ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 203/8
విండీస్ 148 ఆలౌట్
రోసీయూ: పటిష్టమైన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌ను వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ (6/68) వణికించాడు. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆనందంతో తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఈ దెబ్బతో రెండో రోజు గురువారం కడపటి వార్తలందేసరికి 72 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆడమ్ వోజెస్ (148 బంతుల్లో 71 బ్యాటింగ్; 8 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. క్రీజులో తనతో పాటు లియోన్ (26 బంతుల్లో 15 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నాడు. ఏడో వికెట్‌కు జాన్సన్ (59 బంతుల్లో 20; 1 ఫోర్)తో కలిసి వోజెస్ 52 పరుగులు జోడించాడు. వీరి ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 53.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. జాన్సన్, హేజెల్‌వుడ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి.
వణికించిన బిషూ
Published Fri, Jun 5 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
Advertisement
Advertisement