తైక్వాండో పోటీల్లో జిల్లాకు 10 పతకాలు
కాకినాడ సిటీ :
విజయనగరం జిల్లాలో ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగిన తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు 10 మెడల్స్ వచ్చాయి. క్యాడెట్, జూనియర్ స్థాయిల్లో 28 కేటగిరీల్లో క్రీడాకారులు రెండు గోల్డ్, రెండు సిల్వర్, ఆరు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. శుక్రవారం జిల్లా క్రీడామైదానంలో జరిగిన కార్యక్రమంలో డీఎస్డీఓ మురళీధరరావు క్రీడాకారులను అభినందించారు. 55 కిలోల వెయిట్లో యు.సుష్మా, 68 కిలోల వెయిట్లో జి.మేరీగోల్డ్.. గోల్డ్ మెడల్స్ పొంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే 63 కిలోల్లో ఎస్ఎంవీవీ సాయి, 78 కిలోల్లో ఎం.భానుప్రసాద్ సిల్వర్ మెడల్స్, 63 కిలోల్లో పళ్ల శ్రీసత్య ఆకాంక్ష, 59 కిలోల్లో కె.రేష్మా, 57 కిలోల్లో ఎల్జీఈ నితిన్, 55 కిలోల్లో వి.తరుణ్ వరప్రసాద్, 37 కిలోల్లో టి.చరణ్, 29 కిలోల్లో పి.భార్గవీశ్రీకళ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. జాతీయ స్థాయికి ఎంపికైన వారికి ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో జరిగే తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి బి.అర్జున్‌రావు తెలిపారు.