Dharmana Prasada
-
దొంగదీక్షలతో మోసం చేయడానికి వచ్చారు
-
కేసులెన్ని పెట్టినా పోరుబాటే!
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన స్పష్టీకరణ ► బాధితుల తరఫున జగన్ నాయకత్వంలో పోరాటం ► అణచి వేయాలనుకుంటే ప్రభుత్వానికి భంగపాటే ► ప్రజలను జలగల్లా పీల్చి పిప్పిచేస్తున్న జన్మభూమి కమిటీలు సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: అధికారమదంతో టీడీపీ నాయకులు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న వైనాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, ఇది అభివృద్ధిని అడ్డుకోవడమెలా అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగంతో అడ్డుకోవాలనుకుంటే భంగపాటు తప్పదన్నారు. హామీల వలవేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు మూడో సంవత్సరం గడిచిపోతున్నా ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గార మండలం శ్రీకూర్మంలో సర్పంచ్ బరాటం రామశేషు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ధర్మాన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేలాది సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికీ గండికొడుతూ జన్మభూమి కమిటీలను స్థానిక సంస్థల నెత్తిన రుద్దిందని విమర్శించారు. పింఛను, రేషన్‌కార్డు ఉన్నవారికి తీసేయడం, కావాల్సిన వారికి కుంటిసాకులు చెప్పి అందకుండా చేయడం జన్మభూమి కమిటీల పనిగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న సర్పంచుల అధికారాలను హరిస్తున్న కిరికిరి కమిటీలనే ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికలుగా భావిస్తున్నారంటే ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తే ప్రపంచం మెచ్చే గొప్ప రాజధాని కడతానని చంద్రబాబు చెబుతుంటారని, మళ్లీ అదే నోటితో మరో 50 ఏళ్ల వరకూ నిర్మాణం పూర్తికాదనీ చెబుతారని విమర్శించారు. రాజధాని పూర్తయ్యేవరకూ పింఛను కోసం పండుటాకులు ఎదురుచూడాల్సిందేనా అని ప్రశ్నించారు. ఒక్కరికై నా హామీలు నెరవేర్చారా?... రుణాలు మాఫీ చేస్తానన్న కల్లబొల్లి మాటలతో డ్వాక్రా మహిళలను మోసం చేశారని, లక్ష రూపాయల రుణానికి రూ.30 వేల చొప్పున పెరిగిపోరుున వడ్డీ ముందు రూ.3 వేలు ఏమూలకు వస్తుందని ధర్మాన ప్రశ్నించారు. రైతులు బ్యాంకు మెట్లు ఎక్కలేని పరిస్థితి తెచ్చారని విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలని జిల్లా అంతటా నినాదాలు రారుుంచారని, ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలని నిరుద్యోగ యువత కోరుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఐదేళ్ల పాటు విద్యుత్తు చార్జీలు పెంచని ఘనత వైఎస్‌ది అరుుతే చాపకింద నీరులా విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను వడ్డిస్తున్న గొప్పతనం చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఇవేమి కేబినెట్ మీటింగ్‌లు? పజలకు మేలు చేసే ప్రతిపాదనలపై చర్చించే అవకాశం రాలేదని చెబుతున్నారని, అదే అనుయాయులకు భారీ ఎత్తున భూపందేరానికి మాత్రం నిర్ణయాలు జరిగిపోతున్నాయని... ఇవేమి కేబినెట్ మీటింగ్‌లని ధర్మాన విమర్శించారు. కేబినెట్ సమావేశాల్లో చర్చ ఉండదని, ప్రజల సంక్షేమానికి నిర్ణయాలే ఉంటాయని గుర్తు చేశారు. తప్పు చేసి గొప్పగా చెప్పుకోవడమూ చంద్రబాబుకు, టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు. డబ్బు కట్టలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు నల్లధనం విషయం పసుపు కండువాలేసి వారిని పార్టీలోకి ఆహ్వానించినప్పుడు తెలియదా? అని ధర్మాన ప్రశ్నించారు. ఇలాంటి మోసపూరిత టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మం గడ్డపై నుంచే ప్రారంభమవ్వాలని పిలుపునిచ్చారు. -
నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేద్దాం
