బాల్య వివాహానికి ఏర్పాట్లు.. అడ్డుకున్న అధికారులు
ఆలంపల్లి, న్యూస్‌లైన్: అధికారులు ఓ బాల్య వివాహ ఏర్పాట్లను అడ్డుకొని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహం చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరిం చారు. ఈ సంఘటన గురువారం వికారాబాద్ మండలం మదన్‌పల్లిలో చో టుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కిష్టయ్య, కిష్టమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కూతురు(15) స్థానికంగా ఆరో తరగతి చదువుతోంది. బాలికకు మర్పల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. శుక్రవారం ఉదయం వివాహం చేసేందుకు ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారంతో గురువారం ఉదయం వికారాబాద్ తహసీల్దార్ గౌతంకుమార్, ఎస్ఐ హన్మ్యా నాయక్, అధికారులు మదన్‌పల్లికి చేరుకొని వివాహ ఏర్పాట్లను అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని, లేదంటే జైలుపాలవుతారని హెచ్చరించారు. చిన్నతనంలో పెళిళ్ల్లు చేస్తే జరిగే పరిణామాలను వివరించి వారికి కౌన్సెలింగ్ చేశారు. బాల్య వివాహాల గురించి తమకు సమాచారం అందించాలని అధికారులు స్థానికులకు చెప్పారు. ఎస్ఐ హన్మ్యానాయక్ మాట్లాడుతూ.. అం టరానితనం రూపుమాపాలని చెప్పా రు. అమ్మాయిలకు మైనారిటీ తీరిన తర్వాతే వివాహం చేయాలని సూచిం చారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని చెప్పారు. గ్రామ సర్పంచ్ మాణెమ్మ, వీఆర్ఓ నర్సింహారెడ్డి, వీఏఓ రమాదేవి తదితరులు ఉన్నారు.