వేసవి తాపం..
భీమవరం: భానుడి ప్రతాపానికి పశుపక్ష్యాదులు, జలచరాలు సైతం అల్లాడుతున్నాయి. నిత్యం భూమి మీద సంచరించే జీవులు కొద్దిసేపు నీటిలో జలకాలాడేందుకు తాపత్రయ పడుతుంటే , ఎప్పుడూ నీటిలో ఉండే జలచరాలు మాత్రం గట్టుమీద సేదతీరేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రజలు వీటిని అసక్తిగా తిలకిస్తున్నారు.