డిప్యూటీ తహశీల్దార్ల బదిలీ
- 46 మందికి స్థాన భ్రంశం
- జేసీ వివేక్‌యాదవ్ ఉత్తర్వులు జారీ
గుంటూరు ఈస్ట్: జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్ యాదవ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 46 మంది డిప్యూటీ తహశీల్దారులకు స్థాన చలనం కలిగింది. బుధవారం 58 మంది తహశీల్దార్ల బదిలీలు, తాజాగా డిప్యూటీ తహశీల్దార్ల బదిలీలు కూడా తెలుగుదేశం పార్టీ నేతల కనుసన్నల్లో జరిగాయనే ఆరోపణలు వినిపించాయి.