తిరుమలలో ఆత్మహత్య చేసుకున్న భక్తుడు
తిరుమల : తిరుమలలో ఓ భక్తుడు శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ నడుపుతున్న ధర్మరథం కింద పడి అతను ఈ ఘటనకు పాల్పడ్డాడు. భక్తుడి తలపై నుంచి బస్సు చక్రం వెళ్లటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుని వివరాల కోసం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.