శ్రీకాకుళం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నయవంచనకు గురిచేశారని ప్రజలు దుయ్యబడుతున్నారు. టీడీపీ అధికారం చేపట్టి రెండే ళ్లు పూర్తయినా ఒక్కహామీ కూడా అమలు చేయడం లేదని, అర్హులైన వారికి రేషన్‌కార్డులు ఇవ్వలేదని, పింఛన్లు, ఇళ్లు మంజూరు చేయలేదని వాపోతున్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నేతల వద్ద గోడు వినిపిస్తున్నారు. జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేసి పచ్చచొక్కాలవారికే ప్రయోజనం చేకూర్చుతోందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలో శనివారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పెద్దగనగళ్లపేటో... పంచాయతీలకు ఇచ్చే నిధులను సైతం తెలుగుదేశం ప్రభుత్వం బ్రోకర్లకు కట్టబెడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం మండలంలోని పెద్దగనగళ్లపేట పంచాయితీలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు డ్వాక్రా రుణాలు మాఫీ చేశారా?, మత్స్యకారులు వేటకు వెళ్లి మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తామన్నారు... ఏ ఒక్కరికైనా ఇచ్చారా?, మత్స్యకారులకు ఒక్క ఇళ్లయినా నిర్మించారా?, ఇంటికో జాబ్ ఇస్తామన్నారు. ఇచ్చారా?, కనీసం నిరుద్యోగ భృతి నెలకు రూ.2వెలు ఇస్తామన్నారు. ఇచ్చారా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఒక్క హామీ కూడా అమలుచేయలేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పీఏసీఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణ, పార్టీ మండల కన్వీనర్ మూకళ్ల తాతబాబు, సర్పంచ్ చీకటి గురమ్మ, గురుమూర్తి, దానయ్య, బలరాంపురం సర్పంచ్ కోనాడ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. తెలికిపెంటలో... సరుబుజ్జిలి మండలం తెలికిపెంట పంచాయతీలో రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించా రు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. రాజకీయ కక్షతో పింఛన్ రద్దుచేసిన తెలికిపెంట గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇసాయి పగడాలమ్మ (70)ను ఓదార్చారు. మంచిరోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. కరకవలసలో... జలుమూరు మండలం కరకవలస గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు రద్దుచేసిన వారిని ఓదార్చారు. జగన్ ప్రభుత్వం వస్తుందని, ప్రజలందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ నియంత పాలను ఎన్నాళ్లూ సాగదన్నారు. రౌతుపురం, గొల్లబంజరుపేటల్లో... టీడీపీ ఆరాచక పాలనపై నందిగాం మండలం రౌతుపురం, గొల్లబంజరుపేట తదితర గ్రామాల ప్రజలను వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ చైతన్యవంతం చేశారు. ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన అచ్చెన్నాయుడు... బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పారని, ఇప్పుడు జాబు రౌతుపురానికి చెందిన బెవర నానాజమ్మ వాపోయింది. దివ్యాంగ పింఛన్‌కు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని గ్రామానికి చెందిన పోలాకి ఆదినారాయణ తెలిపారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మాయచేవారంటూ సభ్యురాలు బెవర చిన్నమ్మ ఆవేదన వ్యక్తంచేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతలకు బుద్ధిచెబుతామని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు దువ్వాడ వాణి, రొక్కం సూర్యప్రకాశరావు, కాళ్ల సంజీవరావు, బుసకల సీతారాం, బగాది హరి తదితరులు పాల్గొన్నారు. పెద్దకొజ్జిరియాలో... కంచిలి మండలం పెద్దకొజ్జిరియ గ్రామంలో పార్టీ మండలాధ్యక్షుడు వజ్జ మృత్యుంజరావు అధ్యక్షతన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు పాల్గొని టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. వంద ప్రశ్నలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇప్పిలి కృష్ణారావు, పలికల భాస్కరరావు, నవీన్‌కుమార్ అగర్వాలా పాల్గొన్నారు. -
హామీలతో ముంచేశాడు!
ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి తామంతా మోసపోయామని జనం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టాక ఇచ్చిన హమీల్లో ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రజలు తమ సమస్యలను వివరిస్తున్నారు. గురువారం జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం రూరల్ మండలంలోని కుందువానిపేటలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. స్మార్ట్ విలేజ్ అని చెప్పి తమ భూములన్నీ ప్రభుత్వం లాక్కుంది. ఎటువంటి పరిహారం ఇవ్వలేదు, తర్వాత బతుకు తెరువు కోసం వలస వెళ్లిన వారికి రేషన్ కట్ చేస్తున్నారని చీకటి దానయ్య, బర్రి లక్ష్మణ తదితరులు ధర్మాన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయారని, స్మార్ట్ విలేజ్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇది హామీగానే మిగిలిపోయిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, డీసీఎంఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి, పీఏసీఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఆమదాలవలసలోని మెట్టక్కివలసలో పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదని, నిరుద్యోగభృతి ఇవ్వడం లేదని విద్యార్థులు, యువకులు తమ్మినేనికి వివరించారు. రణస్థలం మండలం అల్లివలసలో ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్చార్జి గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంగో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు తమ రేషన్‌కార్డులు తొలగించారని, పింఛన్లు రాకుండా చేశారని కిరణ్‌కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. రాజాం నగర పంచాయతీ పరిధి 17వ వార్డు అమ్మవారు కాలనీలో ఎమ్మెల్యే కంబాల జోగులు కార్యక్రమాన్ని నిర్వహించారు. గడచిన రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోపించారు. బాబు ఇచ్చిన హామీలను ముద్రించిన 100 ప్రశ్నల కరపత్రాన్ని ఇంటింటికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు టంకాల పాపినాయుడు, పాలవలస శ్రీనివాసరావు పాల్గొన్నారు. నరసన్నపేట మండలం మడపాం పంచాయతీ కొత్తపేట, బుచ్చిపేట గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను పక్షపాతంగా అమలు చేస్తున్నారని, అర్హులైనప్పటికీ రాజకీయంగా కక్షసాధించి ఎంపిక చేయడం లేదని, ఉపాధిపనుల్లో కూడా వివక్షత చూపుతున్నారని పలువురు మహిళలు కృష్ణదాస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఏక పక్షంగా వ్యవహరిస్తూ నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు పాల్గొన్నారు. నందిగాం మండలం దడ్లరామచంద్రాపురం గ్రామంలో టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. 80 సంవత్సరాలైనప్పటికీ వృద్ధాప్య పింఛన్ రావడం లేదనిచమళ్ల బోడెమ్మ దువ్వాడ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. కార్యక్రమంలోపార్టీ నేతలు దువ్వాడ వాణి, కొంచాడ పాపయ్య, రొక్కం సూర్యప్రకాశరావు పాల్గొన్నారు. కొత్తూరు మండలం మాసింగి కాలనీలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు మాటలకు మోసపోయామని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారని, ఈ మాటలకు నమ్మి రుణం కట్టలేదని, ఇపుడు బ్యాంకర్లు వద్దనుంచి నోటీసులు వచ్చాయని బి.దమయంతి, కవితలతోపాటు పలువురు నోటీసులు చూపించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు డి.అప్పన్న, పొట్నూరు మధుబాబు, రాజా, మోహనరావు, షణ్ముఖరావు, గోవిందరావు పాల్గొన్నారు. ఇఛ్చాపురంలోని పురుషొత్తపురంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పార్టీ జిల్లా అద్యక్షురాలు రెడ్డి శాంతి పాల్గొన్నారు. పింఛన్లు అందడం లేదని, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయలేదని పలువురు ఫిర్యాదు చేశారు. -
ప్రభుత్వ భూదోపిడీకి వ్యతిరేకంగా సదస్సు
-
