మహిళా రైతు ఆత్మహత్య
చివ్వెమ్ల మండలం పాండ్యానాయక్ తండాలో దారావత్ బోడి(35) అనే మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. అప్పులవాళ్ల ఒత్తిడి తట్టుకోలేక బుధవారం రాత్రి చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మహిళా రైతుకు సుమారు రూ.2 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిసింది.