Emerging Cup Under-23 tournament
-
పరుగుల వేటలో పాక్‌పై భారత్ బోల్తా
ఢాకా: ఆసియా ఎమర్జింగ్ కప్ అండర్–23 క్రికెట్ టోర్నమెంట్లో టైటిల్ ఫేవరెట్ భారత జట్టు పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసింది. చివరి ఓవర్లో భారత్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. అయితే పాక్ బౌలర్ అమాద్ బట్ వేసిన ఈ ఓవర్లో భారత్ వికెట్ కోల్పోవడంతోపాటు కేవలం నాలుగు పరుగులే చేసి ఓటమి చవిచూసింది. భారత ఇన్నింగ్స్‌లో శరత్ (47; 6 ఫోర్లు, సిక్స్), సనీ్వర్ సింగ్ (76; 5 ఫోర్లు, సిక్స్), అర్మాన్ జాఫర్ (46; 3 ఫోర్లు, సిక్స్) రాణించినా కీలకదశలో అవుట్ కావడం దెబ్బ తీసింది. అంతకుముందు పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 267 పరుగులు సాధించింది. -
భారత్‌కు చుక్కెదురు
ఢాకా: ఒకవైపు బంగ్లాదేశ్ సీనియర్ జట్టు భారత్ చేతిలో తొలి టెస్టులో చిత్తుగా ఓడగా... మరోవైపు ఆసియా ఎమర్జింగ్ కప్ అండర్–23 టోర్నమెంట్లో భారత జట్టుపై బంగ్లాదేశ్ యువజట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ వన్డే మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్‌మన్ అర్మాన్ జాఫర్ శతకం (98 బంతుల్లో 105; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) వృథా అయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అర్మాన్ జట్టును నడిపించే భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. స్వేచ్ఛగా షాట్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. అతను వినాయక్ గుప్తా (65 బంతుల్లో 40; 5 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 125 పరుగులు జోడించాడు. దీంతో భారత్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే సౌమ్య సర్కార్ (2/53) వినాయక్‌ను పెవిలియన్‌కు పంపి బంగ్లాకు బ్రేక్ ఇచ్చాడు. అనంతరం బంగ్లా మరో బౌలర్ సుమోన్ ఖాన్ (4/64) అర్మాన్‌ను అవుట్ చేసి భారత జోరుకు కళ్లెం వేశాడు. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లా 42.1 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 250 పరుగులు చేసింది. రెండో ఓవర్ నాలుగో బంతికి ప్రత్యర్థి ఓపెనర్ నైమ్ (14)ను ఔట్ చేసిన సౌరభ్ దూబే భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే సౌమ్య సర్కార్ (68 బంతుల్లో 73; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), సారథి నజు్మల్ (88 బంతుల్లో 94; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 144 పరుగులు జోడించి భారత ఆశలపై నీళ్లు చల్లారు. చివర్లో వీరు అవుటైనా ఆఫిఫ్ హుసేన్ (46 బం తుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు) లాంఛనం పూర్తి చేశాడు. -
భారత అండర్–23 జట్టులో విహారికి చోటు
న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో జరిగే అండర్–23 ఎమర్జింగ్ కప్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గాదె హనుమ విహారికి స్థానం లభించింది. ఇటీవలే జరిగిన విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నీలో విహారి ఆరు మ్యాచ్‌ల్లో కలిపి 262 పరుగులు చేశాడు. 15 మంది సభ్యులుగల టీమిండియాకు తమిళనాడు ప్లేయర్ బాబా అపరాజిత్ నాయకత్వం వహిస్తాడు. టోర్నీలో 23 ఏళ్లలోపు ఆటగాళ్లే పాల్గొనాల్సినా... ఏసీసీ నిబంధనలు సవరించి 23 ఏళ్లకుపైగా ఉన్న నలుగురు ఆటగాళ్లు జట్టులో ఉండొచ్చని తెలిపింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఈనెల 15 నుంచి 26 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 2013లో చివరిసారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో పాక్‌పై నెగ్గి భారత్ విజేతగా నిలిచింది.