అచ్చెన్న నంబర్-1 దగాకోరు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడుకు నంబర్-1 మంత్రిగా ఎలా మార్కులిచ్చారో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు నంబర్-1 దగా మంత్రి అని ఆరోపించారు. ప్రజల తరఫున వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్ చేస్తూ, అచ్చెన్నాయుడును మాట్లాడాలంటూ ఉసిగొల్పుతుంటారని, ఆయనేమో పిచ్చి ప్రేలాపనలు పేలుతూ సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ నిధుల్లో 30 శాతం కమీషన్‌కు కక్కుర్తిపడి టీడీపీ నేతలు రోడ్లేసేస్తున్నారని, టీడీపీది దొంగల పాలన అని మండిపడ్డారు. పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడారు. జనహితమే లక్ష్యంగా ధర్మ పోరాటం జనహితమే లక్ష్యంగా ధర్మ పోరాటం పేరిట నిర్వహించిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ గతంలో జరిగిన నీటి సంఘాల ఎన్నికల్ని గుర్తు చేశారు. టీడీపీ నేతలు చీటీ రాసుకుని తమ వారిపేర్లు ప్రకటించేసి ఎన్నికలు పూర్తయినట్టు చెప్పేశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలు పార్టీ మారి పోతున్నారన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పదేళ్లపాటు అధికారానికి దూరమైపోయారని, మళ్లీ అదే బాబు ప్రజల బలహీనతలపై దెబ్బకొట్టి అధికారంలోకి వచ్చి మళ్లీ మాట మారుస్తున్నారన్నారు. తాను మారానని చెప్పుకున్న బాబు..ఇప్పుడు ప్రజలు కూడా ఆయన మారలేదని నిర్ణయించేసుకున్నారన్నారు. రైతులు అమాయకులు కావచ్చు కానీ జరుగుతున్నది చూస్తూ మళ్లీ ఓటేసే పరిస్థితి లేదని, ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చట్టం కష్టాల్ని జనం చూడరని, విధానాల్లో నిర్ణయాల్ని మాత్రమే ప్రశ్నిస్తుంటారని, ఆ పని వైఎస్సార్సీపీ తరఫున తాము చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామన్నారు. ఏప్రిల్ ముగుస్తున్నా ధాన్యం కుప్పలు ఇంకా పొలాల్లోనే ఉన్నాయని, రైతులు, నిరుద్యోగులు ధైన్యంలో ఉన్నారని, మహిళలంతా తాము బాబుకెందుకు ఓటేశామా అని లోలోన కుమిలిపోతున్నారన్నారు. సహజంగా దొరికే ఇసుక కూడా టీడీపీ నేతలు అక్రమ రవాణా చేస్తున్నారని, అధికారులకు ఫోన్ చేస్తే అది ఏ పార్టీ ఇసుక అంటున్నారని, టీడీపీది అని తెలిస్తే వదిలేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఏం తెచ్చారు తమ హయాంలో నిధులు తెచ్చి ప్రారంభించిన పనుల్నే టీడీపీ నేతలు గొప్పలకు పోయి వారి పనులుగా చెప్పుకుంటున్నారని ధర్మాన అన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తన నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఏం అడిగినా టీడీపీ కార్యకర్తలకే లబ్ధి చేకూరేలా చేస్తున్నారని, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలున్నారన్నారు. 12 జిల్లాల్లో కేంద్రం విద్యా సంస్థలు ప్రకటిస్తే వెనుకబడిన జిల్లాకు ఏం ఒరగబెట్టిందో ఒక్క నాయకుడైనా ప్రశ్నించారా అన్నారు. వంశధార, మహేంద్రతనయ, మడ్డువలస ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గడువు ముగిసిన స్థానిక ఎన్నికలకు ఆరుమాసాల్లో చట్టబద్ధంగా ఎన్నికలు జరపాల్సి ఉంటే నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని, లోకేష్‌బాబు చేపట్టిన సర్వేలో శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిపితే ఓడిపోతామని గ్రహించే ఎన్నికలకు దూరంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ కల్యాణ మండపం, మంచినీటి వ్యవస్థల్ని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. 400 దుకాణాలకు లీజు గడువు తీరితే పట్టించుకోని ఎమ్మెల్యే నగరపాలక సంస్థను ప్రైవేట్ ఎస్టేట్‌గా తయారు చేశారని, దుకాణదారులు అమ్మగారిని కలవాలంటూ టీడీపీ తమ్ముళ్లు చెప్పడం ఎంతవరకు న్యాయం అన్నారు. రెండెకరాల ప్రజల భూమిని పార్టీ కార్యాలయానికి ధారాధత్తం చేశారని, కంపోస్ట్ కాలనీ స్థలాన్ని కార్యకర్తలకు ప్లాట్లుగా విభజించి రెండేసి లక్షలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెదబాబు శాంక్షన్, చినబాబు కలెక్షన్ పెదబాబు పనుల్ని శాంక్షన్ చేస్తుంటే చినబాబు కలెక్షన్ చేస్తూ ఆ సొమ్ముతో ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తున్నారని ధర్మాన ఆరోపించారు. దమ్ముంటే వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోయినవారంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రజారాజధాని కాదని, అది దగా రాజధాని అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోలేదని, ఒకటి, రెండు సీట్లతో ప్రారంభమై ఏడాదిన్నర సమయంలో 17కి చేరి 2014లో 67సీట్లు సాధించిన పార్టీ ఒడిపోయినట్టు కాదని ధర్మాన స్పష్టం చేశారు. -
ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడదాం
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం శ్రీకాకుళంలోని 36 వార్డుల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల కష్టాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. రైతుల తరఫున మనమే పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థగా మార్పు చెందిన తర్వాత పేద, మధ్య తరగతి కుటుంబాలపై పన్నుభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ.40 కోట్లతో నిర్మించిన పథకంతో నాలుగేళ్లపాటు నిరాటంకంగా నీరు సరఫరా చేశామని ధర్మాన చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో టీడీపీ ఒక్కరికైనా ఒక్క ఇల్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించాలి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అవినీతిని, అక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల కోసం కేటాయించిన రెండు ఎకరాల స్థలాన్ని టీడీపీ ప్రభుత్వం లీజు పేరిట ఎన్టీఆర్ ట్రస్ట్‌కు కేటాయించడం దారుణమన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర వేసేందుకు సిద్ధం కావాలని వార్డు కమిటీ ప్రతినిధులకు ధర్మాన పిలుపునిచ్చారు. ఇసుక విధానం పేరుతో టీడీపీ శ్రేణులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎం.వి.పద్మావతి, చల్లా రవి, అంధవరపు సూరిబాబు, కోణార్క్ శ్రీను, సాధు వైకుంఠరావు, చల్లా అలివేలుమంగ, మండవిల్లి రవి, ఎం.వి.స్వరూప్, మామిడి శ్రీకాంత్, కింతలి సత్యనారాయణ, పొన్నాడ రుషి, గుడ్ల దామోదరరావు, కె.సీజు, ఆర్ఆర్ మూర్తి, కెఎల్ ప్రసాద్, నక్క రామరాజు, ధర్మాన రఘునాథమూర్తి, కిల్లాన సాయి, కె.విజయ్‌కుమార్, బలగ పండరీనాద్, బైరి మురళి, ఖలీల్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు
♦ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ♦ శాసనసభలో అధికారపక్షం తీరుపై ధర్మాన ధ్వజం సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సోమవారం నాటి కార్యక్రమాలన్నీ ఏకపక్షంగా సాగాయని, ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక ఆత్మరక్షణలో పడిం దని, సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా వెనుకాడిం దని అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు విచారణకు సిద్ధపడటం అధికారంలో ఉన్నవారికి కొత్తేమీ కాదని, విచారణ జరిపితే అభివృద్ధి ఆగిపోతుందనే వితండ వాదాన్ని ప్రభుత్వం తెరమీదకు తేవడం విస్మయాన్ని కలిగిస్తోందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అవి శ్వాస తీర్మానం పెట్టలేదని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని గాడి లో పెట్టాలనే ఈ అస్త్రం ఉపయోగించామన్నారు. తమకు ఓట్లేసిన వారే ప్రజలు, ఓట్లు వేయని వారు అసలు ఈ రాష్ట్ర ప్రజలే కాదనే విధంగా వారి హక్కులను హరించి వివక్షను ప్రదర్శిస్తున్నారన్నారు. అధికారపక్షానికి ధీటుగా ప్రతిపక్షం ఉన్నపుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని కానీ అవినీతి సొమ్ముతో ప్రలోభపెడుతూ అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని యోచిస్తూ ఉండటం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. విమర్శలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షంపై మితిమీరిన విధంగా ఎదురుదాడికి దిగడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు. -
పోరాడదాం.. ఎండగడదాం
శ్రీకాకుళం అర్బన్ :ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతోపాటు జిల్లా పరిషత్ వేదికగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్, అధికార ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు నీరు-చెట్టు కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీనిపై ప్రశ్నించాలని సూచించారు. తమ పరిధిలోని సమస్యలను జెడ్పీ సమావేశంలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అధికార పార్టీ ప్రజల్లో అపఖ్యాతిపాలవడంతోపాటు వైఎస్సార్ సీపీ బలంగా తయారైందన్నారు. పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పంచాయతీలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని దుయ్యబట్టారు. