక్కువగా నమోదైంది. జూన్‌లో సరాసరి 114.7 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 276.8 మిల్లీమీటర్లు కురిసింది. 39 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు గంపెడాశతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. తీరా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. జూలైలో 250.2 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 142.4 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఆగస్టులో 186.6 మిల్లీమీటర్లకు గాను కేవలం 22.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే 88.8 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గడంతో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్నాయి. నాలుగైదు రోజులుగా జిల్లాలో 4 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత పెరిగింది. కొవ్వూరులో శనివారం గరిష్టంగా 37 డిగ్రీలు నమోదైంది. సోమవారం కొవ్వూరులో 36, నరసాపురంలో 35.7 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపలేకపోతున్నాయి. ఉత్తర భారతంలోని బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో తేమతో కూడిన ఇక్కడి గాలులు అటువైపు వెళ్లిపోతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తేమ శాతం తగ్గడం వల్ల ఉక్కపోత పెరుగుతోంది. జిల్లాలో వర్షాభావ పరిస్థితులకు తోడు ఎండలు మండిపోతుండటంతో పంటలకు సాగునీటి ఇబ్బందులు మరింత అధికమవుతున్నాయి. పర్యవేక్షణ లోపంతోనే సాగునీటి సమస్య ప్రధాన కాలువల్లో నీరు సమృద్ధిగా ఉంటున్నా.. పంట కాలువలు, పంపిణీ కాలువలకు నీరు చేరకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం వల్లే గోదావరి డెల్టా ఆయకట్టు రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైతులు, అధికారులు, నీటి సంఘాలు సమన్వయంతో పనిచేయాలి. పంపిణీ కాలువల ద్వారా నీటిని పొలాలకు చేరేవిధంగా నిత్యం పర్యవేక్షించాలి. ప్రతి తూముపైనా పర్యవేక్షణ ఉండాలి. – విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డు ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం -
హే..కృష్ణా!
‘కృష్ణా డెల్టా ఆయకట్టుకు జూలై 16వ తేదీ నాటికి నీరందిస్తాం. ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూసే బాధ్యత మాది’ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా అధికారులు, ప్రభుత్వ పెద్దలు పదేపదే చెప్పిన మాటలివి. జూలై 16 కాదుకదా.. ఆగస్టు 16 దాటిపోయినా దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల్లోని కృష్ణా ఆయకట్టుకు నీరు మాత్రం రాలేదు. నారుమడులు ఎండిపోతుండగా.. రైతులు నాట్లు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : కృష్ణా కాలువ పరిధిలో జిల్లాలోని పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల్లో 58 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా కెనాల్ ద్వారా నీరు అందించాల్సి ఉంది. చుక్క నీరు కూడా రాకపోవడంతో చాటపర్రు, పాలగూడెం, కొమడవోలు, జాలిపూడి, కాట్లం పూడి, మాదేపల్లి, లింగారావుగూడెం, పోణంగి తదితర గ్రామాల్లో 12 వేల ఎకరాల్లో వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను తరలించి జూలై 16వ తేదీ నాటికి కృష్ణా డెల్టాకు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటివరకూ పట్టిసీమ నుంచి పూర్తి సామర్థ్యంతో నీటిని తీసుకువెళ్లింది లేదు. 4,200 క్యూసెక్కుల నీటి ప్రవాహానికే కృష్ణా జిల్లా రామిలేరు వద్ద పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువకు గండిపడింది. దీంతో నీటి తరలింపును నిలిపివేశారు. తాజాగా ఒకటి రెండు మోటార్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. కృష్ణా డెల్టాకు 15 వేల క్యూసెక్కుల నీరివ్వాల్సి ఉండగా, ప్రస్తుతం పట్టిసీమ ద్వారా వెళ్లిన ఆరు టీఎంసీల నీరు ఏ మాత్రం సరిపోలేదు. మరోవైపు కృష్ణా పుష్కరాల నేపథ్యంలో అక్కడి నదిలో నీటిమట్టం ఉండేలా చూసేందుకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీని నమ్ముకుని పంటలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గోదావరి జలాలూ ఇచ్చింది లేదు.. పోణంగిపుంత పథకం పనులు పూర్తి కాకపోవడం వల్ల గోదావరి నీరు కూడా తరలించే అవకాశం లేకుండా పోయింది. దీంతో చేలు బీడువారి నారుమళ్లు, నాట్లు ఎండుతున్నాయి. ఇప్పటికే సాగు చేపట్టిన రైతులు పూర్తిగా నష్టపోతుండగా, మిగిలిన రైతులు నాట్లు వేయాలా వద్దే ఆనే మీమాంసలో ఉన్నారు. ఇప్పటికే అదును దాటిపోయింది. ఈ నెలలో నాట్లు వేస్తే పంట కోతకు వచ్చే సమయంలో వాయుగుండం, అల్పపీడనాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. కస్సుబుస్సులాడిన ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం పంట బోదెల ద్వారా కొంతమేర నీరు వచ్చినా.. మోటార్లతో తోడుకుంటేగాని చేలకు అందని పరిస్థితి. వంతులవారీగా నీరు తోడుకునే విషయంలో రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎగువ రైతులు పూర్తిగా వాడుకున్న తర్వాత గాని దిగువకు నీరి వ్వడానికి అంగీకరించడం లేదు. నీటి విషయం అడిగితే దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఎవరినడిగి పంటలు వేశారంటూ కస్సుబుస్సులాడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అపరాలు వేసే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని స్థితిలో అపరాలు వేసినా నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీ పంటలు రెండూ వేయలేకపోయారు. ఫలితంగా ఆ ప్రాంతంలోని 14 వేల మంది కౌలు రైతులు, 20 వేల మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ ఏడాది ఖరీఫ్‌పై ఆశలు పెట్టుకున్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో సాగు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతుల నుంచి సొమ్ము వసూలు ఏలూరు మండలంలోని కొద్దిపాటి ఆయకట్టును కాపాడుకునే అవకాశం ఉన్న తూర్పు లాకుల నుంచి గోదావరి నీటిని మోటార్ల సాయంతో తోడి కాలువలోకి పంపిస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వ ఖర్చుతో నీటిని తోడగా, ఈ ఏడాది కూడా అదే పని చేస్తున్నారు. అయితే, దొడ్డిదారిన రైతుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి ఎకరాకు రూ.500 చొప్పున తీసుకుంటున్నారు. అయినా, ఆ నీరు వరి పంటకు కాకుండా చేపల చెరువులకు మళ్లిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.