35మంది అమెరికా నావికులుకు ఐదేళ్ల జైలు శిక్ష
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన 35మంది నావికులకు ట్యూటికోరిన్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. 2013లో అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణల కిందట విచారించిన కోర్టు వారికి ఐదేళ్లపాటు కఠిన కారాగార శిక్షను విధించింది.
2013 అక్టోబర్ 12న అమెరికాకు చెందిన సీమన్ గార్డ్ ఓహియో నౌక ట్యూటీకోరన్ తీరంలోకి అక్రమంగా ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించింది. దానిని తనిఖీలు చేయగా అందులో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించాయి. దీంతో గస్తీ బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి విచారణ చేపట్టి చివరకు సోమవారం తీర్పును వెల్లడించింది.