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు ఇచ్చిన అధికారులకు కోత పెడుతుందని విమర్శించారు. ప్రజలకు వీటన్నింటిని వివరించి అభివృద్ధి ఏవిధంగా కుంటుపడుతుందో తెలియజేయాలన్నారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ చంద్రబాబు ఒక పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా రాక్షసపాలన చేస్తున్నారని విమర్శించారు. అందరం కలిసి ప్రజా సమస్యలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ ప్రజలు చెల్లించే పన్నులో కొంత భాగం జెడ్పీకి వస్తుందని, దీన్ని ఆయా గ్రామాల్లో తాగునీరు, ఇతరత్రా పనులకు వినియోగిస్తారన్నారు. దురదృష్టవశాత్తు పచ్చచొక్కాలకే నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ జెడ్పీలో వైఎస్సార్సీపీ సభ్యులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మీసాల నీలకంఠంనాయుడు, నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, దువ్వాడ వాణి, అంధవరపు సూరిబాబు, కర్నిక సుప్రియ, పేరాడ తిలక్, కోణార్క్ శ్రీను, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్, రొక ్కం సూర్యప్రకాశరావు, కరిమి రాజేశ్వరరావు, కిల్లి వెంకట సత్యన్నారాయణ, సువ్వారి గాంధీ, మండవిల్లి రవి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఆనెపు రామకృష్ణ, విప్‌గా గొర్లె రాజగోపాల్, అధికార ప్రతినిధిగా కురమాన బాలకృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్ మాట్లాడుతూ ఈ పదవితో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తెసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆనెపు రామకృష్ణ మాట్లాడుతూ 13వ ఆర్థిక సంఘం నిధులు లేవని, దీనికోసం దరఖాస్తులు పెట్టుకోవద్దని ప్రభుత్వమే లేఖలు రాయడం శోచనీయమన్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల అధికారాలను ప్రభుత్వం లాక్కొంటుందని, జన్మభూమి కమిటీ సభ్యులకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. -
‘వర్జిన్‌రాక్’ ఎలాంటి అక్రమాలూ చేయలేదు
* లోకాయుక్త తీర్పులో ఆ విషయం స్పష్టచేసింది * కన్నెధార కొండ మైనింగ్ లీజ్‌పై ధర్మాన సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని పది హెక్టార్లలో మైనింగ్‌లీజు పొందిన తమ కుటుంబానికి చెందిన వర్జిన్‌రాక్ సంస్థ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని లోకాయుక్త తీర్పు ద్వారా వెల్లడైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ... తనపైనా, తన కుటుంబంపైనా బురద జల్లేందుకు అనేక రాజకీయ సంస్థలు ఐదేళ్లుగా ప్రయత్నించినా... అంతిమంగా ధర్మమే విజయం సాధించిందన్నారు. తాను వైఎస్సార్సీపీతో ఉన్నాననే కక్షతో టీడీపీ అధినేత చంద్రబాబు సహా చాలా మంది వర్జిన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అక్రమాలకు పాల్పడుతోందని ప్రచారం చేశారని గుర్తుచేశారు. సీఎం ఈ విషయమై క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఇక్కడి జిల్లా యంత్రాంగంపైనా ఒత్తిడి తెచ్చి న్యాయస్థానాలకు వ్యతిరేకంగా చెప్పించారని ఆరోపించారు. తాను అధికారులపై ఎలాంటి ఒత్తిడి తేలేదని, మైనింగ్ చేయలేదని, అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదని చెప్పారు. వేసిన కేసుల్లో మూడుమార్లూ వర్జిన్‌రాక్ సంస్థకు అనుకూలంగానే తీర్పు వచ్చిందని తెలిపారు. కేబినెట్ సభ్యులు ఒత్తిడి తేవడంవల్లే ప్రస్తుత కలెక్టర్ తొందరపడి ఎన్వోసీ రద్దు అని, లీజు క్యాన్సిల్ అని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ఎవరు, ఎవరు పైనా ఎలాంటి ఆరోపణలు చేయకూడదని, చేసినా అది చెల్లదని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు. తానెప్పుడూ గిరిజనుల మనోభావాలకు, సంప్రదాయాలకు, స్థానికంగా ఉన్న వ్యక్తులకూ వ్యతిరేకం కాదన్నారు. ఇప్పుడు పది హెక్టార్లు తనకు అప్పగించాలని జిల్లా యంత్రాంగానికి సూచిస్తూ కోర్టు తనకు అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా తాను మైనింగ్ చేపట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
'రుణమాఫీపై కోటయ్యతో కిరికిరి కమిటీ'