Devendra Bishoo
-
విరాట్ కు బౌలింగ్.. కష్టమేం కాదు
► ఇది బ్యాటింగ్ పిచ్.. కాస్త ఓపిక పట్టాలి ► వెస్టిండీస్ స్పిన్నర్ దేవెంద్ర బిషూ నార్త్ సౌండ్: బౌలర్లు సహనం కోల్పోతే సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని వెస్డిండీస్ లెగ్ స్పిన్నర్ దేవెంద్ర బిషూ అన్నాడు. భారత్‌తో జరుగుతున్న తొలిటెస్టులో మొదటిరోజు టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేయగా, అందులో మూడు వికెట్లు బిషూనే తీశాడు. సహచరుల నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా బిషూ మాత్రం (3/108) పోరాటం చేస్తున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(143 నాటౌట్)కి బౌలింగ్ చేయడం తనకు సవాలు కాదని, ఆట అన్నాక కాస్త ఓపిక అవసరమని వ్యాఖ్యానించాడు. ఇది కచ్చితంగా బ్యాటింగ్ పిచ్ అని స్పిన్నర్ బిషూ పేర్కొన్నాడు. తొలిరోజు బంతి టర్న్ అవ్వలేదని, అయితే మూడోరోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డాడు. గాబ్రియెల్ భారత టాపార్డర్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాడని, అతని నుంచి కాస్త సహకారం లభించిందన్నాడు. తొలిరోజు టీమిండియాదే అయినా, మాకు ఓ రోజు వస్తుంది.. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని బిషూ ధీమా వ్యక్తం చేశాడు. -
బిషూ 'సిక్సర్'... వోజెస్ సెంచరీ
రోసీయూ: వెస్టిండీస్ తో జరుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 318 పరుగులు చేసింది. ఆడమ్ వోజెస్ తొలి టెస్టు సెంచరీతో ఆసీస్ కు ఆధిక్యం దక్కింది. 178 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను వోజెస్ అజేయ శతకంతో గట్టెక్కించాడు. చివరి రెండు వికెట్ కు అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. హాజిల్ వుడ్ తో కలిసి పదో వికెట్ కు 97 పరుగులు జోడించాడు. హాజిల్ వుడ్ 39 పరుగులు చేసి చివరి వికెట్ గా అవుటయ్యాడు. తొలి టెస్టు ఆడుతున్న వోజెస్ పట్టుదలగా ఆడి శతకం నమోదు చేశారు. 247 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ తో 130 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ దేవేంద్ర బిషూ (6/80) కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. -
వణికించిన బిషూ
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 203/8 విండీస్ 148 ఆలౌట్ రోసీయూ: పటిష్టమైన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌ను వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ (6/68) వణికించాడు. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆనందంతో తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఈ దెబ్బతో రెండో రోజు గురువారం కడపటి వార్తలందేసరికి 72 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆడమ్ వోజెస్ (148 బంతుల్లో 71 బ్యాటింగ్; 8 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. క్రీజులో తనతో పాటు లియోన్ (26 బంతుల్లో 15 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నాడు. ఏడో వికెట్‌కు జాన్సన్ (59 బంతుల్లో 20; 1 ఫోర్)తో కలిసి వోజెస్ 52 పరుగులు జోడించాడు. వీరి ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 53.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. జాన్సన్, హేజెల్వుడ్లకు మూడేసి వికెట్లు దక్కాయి.