donetion
-
కనీసం రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
‘బద్రి’చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయింది నటి రేణూ దేశాయ్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత జానీ(2003) చిత్రంలో నటించి, పవన్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2009లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2012లో ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం కొడుకు అకీరా, కూతురు ఆద్యతో కలిసి ఉంటుంది రేణూ. పిల్లల కోసం సినిమాలను దూరం పెట్టింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రను పోషించి, తనదైన నటనతో మెప్పించింది. మంచి పాత్రలు లభిస్తే..ఇకపై సినిమాల్లో నటిస్తానని కూడా చెప్పింది. దీంతో టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు రేణూ దేశాయ్‌కి కథలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా సినిమాల పరంగా కాస్త దూరమైనా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది రేణూ దేశాయ్. మంచి పనులను చేయడానికే సోషల్ మీడియాను వాడుతుంటారు. తాజాగా రేణూ తన ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. నా వంతుగా రూ.30 వేలు ఇచ్చా రేణూ దేశాయ్‌కి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. తను పెట్స్‌తో పాటు పిల్లులను కూడా పెంచుకుంటుంది. వాటికి ఆరోగ్య సమస్యలు వస్తే.. తట్టుకోలేదు. అంతేకాదు పెంపుడు జంతువుల కోసం విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ మూడు కుక్కలకు ఆపరేషన్ చేయించేందుకు ఓ సంస్థ విరాళాలు అడుగుతోంది. ఆపరేషన్‌కి మొత్తం రూ.55 వేల వరకు ఖర్చు అవుతుందట. ఈ విషయం రేణూ దేశాయ్ దృష్టికి వెళ్లింది. దీంతో తన వంతుగా రూ.30 వేలు విరాళం ఇచ్చి.. మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరంటూ.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ‘నేను రూ.30 వేలు సర్దాను. దయచేసిన మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరు. కనీసం ఒక్కొక్కరు రూ. 100 పంపించినా చాలు’ అని రేణూ దేశాయ్ తన ఫాలోవర్స్‌కి విజ్ఞప్తి చేసింది. -
చేయి చేయి కలుపుదాం
కోసిగి (కర్నూలు): చేయి చేయి కలిపి కేరళ వరద బాధితులను ఆదుకుందామని బాలుర ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఖలీల్ అహ్మద్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షులు రాముడు, నయకులు హొలగుంద కోసిగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కోసిగిలో వరద బాధితుల సహాయార్థం వ్యాపార దుకాణాలు, ఇంటింటా తిరిగి విరాళాలు సేకరించారు. వారు మాట్లాడుతూ కేరళలో వరద ముంచుకొచ్చి ప్రజలు సర్వ కోల్పోయి నిరాశ్రులయ్యారు. విరాళాలు సేకరించిన వారిలో పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి లోకారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రాలయం రూరల్: కేరళలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తరుపున విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం మండల నాయకులు విశ్వనాథ్, నవీన్ నేతృత్వంలో మండల కేంద్రంలో పర్యటించి రూ.39వేలు సేకరించారు. ప్రిన్సిపాల్ చేతుల మీదుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో రఘు, జయలక్ష్మి, ఎల్లప్ప, అంజి, ప్రభుత్వ, రాఘవేంద్ర జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కౌతాళం: మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లయ్య, మండల పార్టీ కార్యదర్శి లింగన్న తెలిపారు. వారు మాట్లాడుతూ కేరళ రాష్ట్రం వరదలతో నష్టపోయిన బాధితులకు విరాళాలు సేకరించామన్నారు. అలాగే కౌతాళంలోని ప్రతిభ హైస్కూల్ కరస్పాండెంట్ దూద్‌బాషా కుటుంబం కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి రూ.12వేల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నట్లు దూద్ బాషా తెలిపారు. -
మునికోటి కుటుంబానికి పవన్ కల్యాణ్ రూ.2 లక్షల సాయం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి కుటుంబానికి జనసేన అధినేత, హీరో పవన్‌కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. మంగళవారం మధ్యాహ్నం పవన్ కల్యాణ్ తరపున ఆయన ప్రతినిధి మారిశెట్టి రాఘవయ్య తిరుపతి వచ్చి సాయాన్ని అందజేశారు. రాఘవయ్య వెంట జిల్లా జనసేన నాయకులు, తిరుపతి అభిమాన సంఘం నాయకులు కిరణ్‌రాయల్, రాజారెడ్డి, దినేష్‌జైన్, హరిశంకర్‌లు ఉన్నారు.