వ్యవసాయ బావిలో బాలుడి శవం లభ్యం
ఈనెల 13 నుంచి కనిపించని బాలుడు
మృతదేహంపై గాయాలున్నట్లు అనుమానం
ఖమ్మం రూరల్ : ఓ బాలుడి మృతదేహం ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు శివారు కోదాడ–ఖమ్మం ప్రధాన రహదారి పక్కన వ్యవసాయ బావిలో మంగâýæవారం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా కోదాడ మండలం మొగలాయికోటకు చెందిన లింగా గోవిందరెడ్డి, రమాదేవిలకు ఇద్దరు కొడుకులు. సృజ¯ŒSరెడ్డి, పూరీజగన్నాథరెడ్డి(10). ఆర్మీలో ఉద్యోగం చేసిన గోవిందరెడ్డి ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కోదాడలోని యాక్సిస్ బ్యాంక్లో గార్డుగా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. స్థానిక ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న పూరీజగన్నాథరెడ్డి ఈనెల 13న గ్రామంలోని వినాయకుని వద్ద కాసేపు గడిపి.. తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ‘కోదాడకు వెళ్తున్నాం.. నిన్ను బండిమీద తీసుకెళతాం’ అంటూ పూరీజగన్నాథరెడ్డిని అడిగారు. ‘నా దగ్గర సైకిల్ ఉంది.. ఇప్పుడెలా రానని బాలుడు అనగా.. ఇంటి వద్ద సైకిల్ పెట్టిరా..’ అనడంతో సైకిల్ ఇంటి దగ్గర పెట్టి వచ్చి గుర్తు తెలియని వ్యక్తులతో ద్విచక్ర వాహనంపై వెళ్లాడని మొగలాయికోటకు చెందిన స్థానికులు తెలిపారని బంధువులు చెప్పారు. అనంతరం జగన్నాథరెడ్డి కనిపించడం లేదని తండ్రి లింగారెడ్డి కోదాడ పోలీస్స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత పదేâýæ్ల బాలుడు కనిపించడం లేదని.. ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమానం ఇస్తామని తండ్రి పోస్టర్లు ముద్రించి.. కోదాడ, ఖమ్మం వచ్చే ప్రధాన రహదారి వెంబడి అంటించారు. ఒక పక్క కోదాడ పోలీసులు, మరో పక్క బాలుని బంధువులు జగన్నాథరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంగâýæవారం గుర్రాలపాడు వద్ద బావిలో బాలుడి శవం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదిలా ఉండగా.. బావిలో ఉన్న మృతదేహం బాగా కుళ్లిపోవడంతో పోలీసులు అతి కష్టంమీద బయటకు తీయించారు. కోదాడ సీఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా.. బాలుడి మృతదేహంపై గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 13న లేదా మరుసటి రోజు గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని కొట్టి.. హత్య చేసి ఉంటార ని భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.