చిరుతల కోసం గాలింపు
మాచారెడ్డి : కొద్ది రోజులుగా అక్కాపూర్, ఇసాయిపేట్ సందుకట్ల గూడెం అటవీ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయి. ఇటీవల ఓ మేక, లేగదూడలపై దాడి చేసి చంపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు శనివారం ఎనిమల్ రిస్క్ వ్యాన్‌తో చిరుతను పట్టడానికి అటవీ ప్రాంతంలో సంచరించారు. బోను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పరిసర గ్రామాల ప్రజలు చిరుతలను పట్టవద్దని, అలాగే అటవీ ప్రాంతంలో ఉండనివ్వాలని అధికారులు సూచించారు. ఇప్పటి వరకు మనుషులకు అవి తారసపడినప్పటికీ హాని తలపెట్టలేదని, చిరుతల భయంతో కలప స్మగ్లర్లు కలప జోలికి పోరని అన్నారు. ఏదేమైనప్పటికీ అధికారులు చిరుతలను పట్టడానికి చర్యలు ముమ్మరం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారిణి సుజాత, బీట్ అధికారులు బద్రి, శంకరప్ప, రిస్క్ టీం సభ్యులు పాల్గొన్నారు.