అవినీతిలో కర్ణాటక మొదటి స్థానం
బీజేపీ నాయకుడు శంకరబిదిరి
బెంగళూరు: సమాచార, సాకేతిక రంగంలో దేశానికి ఆదర్శవంతమైన కర్ణాటక ప్రస్తుతం అవినీతిలో మొదటి స్థానంలో ఉందని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు శంకరబిదిరి పేర్కొన్నారు. ఇందుకు కొంతమంది రాజకీయ నాయకులే కారణమన్నారు. బెంగళూరులోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...గతంలో నాయకులు రాజకీయాల్లోకి సేవా భావంతో వచ్చేవారన్నారు. దీని వల్ల అవినీతి తక్కువగా జరిగేదని తెలిపారు. అయితే ప్రస్తుతం ధనార్జనే ధ్యేయంగా నాయకులు రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు.
అందువల్లే ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి పనుల్లో కోట్లాది రుపాయల అవినితి జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి కర్ణాటకలో ఎక్కువగా ఉందన్నారు. ఇందుకు ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులే ప్రధాన కారణమన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మినహాయింపు కాదని ఆరోపించారు. తన విషయం బయటపడకుండా పకడ్భందీగా ఆయన ప్రభుత్వ అధికారులను ఈ అక్రమాల్లో భాగస్వామం చేస్తూ మాముళ్ల ముఖ్యమంత్రిగా మారారని శంకరబిదిరి ఆరోపించారు.