నా భూముల్లో మీ పెత్తనమేంటి?
విశాఖ: విశాఖ జిల్లాలోని అనీట్స్ కాలనీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన భూముల్లో పనులు చేపడుతున్నారని జీవీఎమ్సీ అధికారులను బీజేపీ నేత అప్పలనాయుడు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జీవీఎమ్సీ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి అప్పలనాయుడును అడ్డుకున్నారు.
అనంతరం ఆయన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే జీవీఎమ్సీ పనులు చేపట్టిన భూములతో అప్పలనాయుడుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.