ఫ్రెంచ్ నవలా రచయితకు సాహిత్య నోబెల్
స్టాక్‌హోం(స్వీడన్): ఫ్రెంచ్ నవలా రచయిత ప్యాట్రిక్ మొడియానోకు సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. రెండో ప్రపంచ యుద్ధం, 1940 నాటి పరిస్థితులాధారంగా ఆయన రచనలు సాగాయి.
మానవ జీవితంలో ఎవరూ స్పృశించని కోణాలను ప్యాట్రిక్ మొడియానో తన రచనల్లో పొందుపరిచారని అవార్డు కమిటీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి రాని విభిన్న రకాల జీవన విధానాలను ఆయన స్పృశించారని నోబెల్ కమిటీ కొనియాడింది.